‘‘ప్రభుత్వ అభివృద్ధి పథకాల సేచురేశన్ అనే లక్ష్యాన్ని సాధించడానికి, అలాగే కనీస సౌకర్యాలు శత శాతం జనాభా కు ఏ విధంగా అందగలవు అనే దానికి ఒక స్పష్టమైన మార్గసూచీ ని బడ్జెటు అందించింది’’
‘‘బ్రాడ్ బ్యాండ్ అనేది పల్లెల కు సౌకర్యాల ను అందించడం ఒక్కటేకాకుండా నైపుణ్యం కలిగిన యువత తాలూకు ఒక పెద్ద సమూహాన్ని కూడాతయారు చేయనుంది’’
‘‘రెవిన్యూ విభాగం మీద గ్రామీణ ప్రజానీకం ఆధారపడడం అనేది తక్కువ లో తక్కువ స్థాయికి చేరేటట్టు మనం చూడాలి’’
‘‘విభిన్న పథకాల లో వంద శాతం కవరేజి కై మనం కొత్తసాంకేతికత పట్ల శ్రద్ధ తీసుకోవాలి; అలా శ్రద్ధ వహించినప్పుడు పథకాలనువేగవంతం గా పూర్తి చేయవచ్చును. అంతేకాక, నాణ్యత విషయం లోనూ రాజీ పడవలసిన అగత్యంతలెత్తదు’’
‘‘మహిళా శక్తి అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు పునాదిగా ఉంది. కుటుంబాల ఆర్థిక నిర్ణయాల లో మహిళల కు మరింత చక్కనిప్రాతినిధ్యాని కి ఫైనాన్శియల్ ఇంక్లూజన్ పూచీ పడింది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘గ్రామీణాభివృద్ధి పై కేంద్ర బడ్జెటు సకారాత్మక ప్రభావం’ అనే అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ఈ పరంపర లో రెండో వెబినార్. ఈ సందర్భం లో సంబంధిత కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల కు చెందిన ప్రతినిధులు మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ పాలుపంచుకున్నారు.

ప్రభుత్వ విధానాలన్నిటి లో, అన్ని కార్యాచరణల లో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్’ అనే మంత్రం ప్రేరణాత్మకం గా ఉంటోంది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ‘‘ ‘ఆజాదీ కా అమృత్ కాలాన్ని’ ఆవిష్కరించడానికి మనం చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి ని ప్రతి ఒక్కరి ప్రయాసల తోనే నెరవేర్చడం జరుగుతుంది. మరి అభివృద్ధి తాలూకు పూర్తి ప్రయోజనం ప్రతి వ్యక్తి కి, ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అందినప్పుడే ప్రతి ఒక్కరు ఆ విధమైన ప్రయాసల ను చేయగలుగుతారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ప్రభుత్వ అభివృద్ధి చర్యల మరియు పథకాల సేచురేశన్ అనే లక్ష్యాన్ని సాధించడం కోసం, మరి అలాగే కనీస సౌకర్యాలు జనాభా లో వంద శాతం మంది కి ఏ విధం గా అందుతాయి అనే అంశం లో బడ్జెటు స్పష్టమైన మార్గసూచీ ని ప్రసాదించింది అని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘పిఎమ్ ఆవాస్ యోజన, గ్రామీణ్ సడక్ యోజన, జల్ జీవన్ మిశన్, దేశ ఈశాన్య ప్రాంతాల కు సంధానం సదుపాయం, పల్లెల కు బ్రాడ్ బ్యాండ్ సంధానం ల వంటి ప్రతి ఒక్క పథకాని కి ఎంతో అవసరమైన కేటాయింపుల ను బడ్జెటు లో పొందుపరచడమైంది’’ అని ఆయన అన్నారు. ‘‘ఇదే విధం గా బడ్జెటు లో ప్రకటించిన వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ సరిహద్దు గ్రామాల అభివృద్ధి కి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం గా ఉంది’’ అని ఆయన అన్నారు.

 

ప్రభుత్వం యొక్క ప్రాథమ్యాల ను గురించి ప్రధాన మంత్రి పూసగుచ్చినట్లుగా వివరించారు. ఈశాన్య ప్రాంతాల లో మౌలిక సదుపాయాలు అందరికీ చేరేందుకు ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్ మెంట్ ఇనిశియేటివ్ ఫార్ నార్థ్ ఈస్ట్ రీజియన్ (పిఎమ్-డిఇవి ఐఎన్ఇ) పూచీపడుతుంది అని ఆయన చెప్పారు. అదే మాదిరి గా స్వామిత్వ పథకం గ్రామాల లో భూమి కి మరియు నివాసాల కు హద్దు రేఖల ను సరి అయిన విధం గా చూపడం లో సహాయకారి గా ఉందని, 40 లక్షల కు పైగా సంపత్తి కార్డుల ను జారీ చేయడమైందని ఆయన వెల్లడించారు. విశిష్ట భూమి గుర్తింపు పిఐఎన్ వంటి చర్యల తో రెవిన్యూ అధికారుల పై గ్రామ ప్రజలు ఆధారపడేటటువంటి పరిణామం తగ్గిపోతుంది అని ఆయన అన్నారు. భూమి రికార్డుల ను మరియు హద్దు ల నిర్ణయం సంబంధి పరిష్కారాల ను ఆధునిక సాంకేతిక విజ్ఞానం తో ముడిపెట్టడం కోసం నిర్ణీత కాలాన్ని పెట్టుకొని పనిచేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాల కు ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ‘‘వివిధ పథకాల లో వంద శాతం కవరేజి చడం కోసం, మనం నూతన సాంకేతిక విజ్ఞానం పై శ్రద్ధ తీసుకోవాలి. ప్రాజెక్టు లు వేగం గా పూర్తి చేయాలి అంటే, నాణ్యత విషయం లో రాజీ పడకుండా ఉండాలి అంటే ఇది జరగాలి’’ అని ఆయన అన్నారు.

జల్ జీవన్ మిశన్ లో భాగం గా 4 కోట్ల కనెక్షన్ ల ఇచ్చే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ దిశ లో కృషి ని పెంచాలి అంటూ సూచన చేశారు. గొట్టపు మార్గాల విషయం లో, అందజేసే నీటి విషయం లో నాణ్యత ను గురించి చాలా జాగరూకత తో ఉండాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాని కి ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ పథకం ముఖ్యాంశాల లో ఒక ముఖ్యాంశం ఏమిటి అంటే, అది గ్రామీణ స్థాయి లో యాజమాన్య భావన అనేది ఏర్పడాలి; మరి జల పాలన అనేది బలోపేతం కావాలి అనేదే, ఈ విషయాలన్నిటి ని దృష్టి లో పెట్టుకొని నల్లా నీటి ని 2024వ సంవత్సరాని కల్లా ప్రతి ఒక్క కుటుంబాని కి మనం తీసుకు పోవలసి ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

పల్లెసీమల లో డిజిటల్ కనెక్టివిటీ అనేది ఇక ఎంత మాత్రము ఒక మహత్వాకాంక్ష గా మిగిలిపోకూడదు. అంతకంటే అది ఒక అవసరం గా మారిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటి గ్రామాల లో సౌకర్యాల ను సమకూర్చడం ఒక్కటే కాకుండా అది నైపుణ్యయుక్త యువత తాలూకు ఒక పెద్ద సమూహాన్ని తయారు చేయడం లో కూడా సాయపడుతుంది’’ అని ఆయన అన్నారు. దేశం లో శక్తియుక్తుల ను పెంపొందింపచేయడం కోసం సేవల రంగాన్ని బ్రాడ్ బ్యాండ్ విస్తరించనుంది అని ఆయన చెప్పారు. ఇప్పటికే పని పూర్తి అయిన ప్రాంతాల లో ఆ ప్రాంతాల లో బ్రాడ్ బ్యాండ్ సామర్ధ్యాలను సరి అయిన రీతి లో ఉపయోగించుకొనే విషయం లో తగినంత చైతన్యాన్ని అలవరచడం పైన కూడా శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన నొక్కి చెప్పారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు కు ఒక పెద్ద ఆధారం గా మన మహిళ ల శక్తి ఉంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘కుటుంబాల లో ఆర్థిక సంబంధి నిర్ణయాల లో మహిళల కు మెరుగైన ప్రాతినిధ్యం లభించేటట్లు గా ఫైనాన్శియల్ ఇంక్లూజన్ చూసింది. మహిళల కు దక్కిన ఈ ప్రాతినిధ్యాన్ని స్వయం సహాయ సమూహాల ద్వారా మరింత గా పెంపు చేయవలసిన అవసరం ఉంది’’ అని కూడా ఆయన అన్నారు.

చివర లో, ప్రధాన మంత్రి తన కు ఉన్నటువంటి అనుభవం తో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలన ను మెరుగు పరచే పలు మార్గాల ను గురించి పలు సూచనల ను చేశారు. గ్రామీణ అంశాల కు బాధ్యత వహించేటటువంటి ఏజెన్సీ లు అన్నీ కూడాను చక్కని సమన్వయం ఏర్పడేటట్లు గా చూడటానికి గాను నియమిత అంతరాళాల్లో కలిసి ఒక చోటు లో కూర్చొని చర్చించుకోవడం మేలు చేస్తుంది అంటూ ఆయన సలహా ఇచ్చారు. ‘‘డబ్బు అందుబాటు కంటే కూడా సమన్వయ లోపం మరియు అడ్డుగోడల ను ఏర్పరచుకోవడం అనేవి సమస్యలు గా మారుతాయి’’ అని ఆయన చెప్పారు. వివిధ పోటీల కు సరిహద్దు గ్రామాల ను ఒక నిలయం గా రూపుదిద్దడం, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ అధికారులు వారు గడించిన పాలన సంబంధి అనుభవం తో వారి గ్రామాల కు మేలు ను చేయడం వంటి అనేక నవీన పద్ధతుల ను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పల్లె కు పుట్టిన రోజు మాదిరిగా ఒక రోజు ను నిర్ణయించడం, మరి ఆ రోజు న ఆ గ్రామం తాలూకు సమస్యల ను పరిష్కరించేటటువంటి భావన తో వేడుక ను జరుపుకోవడం వల్ల ప్రజల కు వారి పల్లె తో అనుబంధం పటిష్టం అవుతుందని, మరి ఇది గ్రామీణ జీవనాన్ని సుసంపన్నం చేయగలుగుతుందని కూడా ఆయన సూచించారు. రైతుల లో కొంత మంది ని ప్రాకృతిక వ్యవసాయం కోసం కృషి విజ్ఞాన కేంద్రాల ఆధ్వర్యం లో ఎంపిక చేయడం, పోషకాహార లోపాన్ని దూరం చేయాలని నిర్ణయించుకొనే గ్రామాలు, చదువు ను మధ్యలో మానివేయడాన్ని నియంత్రించడం వంటి ఉపాయాలతో భారతదేశం లో పల్లెల కు మెరుగైన ఫలితాల ను ప్రసాదించగలవు అని ప్రధాన మంత్రి అన్నారు.

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
UPI hits record with ₹16.73 billion in transactions worth ₹23.25 lakh crore in December 2024

Media Coverage

UPI hits record with ₹16.73 billion in transactions worth ₹23.25 lakh crore in December 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chess champion Koneru Humpy meets Prime Minister
January 03, 2025

Chess champion Koneru Humpy met the Prime Minister, Shri Narendra Modi today. Lauding her for bringing immense pride to India, Shri Modi remarked that her sharp intellect and unwavering determination was clearly visible.

Responding to a post by Koneru Humpy on X, Shri Modi wrote:

“Glad to have met Koneru Humpy and her family. She is a sporting icon and a source of inspiration for aspiring players. Her sharp intellect and unwavering determination are clearly visible. She has not only brought immense pride to India but has also redefined what excellence is.”