బడ్జెటు లో పేర్కొన్న అంశాల ను ఒక నిర్ణీత కాలం లోపల అమలు చేసేందుకు సంబంధిత వర్గాల వారిని సంప్రదించడాని కి, ఆయా వర్గాల ను ప్రోత్సహించడాని కి వరుస గా నిర్వహిస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లలో భాగం గా ఏర్పాటైన ఏడో వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. ఆయన ఈ వెబినార్ ల తాలూకు ఔచిత్యాన్ని గురించి వివరిస్తూ, ‘‘బడ్జెటు యొక్క వెలుగు లో, ఏ విధం గా త్వరిత గతి న, ఎలాంటి అంతరాయాలు లేకుండా, సర్వోత్తమ ఫలితాల ను సాధించుకోవడం కోసం ఈ కేటాయింపుల ను అమలు పరచగలమన్నది మనః అందరి ఉమ్మడి ప్రయాస కావాలి’’ అన్నారు.
ఈ ప్రభుత్వాని కి విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం అనేది ఒక ఒంటరి రంగం కాదు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ తాలూకు రంగం లో ఈ దృష్టి కోణం డిజిటల్ ఇకానమి, ఇంకా ఫిన్ టెక్ ల వంటి రంగాల తో జతపడి ఉంది. ఇదే విధం గా మౌలిక సదుపాయాల కల్పన మరియు సార్వజనిక సేవల అందజేత తో ముడిపడిన దృష్టి కోణం లో ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఒక ప్రధానమైన పాత్ర ను పోషించవలసి ఉంది. ‘‘సాంకేతిక విజ్ఞానం అనే దానిని దేశ ప్రజల సశక్తీకరణ తాలూకు ఒక మాధ్యమం గా మేం చూస్తున్నాం. దేశం స్వయంసమృద్ధం కావాలి అంటే గనక దానికి సాంకేతిక విజ్ఞానం ఒక మూలాధారం అని మనం విశ్వసిస్తున్నాం. ఈ సంవత్సరం బడ్జెటు లో సైతం ఇదే విధమైనటువంటి దృష్టికోణం ప్రతిబింబించింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అభివృద్ధి చెందిన దేశం అయిన యుఎస్ఎ కూడా ప్రస్తుతం దీనిని గురించి మాట్లాడుతోందని ప్రధాన మంత్రి చెప్తూ యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ ప్రసంగాన్ని గుర్తు కు తీసుకు వచ్చారు. ఆ ప్రసంగం లో శ్రీ బైడెన్ స్వయంసమృద్ధి యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పడం గమనార్శం. ‘‘కొత్త గా ఉనికి లోకి వస్తున్న ప్రపంచ వ్యవస్థ ల వెలుగు లో, మనం ఆత్మనిర్భరత పట్ల శ్రద్ధ తీసుకొంటూ ముందుకు సాగవలసిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు.
ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్, జియో-స్పేశల్ సిస్టమ్స్, డ్రోన్స్ ,సెమి-కండక్టర్స్, జినోమిక్స్, అంతరిక్ష సంబంధి సాంకేతిక విజ్ఞానం, ఔషధ నిర్మాణం, 5జి సంబంధి స్వచ్ఛ సాంకేతికత ల వంటి కొత్త గా వృద్ధి లోకి వస్తున్న రంగాల కు బడ్జెటు పెద్ద పీట వేసింది అంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించారు. 5జి స్పెక్ట్రమ్ వేలం పాట కోసం ఒక స్పష్టమైన మార్గసూచీ ని అంతేకాకుండా ఒక దృఢమైన 5జి ఇకో-సిస్టమ్ తో సంబంధం కలిగిన డిజైన్ ప్రధానమైన తయారీ రంగం కోసం ఉత్పత్తి తో ముడిపడిన ప్రోత్సాహక (ప్రొడక్టివిటీ లింక్ డ్ ఇన్ సెంటివ్.. పిఎల్ఐ) పథకాల ను గురించి బడ్జెటు పేర్కొనడమైంది. ఈ రంగం లో ప్రైవేటు రంగం తన ప్రయాసల ను పెంచాలి అని ఆయన సూచించారు.
‘సాంకేతిక విజ్ఞానం అనేది స్థానికం, మరి విజ్ఞాన శాస్త్రం అనేది సర్వాధికారయుక్తం’ అనే సిద్ధాంతాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘మనకు విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు తెలిసినవే. కానీ, మనం జీవనం లో సౌలభ్య సాధన కోసం సాంకేతిక విజ్ఞానాన్ని వీలయినంత ఎక్కువ స్థాయి లో ఎలా ఉపయోగించుకోవచ్చనే దానికి పెద్ద పీట వేయాలి’’ అని ఆయన అన్నారు. గృహ నిర్మాణం, రైలు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గాలు, ఇంకా ఆప్టికల్ ఫైబర్.. వీటిలో పెట్టుబడి ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ముఖ్యమైన ఈ రంగాల లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ఆలోచన లు చేయండి అంటూ ఆయన పిలుపు ను ఇచ్చారు.
గేమింగ్ కు ప్రపంచ స్థాయి బజారు విస్తృతం అవుతోంది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఏనిమేశన్ విజువల్ ఎఫ్టెక్ట్ స్ గేమింగ్ కామిక్ (ఎవిజిసి) లకు బడ్జెటు ప్రాథమ్యాన్ని కట్టబెట్టింది అని ప్రధాన మంత్రి అన్నారు. అదే విధం గా భారతీయ జనమానసానికి అనువైనవి అయినటువంటి, బారతదేశం అవసరాల కు తగినటువంటి ఆటవస్తువుల ను రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా ఆయన అన్నారు. కమ్యూనికేశన్ సెంటర్ లు, ఇంకా ఫిన్ టెక్ లను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొని, ఈ రెండు అంశాల లో స్వదేశీ ఇకో సిస్టమ్ ను ఆవిష్కరించాలని, విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించాలన్నారు. జియో-స్పేశల్ డేటా ఉపయోగం తాలూకు నియమాల లో మార్పు మరియు సంస్కరణ ల కారణం గా చోటు చేసుకొన్న అంతులేనటువంటి అవకాశాల ను వీలైనంత ఎక్కువ వినియోగించుకోవాలంటూ ప్రయివేటు రంగాని కి ప్రధాన మంత్రి ఉద్భోదించారు. ‘‘కోవిడ్ కాలం లో టీకా మందు ఉత్పత్తి చేయడాని కి మనం స్వీయ సామర్ధ్యం పై ఏ విధం గా ఆధారపడ్డామో ప్రపంచం గమనించింది. ఈ సాఫల్యాన్నే ప్రతి రంగం లో మనం అనుకరించాలి’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
దేశాని కి ఒక పటిష్టమైనటువంటి డేటా సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ కు ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అని కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ విషయం లో ప్రమాణాల ను నెలకొల్పడాని కి, విధి విధానాల ను ఖరారు చేయడాని కి ఒక మార్గసూచీ ని అందించాలి అంటూ ఆయన సభికుల కు విజ్ఞప్తి చేశారు.
మూడో అతి పెద్దదైనటువంటి స్టార్ట్-అప్ ఇకో- సిస్టమ్ గా ఉన్నటువంటి భారతదేశ స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ ను గురించి ప్రధాన మంత్రి పేర్కొంటూ, ఈ రంగాని కి ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సమర్ధన లభిస్తుంది అని భరోసా ను ఇచ్చారు. ‘‘యువతీ యువకుల కు నైపుణ్యాల ను నేర్పించడం కోసం, వారిలో అప్పటికే ఉన్న నైపుణ్యాల కు మెరుగులు పెట్టడం కోసం, అలాగే ఆ నైపుణ్యాల ను ఉన్నతీకరించడం కోసం ఒక పోర్టల్ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ను బడ్జెటు లో చేర్చడమైంది. దీనితో పాటు గా, యువత కు ఎపిఐ ఆధారితమైన విశ్వసనీయ నైపుణ్య ప్రమాణాలు, చెల్లింపు మరియు సాంకేతిక ఆధారిత వనరుల అన్వేషణ మాధ్యమం ద్వారానే సరియైనటువంటి ఉద్యోగాలు, ఇంకా అవకాశాలు లభిస్తాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
దేశం లో తయారీ ని ప్రోత్సహించడం కోసం 14 కీలక రంగాల లో దాదాపు గా 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పిఎల్ఐ స్కీముల ను తీసుకు రావడం గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. పౌర సేవలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, సర్క్యులర్ ఇకానమి, ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల రంగం లో ఆప్టికల్ ఫైబర్ వినియోగం వంటి విషయాల లో ఆచరణీయ సూచనల ను, సలహాల ను అందజేయవలసింది గా సంబంధిత వర్గాలు అన్నిటి కి ప్రధాన మంత్రి ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు.