మానవ జీవన శ్రేయస్సులో యోగాభ్యాసానికిగల ప్రాముఖ్యంపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెజ్ అభిప్రాయంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏకీభవించారు. యోగా దినోత్సవం మనందర్నీ మరింత సన్నిహితం చేయడంతోపాటు భూగోళం చక్కగా వర్ధిల్లేలా నడచుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించేలా స్ఫూర్తినివ్వాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో- ప్రస్తుత విభజిత ప్రపంచంలో లక్షలాది ప్రజానీకాన్ని యోగాభ్యాసం ఒకే వేదికపైకి తెస్తుందని, ఇది సమష్టి సామర్థ్యం, సామరస్యం, శాంతికి బలమైన మూలస్తంభమని పేర్కొన్నారు.
ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ట్వీట్‌కు స్పందనగా ప్రధానమంత్రి ఇచ్చిన సందేశంలో:
“యోగా ప్రాముఖ్యంపై ఐరాస ప్రధాన కార్యదర్శి @antonioguterres అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. యోగాభ్యాసం మనందర్నీ మరింత దగ్గర చేయడంతోపాటు భూగోళం ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Fully agree with @UN Secretary General @antonioguterres on the importance of Yoga. May Yoga Day bring us all closer and improve the health of our planet. https://t.co/enNyUJte32
— Narendra Modi (@narendramodi) June 21, 2023