ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ ఉదయం, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తో టెలిఫోన్ లో మాట్లాడారు.
ఇరువురు నాయకులు పరస్పరం నవ్ రోజ్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ పండుగ రెండు దేశాల మధ్య నెలకొన్న వారసత్వం, సాంస్కృతిక సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు గురించీ, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన విషయాలపై ఈ సందర్భంగా ఇరువురు నాయకులు చర్చించారు. పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.