జీఇఎం వేదికపై తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్న విక్రేతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. కాగా, 2022-2023 ఆర్థిక సంవత్సరానికిగాను 2022 నవంబరు 29నాటికి ఈ వేదికపై లభ్యమయ్యే వస్తువుల స్థూల విలువ రూ.లక్ష కోట్లకుపైగా నమోదైంది.
ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్‌పై ప్రధాని స్పందిస్తూ-
“ఇదెంతో అద్భుతమైన సమాచారం! @GeM_India భారత వ్యవస్థాపక ఉత్సాహాన్ని ప్రదర్శించడంతోపాటు పారదర్శకతను పెంపొందించడంలో కొత్తపుంతలు తొక్కింది. ఈ వేదికపై తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్న వారందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ బాటను అనుసరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను” అని పేర్కొన్నారు.
Excellent news! @GeM_India is a game changer when it comes to showcasing India’s entrepreneurial zeal and furthering transparency. I laud all those who are displaying their products on this platform and urge others to do the same. https://t.co/O2gioaxxrL
— Narendra Modi (@narendramodi) November 29, 2022