న్యూ దిల్లీ లో జి-20 సదస్సు నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 10వ తేదీన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడెతో సమావేశమయ్యారు. జి-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు నరేంద్ర మోదీని ఆయన అభినందించారు. ప్రజాస్వామ్య విలువలపై పూర్తి విశ్వాసం ఉన్న దేశాలుగా చట్టాలను గౌరవిస్తూనే ప్రజల మధ్య గట్టి బంధం కొనసాగాలే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కెనడాలో తీవ్రవాదుల భారత వ్యతిరేక కార్యకలాపాల పట్ల మోదీ ఈ సందర్బంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.
వారు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తు, భారతీయ దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నారని, దౌత్య ప్రాంగణాలను దెబ్బతీస్తున్నారని, అంతే కాకుండా కెనడాలోని భారతీయ సమాజాన్ని, వారి ప్రార్థనా స్థలాల విషయంలో కూడా భయభ్రాంతులకు గురయ్యేలా వ్యవహరిస్తున్నారని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల సిండికేట్‌లు, మానవ అక్రమ రవాణాతో ఇటువంటి శక్తుల కలవడం కెనడాకు కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవడంలో ఇరు దేశాలు సహకరించుకోవడం తప్పనిసరి అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
భారతదేశం-కెనడా సంబంధాల పురోగతికి పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడిన సంబంధం చాలా అవసరమని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Met PM @JustinTrudeau on the sidelines of the G20 Summit. We discussed the full range of India-Canada ties across different sectors. pic.twitter.com/iP9fsILWac
— Narendra Modi (@narendramodi) September 10, 2023