‘‘మేరేసప్ నోం కా భారత్’’ మరియు ‘‘అన్ సంగ్హీరోజ్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్ మెంట్’’ అంశాలపై ఎంపికైన వ్యాసాల ను ఆయన ఆవిష్కరించారు"
ఎమ్ఎస్ఎమ్ఇటెక్నాలజీ సెంటర్ ను, ఓపెన్ ఎయర్ థియేటర్ భాగం గా ఉండే ఒక సభాభవనం‘పెరుంతలైవర్ కామరాజర్ మణిమండపమ్’ ను కూడా ఆయన ప్రారంభించారు
‘‘భారతదేశజనాభా యవ్వన భరితం గా ఉంది, భారతదేశం మేధస్సు కూడాను యవ్వనం తో కూడుకొని ఉన్నది. భారతదేశం యొక్క సామర్ధ్యం లో, భారతదేశం యొక్క స్వప్నాల లో యవ్వనం ఉంది. భారతదేశం ఆలోచనల లో, భారతదేశం చేతన లో యవ్వనం తొణికిసలాడుతోంది’’
‘‘భారతదేశంతన యువత ను జనాభా పరమైనటువంటి ఒక డివిడెండు గాను, వికాసానికిచోదకంగాను భావిస్తున్నది’’
‘‘భారతదేశంయొక్క యువతీయువకుల లో కష్టపడి పని చేసే సత్తా ఉన్నది. మరి భవిష్యత్తు పట్ల వారికి ఒక స్పష్టత కూడా ఉంది. ఈ కారణం గానే ప్రస్తుతం భారతదేశం చెబుతున్నమాటల ను ప్రపంచం రేపటి వాణి లాగాపరిశీలిస్తున్నది’’
‘‘పాత మూసపోతలు అనేవి యువత యొక్క సమర్ధత పై భారం కావడం లేదు. ఈ యువతరం కొత్త సవాళ్లకు తగ్గట్టు గా తనను తాను, అలాగే సమాజాన్నికూడాను తీర్చిదిద్దగలదు’’
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25వ జాతీయ యువజనోత్సవాన్ని పుదుచ్చేరీ లో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు న స్వామి వివేకానంద గారి జయంతి కావడం తో ఈ దినాన్ని ‘జాతీయ యువత దినం’గా పాటించడం జరుగుతోంది.
కేంద్ర మంత్రులు శ్రీయుతులు శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్, నారాయణ్ రాణే, భాను ప్రతాప్ సింహ్ వర్మ, నిశిత్ ప్రమాణిక్, పుదుచ్చేరీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, పుదుచ్చేరీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.
ఇద్దరూ పరస్పర సాహిత్య యాత్ర లో, ఆధ్యాత్మిక యాత్ర లో భాగం పంచుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25వ జాతీయ యువజనోత్సవాన్ని పుదుచ్చేరీ లో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు న స్వామి వివేకానంద గారి జయంతి కావడం తో ఈ దినాన్ని ‘జాతీయ యువత దినం’గా పాటించడం జరుగుతోంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25వ జాతీయ యువజనోత్సవాన్ని పుదుచ్చేరీ లో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు న స్వామి వివేకానంద గారి జయంతి కావడం తో ఈ దినాన్ని ‘జాతీయ యువత దినం’గా పాటించడం జరుగుతోంది. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా ‘‘మేరే సప్ నోం కాభారత్’’, ఇంకా ‘‘అన్ సంగ్ హీరోజ్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్ మెంట్’’ అంశాల పై ఎంపికైన వ్యాసాల ను ఆవిష్కరించారు. ఈ రెండు ఇతివృత్తాల పైన ఒక లక్ష మంది కి పైగా యువతీ యువకులు సమర్పించిన రచనల లో నుంచి ఈ వ్యాసాల ను ఎంపిక చేయడమైంది. ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ కు చెందిన ఒక టెక్నాలజీ సెంటర్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. దాదాపు 122 కోట్ల పెట్టుబడి తో ఈ సెంటరు ను పుదుచ్చేరీ లో స్థాపించడమైంది. ప్రధాన మంత్రి ఒక ఓపెన్ ఎయర్ థియేటర్ భాగం గా ఉండేటటువంటి ‘పెరుంతలైవర్ కామరాజర్ మణిమండపమ్’ పేరు తో ఏర్పాటైన సభాభవనాన్ని కూడా ప్రారంభించారు. దాదాపు 23 కోట్ల రూపాయల ఖర్చు తో ఈ సభాభవనాన్ని పుదుచ్చేరీ ప్రభుత్వం నిర్మించింది. కేంద్ర మంత్రులు శ్రీయుతులు శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్, నారాయణ్ రాణే, భాను ప్రతాప్ సింహ్ వర్మ, నిశిత్ ప్రమాణిక్, పుదుచ్చేరీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, పుదుచ్చేరీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. రంగస్వామి, రాష్ట్ర మంత్రులు మరియు పార్లమెంట్ సభ్యులు ఈ సందర్భం లో హాజరు అయిన వారిలో ఉన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రసంగవంచిన ప్రధాన మంత్రి జాతీయ యువజన దినం సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియజేశారు. స్వామి వివేకానంద గారి కి ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ఈ సంవత్సరం లో స్వామి వివేకానంద గారి జయంతి రావడం చాలా ప్రేరణాత్మకం గా ఉంది అన్నారు. శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవం కూడాను ఈ సంవత్సరానికి మరింత ప్రాముఖ్యాన్ని జోడించింది, అంతేకాకుండా మహాకవి సుబ్రహ్మణ్య భారతి యొక్క 100వ వర్ధంతి ని సైతం ఇదే సంవత్సరం లో పాటించుకొంటున్నాం అన్నారు. ‘‘ఈ మనీషులు ఇరువురి కి పుదుచ్చేరీ తో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇద్దరూ పరస్పర సాహిత్య యాత్ర లో, ఆధ్యాత్మిక యాత్ర లో భాగం పంచుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రాచీన దేశం తాలూకు యువజన ముఖ చిత్రాన్ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, ప్రపంచం ప్రస్తుతం భారతదేశాని కేసి ఆశ తో, నమ్మకం తో చూస్తోందన్నారు. దీనికి కారణం, భారతదేశం లో జనాభా యవ్వనం తో ఉండడం; అంతేకాదు, భారతదేశం యొక్క మేధస్సు కూడాను తారుణ్యంతో ఉంది. భారతదేశం యొక్క సామర్ధ్యం లోను, భారతదేశం యొక్క స్వప్నాల లోను యవ్వనం నిండి ఉంది. భారతదేశం తన ఆలోచనల లోను, తన చేతన లోను యవ్వనాన్ని సంతరించుకొంది. భారతదేశం యొక్క ఆలోచన విధానం, భారతదేశం యొక్క దార్శనికత పరివర్తన ను ఎల్లప్పటికీ ఆమోదిస్తూ వచ్చాయి. మరి ఈ దేశం యొక్క ప్రాచీనత లో ఆధునికత ఇమిడిపోయి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో యువత అవసరమైన అన్ని కాలాల లో సదా ముందడుగు వేసింది అని ఆయన అన్నారు. జాతీయ చేతన ముక్కలైనపుడల్లా శంకర్ వంటి యువత ముందుకు వచ్చినట్లు, ఆది శంకరాచార్యుల వారి రూపం లో దేశాన్నిఐక్యత తాలూకు బంధం లో పెనవేసినట్లు చెప్పారు. నిరంకుశత్వం రాజ్యమేలిన కాలాల లో గురు గోబింద్ సింహ్ జీ యొక్క సాహిబ్ జాదేల వంటి యువజనుల త్యాగాలు ఈ నాటికి కూడా మార్గదర్శి గా ఉంటున్నాయన్నారు. భారతదేశానికి స్వాతంత్య్ర సాధన లో త్యాగాలు అవసరం అయినప్పుడు భగత్ సింహ్, చంద్రశేఖర్ ఆజాద్, మరియు నేతాజీ సుభాష్ వంటి యువ విప్లవకారులు దేశం కోసం వారి ప్రాణాల ను సమర్పించడానికి ముందంజ వేశారని ప్రధాన మంత్రి అన్నారు. దేశానికి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం అవసరమైనపుడల్లా అరవిందో, ఇంకా సుబ్రహ్మణ్య భారతి వంటి మునులు రంగ ప్రవేశం చేశారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం లోయువజనులు వయస్సు పరం గా యవ్వనం లో ఉండడమే కాక ప్రజాస్వామిక విలువల ను కూడా పుణికిపుచ్చుకొన్నారని, వారి వల్ల ప్రజాస్వామ్యాని కి కలిగే లబ్ధి కూడా సాటిలేనిదని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం తన యువజనుల ను జనాభా పరం గా పైచేయి ని అందించేటటువంటిది గానే కాకుండా అభివృద్ధి కి చోదక శక్తి గా కూడా పరిగణిస్తున్నది అని ఆయన నొక్కిచెప్పారు. ప్రస్తుతం భారతదేశాని కి చెందిన యువతీ యువకులు సాంకేతిక విజ్ఞానం తాలూకు ఆకర్షణ ను కలిగి వుండడం తో పాటుగా ప్రజాస్వామ్యం తాలూకు చైతన్యాన్ని సైతం కలిగివున్నారు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. నేటి భారతదేశ యువత లో కఠోర శ్రమ తాలూకు సామర్ధ్యం ఉందీ అంటే గనుక అప్పుడు భవిష్యత్తు పట్ల కూడా వారికి స్పష్టత ఉన్నట్లే. ఈ కారణం గా ప్రస్తుతం భారతదేశం చెబుతున్న మాటల ను ప్రపంచం రేపటి వాణి గా లెక్కలోకి తీసుకొంటోంది అని ఆయన అన్నారు.

స్వాతంత్య్ర పోరాట కాలం లో దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడానికి అయినా సరే యువతరం వెనుకాడలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. అయితే, నేటి యువత దేశం కోసం మన స్వాతంత్య్ర యోధులు కన్న కలలను నెరవేర్చడం కోసం తప్పక జీవించవలసి ఉందని ఆయన అన్నారు. పాత మూసల తాలూకు భారం యువతరం సమర్ధతపైన లేదు, వాటి ని ఎలా అధిగమించాలి అనేది యువత కు తెలుసు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కాలం యువత కొత్త సవాళ్ళ కు, కొత్త డిమాండుల కు తగినట్లు గా తనను తాను మలచుకొని, సమాజాన్ని కూడా తీర్చిదిద్దగలుగుతుంది,కొత్త పోకడల ను ఆవిష్కరించ గలుగుతుంది అని ఆయన అన్నారు. నేటి యువత లో ‘చేయగలం’ అనే భావన ఉంది. అది ప్రతి ఒక్క తరాని కి ప్రేరణ ను ఇవ్వగలుగుతుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం భారతదేశం లోని యువతీ యువకులు ప్రపంచ సమృద్ధి తాలూకు కోడ్ ను లిఖిస్తున్నదని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తం గా ఉన్నటువంటి యూనికార్న్ ఇకోసిస్టమ్ లో భారతదేశం యొక్క యువత ను లెక్కలోకి తీసుకోవలసిన ఒక శక్తి గా చూడాలి. భారతదేశం లో ప్రస్తుతం 50,000కు పైగా స్టార్ట్-అప్స్ తో కూడినటువంటి ఒక బలమైన ఇకోసిస్టమ్ ఏర్పడింది. వీటిలో నుంచి 10,000కు పైగా స్టార్ట్-అప్స్ మహమ్మారి తాలూకు సవాలు నేపథ్యం లో పుట్టుకు వచ్చాయి అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ‘న్యూ ఇండియా’కు ఒక మంత్రాన్ని ఇచ్చారు. అది ఏమిటి అంటే.. ‘కంపీట్ ఎండ్ కాంకర్’. ఈ మాటల కు పోటీ పడండి, గెలవండి అని భావం. మరో మాట లోచెప్పాలి అంటే గనక పాలుపంచుకోండి, విజయాన్ని సొంతం చేసుకోండి; ఏకం కండి, పోరు లో విజేతలు గా నిలవండి అని కూడా అన్నమాట. ఒలింపిక్స్ క్రీడోత్సవాల లో, దివ్యాంగుల కు ఉద్దేశించిన పారాలింపిక్స్ లో యువత ప్రదర్శన ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దానితో పాటు టీకాకరణ కార్యక్రమం లో యువత పాలుపంచుకోవడాన్ని యువజనుల లో ఉన్న బాధ్యత తాలూకు జ్ఞానానికి, గెలవాలనే కోరిక కు నిదర్శనం గా నిలుస్తోంది అని ఆయన అన్నారు.

కుమారులు మరియు కుమార్తెలు సమానం అని ప్రభుత్వం భావిస్తోంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ విధమైన ఆలోచన తో, ప్రభుత్వం కుమార్తెల అభ్యున్నతి కోసం వివాహ వయస్సు ను 21 సంవత్సరాల కు పెంచాలి అని నిర్ణయించింది. కుమార్తె లు కూడా వారి ఉద్యోగ జీవనాన్ని వారు మలచుకోగలరు. వారి కి మరింత కాలం అందుబాటు లోకి వస్తుంది. ఈ దిశ లో ఇది ఒక అతి ముఖ్యమైన అడుగు అవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

మన స్వాతంత్య్ర పోరాటాని కి తోడ్పాటు ను అందించినటువంటి యోధుల లో ఎంత అయితే గుర్తింపు రావాలో అంత గుర్తింపు రాని అటువంటి యోధులు చాలా మంది ఉన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి ప్రముఖుల ను గురించి మన యువతీ యువకులు ఎంత ఎక్కువ గా పరిశోధనలు చేసి, వారి గురించి న విషయాల ను గ్రంథస్తం చేస్తారో అంతగా దేశం యొక్క రాబోయే తరాల లో చైతన్యం వృద్ధి చెందుతుంది అని కూడా ఆయన అన్నారు. యువత తన స్వరాన్ని బిగ్గర గా వినిపించాలని, స్వచ్ఛత ఉద్యమానికి తోడ్పాటు ను అందించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశ యువతీయువకుల మస్తిష్కాలను తీర్చిదిద్ది, వారిని దేశాన్ని నిర్మించడం కోసం ఒక ఐక్య శక్తి గా పరివర్తన చెందింపచేయాలనేది జాతీయ యువజనోత్సవం ధ్యేయం గా ఉంది. సామాజిక సమన్వయ సాధన లోను, మేధోపరమైనటువంటి మరియు సాంస్కృతికపరమైనటువంటి ఏకీకరణ లో అతి పెద్దవైన కసరత్తుల లో ఒక కసరత్తు గా ఉంది. ఇది భారతదేశం లోని వైవిధ్య భరితమైన సంస్కృతులను ఒక చోటు కు తీసుకు వచ్చి మరి వాటిని ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ తాలూకు ఒక ఐక్య పాశం గా పెనవేయాలనే లక్ష్యాన్ని కూడా కలిగివుంది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi