మారిశస్ లో సర్వోన్నత న్యాయస్థానం నూతన భవనాన్ని 2020వ సంవత్సరం జూలై 30వ తేదీ గురువారం నాడు మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉభయులు సంయుక్తం గా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమం మారిశస్ న్యాయ వ్యవస్థ కు చెందిన సీనియర్ సభ్యులు మరియు ఇరు దేశాల కు చెందిన ఇతర ప్రముఖుల సమక్షం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరుగనుంది. భవనాన్ని భారతదేశం మంజూరు చేసిన సహాయం తో నిర్మించడమైంది. ఇంకా ఇది కోవిడ్ అనంతర కాలం లో భారతదేశం యొక్క సహాయం తో రాజధాని నగరం పోర్ట్ లుయిస్ లో కట్టబడినటువంటి ఒకటో మౌలిక సదుపాయ కల్పన పరియోజన కానున్నది.
మారిశస్ కు భారత ప్రభుత్వం 2016వ సంవత్సరం లో అందజేసిన 353 మిలియన్ యుఎస్ డాలర్ ల విలువైన ‘స్పెశల్ ఇకొనామిక్ పాకేజ్’ లో భాగం గా రూపుదాల్చబోతున్నటువంటి అయిదు పరియోజనల లో నూతన సర్వోన్నత న్యాయస్థానం భవనం కూడా ఒకటి గా ఉంది. ఈ ప్రాజెక్టు ను అనుకొన్న కాల పరిమితి కి లోపే అంచనా వేసిన దాని కంటే తక్కువ వ్యయం తో పూర్తి చేయడం జరిగింది. 10 కి పైగా అంతస్తుల తో కూడిన ఈ భవనం రమారమి 4,700 చదరపు మీటర్ల క్షేత్రం లో వ్యాపించివుంది; ఇంకా దీని యొక్క నిర్మిత ప్రాంతపు విస్తీర్ణం సుమారు గా 25,000 చదరపు మీటర్లు ఉంది. ఈ భవనం అత్యాధునికమైనటువంటి రూపురేఖల తో, హరిత విశేషతల తో అలరారుతున్నది. దీని లో ఉష్ణ సంబంధి మరియు ధ్వని నిరోధక వ్యవస్థల తో పాటు శక్తి వినియోగం విషయం లో అధిక సమర్థంగా ఉండేటట్టు శ్రద్ధ వహించడమైంది.
స్పెశల్ ఇకొనామిక్ పాకేజ్ లో భాగం గా మారిశస్ లో నిర్మితమైనటువంటి నూతన ఇఎన్ టి హాస్పిటల్ పరియోజన ను, ఇంకా మెట్రో ఎక్స్ ప్రెస్ పరియోజన యొక్క ఫేజ్-I ని 2019వ సంవత్సరం అక్టోబర్ లో మారిశస్ ప్రధాని మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలసి ప్రారంభించారు. మెట్రో ఎక్స్ ప్రెస్ పరియోజన యొక్క ఫేజ్-I లో భాగం గా, 12 కి.మీ. పొడవైన మెట్రో మార్గం నిర్మాణం కిందటి సంవత్సరం సెప్టెంబర్ లో పూర్తి అయింది. కాగా ఫేజ్ -2 తాలూకు 14 కి.మీ. పొడవైన మెట్రో మార్గం పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇఎన్ టి హాస్పిటల్ ప్రాజెక్టు మాధ్యమం ద్వారా భారతదేశం మారిశస్ లో 100 పడకలు కలిగివుండేటటటువంటి అత్యాధునిక ఇఎన్ టి ఆసుపత్రి యొక్క నిర్మాణం లో సహాయాన్ని అందిస్తున్నది.
నూతన సర్వోన్నత న్యాయస్థానం భవనం ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంకేతం గా ఉంటూ రాజధాని నగరం లో ఒక ముఖ్యమైన సీమచిహ్నం కాగలదని భావిస్తున్నారు.