రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న లోక్ సభ లో సమాధానాన్ని ఇచ్చారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) గురించి ప్రధాన మంత్రి కూలంకషం గా మాట్లాడుతూ, దీనివల్ల భారతదేశం లో ఏ ఒక్క పౌరుడు/పౌరురాలు ప్రభావితం కాబోరంటూ సభ కు హామీ ని ఇచ్చారు.
ప్రధాన మంత్రి తన ఉపన్యాసం లో మునుపటి ప్రభుత్వాల ఆలోచన సరళి కూడా ఒకే రకమైనది గా ఉంది అని ప్రస్తావించారు.
ఇరుగు పొరుగు దేశాల నుండి వచ్చే అల్ప సంఖ్యాక వర్గాల శరణార్థుల కు భారతదేశం రక్షణ ను ఇవ్వాలని, అందులకు గాను అవసరపడితే చట్టాన్ని సవరించడానికి భారతదేశ ప్రథమ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సుముఖత వ్యక్తం చేయడాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగం లో ఉట్టంకించారు.
కొన్ని రాజకీయ పక్షాలు భారతదేశం లో వేర్పాటు సంబంధ కార్యాచరణ కు యత్నిస్తున్న పాకిస్తాన్ కు కొమ్ము కాస్తున్నాయని ప్రధాన మంత్రి అంటూ, సిఎఎ భారతదేశం లో ఏ ఒక్క పౌరుడి ని/పౌరురాలి ని ప్రభావితం చేయబోదు అంటూ లోక్ సభ కు హామీ ని ఇచ్చారు.
‘‘సిఎఎ ను అమలు చేసినందువల్ల భారతదేశం లో ఏ ఒక్క పౌరుడి కి/పౌరురాలి కి, వారి యొక్క విశ్వాసం/ధర్మం ఏది అయినప్పటికి కూడాను, ఎటువంటి ప్రభావం ఉండబోదు అని నేను స్పష్టం చేయదలచుకొన్నాను’’ అని ఆయన అన్నారు.
Much has been said about CAA, ironically by those who love getting photographed with the group of people who want ‘Tukde Tukde’ of India: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 6, 2020