ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథనీ అల్బనీజ్ గుజరాత్ లోని అహమదాబాద్ లో గల నరేంద్ర మోదీ స్టేడియమ్ లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ లో భాగం గా ఈ రోజు న జరుగుతున్న నాలుగో స్మారక టెస్ట్ మ్యాచ్ ను కాసేపు చూశారు.
ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథని అల్బనీజ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘క్రికెట్ అనేది భారతదేశం లో మరియు ఆస్ట్రేలియా లో ఓ ఉమ్మడి ఉద్వేగం అని చెప్పాలి. భారతదేశం-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో కొంత ఆట ను చూడడం కోసం నా యొక్క మంచి మిత్రుడు ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ తో కలసి అహమదాబాద్ కు విచ్చేసినందుకు సంతోషిస్తున్నాను. ఇది కచ్చితం గా ఒక ఉత్తేజదాయకం అయినటువంటి గేమ్ అవుతుంది అని నేను భావిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
అహమదాబాద్ లో టెస్ట్ మ్యాచ్ కు సంబంధించిన దృశ్యాల ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘అహమదాబాద్ నుండి మరికొన్ని దృశ్యాలు. అంతటా క్రికెట్ యే.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి మరియు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ లు వచ్చీ రాగానే, వారికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫార్ క్రికెట్ ఇన్ ఇండియా యొక్క కార్యదర్శి శ్రీ జయ్ శాహ్ మరియు బిసిసిఐ అధ్యక్షులు శ్రీ రోజర్ బిన్నీ క్రమానుగతం గా అభినందనల ను అందజేశారు. గాయకురాలు ఫాల్గుణి శాహ్ ఆధ్వర్యం లో యూనిటీ ఆఫ్ సింఫనీ పేరిట జరిగిన ఒక సాంస్కృతిక ప్రదర్శన ను ప్రధాన మంత్రి, ఆస్ట్రేలియా ప్రధాని తిలకించారు.
Cricket, a common passion in India and Australia! Glad to be in Ahmedabad with my good friend, PM @AlboMP to witness parts of the India-Australia Test Match. I am sure it will be an exciting game! 🇮🇳 🇦🇺 https://t.co/XvwU0XCbJf pic.twitter.com/JwJecwUkHi
— Narendra Modi (@narendramodi) March 9, 2023
Some more glimpses from Ahmedabad. It is cricket all over! 🏏 pic.twitter.com/K8YCx0Iaz7
— Narendra Modi (@narendramodi) March 9, 2023
Celebrating 🇮🇳 🇦🇺 friendship through cricket! 🏏
— PMO India (@PMOIndia) March 9, 2023Upon arriving, the Prime Minister and the Australian counterpart, Mr Anthony Albanese were felicitated by the Secretary of the Board of Control for Cricket in India. Shri Jay Shah and President BCCI, Shri Roger Binny, respectively. The Prime Minister and the Prime Minister of Australia also witnessed a cultural performance, Unity of Symphony by singer Ms Falgui Shah.
Prime Ministers @narendramodi and @AlboMP watch parts of #INDvsAUS match in Ahmedabad. pic.twitter.com/EmIy4ifC82
ప్రధాన మంత్రి టెస్ట్ కేప్ ను టీమ్ ఇండియా సారధి శ్రీ రోహిత్ శర్మ కు అందించగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు టెస్ట్ కేప్ ను అందించారు. ఆ తరువాత స్టేడియమ్ లో గుమికూడిన ఒక భారీ జనసమూహం సమక్షం లో ప్రధాన మంత్రి మరియు ఆస్ట్రేలియా ప్రధాని ఒక గోల్ఫ్ కార్ట్ లో నిలబడి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
రెండు జట్ల నాయకులు టాస్ కోసమని పిచ్ వైపు బయలుదేరగా, ప్రధాన మంత్రి మరియు ఆస్ట్రేలియా ప్రధాని ఫ్రెండ్ శిప్ హాల్ ఆఫ్ ఫేమ్ వైపునకు వెళ్ళారు. ఇరు దేశాల ప్రధాన మంత్రుల ను భారతదేశం జట్టు పూర్వ కోచ్ మరియు క్రీడాకారుడు శ్రీ రవి శాస్త్రి అనుసరించారు. భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య గల ఘనమైన క్రికెట్ సంబంధి చరిత్ర ను గురించి వారికి ఆయన వివరించారు.
దీని తరువాత రెండు జట్ల నాయకులు వారి దేశాల ప్రధాన మంత్రుల వెంట ఆటమైదానం లోకి నడచి వెళ్ళారు. నాయకులు ఇరువురు వారి వారి జట్టులను తమ తమ ప్రధాన మంత్రుల కు పరిచయం చేశారు. ఆనక భారతదేశం యొక్క మరియు ఆస్ట్రేలియా యొక్క జాతీయ గీతాల ఆలాపన చోటు చేసుకొంది. ప్రధాన మంత్రి మరియు ఆస్ట్రేలియా ప్రధాని తదనంతరం ఉభయ క్రికెట్ ఉద్దండ జట్టుల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ ను చూడడానికి ప్రెసిడెంట్స్ బాక్స్ కేసి కదలారు.