ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి , హిజ్ ఎక్సలెన్సీ శ్రీ రిషి సునాక్తో
సెప్టెంబర్ 09,2023న , న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్బంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
2022 అక్టోబర్ లో యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికైనప్పటి నుంచి , ఆయన భారత్ సందర్శించడం ఇదే తొలిసారి.
ఇండియా జి 20 అధ్యక్షతకు యు.కె. ఇచ్చిన మద్దతుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 సమావేశాలలో
దీనికి సంబంధించిన పలు ఈవెంట్లలో వివిధ దేశాధినేతలు, ఉన్నతస్థాయి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఆరోగ్యం, మొబిలిటి రంగాలు, వాతావరణ మార్పులు, హరిత సాంకేతికత, రక్షణ, భద్రతా సాంకేతికత,ఆర్థికరంగానికి సంబంధించి రోడ్ మ్యాప్ 2030
, అలాగే ఇండియా –యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విషయంలో పురోగతి, ద్వైపాక్షిక సహకారం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇరువురు నాయకులు ఉభయులకు పరస్పర ప్రయోజనకరమైన అంశాలతో పాటు, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను కలబోసుకున్నారు.
ఇరువురు నాయకులు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై సంప్రదింపుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన అంశాలు త్వరలోనే చేపట్టవచ్చని, దీనిద్వారా ఉభయపక్షాలకు ప్రయోజనకరమైన, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలోనే
ఖరారు అవుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
త్వరలోనే ఉభయులకు అనువైన తేదీలలో, మరింత వివరణాత్మక చర్చలకోసం, ద్వైపాక్షిక సందర్శనకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుకె ప్రధానమంత్రి సునాక్ ను కోరారు.
దీనికి యుకె ప్రధానమంత్రి సునాక్ అంగీకారం తెలిపారు. అలాగే జి 20 శిఖరాగ్ర సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని , యుకె ప్రధాని సునాక్ అభినందించారు.
Great to have met PM @RishiSunak on the sidelines of the G20 Summit in Delhi. We discussed ways to deepen trade linkages and boost investment. India and UK will keep working for a prosperous and sustainable planet. pic.twitter.com/7kKC17FfgN
— Narendra Modi (@narendramodi) September 9, 2023