న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరు 10న జర్మనీ గణతంత్ర సమాఖ్య చాన్సలర్ గౌరవనీయ ఓలాఫ్ స్కోల్జ్ తో సమావేశమయ్యారు. కాగా, 2023 ఫిబ్రవరిలో తొలిసారి భారత్‌లో పర్యటించిన స్కోల్జ్, ప్రస్తుతం జి-20 సదస్సులో పాల్గొనేందుకు రెండోసారి వచ్చారు. జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని ఆయన అభినందించారు.
భారత్ అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో జర్మనీ సంపూర్ణ మద్దతు ఇవ్వడాన్ని ప్రధానమంత్రి ప్రశంసిస్తూ జి-20 శిఖరాగ్ర సదస్సు సమావేశాలు, కార్యక్రమాల్లో ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని నేతలిద్దరూ సమీక్షించారు. రక్షణ, హరిత-సుస్థిర ప్రగతి, కీలక ఖనిజాలు, నిపుణ మానవశక్తి ఆదానప్రదానం, విద్య వగైరా రంగాల్లో సహకార విస్తరణకుగల మార్గాలపైనా వారు చర్చించారు.
మరోవైపు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, వచ్చే ఏడాది అంతర-ప్రభుత్వ కమిషన్ సమావేశం నేపథ్యంలో భారత్‌లో పర్యటించాల్సిందిగా చాన్సలర్ స్కోల్జ్ ను ప్రధాని ఆహ్వానించారు.
Sehr gutes Treffen mit @Bundeskanzler @OlafScholz in Delhi. Ich habe ihm dafür gedankt, dass er den G20-Gipfel mit seinen Ansichten bereichert hat. Wir haben auch darüber diskutiert, wie Indien und Deutschland weiterhin in den Bereichen saubere Energie, Innovation und Arbeit für… pic.twitter.com/LfL2gHPvxr
— Narendra Modi (@narendramodi) September 10, 2023
Very good meeting with @Bundeskanzler @OlafScholz in Delhi. Thanked him for enriching the G20 Summit with his views. Also discussed how India and Germany can continue working together in clean energy, innovation and work towards a better planet. pic.twitter.com/g62rUXEVDc
— Narendra Modi (@narendramodi) September 10, 2023