ఈ రోజు ప్యారిస్‌లో నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్...ప్రసంగించారు. ఈ ఫోరమ్ ఇరు పక్షాలకు చెందిన వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓల)ను ఒక చోటుకు చేర్చింది. ఇది రక్షణ, ఏరోస్పేస్, కీలక టెక్నాలజీలు-కొత్తగా ఉనికిలోకి వస్తున్న టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, కృత్రిమ మేధ, వైద్య ఆరోగ్య శాస్త్రాలు, జీవనశైలిలతోపాటు ఆహారం, ఆతిథ్య రంగాలపై దృష్టిని కేంద్రీకరించింది.
భారత్, ఫ్రాన్స్‌ల వ్యాపారం, ఆర్థిక సహకారం అంతకంతకు విస్తరిస్తూ ఉండడాన్ని, రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి అది అందించిన ప్రేరణను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. సుస్థిర ప్రభుత్వ విధానాలే కాక విధాన నిర్ణయాల అమలు పరంగా అంచనాలతో సరిపోలే తరహా మార్పుచేర్పులను ఇండియా అనుసరిస్తూ ఉన్న కారణంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోని అనేక దేశాలకు అభిమానపాత్ర దేశంగా మారిందని ఆయన ప్రధానంగా చెప్పారు. ఇటీవల బడ్జెటులో ప్రకటించిన సంస్కరణలను గురించి ఆయన మాట్లాడుతూ... బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించిన సంగతిని ప్రస్తావించారు. పౌర ప్రయోజనాలే ప్రధానంగా పరమాణు ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రైవేటు ప్రాతినిధ్యానికి అవకాశాన్ని కల్పించడంతోపాటు ఇంధన మార్పునకు, డీకార్బనైజేషన్‌కు తోడ్పడే వినూత్న అణు సాంకేతికతలైన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్), అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ రియాక్టర్ల (ఏఎంఆర్)పై దృష్టి సారించడాన్ని గురించి, కస్టమ్స్ రేటు స్వరూపాన్ని సువ్యవస్థీకరించడాన్ని గురించి కూడా ఆయన వివరించారు. ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సరళతర ఆదాయపు పన్ను విధానాన్ని తీసుకువచ్చినట్లు ప్రధానమంత్రి తెలిపారు. సంస్కరణలను ప్రవేశపెట్టడాన్ని కొనసాగించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెబుతూ, ఆర్థిక కార్యకలాపాల పర్యవేక్షణలో నమ్మకానికి పెద్దపీటను వేస్తూ సువ్యవస్థీకరణ ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టడానికి ఒక ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇదే తరహా స్ఫూర్తితో, గత కొన్నేళ్లలో 40,000కు పైగా నియమపాలన నిర్బంధాలను తొలగించి హేతుబద్ధీకరణకు తావు ఇచ్చామని ఆయన అన్నారు.
వృద్ధి సాధన దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో, రక్షణ, ఇంధనం, హైవే, పౌర విమానయానం, అంతరిక్షం, ఆరోగ్యసంరక్షణ, ఫిన్‌టెక్, స్థిరాభివృద్ధి రంగాల్లో లభిస్తున్న చాలా అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నైపుణ్యాలు, ప్రతిభ, నవకల్పనలతోపాటు భారత్ ఇటీవలే కొత్తగా చేపట్టిన కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్, క్వాంటమ్, కీలక ఖనిజాలు, హైడ్రోజన్ మిషన్‌ల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తే కాక ప్రశంసలు కూడా వ్యక్తం అవుతున్నాయని ఫ్రాన్స్ వాణిజ్య వ్యవస్థలు పరస్పర వృద్ధి కోసం, సమృద్ధి కోసం ఇండియాతో చేతులు కలపాలని ఆయన సూచించారు. ఈ రంగాల్లో క్రియాశీల సంబంధాల్ని నెలకొల్పుకోవడానికి ప్రాధాన్యాన్నివ్వాలని ఆయన స్పష్టం చేస్తూ, నవకల్పన, పెట్టుబడులు, సాంకేతికత చోదకశక్తిగా ఉండే భాగస్వామ్యాల్ని పెంచుకోవాలన్న ఇరు దేశాల నిబద్ధతను పునరాద్ఘాటించారు. ప్రధాని పూర్తి ప్రసంగం పాఠాన్ని ఇక్కడ ( here ) చూడొచ్చు.
French Side:
The India-France CEO Forum plays a key role in strengthening economic ties and fostering innovation. It is gladdening to see business leaders from both nations collaborate and create new opportunities across key sectors. This drives growth, investment and ensures a better future… pic.twitter.com/gSImOqAcEZ
— Narendra Modi (@narendramodi) February 11, 2025
Le Forum des chefs d'entreprise Inde-France joue un rôle clé dans le renforcement des liens économiques et la promotion de l'innovation. Il est réjouissant de voir des chefs d'entreprise des deux pays collaborer et créer de nouvelles opportunités dans des secteurs clés. Cela… pic.twitter.com/mkOrTQTr6z
— Narendra Modi (@narendramodi) February 11, 2025