గౌరవనీయులైన అధ్యక్షుడు ట్రంప్,

రెండు దేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులకు
నమస్కారం!
ముందుగా నాకు ఆత్మీయ స్వాగతాన్ని, ఆతిథ్యాన్ని అందించిన నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్ తన నాయకత్వ పటిమ ద్వారా భారత్-అమెరికా మధ్య సంబంధాలను పునరుజ్జీవింపచేశారు.
ఆయన మొదటిసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎంత ఉత్సాహంగా కలిసి పనిచేశామో, ఇప్పుడు కూడా అదే శక్తిని, నిబద్ధతను చూస్తున్నాను.
ఆయన తొలిసారి పదవి చేపట్టినప్పుడు పరస్పర విశ్వాసంతో మేం సాధించిన విజయాలకు ఈనాటి చర్చలు సంతృప్తికరమైన వారధిగా నిలిచాయి. అదే సమయంలో కొత్త లక్ష్యాలు సాధించాలని సంకల్పించుకున్నాం. భారత్, అమెరికా మధ్య సహకారం, భాగస్వామ్యం ప్రపంచాన్ని మరింత మెరుగుపరుస్తాయని మేం విశ్వసిస్తున్నాం.

స్నేహితులారా,

అధ్యక్షుడి ట్రంప్ నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేదా ‘‘మాగా’’ గురించి అమెరికా ప్రజలకు బాగా తెలుసు. భారతీయుులు సైతం ‘‘వికసిత్ భారత్ 2047’’ సంకల్పాన్ని సాధించేందుకు వారసత్వం, అభివృద్ధి మార్గంలో వేగంగా అడుగులు వేస్తున్నారు.

అమెరికా భాషలో వివరిస్తే.. అభివృద్ధి చెందిన భారత్ అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అంటే ‘‘మిగా’’ అని అర్థం.

 

|

అమెరికా, భారత్ కలసి పనిచేసినప్పుడు ‘‘మాగా’’, ‘‘మిగా’’ రెండూ కలసి సంక్షేమానికి ‘‘మెగా’’ భాగస్వామ్యం ఏర్పడుతుంది. ఈ మెగా ఉత్సాహం మన లక్ష్యాలకు కొత్త స్థాయిని, పరిధిని ఇస్తుంది.
మిత్రులారా,
ద్వైపాక్షిక వాణిజ్యంలో 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ఈ రోజు మేం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పరస్పరం ప్రయోజనం చేకూర్చే వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసేందుకు మా బృందాలు పనిచేస్తాయి.
భారత్ ఇంధన భద్రతకు హామీ ఇస్తూ చమురు, సహజవాయు వాణిజ్యాన్ని బలోపేతం చేస్తాం. ఇంధన మౌలిక వసతుల్లో పెట్టుబడులు సైతం పెరుగుతాయి.
అణు ఇంధన రంగంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల దిశగా సహకారాన్ని పెంచే అంశాలపై కూడా మేం చర్చించాం.
స్నేహితులారా,

భారత రక్షణ సన్నద్ధతలో సైతం అమెరికా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. వ్యూహాత్మక, విశ్వసనీయ భాగస్వాములుగా... ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పత్తి, సాంకేతికతల బదిలీ దిశగా మేం చురుగ్గా ముందుకు సాగుతున్నాం.
రానున్న కాలంలో, నూతన సాంకేతికత, పరికరాలు మా సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ (స్వయం ప్రతిపత్తి గల ఆయుధ పారిశ్రామిక భాగస్వామ్యం)ను ప్రారంభించాలని నిర్ణయించాం.
వచ్చే దశాబ్ద కాలానికి రక్షణ సహకార నియమావళి రూపొందుతుంది. రక్షణ బలగాల మధ్య పరస్పర సహకారం, రవాణా, మరమ్మత్తులు, నిర్వహణ దీనిలో ప్రధానాంశాలుగా ఉంటాయి.

 

|

మిత్రులారా,
21వ శతాబ్దంతో సాంకేతికత సాయంతో నడుస్తోంది. ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే రెండు దేశాల మధ్య సాంకేతిక రంగంలో సన్నిహిత సహకారం మొత్తం మానవాళికి నూతన దిశను, సామర్థ్యాన్ని, అవకాశాలను కల్పిస్తుంది.
కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, క్వాంటం, బయోటెక్నాలజీ, ఇతర సాంకేతికతల్లో భారత్, అమెరికా కలసి పనిచేస్తాయి.
ట్రస్ట్ - ట్రాన్స్ఫామింగ్ రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ విషయంలోనూ మేం అంగీకారానికి వచ్చాం. దీని ద్వారా, కీలకమైన ఖనిజాలు, అధునాతన ముడి పదార్థాలు, ఔషధాల సరఫరా కోసం సమర్ధవంతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. లిథియం లాంటి అరుదైన ఖనిజాలను వెలికితీయడానికి, శుద్ధి చేయడానికి ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం.

అంతరిక్ష రంగంలోనూ అమెరికాతో మాకు సన్నిహిత సహకారం ఉంది. ఇస్రో, నాసా భాగస్వామ్యంతో ‘నిసార్’ ఉపగ్రహాన్ని తయారు చేశాం. దీనిని త్వరలోనే భారతీయ అంతరిక్ష వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు.
మిత్రులారా,

ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలు, వ్యవస్థలపై ఆధారపడి భారత్, అమెరికా మధ్య భాగస్వామ్యం కొనసాగుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని, సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు మేం కలసి పనిచేస్తాం. దీనిలో క్వాడ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.
ఈ ఏడాది భారత్‌లో జరిగే క్వాడ్ సమ్మేళనంలో మా భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని కొత్త రంగాలకు విస్తరిస్తాం. ఐఎంఈసీ, ఐ2యూ2 కార్యక్రమాల ద్వారా ఆర్థిక కారిడార్లు, రవాణా మౌలికవసతుల కల్పనలో కలసి పనిచేస్తాం.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, అమెరికా కలిసి దృఢంగా పనిచేస్తాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కలసి పనిచేయడం అవసరమని మేం అంగీకరించాం.
2008లో భారత్‌లో జరిగిన నరమేధానికి కారణమైన నిందితుడ్ని మాకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్న అధ్యక్షునికి ధన్యవాదాలు. ఇప్పుడు భారత న్యాయస్థానాలు తగిన చర్యలు చేపడతాయి.

 

|

మిత్రులారా,
రెండు దేశాల మధ్య బంధానికి అమెరికాలో ఉన్న భారతీయ సమాజం కీలకం. ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత పెంచే యోచనతో లాస్ ఏంజెల్స్, బోస్టన్‌ నగరాల్లో కొత్త భారతీయ కాన్సులేట్లు త్వరలోనే తెరుచుకోబోతున్నాయి.
 

|

భారత్‌లోని ఆఫ్-షోర్ క్యాంపస్‌లను సందర్శించాలని అమెరికా విశ్వ విద్యాలయాలు, విద్యాసంస్థలను ఆహ్వానిస్తున్నాం.
అధ్యక్షుడు ట్రంప్, భారత్ పట్ల మీకున్న స్నేహభావానికి, దృడమైన నిబద్ధతకు ధన్యవాదాలు. మీరు 2020లో భారత్‌ను సందర్శించిన సందర్భాన్ని మా ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. త్వరలోనే అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వారి వద్దకు వస్తారని ఆశిస్తున్నాను.
1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున మిమ్మల్ని భారత్‌కు ఆహ్వానిస్తున్నాను.
ధన్యవాదాలు
 

  • Sekukho Tetseo March 29, 2025

    Elon Musk say's - I am a FAN of MODI.
  • Ravi Dhakad March 25, 2025

    🚩🚩🚩
  • Jitendra Kumar March 18, 2025

    🙏🇮🇳
  • ABHAY March 15, 2025

    नमो सदैव
  • Vivek Kumar March 08, 2025

    Jai shree ram
  • கார்த்திக் March 03, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏🏻
  • Dinesh sahu March 03, 2025

    पहली अंजली - बेरोजगार मुक्त भारत। दूसरी अंजली - कर्ज मुक्त भारत। तीसरी अंजली - अव्यवस्था मुक्त भारत। चौथी अंजली - झुग्गी झोपड़ी व भिखारी मुक्त भारत। पांचवी अंजली - जीरो खर्च पर प्रत्याशी का चुनाव हो और भ्रष्टाचार से मुक्त भारत। छठवीं अंजली - हर तरह की धोखाधड़ी से मुक्त हो भारत। सातवीं अंजली - मेरे भारत का हर नागरिक समृद्ध हो। आठवीं अंजली - जात पात को भूलकर भारत का हर नागरिक एक दूसरे का सुख दुःख का साथी बने, हमारे देश का लोकतंत्र मानवता को पूजने वाला हो। नवमीं अंजली - मेरे भारत की जन समस्या निराकण विश्व कि सबसे तेज हो। दसमी अंजली सौ फ़ीसदी साक्षरता नदी व धरती को कचड़ा मुक्त करने में हो। इनको रचने के लिये उचित विधि है, सही विधान है और उचित ज्ञान भी है। जय हिंद।
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • Gurivireddy Gowkanapalli March 03, 2025

    jaisriram
  • Vivek Kumar Gupta March 01, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India Inc raises record Rs 1.33 lakh cr via QIPs in FY25 amid market boom

Media Coverage

India Inc raises record Rs 1.33 lakh cr via QIPs in FY25 amid market boom
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 మార్చి 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership