పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు 2 లక్షల రూపాయల మేర ఎక్స్ గ్రేషియా అందజేయడానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, తమ ఆమోదం తెలియజేశారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించడానికి కూడా ఆయన ఆమోదం తెలియజేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ , "పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు పి.ఎం.ఎన్..ఆర్.ఎఫ్. నుండి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఇస్తారు." అని పేర్కొంది.
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to flooding in parts of West Bengal. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) August 4, 2021