సహకార మార్కెటింగ్, సహకార విస్తరణ, సలహా సేవల కోసం ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఈ-పోర్టల్స్ ప్రారంభం
“సహకార స్ఫూర్తి ‘సబ్ కా ప్రయాస్’ సందేశాన్నిస్తుంది”
“సరసమైన ధరలకు ఎరువుల అందుబాటు ద్వారా రైతుల జీబితాలలో భారీ మార్పులకు బీజం పడింది”
“సర్కార్, సహకార్ (ప్రభుత్వం, సహకారం) కలిసి ‘వికసిత భారత్’ కలను ఉమ్మడిగా సాకారం చేస్తాయి”
“పారదర్శకతకు, అవినీతి రహిత పాలనకు సహకార రంగం ఒక నమూనా అవుతుంది”
“చిన్న రైతులకు ఎఫ్ పీవో లు గొప్ప శక్తినిస్తాయి, చిన్న రైతులము మార్కెట్లో పెద్ద శక్తిగా మారుస్తాయి”
“ఈరోజు రసాయన రహిత ప్రకృతి సేద్యం ప్రభుత్వ ప్రాధాన్యత”

అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్  లో జరిగిన 17 వ భారత సహకార కాంగ్రెస్ నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.  ఈ 17 వ సహకార కాంగ్రెస్ థీమ్ ‘ అమృత కాలం: చురుకైన భారత కోసం సహకారం ద్వారా సంపద’. శ్రీ మోదీ ఈ సందర్భంగా సహకార మార్కెటింగ్, సహకార విస్తరణ, సలహా సేవల కోసం ఈ  కామర్స్ వెబ్ సైట్ లో ఈ-పోర్టల్స్ ప్రారంభించారు. 

సభనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ఈ సందర్భంగా అందరినీ అభినందించారు. దేశం వికసిత, ఆత్మ నిర్భర భారత్ లక్ష్య సాధన దిశలో నడుస్తున్నదన్నారు. ఈ లక్ష్య సాధనకు అందరి కృషి ( సబ్ కా ప్రయాస్) అవసరమన్నారు. ఇందుకోసం సహకార సందేశం స్ఫూర్తిగా నిలబడుతుందన్నారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు కావటానికి పాడి సహకార సమాఖ్యలు , చక్కెర తయారు చేసే అగ్ర సంస్థలలో భారత ఒకటి కావటానికి చక్కెర సహకార సంఘాలు ఎంతగానో తమ పాత్ర పోషించాయన్నారు. దేశంలో అనేక చోట్ల చిన్న రైతులకు సహకార సంఘాలు బలమైన అండగా నిలబడటాన్ని ప్రధాని గుర్తు చేశారు. పాడి రంగంలో మహిళల కృషి  దాదాపు 60% ఉందని కూడా ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. 

అందుకే ప్రభుత్వం తన లక్ష్యమైన ‘వికసిత భారతదేశం’ కోసం సహకార రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించిందన్నారు.  మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయింపులు జరిపిందన్నారు.  అందువల్లనే సహకార సంస్థలు కూడా కార్పొరేట్ రంగానికి దీటుగా పనిచేస్తున్నాయని చెప్పారు. పన్ను శాతం తగ్గింపు లాంటి చర్యల ద్వారా సహకార రంగాన్ని పటిష్టపరుస్తున్నామన్నారు. కొత్త బ్రాంచీల ప్రారంభం, ఇంటి గడప దగ్గరే బాంకింగ్ లాంటి అవకాశాలు కల్పించటం ద్వారా సహకార బాంకులను బలోపేతం చేస్తున్న సంగతి గుర్తు చేశారు.

ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో అనుసంధానం కావటాన్ని ప్రస్తావిస్తూ, గడిచిన తొమ్మిదేళ్లలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాలను ప్రధాని వివరించారు. గతంలో ప్రభుత్వ అండ నామమాత్రంగా ఉండటంతోబాటు మధ్య దళారీలు ఎక్కువగా ఉండేవారని ఇప్పుడు కోట్లాది మంది రైతులు కిసాన్  సమ్మాన్  నిధి ని నేరుగా తమ బాంకు ఖాతాల్లో పొందగలుగుతున్నారని అన్నారు.  గత నాలుగేళ్లలో ఈ పథకం కింద 2.5 లక్షల కోట్ల బదలీ అత్యంత పారదర్శకంగా జరిగిందని చెప్పారు. 2014 కు ముంది ఐదేళ్ల మొత్తం వ్యవసాయ బడ్జెట్ 90 వేలకోట్ల లోపు ఉండగా ఇప్పుడు రైతులకు బడలీ చేసిన 2.5 లక్షల కోట్లు ఎంత పెద్ద మొత్తమో గ్రహించాలని ప్రధాని కోరారు.. అంటే వ్యవసాయ బడ్జెట్ కు మూడురెట్లకు పైగా ఒక్క పథకానికే ఖర్చు పెట్టామన్నారు.

అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా, ఆ ప్రభావం రైతులమీద పడకుండా చూసిన విషయం కూడా ప్రధాని ప్రస్తావించారు. ఈరోజు భారతదేశంలో రైతులు ఒక యూరియా బస్తాకు రూ.270 చెల్లిస్తుండగా బంగ్లాదేశ్ లో రూ. 720, పాకిస్తాన్ లో రూ. 800, చైనాలో రూ. 2100,  అమెరికాలో రూ.3,000 ఉందని గుర్తు చేశారు. భారతదేశం తన రైతులకు ఎలాంటి హామీ ఇస్తున్నదో చెప్పటానికి ఇదొక ఉదాహరణ అన్నారు. గత తొమ్మిదేళ్లలో కేవలం ఎరువుల సబ్సిడీ మీదనే ప్రభుత్వం  రూ. 10 లక్షల కోట్లు వెచ్చించించిందన్నారు.

రైతులకు వారి ఉత్పత్తులకుసరైన ధర లభించటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత తొమ్మిదేళ్లలో కనీస మద్దతు ధర కోసం 15 లక్షలకోట్లు చెల్లించిందని చెప్పారు. సగటున ప్రభుత్వం ఏటా వ్యవసాయం మీద, రైతుల మీద 6.5 లక్షల కోట్లు వెచ్చిస్తున్నదన్నారు. దేశంలో ప్రతి రైతూ  ఏదోవిధంగా ఏటా దాదాపు 50 వేల రూపాయల సహాయం అందుకునేలా చూస్తున్నదన్నారు.

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని చెబుతూ, చెరకు రైతులకు సరసమైన ధర లభించేలా ఈ మధ్యనే క్వింటాలుకు రూ.315 చొప్పున  మొత్తం  3 లక్షల 79 వేల పాకేజ్  ఇవ్వటాన్ని ప్రస్తావించారు. దీనివల్ల 5 లక్షలమంది చర్యలు రైతులు ప్రత్యక్షంగానూ, చక్కెర మిల్లులలో పనిచేసేవారు పరోక్షంగానూ  లబ్ధిపొందారన్నారు. 

అమృత కాలంలో భాగంగా గ్రామాలు, రైతుల అభివృద్ధి;లో సహకార రంగం పాత్ర బాగా పెరిగిందన్నారు.  “సర్కార్, సహకార్ (ప్రభుత్వం, సహకారం) కలిసి ‘వికసిత భారత్’ కలను ఉమ్మడిగా సాకారం చేస్తాయి” అన్నారు. డిజిటల్ ఇండియా ప్రచారోద్యమం ప్రభుత్వం  పారదర్శకతకు పెద్దపీట వేసి లబ్ధిదారులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా చూస్తోంది. ఈ రోజు అవినీతి, బంధుప్రీతి మాటుమాయమయ్యాయని నిరుపేదలుకు విశ్వాసం కలిగిందన్నారు. సహకారం మీద దృష్టిసారించి రైతులు, పశువుల పెంపకం దారులు లబ్ధిపొందాటానికి ప్రయత్నించాలన్నారు. “పారదర్శకతకు, అవినీతి రహిత పాలనకు సహకార రంగం ఒక నమూనా అవుతుంది”  అని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సహకార రంగంలో డిజిటల్ వ్యవసస్థను ప్రోత్సహించాలని సూచించారు. యావత్ ప్రపంచంలో భారతదేశం డిజిటల్ లావాదేవీలకు పేరుమోసిందని, సహకార సంస్థలు కూడా ఈ  విధానాన్ని అమలు చేసుకోవాలని సూచించారు. దీనివలన మార్కెట్లో  పారదర్శకత, సమర్థత పెరగటంతోబాటు మెరుగైన పోటీ ఏర్పడుతుందన్నారు,

సహకార సంఘాలలో ప్రాథమిక స్థాయిలో ప్రధానమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ,  అవి పారదర్శకతకు నమూనాగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 60 వేలకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కంప్యూటరైజ్ అయ్యాయని అవి పారాదర్శకటకు నమూనా అవుతాయని అన్నారు.  సహకార సంఘాలు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకోవాలని ప్రధాని మోదీ  పిలుపునిచ్చారు. సహకార సంఘాలు కూడా బాంకింగ్ లో   డిజిటల్ లావాదేవీలు జరగాలని అభిలషించారు.

పెద్ద ఎత్తున పెరుగుతున్న ఎగుమతుల గురించి మాట్లాడుతూ, ఈ రంగంలో సహకార సంఘాలు కూడా  తగిన పాత్ర పోషించాలన్నారు. తయారీ రంగానికి సంబంధించి సహకార రంగాన్ని ప్రోత్సహించటానికి ఇదే కారణమన్నారు.  వాటి పన్ను భారాన్ని తగ్గించామని, పాడి రంగం ఎగుమతులలో గణనీయమైన పురోగతి సాధించిందని ప్రత్యేకంగా ప్రస్తావించారు.గ్రామాల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని సూచించారు.  శ్రీ అన్న (చిరు ధాన్యాల) కు కొత్తగా ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. ఇటీవల వైట్ హౌస్ లో  ప్రభుత్వ విందు సందర్భంగా అమెరికా కూడా శ్రీ అన్న వంతకాలను ప్రముఖంగా వడ్డించటాన్ని ప్రధాని ప్రస్తావించారు.  సహకార సంఘాలు చిరు ధాన్యాలను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకుపోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

చెరకు రైతులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను ప్రధాని వివరించారు. ముఖ్యంగా మద్దతి ధర సకాలంలో చెల్లించటానికి, బకాయిలు చెల్లించటానికి  చక్కెర మిల్లులకు రూ.20,000  కోట్లు ఇచ్చారు. అదే విధంగా చక్కెర మిల్లుల నుంచి రూ.70 వేల కోట్ల విలువ చేసే ఎత్తనాల ను ప్రభుత్వం కొనుగోలు చేసింది.   చెరకు ధరలమీద అధిక పన్నులను కూడా తడదు చేశామన్నారు. పన్ను సంబంధమైన సంస్కరణల గురించి చెబుతూ, సహకార చక్కెర మిల్లులకు రూ. 10 వేల కోట్లు కేటాయించటం ద్వారా బకాయిలు చెల్లించేలా చూశామన్నారు. 

పిఎం మత్స్య సంపద యోజన సాధించిన విజయాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నీటి వనరుల సమీపంలో నివసించే మత్స్య కారులకు,  రైతులకు ఈ పథకం అదనపు ఆదాయం సమకూర్చుకోవటానికి ఉపయోగ పడిందన్నారు. మత్స్య రంగంలో 25 వేలకు పైగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయని, చేపల శుద్ధి, చేపలు ఎండబెట్టటం, క్యూరిమగ, నిల్వ, రవాణా వంటి విభాగాలలో అవి సేవలందిస్తున్నాయని గుర్తు చేశారు.  చేపల పెంపకం వంటి రంగాలకు కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విధంగా 2 లక్షల బాహుళయర్థసాధక సహకార సంఘాలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చఱయయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనివలన సహకార సంఘాల శక్తి ప్రతి గ్రామ పంచాయితీకి చేరుతుందన్నారు, .

గత కొన్నేళ్లలో ఎఫ్ పీ వోల మీద దృష్టి పెరగటాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికే 5 వేలు ఉండగా మరో 10 వేలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఇవి చిన్న రైతులకు ఎంతో శక్తి ఇస్తాయన్నారు. ఆ విధంగా చిన్న రైతులు మార్కెట్లో  పెద్ద శక్తిగా మారుతున్నారని చెప్పారు. విత్తనాలు మొదలుకొని మార్కెట్ దాకా రైతులు పరాయి వ్యవస్ఠనూ తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నారని. శక్తిమంతమైన మార్కెట్లను శాసించగలుగుతున్నారని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా కూడా ఎఫ్ పీవోలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు, 

వ్యర్థాల నుంచి సంపద  సృష్టించే  గోబర్ధన్  పథకం గురించి ప్రధాని వివరిస్తూ, ఇది దేశవ్యాప్తంగా అమలు జరుగుతోందన్నారు. ఆవు పేడను, ఇతర వ్యర్థాలను విద్యుత్ గాను, సేంద్రీయ ఎరువులుగాను  మార్చే భారీ నెట్ వర్క్ ను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. దేశంలో అనేక కంపెనీలు 50 కి పైగా గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశాయన్నారు. సహకార సంఘాలు కూడా గోబర్ధన్  పథకానికి తోడ్పాటు ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనివలన పశుపెంపకం దారులు లబ్ధి పొండటంతోబాటు వీధుల్లో వదిలేసిన జంతువులకు కూడా విలువ పెరుగుతుందన్నారు.

పాడి, పశుగణాభివృద్ధి రంగాలలో జరుగుతున్న సంపూర్ణాభివృద్ధిని ప్రధాని ప్రస్తావించారు.  పశువుల పెంపకం దారులు పెద్ద సంఖ్యలో సహకార సంఘాలతో అనుసంధానం కావటాన్ని  గుర్తు చేశారు. ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వలన పశుపెంపకం దారులు తీవ్రంగా నష్టపోతుండటాన్ని ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా  ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టి  24 కోట్ల పశువులకు టీకాలు వేసిందన్నారు. ఈ వ్యాధి నిర్మూలనకు గాను టీకాల విషయంలో సహకార సంఘాలు ముందుకు రావాలని ప్రధాని కోరారు.  ప్రతి పాడి పశువునూ గుర్తించటంలో  సహకార సంఘాలు కీలపాత్ర పోషించాలని కోరారు.  

ప్రభుత్వం చేపట్టే వివిధ మిషన్లు విజయవంతం కావటానికి సహకార రంగం సహకరించాలని కోరారు. అమృత్ సరోవర్లు, జల సంరక్షణ, చుక్క చుక్కకూ అధిక పంట, సూక్ష్మ సేద్యం  వంటి కార్యక్రమాల్లో  చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.

నిల్వ చేసే విషయం గురించి కూడా ప్రధాని మాట్లాడారు. సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవటం చాలాకాలంగా ఆహార భద్రతకు పెనుసవాలుగా మారుతూ వస్తోందన్నారు. మనం ఉత్పత్తి చేసిన ధాన్యంలో సగానికి తక్కువే నిల్వ చేయగలుగుతున్నామన్నారు. కేంద్ర ప్రపంచం ప్రపంచంలోనే అతిపెద్ద  నిల్వకు ఒక పథకాన్ని రూపు దిద్దిందని దీనివలన 700  లక్షల టన్నుల  నిల్వ సామర్థ్యం వచ్చే అయిదేళ్లలో కలుగుతుందన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ సామర్థ్యం 1400 లక్షల టన్నులు మాత్రమేనని గుర్తు చేశారు.

ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, సహకార సంఘాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తిమంతమైన మాధ్యమంగా మారగగలవని ఆశాభావం వ్యక్తం చేశారు సహకార నమూనాను పాటిస్తూ గ్రామాలు స్వయం సమృద్ధం కావాలని పిలుపునిచ్చారు. సహకార సంఘాల మధ్య సహకారం పెరగాలని ప్రధాని ఆకాంక్షించారు.  

ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్, సహకార్ శాఖామంత్రి శ్రీ అమిత షా, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బీ ఎల్ వర్మ, ఏసియా పసిఫిక్ ప్రాంత అంతర్జాతీయ సహకార సమాఖ్య ఛైర్మన్ డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్, భారత జాతీయ సహకార యూనియన్  అధ్యక్షుడు శ్రీ దిలీప్ సంఘాని తదితరులు  పాల్గొన్నారు. 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government