మారిశస్ లోని అగాలెగా దీవి లో ఆరు సాముదాయిక అభివృద్ధి ప్రాజెక్టుల తో పాటు క్రొత్త ఎయర్‌స్ట్రిప్, ఇంకా సెయింట్ జేమ్స్ జెట్టీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ లు 2024 ఫిబ్రవరి 29 వ తేదీ నాడు మధ్యాహ్నం పూట ఒంటి గంట వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా సంయుక్తం గా ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమం భారతదేశాని కి మరియు మారిశస్ కు మధ్య బలమైనటువంటి మరియు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యానికి ఒక నిదర్శనగా ఉంది అని చెప్పాలి. ఈ ప్రాజెక్టులు మారిశస్ ముఖ్య క్షేత్రం మరియు అగాలెగా దీవి కి మధ్య మెరుగైన సంధానం తాలూకు ఆవశ్యకత ను పూర్తి చేయడమే కాకుండా సముద్ర సంబంధి భద్రత ను బలోపేతం చేస్తాయి; అలాగే సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వనున్నాయి.
ఇద్దరు నేతలు ఇటీవలే అంటే 2024 ఫిబ్రవరి 12వ తేదీ న మారిశస్ లో యుపిఐ మరియు రూపే కార్డుల సేవల ను ప్రారంభించిన తరువాత ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరుగుతుండడం తో ఈ కార్యక్రమం ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నది.