‘‘కేవలం 6 సంవత్సరాల లో వ్యవసాయ బడ్జెటు అనేకరెట్లు పెరిగింది. రైతుల కు వ్యవసాయ రుణాల ను కూడాగడచిన ఏడేళ్ళ లో రెండున్నర రెట్ల మేర పెంచడమైంది’’
‘‘2023వ సంవత్సరానికి చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం గా గుర్తింపు లభిస్తున్నకారణం గా, భారతదేశం లోని చిరుధాన్యాల బ్రాండింగు కు మరియు ప్రచారాని కి కార్పొరేట్జగత్తు ముందుకు రావాలి’’
‘‘ఆర్టిఫిశియల్ఇంటెలిజెన్స్ అనేది 21వ శతాబ్దం లో వ్యవసాయం మరియు సాగు కు సంబంధించినధోరణి ని పూర్తి గా మార్చివేయనుంది’’
‘‘గడచిన 3-4 ఏళ్ల లో దేశం లో 700 కు పైగా ఎగ్రి స్టార్ట్-అప్స్ నుతయారు చేయడమైంది’’
‘‘సహకార సంఘాల కు సంబంధించిన ఒక కొత్త మంత్రిత్వ శాఖ నుప్రభుత్వం ఏర్పాటు చేసింది. సహకార సంఘాల ను ఏ విధం గా ఒక విజయవంతమైన వాణిజ్యసంస్థలు గా మలచాలి అనేది మీ లక్ష్యం కావాలి’’

వ్యవసాయ రంగం లో కేంద్ర బడ్జెటు 2022 తీసుకు రాగల సకారాత్మక ప్రభావం అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరచడం కోసం బడ్జెటు తోడ్పాటు ను అందించగల మార్గాల ను గురించి ఆయన చర్చించారు. ‘స్మార్ట్ ఎగ్రికల్చర్’ - అమలు సంబంధి వ్యూహాలు అనే విషయం పై ఈ వెబినార్ లో దృష్టి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంబంధిత కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పరిశ్రమ మరియు విద్య రంగాల ప్రతినిధుల తో పాటు వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల మాధ్యమం ద్వారా రైతులు పాలుపంచుకొన్నారు.

పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ప్రారంభం అనంతరం మూడో వార్షికోత్సవం జరుపుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం మొదట్లో ప్రస్తావించారు. ‘‘ఈ పథకం ప్రస్తుతం దేశం లో చిన్న రైతుల కు ఒక బలమైన అండ గా నిలచింది. ఈ పథకం లో భాగం గా, 11 కోట్ల మంది రైతుల కు దాదాపు గా 1.75 లక్షల కోట్ల రూపాయల ను ఇవ్వడమైంది’’ అని ఆయన అన్నారు. విత్తనం నుంచి బజారు వరకు విస్తరించినటువంటి అనేక కొత్త వ్యవస్థల ను గురించి, మరి అలాగే వ్యవసాయ రంగం లో పాత వ్యవస్థల లో చోటు చేసుకొన్న సంస్కరణల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ‘‘కేవలం 6 సంవత్సరాల లో వ్యవసాయాని కి బడ్జెటు ను అనేక రెట్లు పెంచడమైంది. రైతుల కు వ్యవసాయ రుణాలు కూడా గత 7 సంవత్సరాల లో రెండున్నర రెట్ల మేరకు పెరిగాయి’’ అని ఆయన అన్నారు. మహమ్మారి తాలూకు కష్టకాలం లో ఒక ప్రత్యేక ఉద్యమం లో భాగం గా కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి) లను 3 కోట్ల మంది రైతుల కు ఇవ్వడం జరిగింది. అంతే కాక పశుపోషణ, చేపల పెంపకం లలో నిమగ్నం అయిన రైతుల కు కూడా కెసిసి సదుపాయాన్ని వర్తింప జేయడమైంది. చిన్న రైతుల కు గొప్ప లబ్ధి ని చేకూర్చడం కోసం సూక్ష్మ సేద్యం సంబంధి నెట్ వర్క్ ను కూడా బలోపేతం చేయడం జరిగింది అని ఆయన అన్నారు.

ఈ ప్రయాసల తో రైతులు రికార్డు స్థాయి ఉత్పత్తి ని అందిస్తున్నారు. మరి ఎమ్ఎస్ పి కొనుగోళ్ళ లో సైతం కొత్త కొత్త రికార్డు లు నమోదు అయ్యాయి. సేంద్రియ వ్యవసాయాని కి ప్రోత్సాహం లభించినందువల్ల సేంద్రియ ఉత్పత్తు ల బజారు 11,000 కోట్ల రూపాయల స్థాయి కి చేరుకొంది. ఎగుమతులు 6 సంవత్సరాల కిందట 2000 కోట్ల రూపాయల వద్ద ఉండగా ప్రస్తుతం 7000 కోట్ల రూపాయల కు పై చిలుకు స్థాయి కి ఎగశాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

వ్యవసాయాన్ని ఆధునికమైంది గా, స్మార్ట్ గా తీర్చిదిద్దడం కోసం బడ్జెటు లో ఏడు మార్గాల ను ప్రతిపాదించడం జరిగిందని ప్రధాన మంత్రి వివరించారు. వాటిలో ఒకటో మార్గం గంగా నది ఉభయ తీర ప్రాంతాల లో 5 కిలో మీటర్ ల పరిధి లో ప్రాకృతిక వ్యవసాయాన్ని ఉద్యమ తరహా లో చేపట్టాలి అనే లక్ష్యం. రెండో మార్గం వ్యవసాయం లో, తోట పంటల సాగు లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల కు అందుబాటు లోకి తీసుకు రావడం. మూడో మార్గం ఖాద్య తైలం దిగుమతి ని తగ్గించడం కోసం మిశన్ ఆయిల్ పామ్ ను బలపరచడానికి ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం. నాలుగో మార్గం ఏది అంటే అది వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం పిఎం గతి-శక్తి ప్రణాళిక మాధ్యమం ద్వారా సరికొత్త లాజిస్టిక్స్ సంబంధి ఏర్పాటులను చేయడం అనేదే. బడ్జెటు లో పేర్కొన్న అయిదో పరిష్కార మార్గం వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ ను మెరుగైన పద్ధతి లో చేపట్టడమూ, వ్యర్థాల నుంచి శక్తి ఉత్పాదన ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమూను. రైతు లు ఇకపై ఇబ్బందుల ను ఎదుర్కోబోకుండా ఒకటిన్నర లక్షల కు పై చిలుకు తపాలా కార్యాలయాలు బ్యాంకింగ్ వంటి సేవల ను సమకూర్చడం అనేది ఆరో మార్గం గా ఉంది. ఏడో మార్గం ఏది అంటే అది- వ్యవసాయ పరిశోధన, ఇంకా విద్య సంబంధి పాఠ్య క్రమాన్ని ఆధునిక కాలాల అవసరాల కు తగినట్లు మార్చడం జరుగుతుంది- అనేదే.

2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం గా గుర్తిస్తున్న కారణం గా భారతీయ చిరుధాన్యాల బ్రాండింగ్ కు మరియు వాటి ప్రచారానికి గాను కార్పొరేట్ జగతి ముందడుగు ను వేయవలసిన అవసరం ఉంది అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. విదేశాల లోని ప్రధాన భారతీయ దౌత్య కార్యాలయాలు ఆయా దేశాల లో భారతదేశం చిరుధాన్యాల యొక్క నాణ్యత, భారతదేశం చిరుధాన్యాల యొక్క ప్రయోజనాలు ప్రజాదరణ కు నోచుకొనేటట్లు గా చర్చాసభ ల నిర్వహణ కు మరియు ఇతర ప్రోత్సాహక కార్యకలాపాల నిర్వహణ కు నడుం బిగించాలి అని కూడా ఆయన అన్నారు. పర్యావరణ అనుకూల జీవనశైలి విషయం లో చైతన్యం పెరుగుతూ ఉన్న పరిణామాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తత్ఫలితం గా ప్రాకృతిక ఉత్పత్తుల కు ఇంకా సేంద్రియ ఉత్పత్తుల కు ఏర్పడే బజారు ను వృద్ధి చేయాలని కూడా ప్రధాన మంత్రి సూచించారు. ప్రాకృతిక వ్యవసాయాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం కెవికె లు తలా ఒక గ్రామాన్ని దత్తత చేసుకోవడం ద్వారా ముఖ్య భూమిక ను పోషించాలి అంటూ ఆయన ఉద్భోదించారు.

భారతదేశం లో భూమి పరీక్ష ల సంస్కృతి వృద్ధి చెందవలసిన అవసరం ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. భూమి స్వస్థత కార్డు ల పట్ల ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధ ను గురించి ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, నిర్ణీత కాలాంతరం తరువాత తప్పకుండా నేల ను పరీక్ష చేసే అభ్యాసాని కి మార్గాన్ని సుగమం చేయడం కోసం ముందుకు రావాలి అంటూ స్టార్ట్-అప్స్ కు పిలుపునిచ్చారు.

సేద్యపునీటి రంగం లో నూతన ఆవిష్కరణల పై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘ప్రతి నీటి బిందువు కు, మరింత పంట’ అనే అంశం పై ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధ ను గురించి వివరించారు. దీనిలో కూడా కార్పొరేట్ జగతి కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. బుందేల్ ఖండ్ ప్రాంతం లోని కేన్-బేత్ వా లింక్ పథకం ఆవిష్కరించబోయే పరివర్తన ను గురించి కూడా ఆయన తన ప్రసంగం లో ప్రస్తావించారు. పెండింగు పడ్డ సేద్యపునీటి పథకాల ను త్వరిత గతి న పూర్తి చేయవలసిన అవసరాన్ని గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అనేది 21వ శతాబ్దం లో వ్యవసాయాని కి మరియు సాగు కు సంబంధించిన సరళి ని పూర్తి గా మార్చివేయబోతోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సాగు లో డ్రోన్ ల వినియోగం పెరుగుతూ ఉండటం అనేది ఈ మార్పు లో ఒక భాగం అని ఆయన అన్నారు. ‘‘మనం ఎగ్రి స్టార్ట్ - అప్స్ ను ప్రోత్సహించినప్పుడే డ్రోన్ సంబంధి సాంకేతిక పరిజ్ఞానం పెద్ద ఎత్తున అందుబాటు లోకి వస్తుంది. గత మూడు నాలుగు సంవత్సరాల లో దేశం లో 700కు పైచిలుకు ఎగ్రి స్టార్ట్-అప్స్ ఉనికి లోకి వచ్చాయి’’ అని ఆయన అన్నారు.

పంట కోత ల అనంతర కాలం లో నిర్వహణ సంబంధి పనుల గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ ప్రాసెస్ చేసిన ఆహారం యొక్క పరిధి ని పెంచడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయం లో నాణ్యత పరం గా అంతర్జాతీయ ప్రమాణాల కు పూచీ పడుతోందన్నారు. ‘‘ఈ అంశం లో కిసాన్ సంపద యోజన తో పాటుగా పిఎల్ఐ స్కీము ముఖ్యమైంది. వేల్యూ చైన్ కూడా ఇందులో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషిస్తుంది. ఈ కారణం గా ఒక లక్ష కోట్ల రూపాయల తో ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండు ను ఏర్పాటు చేయడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

పంట కోత ల శేషం సంబంధి నిర్వహణ అంశాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘దీనికోసం ఈ బడ్జెటు లో కొన్ని కొత్త చర్యల ను తీసుకోవడమైంది. వీటి ఫలితం గా కర్బన ఉద్గారాల ను తగ్గించడం జరుగుతుంది. రైతు లు కూడాను ఆదాయాన్ని పొందగలుగుతారు’’ అని ఆయన అన్నారు. వ్యవసాయ వ్యర్థాల ను ప్యాకేజింగ్ కోసం ఉపయోగించుకొనే మార్గాల ను అన్వేషించవలసిందంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇథెనాల్ రంగం లో ఉన్న అవకాశాల ను గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించారు. 20 శాతం మిశ్రణం అనే లక్ష్య సాధన కు ప్రభుత్వం పురోగమిస్తోందని ఆయన అన్నారు. 2014వ సంవత్సరం లో 1-2 శాతం గా ఉన్న మిశ్రణం కాస్తా ఇప్పుడు సుమారు గా 8 శాతాని కి చేరుకొంది అని ఆయన తెలిపారు.

‘సహకార‘ రంగం యొక్క పాత్ర’ అనే అంశం పై ప్రధాన మంత్రి మాట్లాడారు. ‘‘భారతదేశం లో రంగం చాలా హుషారు గా ఉంది. అవి చక్కెర మిల్లులు కావచ్చు, ఎరువుల కర్మాగారాలు కావచ్చు, డెయిరీ లు కావచ్చు, రుణ సంబంధి ఏర్పాటు లు కావచ్చు, ఆహార ధాన్యాల కొనుగోలు కావచ్చు.. రంగం యొక్క భాగస్వామ్యం భారీ గా ఉంది. మా ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక కొత్త మంత్రిత్వ శాఖ ను కూడా ఏర్పాటు చేసింది. సంఘాల ను ఏ విధం గా ఒక విజయవంతమైనటువంటి వ్యాపార సంస్థ గా మలచాలి అనేది మీ లక్ష్యం కావాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government