మధ్యప్రదేశ్లో వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు 2 లక్షల రూపాయల మేర ఎక్స్ గ్రేషియా అందజేయడానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, తమ ఆమోదం తెలియజేశారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించడానికి కూడా ఆయన ఆమోదం తెలియజేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ , "మధ్యప్రదేశ్లో వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు పి.ఎం.ఎన్..ఆర్.ఎఫ్. నుండి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఇస్తారు." అని పేర్కొంది.
PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who have lost their lives due to rains and floods in Madhya Pradesh. Rs. 50,000 would be given to the injured.
— PMO India (@PMOIndia) August 4, 2021