‘‘ప్రతి తరం లో నిరంతరమూ ప్రవర్తన ను మలచుకోవడం అనేదే ప్రతి సమాజాని కి మూల స్తంభంగా ఉంది’’
‘‘సవాళ్ళు ఉన్న ప్రతి చోటుకు ఆశాభావం తో భారతదేశం అక్కడ కు పోతుంది, సమస్య లు ఎదురైన చోటల్లా వాటి కి భారతదేశంపరిష్కారాల ను అందిస్తుంది’’
‘‘భారతదేశం ప్రస్తుతం ప్రపంచాని కి ఒక కొత్త ఆశ గా ఉన్నది’’
‘‘మనం సాఫ్ట్ వేర్ మొదలుకొని అంతరిక్షం వరకు,ఒక కొత్త భవిష్యత్తు కోసమని తపించే దేశంగా ఎదుగుతూ ఉన్నాం’’
‘‘మనం మనల ను మెరుగు పరచుకొందాం, అయితే మన అభ్యున్నతి అనేది ఇతరులసంక్షేమాని కి సైతం ఒక మాధ్యమం గా ఉండాలి’’
నాగాలాండ్ కు చెందిన ఒక బాలిక కాశీ లో ఘాట్ లను శుభ్రపరచడం కోసం మొదలుపెట్టిన ఉద్యమాన్ని గురించి ప్రస్తావించిన ప్రధాన మంత్రి

వడోదరా లోని కరేలీబాగ్ లో జరుగుతున్న ‘యువ శిబిరా’న్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. కుండల్ ధామ్ లోని శ్రీ స్వామినారాయణ్ మందిరం మరియు వడోదరా లోని కరేలీబాగ్ లో గల శ్రీ స్వామినారాయణ్ మందిరం శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మన గ్రంథాలు ప్రతి తరం లో వ్యక్తి యొక్క ప్రవర్తన ను నిరంతరం గా దిద్ది తీర్చుకోవడం అనేదే ప్రతి ఒక్క సమాజాని కి పునాది గా ఉంటుంది అని మనకు బోధిస్తున్నాయి అన్నారు. ఈ రోజు న జరుగుతూ ఉన్నటువంటి శిబిరం మన యువతీ యువకుల లో మంచి ‘సంస్కారాల’ ను పాదుకొల్పుతుండటం తో పాటు గా సంఘం, గుర్తింపు, గౌరవం, ఇంకా దేశ పునర్జాగరణ కై ఉద్దేశించిన పవిత్రమైనటువంటి మరియు స్వాభావికమైనటువంటి కార్యక్రమం కూడా అని ఆయన స్పష్టం చేశారు.

ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించడం కోసమంటూ ఒక సామూహిక సంకల్పాన్ని తీసుకోవాలని, కలసికట్టుగా ప్రయత్నాలు చేయాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆ ‘న్యూ ఇండియా’ యొక్క గుర్తింపు కొత్తది గా ఉండాలి, అది దూరదర్శి గా ఉంటూనే దాని సంప్రదాయాలు పాతదనానికి తావు ను ఇచ్చేవి గా కూడాను ఉండాలి. అటువంటి న్యూ ఇండియా ఆలోచనల లో కొత్తది గాను, శతాబ్దాల పాతదైన సంస్కృతి ని కలబోసుకొన్నదిగాను ఉడి ముందుకు సాగిపోవాలి, యావత్తు మానవాళి కి ఒక దారి ని చూపేది గా ఉండాలి అని ఆయన అన్నారు. ‘‘ఎక్కడ సవాళ్ళు ఉన్నా, అక్కడ భారతదేశం ఆశాభావం తో ప్రత్యక్షమవుతుంది, ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ భారతదేశం ఆ సమస్యల కు పరిష్కారాల ను ప్రదానం చేస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

కరోనా సంక్షోభం కాలం లో ప్రపంచాని కి టీకా మందుల ను మరియు ఔషధాల ను చేరవేయడం మొదలుకొని చెల్లచెదరైనటువంటి సరఫరా వ్యవస్థ నడుమ ఆత్మనిర్భరత యొక్క ఆశ ను చిగురింపజేయడం వరకు, ప్రపంచం లో అశాంతి మరియు సంఘర్షణ లు చెలరేగుతూ ఉన్న వేళ లో శాంతి కోసం ఒక సమర్ధమైనటువంటి దేశం యొక్క పాత్ర ను పోషించడం వరకు చూస్తే భారతదేశం ఇవాళ ప్రపంచానికి ఒక సరికొత్త ఆశ గా నిలచింది అని ప్రధాన మంత్రి అన్నారు.

మనం మానవ జాతి అంతటికీ యోగ తాలూకు మార్గాన్ని చూపుతూ ఉన్నాం; ఆయుర్వేద యొక్క శక్తి ని వారికి పరిచయం చేస్తున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు. ఇవాళ, ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటే ప్రభుత్వం యొక్క పని చేసే సరళి మరియు సమాజం యొక్క ఆలోచించే పద్ధతి మారిపోయింది అని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రస్తుతం, భారతదేశం లో ప్రపంచం లోకెల్లా మూడో అతి పెద్ద స్టార్ట్-అప్ వ్యవస్థ నెలకొన్నది, మరి దీనికి నాయకత్వాన్ని వహిస్తున్నది భారతదేశం లోని యువతే. ‘‘మనం సాఫ్ట్ వేర్ మొదలుకొని అంతరిక్షం వరకు, ఒక కొత్త భవిష్యత్తు కోసం తపిస్తున్నటువంటి దేశం గా ఎదుగుతూ ఉన్నాం. మనకు సంస్కారం అంటే అర్థం విద్య, సేవ, ఇంకా సంవేదనశీలత లే. మనకు సంస్కారం అంటే అర్థం సమర్పణ భావం, దృఢ నిశ్చయం మరియు సామర్థ్యం అని అర్థం. మనం మనల ను ఉన్నతులు గా మార్చుకొందాం రండి, అయితే మన అభ్యున్నతి అన్యుల సంక్షేమాని కి సైతం ఒక మాధ్యమం గా రూపుదాల్చాలి. మనం సాఫల్యం తాలూకు శిఖరాల ను అందుకొందాం. అదే కాలం లో, మన సాఫల్యం అందరికీ సేవ చేసేటటువంటి ఒక సాధనం గా కూడా ఉండాలి. భగవాన్ స్వామినారాయణ్ బోధన ల సారాంశం ఇదే, మరి భారతదేశం యొక్క స్వభావం కూడా ఇదే’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి వడోదరా తో తన కు గల దీర్ఘ కాలిక అనుబంధాన్ని గుర్తు కు తీసుకు వచ్చారు. తన నిజ జీవనం లో మరియు రాజకీయ జీవనం లో వడోదరా కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ మూలం గా వడోదరా ప్రపంచ ఆకర్షణ తాలూకు మహత్త్వపూర్ణమైన కేంద్రం గా మారిపోయింది. అదే విధం గా పావాగఢ్ ఆలయం కూడా ప్రపంచంలో అందరి ని ఆకట్టుకొంటున్నది అని ఆయన అన్నారు. ‘సంస్కార నగరి’ వడోదరా ను గురించి ప్రపంచవ్యాప్తం గా తెలుసుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే వడోదరా లో తయారైన మెట్రో రైలు పెట్టెల ను ప్రపంచం అంతటా ఉపయోగిస్తున్నారు. ఇదీ వడోదరా యొక్క శక్తి అని ప్రధాన మంత్రి అన్నారు. మనకు దేశ స్వాతంత్య్ర పోరాటం లో ప్రాణాల ను అర్పించే అవకాశం అయితే లభించలేదు, కానీ మనం దేశం కోసం జీవించగలం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘2023వ సంవత్సరం లో ఆగస్టు 15 నాటికి, మనం నగదు తో ముడిపెట్టిన లావాదేవీల ను జరపడాన్ని ఆపివేయలేమా? అని ఆయన ప్రశ్నించారు. మనం డిజిటల్ పేమెంట్స్ మార్గాన్ని అనుసరించగలమా? మీరు అందించేటటువంటి చిన్న తోడ్పాటు అనేది చిన్న వ్యాపారుల మరియు అమ్మకందారుల జీవనం లో ఒక పెద్ద వ్యత్యాసాన్ని తీసుకు రాగలదు’’ అని ఆయన అన్నారు. అదే విధం గా, స్వచ్ఛత కోసం, సింగిల్- యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించడాన్ని మరియు పోషకాహార లేమి ని అడ్డగించడం కోసం కూడాను సంకల్పాన్ని తీసుకోవచ్చును అని ఆయన అన్నారు.

కాశీ లో స్నానఘట్టాల ను శుభ్రం చేయడం కోసం నాగాలాండ్ కు చెందిన ఒక బాలిక చేపట్టిన ఉద్యమాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఆ బాలిక ఒక్కతే ఈ ఉద్యమాన్ని ఆరంభించింది మరి తరువాత తరువాత ఎంతో మంది ఆ ఉద్యమం లో జత కలిశారు. ఇది సంకల్పాని కి ఎంతటి శక్తి ఉన్నదీ తెలియజెప్తున్నది. దేశానికి సహాయపడడం కోసం విద్యుత్తు ను ఆదా చేయడం గాని, లేదా ప్రాకృతిక వ్యవసాయాన్ని అవలంబించడం వంటి చిన్న చిన్న ఉపాయాల ను ఆచరణ లోకి తీసుకువడం గాని చేయండి అని ప్రధాన మంత్రి కోరారు.

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi