ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం మార్చి నెల 22వ తేదీ నుండి 23 వ తేదీ వరకు భూటాన్ లో ఆధికారిక పర్యటన కై ఈ రోజు న పారో కు చేరుకొన్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.
భూటాన్ ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్ గే ప్రధాన మంత్రి కి పారో విమానాశ్రయం లో సాదరం గా స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి గౌరవార్థం ఆయన కు సంప్రదాయబద్ధ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించడమైంది.
భూటాన్ యొక్క రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యెల్ వాంగ్ చుక్ తోను, భూటాన్ కు నాలుగో రాజు అయిన శ్రీ జిగ్మే సింగ్యే వాంగ్ చుక్ తోను ప్రధాన మంత్రి తన యాత్ర కాలం లో సమావేశం కానున్నారు. భూటాన్ ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్ గే తో కూడా ప్రధాన మంత్రి చర్చించనున్నారు.
భారత ప్రభుత్వం యొక్క సహాయం తో థింపూ లో నిర్మించిన అత్యాధునిక ఆసుపత్రి అయినటువంటి ‘గ్యాల్ సుయెన్ జెత్సున్ పేమా మాత మరియు శిశు ఆసుపత్రి’ ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.