ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈరోజు ఉమ్మడిగా భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్ (ఐబీఎఫ్ పి) ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఇరుదేశాల ప్రధానులు 2018 సెప్టెంబర్ లో శంకుస్థాపన చేశారు. నుమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్ సంస్థ 2015 నుంచి బంగ్లాదేశ్ కు పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. భారత్ కు పొరుగుదేశంతో ఉన్న రెండో సీమాంతర ఇంధన పైప్ లైన్ ఐ బి ఎఫ్ పి.
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలలో ఇంధన, విద్యుత్ సహకారం చాలా కీలకంగా ఉంటోంది. బంగ్లాదేశ్ కు హి స్పీడ్ డీజిల్ సరఫరా చేయటానికి భారత్-బంగ్లాదేశ్ మధ్య మొట్ట మొదటి సీమాంతర ఇంధన పైప్ లైన్ ఐబీఎఫ్ పి. దీని రవాణా సామర్థ్యం ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నులు. బంగ్లాదేశ్ తో పెరిగిన అనుసంధానత వల్ల ఇరుదేశాల ప్రజల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది.
భారత దేశపు అభివృద్ధి భాగస్వాములలో బంగ్లాదేశ్ చాలా ముఖ్యమైనది. ఈ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా బంగ్లాదేశ్. ఈ మైత్రీ పైప్ లైన్ వాడకంలోకి వచ్చిన తరువాత రెండు దేశాల మధ్య ఇప్పటి ఇంధన సహకారం మరింత పెరుగుతుంది. అదే విధంగా బంగ్లాదేశ్ పురోగతి , మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగ పురోగతి పెరుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేసినందుకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హశీనాకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనం కోసం ఇదే విధంగా కలసి పనిచేయాలని ఆకాంక్షించారు.
भारत-बांग्लादेश संबंधों में आज एक नए अध्याय की शुरूआत हुई है।
— PMO India (@PMOIndia) March 18, 2023
India-Bangladesh Friendship Pipeline की नींव हमने सितंबर 2018 में रखी थी।
और मुझे ख़ुशी है कि आज प्रधान मंत्री शेख हसीना जी के साथ इसका उद्घाटन करने का अवसर आ गया: PM @narendramodi
मुझे विश्वास है कि यह पाइपलाइन बांग्लादेश के विकास को और गति देगी, और दोनों देशों के बीच बढ़ती connectivity का भी उत्कृष्ट उदाहरण रहेगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 18, 2023
इसी का परिणाम है, कि कोविड महामारी के दौरान हमें रेल नेटवर्क के द्वारा बांग्लादेश को ऑक्सीजन आदि भेजने में सुविधा रही।
— PMO India (@PMOIndia) March 18, 2023
उनके इस दूरदृष्टि भरे विज़न के लिए मैं प्रधानमंत्री शेख हसीना जी का ह्रदय से अभिनंदन करता हूँ: PM @narendramodi
मुझे याद है कि कई वर्षों पूर्व प्रधानमंत्री शेख हसीना जी ने 1965 से पहले की रेल कनेक्टिविटी बहाल करने के अपने विज़न के बारे में चर्चा की थी।
— PMO India (@PMOIndia) March 18, 2023
और उसी समय से दोनों देशों ने मिल कर इस पर बहुत प्रगति की है: PM @narendramodi
कितना शुभ संयोग है, कि आज का यह उद्घाटन, बंगबंधु शेख मुजीबुर्रहमान की जन्म जयंती के एक दिन बाद हो रहा है!
— PMO India (@PMOIndia) March 18, 2023
बंगबंधु के ‘शोनार बांग्ला’ विजन में पूरे क्षेत्र का मैत्रीपूर्ण विकास तथा समृद्धि शामिल था। यह संयुक्त प्रोजेक्ट उनके इस विज़न का उत्तम उदाहरण है: PM @narendramodi