యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ఎ సందర్శన కై వాషింగ్ టన్ డి.సి. (2021, సెప్టెంబర్ 22 న స్థానిక సమయం) కి విచ్చేశారు.
నిర్వహణ మరియు వనరుల సహాయ మంత్రి శ్రీ టి.హెచ్. బ్రాయన్ మెక్ కాన్ యుఎస్ఎ ప్రభుత్వం తరఫు న ప్రధాన మంత్రి కి స్వాగతం పలికారు.
ఉల్లాస భరితులైన భారతీయ సముదాయం ఎండ్ ర్యూజ్ ఎయర్ బేస్ లో గుమికూడారు; వారు ఆనందం గా ప్రధాన మంత్రి కి స్వాగతం పలికారు.
Landed in Washington DC. Over the next two days, will be meeting @POTUS @JoeBiden and @VP @KamalaHarris, Prime Ministers @ScottMorrisonMP and @sugawitter. Will attend the Quad meeting and would also interact with leading CEOs to highlight economic opportunities in India. pic.twitter.com/56pt7hnQZ8
— Narendra Modi (@narendramodi) September 22, 2021