ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో భారత పురుషుల 4x400 మీటర్ల రిలే పరుగు జట్టు అద్భుత ప్రతిభ చూపి, ఫైనల్స్ చేరిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు అర్హత సాధించడంలో జట్టు సభ్యులు అనాస్, అమోజ్, రాజేష్ రమేష్, ముహమ్మద్ అజ్మల్ చూపిన సమష్టి కృషి అభినందనీయమన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో సమష్టి కృషి అద్భుతం! అనాస్, అమోజ్, రాజేష్ రమేష్, ముహమ్మద్ అజ్మల్ తమ ప్రతిభతో జట్టును ఫైనల్స్ చేర్చడమే కాకుండా 4x400 మీటర్ల రిలే పరుగులో సరికొత్త ఆసియా రికార్డు నెలకొల్పడం ముదావహం. ఈ విన్యాసం ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత చరిత్రాత్మక పునరాగమనంగా చిరకాలం గుర్తుంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Incredible teamwork at the World Athletics Championships!
— Narendra Modi (@narendramodi) August 27, 2023
Anas, Amoj, Rajesh Ramesh and Muhammed Ajmal sprinted into the finals, setting a new Asian Record in the M 4X400m Relay.
This will be remembered as a triumphant comeback, truly historical for Indian athletics. pic.twitter.com/5pRkmOoIkM