ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నవ్ సారీ లో ఎ.ఎమ్. నాయక్ హెల్త్ కేర్ కాంప్లెక్స్ మరియు నిరాలీ మల్టీ స్పెశాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఖరేల్ ఎడ్యుకేశన్ కాంప్లెక్స్ ను కూడా వర్చువల్ మాధ్యమం ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగు పరచేటటువంటి ఎన్నో ప్రాజెక్టుల ను ఈ రోజున నవ్ సారీ అందుకొంది అన్నారు. నిరాలీ ట్రస్టు మరియు శ్రీ ఎ.ఎమ్. నాయక్ ఒక వ్యక్తిగత దుర్ఘటన ను మరే ఇతర కుటుంబం కూడా ఎదుర్కోనక్కర లేకుండా పూచీపడే అవకాశాన్ని సృష్టించిందని కూడా ప్రధాన మంత్రి అభినందించారు. ఆధునిక ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని, మల్టీ స్పెశాలిటీ హాస్పిటల్ ను సమకూర్చుకొన్నందుకు నవ్ సారీ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందన లు తెలియజేశారు.
పేద ప్రజల కు సాధికారిత మరియు వారికి జీవన సౌలభ్యం సిద్ధించాలి అంటే గనుక అందుకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ఆధునీకరణ తో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటు లోకి రావడం ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దేశం లో ఆరోగ్య రంగాని కి మెరుగులు దిద్దడం కోసం గడచిన 8 సంవ్సతరాల లో మేం ఒక సంపూర్ణమైన వైఖరి పట్ల శ్రద్ధ తీసుకొన్నాం’’ అని ఆయన అన్నారు. చికిత్స సదుపాయాల ను ఆధునీకరించడంతో పాటు గా పౌష్టికాహారం మరియు స్వచ్ఛమైన జీవన శైలి.. ఈ రెంటి ని మెరుగుపరచే ప్రయత్నాలు జరిగాయి అని ఆయన వివరించారు. ‘‘పేదల ను మరియు మధ్య తరగతి ప్రజల ను వ్యాధి బారి నుంచి రక్షించాలని మేం ధ్యేయం గా పెట్టుకొన్నాం; మరి ఒకవేళ వ్యాధి వెంటాడితే గనుక సంబంధి చికిత్స ఖర్చుల ను కనీస స్థాయికి తగ్గించాలి అని మేం లక్ష్యం గా పెట్టుకొన్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన సస్ టేనబుల్ డెవలప్ మెంట్ గోల్ ఇండెక్స్ లో గుజరాత్ అగ్రస్థానాన నిలచిన నేపథ్యం లో, ఆ రాష్ట్రం లో ఆరోగ్య సంరక్షణ సంబంధి మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్య సంరక్షణ సూచికలు మెరుగయ్యాయి అని ఆయన తెలిపారు.
గుజరాత్ ముఖ్యమంత్రి గా తాను స్వాస్థ్య గుజరాత్, ఉజ్జ్వల్ గుజరాత్, ముఖ్యమంత్రి అమృతం యోజన ల వంటి పథకాల ను ప్రారంభించడాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకున్నారు. ఈ అనుభవమే యావత్తు దేశం లో ప్రజల కు సేవ చేయడం లో తనకు సహాయకారి అవుతోంది అని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ లో భాగం గా గుజరాత్ లో 41 లక్షల మంది రోగులు ఉచిత చికిత్స తాలూకు ప్రయోజనాన్ని పొందారని వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, ఆదరణకు దూరం గా ఉండిపోయిన వారు మరియు ఆదివాసీ సముదాయం అని ఆయన వివరించారు. ఈ పథకం 7,000 వేల కోట్ల రూపాయల కు పై చిలుకు సొమ్మును మిగిల్చింది. గుజరాత్ ఏడున్నర వేలకు పైగా హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లతో పాటు 600 దీన్ దయాళ్ ఔషధాలయాలను అందుకొంది. కేన్సర్ వంటి వ్యాధుల కు ఆధునిక చికిత్స ను అందించగలిగే పరికరాలు గుజరాత్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల లో ఉన్నాయి. భావ్ నగర్, జామ్ నగర్, రాజ్ కోట్ మొదలైన నగరాలు కేన్సర్ చికిత్స సంబంధిత సదుపాయాల కు నిలయాలు గా ఉన్నాయి. మూత్రపిండాల వ్యాధి చికిత్స విషయం లో కూడాను ఈ రాష్ట్రం లో మౌలిక సదుపాయాల పరం గా ఇదే విస్తరణ ను గమనించవచ్చును.
మహిళలు మరియు బాలల ఆరోగ్యం, పౌష్టికాహారం సంబంధి ప్రమాణాలు మెరుగుపడ్డ విషయాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. 14 లక్షల మంది తల్లుల కు కాన్పు పరం గా లబ్ధి ని చేకూర్చినటువంటి చిరంజీవి యోజన ను గురించి ఆయన ప్రస్తావించారు. గుజరాత్ లో అమలైన చిరంజీవి మరియు ఖిల్ ఖిలా హట్ పథకాల ను మిషన్ ఇంద్రధనుష్ మరియు పిఎమ్ మాతృ వందన యోజన లుగా జాతీయ స్థాయి లో విస్తరించడం జరిగింది అని ప్రధాన మంత్రి తెలిపారు. రాష్ట్రం లో వైద్య విద్య ను మెరుగు పరచడం కోసం అమలవుతున్న చర్యల ను గురించి కూడా ప్రధాన మంత్రి తన ప్రసంగం లో పేర్కొన్నారు. రాజ్ కోట్ లో ఎఐఐఎమ్ఎస్ ఏర్పాటవుతోందని, రాష్ట్రం లో వైద్య కళాశాల ల సంఖ్య 30 కి చేరుకొందని, ఎమ్ బిబిఎస్ సీట్లు 1100 నుంచి 5700 కు పెరిగాయని మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ లు 800 గా మాత్రమే ఉండగా అవి 2000 పై చిలుకు స్థాయి కి చేరాయని వివరించారు.
గుజరాత్ ప్రజల లోని సేవా భావన కు నమస్కారం చేస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘గుజరాత్ ప్రజల దృష్టి లో, ఆరోగ్యం మరియు సేవ అనేవి జీవిత లక్ష్యాలు గా ఉన్నాయి. సేవ చేయడాన్ని దేశాని కి ఒక శక్తి గా తీర్చిదిద్దినటువంటి బాపు వంటి మహనీయుల తాలూకు ప్రేరణ మనకు దక్కింది. గుజరాత్ లోని ఈ భావన ఇప్పటికీ పూర్తి శక్తి తో కూడుకొని ఉంది. ఇక్కడ అత్యంత సఫల వ్యక్తి సైతం ఏదో ఒక సేవా కార్యం తో అనుబంధాన్ని కలిగి ఉన్న వారే. గుజరాత్ లో సామర్ధ్యం వృద్ధి చెందుతున్న కొద్దీ, సేవ చేయాలి అనే భావన దానికి అనుగుణం గానే వృద్ధి చెందుతుంటుంది అని ప్రధాన మంత్రి చివరగా అన్నారు.
बीते 8 साल के दौरान देश के हेल्थ सेक्टर को बेहतर बनाने के लिए हमने एक हॉलिस्टिक अप्रोच पर बल दिया है।
— PMO India (@PMOIndia) June 10, 2022
हमने इलाज की सुविधाओं को आधुनिक बनाने का प्रयास तो किया है, बेहतर पोषण, स्वच्छ जीवन शैली, preventive health के साथ जुड़े हुए behavioural विषयों पर भी जोर दिया है: PM
बीते 20 सालों में गुजरात के हेल्थ सेक्टर ने कई नए मुकाम हासिल किए हैं।
— PMO India (@PMOIndia) June 10, 2022
इन 20 वर्षों में गुजरात में शहरों से लेकर ग्रामीण इलाकों तक, हेल्थ इनफ्रास्ट्रक्चर के लिए अभूतपूर्व काम हुआ है, हर स्तर पर काम हुआ है।
ग्रामीण इलाकों में हजारों हेल्थ सेंटर्स बनाए गए: PM @narendramodi
गुजरात में अपने सेवाकाल के दौरान हमारी सरकार ने बच्चों और महिलाओं के स्वास्थ्य और पोषण को सर्वोच्च प्राथमिकता दी।
— PMO India (@PMOIndia) June 10, 2022
चिरंजीवी योजना के तहत पब्लिक-प्राइवेट भागीदारी सुनिश्चित करके, संस्थागत डिलिवरी को हमने एक व्यापक विस्तार दिया: PM @narendramodi
बीते सालों में गुजरात में डॉक्टर और पैरामेडिक्स की पढ़ाई और ट्रेनिंग की सुविधाएं भी बहुत अधिक बढ़ी हैं।
— PMO India (@PMOIndia) June 10, 2022
राजकोट में एम्स जैसा बड़ा संस्थान बन रहा है।
मेडिकल कॉलेजों की संख्या आज 30 से अधिक हो चुकी है: PM @narendramodi