విద్య ను ఉపాధి యోగ్య‌త‌, న‌వ‌పారిశ్రామిక‌త్వ సామ‌ర్థ్యాల‌ తో జోడించే ప్ర‌య‌త్నాల‌ ను బ‌డ్జెటు విస్త‌రించింది: ప్ర‌ధాన మంత్రి

విద్య రంగాని కి సంబంధించి బ‌డ్జెటు లో ప్ర‌స్తావించిన అంశాల ను ప్ర‌భావ‌వంతం గా అమ‌లు చేయ‌డానికి సంబంధించి ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు.

ఈ వెబినార్ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, ఒక స్వ‌యంస‌మృద్ధియుత భార‌త‌దేశాన్ని, నిర్మించడం కోసం దేశ యువ‌త లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఎంతయినా అవసరం అన్నారు. యువతీ యువ‌కులకు వారు చ‌దువుకున్న చ‌దువు, వారు ఆర్జించిన జ్ఞానం అంటే పూర్తి న‌మ్మ‌కం ఉన్నప్పుడు ఆత్మ విశ్వాసం అలవడుతుందని ఆయ‌న అన్నారు. యువత కు వారు చదువుకున్న చ‌దువు వారికి వారి ప‌ని ని చేయ‌డానికి సరి అయిన అవ‌కాశాన్ని, అవ‌స‌ర‌మైన నైపుణ్యాల‌ ను ప్ర‌సాదించినప్పుడు ఆత్మవిశ్వాసం అల‌వ‌డుతుంద‌న్నారు. కొత్త జాతీయ విద్య విధానాన్ని ఈ ఆలోచ‌న తోనే రూపొందించ‌డ‌మైంద‌ని ఆయ‌న తెలిపారు. శిశు త‌ర‌గ‌తి కంటె క్రితం స్థాయి నుంచి పిహెచ్‌డి స్థాయి వ‌ర‌కు జాతీయ విద్య విధానం లో ప్ర‌స్తావించిన అన్ని అంశాల ను త్వ‌రిత‌ గ‌తి న అమ‌లు చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయన నొక్కిచెప్పారు. ఈ సందర్భం లో బ‌డ్జెటు ఎంత‌గానో సాయ‌పడుతుంద‌ని ఆయ‌న అన్నారు.

ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెటు లో ఆరోగ్యం త‌రువాత విద్య‌, నైపుణ్యం, ప‌రిశోధ‌న‌, నూత‌న ఆవిష్క‌ర‌ణ.. వీటి పైనే పూర్తి శ్ర‌ద్ధ ను తీసుకోవడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో క‌ళాశాల లకు, విశ్వ‌విద్యాల‌యాల‌కు మ‌ధ్య మెరుగైన స‌మ‌న్వ‌యం ఏర్ప‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ బ‌డ్జెటు లో నైపుణ్యాభివృద్ధి, ఉన్న‌తీక‌ర‌ణ‌, అప్రెంటిస్ శిప్ అనే అంశాల‌ కు క‌ట్ట‌బెట్టిన‌టువంటి ప్రాధాన్యం అంత‌కుముందు ఎన్న‌డూ ఇచ్చి ఉండ‌లేదు అని ఆయ‌న అన్నారు. విద్య ను ఉపాధి యోగ్య‌త‌ సామర్థ్యాలతోను, నవ‌పారిశ్రామిక‌త్వ సామ‌ర్ధ్యాల‌ తోను ముడిపెట్టేందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాల‌ ను ఈ బ‌డ్జెటు మ‌రింత‌గా విస్త‌రించింది అని ఆయ‌న వివ‌రించారు. ఈ ప్ర‌య‌త్నాల ఫ‌లితం గా భార‌త‌దేశం విజ్ఞాన శాస్త్ర ప‌ర‌మైన ప్ర‌చుర‌ణ‌లు, పిహెచ్‌డి ప‌రిశోధ‌క విద్యార్థుల సంఖ్య‌, స్టార్ట్‌-అప్ ఇకోసిస్ట‌మ్ ల ప‌రం గా ప్రపంచం లో అగ్రగామి మూడు దేశాలలో చేరిపోయింది అని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం గ్లోబ‌ల్ ఇనోవేశ‌‌న్ ఇండెక్స్ లో అగ్ర‌గామి 50 దేశాల సరసకు చేరింద‌ని, భార‌త‌దేశం స్థితి నిల‌క‌డ‌ గా మెరుగుప‌డుతూ వ‌స్తోందని కూడా ఆయ‌న అన్నారు. ఉన్న‌త విద్య‌, ప‌రిశోధ‌న‌, నూత‌న ఆవిష్క‌ర‌ణ ల‌పై నిరంత‌ర శ్ర‌ద్ధ తీసుకొంటున్నందువ‌ల్ల తత్ఫలితం గా విద్యార్థుల కు, యువ శాస్త్రవేత్త‌ల‌ కు కొత్త కొత్త అవ‌కాశాలు అందివస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

మొట్ట‌మొద‌టిసారి గా పాఠ‌శాల‌ల్లో అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్స్ మొదలుకొని ఉన్న‌త విద్యా సంస్థ‌ల లో అట‌ల్ ఇంక్యుబేశన్ సెంట‌ర్స్ వ‌ర‌కు పూర్తి శ్ర‌ద్ధ ను తీసుకోవడం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. దేశం లో స్టార్ట్ అప్స్ కోసం హ్యాక‌థ‌న్ ల‌ను నిర్వ‌హించే ఒక కొత్త సంప్ర‌దాయమంటూ ఏర్ప‌డింది, ఇది ఇటు దేశ యువ‌త‌ కు, అటు దేశ ప‌రిశ్ర‌మ రంగానికి చాలా మహత్వపూర్ణమైందిగా మా‌రుతున్నద‌ని ఆయ‌న అన్నారు. నేశ‌నల్ ఇనిశియేటివ్ ఫార్ డెవలపింగ్ ఎండ్ హార్‌ నెసింగ్‌ ఇనోవేశన్ (ఎన్ఐడిహెచ్ ఐ) ద్వారా 3500కు పైగా స్టార్ట్‌-అప్స్ ను పోషించి పెంచడం జ‌రుగుతోంద‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఇదే విధంగా నేశ‌న‌ల్ సూప‌ర్ కంప్యూటింగ్ మిశ‌న్ లో భాగం గా ప‌ర‌మ్ శివాయ్‌, ప‌ర‌మ్ శ‌క్తి, ప‌ర‌మ్ బ్ర‌హ్మ అనే పేరుల‌తో ఉన్న‌ మూడు సూప‌ర్ కంప్యూట‌ర్ ల‌ను ఐఐటి బిహెచ్‌యు లో, ఐఐటి ఖ‌డ‌గ్ పుర్ లో, ఐఐఎస్‌ఇఆర్ పుణే లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఆ త‌ర‌హా సూప‌ర్ కంప్యూట‌ర్ ల‌ను దేశం లో మ‌రో ప‌న్నెండు కు పైగా సంస్థల‌ కు స‌మ‌కూర్చాల‌నే ప్ర‌తిపాద‌న ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఐఐటి ఖ‌డ‌గ్ పుర్‌, ఐఐటి దిల్లీ ల‌తో పాటు బిహెచ్‌యు ల‌లో మూడు సాఫిస్టికేటెడ్ ఎనలిటికల్ ఎండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్‌స్టిట్యూట్స్ (ఎస్ఎటిహెచ్ఐ) లు సేవ‌ల‌ ను అందిస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

జ్ఞానాన్ని, ప‌రిశోధ‌న ను హద్దుల లో బంధించడం దేశ శ‌క్తియుక్తుల కు తీర‌ని అన్యాయం చేయ‌డ‌మే అనే ఆలోచన తో, అంత‌రిక్షం, పరమాణు శ‌క్తి, డిఆర్‌డిఒ, వ్య‌వ‌సాయం రంగాల లో ప్ర‌తిభాశాలి యువ‌త‌ కు అనేక అవ‌కాశాల‌ ను క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. దేశం మొట్టమొదటి సారి గా వాతావరణ అధ్యయన రంగం లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల ను అందుకొంది, దీనితో ప‌రిశోధ‌న & అభివృద్ధి కి ఊతం ల‌భించింది, మరి మన ప్ర‌పంచ స్థాయి పోటీతత్వం సైతం మెరుగుపడివంది అని ఆయ‌న అన్నారు. ఇటీవ‌లే భూ- అంతరిక్ష సమాచారాన్ని సామాన్యుల కోసం వెల్లడి చేయడమైంద‌ని, దీనితో దేశ యువ‌త కు, అంత‌రిక్ష రంగానికి అనేక అవ‌కాశాలు దక్కుతాయి అని ఆయ‌న చెప్పారు. యావ‌త్తు ఇకో సిస్ట‌మ్ కు దీనితో చాలా ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు. దేశం లో మొట్ట‌మొద‌టి సారి నేశ‌న‌ల్ రిస‌ర్చ్ ఫౌండేశ‌న్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది. దీనికోసం 50 వేల కోట్ల రూపాయ‌ల ను కేటాయించ‌డమైంద‌న్నారు. ఇది దేశం లోని ప‌రిశోధ‌న కు సంబంధించిన సంస్థ‌ల లో పాల‌న వ్యవస్థ ను బ‌లపరుస్తుంద‌ని, ప‌రిశోధ‌న & అభివృద్ధి, విద్యావేత్తలు, ప‌రిశ్ర‌మ.. వీటికి మ‌ధ్య సంబంధాన్ని మెరుగుప‌రుస్తుంద‌న్నారు. బ‌యో టెక్నాల‌జీ కి సంబంధించిన ప‌రిశోధ‌న రంగం లో 100 శాతానికి పైగా వృద్ధి ప్ర‌భుత్వ ప్రాధాన్యాల ను సూచిస్తోందని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆహార భ‌ద్ర‌త‌, పోష‌ణ, వ్య‌వ‌సాయం.. ఈ రంగాల‌ లో బ‌యోటెక్నాల‌జీ సంబంధిత ప‌రిశోధ‌న కు గ‌ల అవ‌కాశాల‌ ను మ‌రింత‌ పెంచాలి అంటూ ఆయ‌న పిలుపునిచ్చారు.

భార‌త‌దేశ ప్ర‌తిభావంతుల కు డిమాండు పెరుగుతున్న సందర్బం లో ప్ర‌ధాన మంత్రి నైపుణ్య సమూహాల ను మేప్ చేసి, శ్రేష్ఠ అభ్యాసాల ను అల‌వ‌ర‌చుకొంటూ, అంత‌ర్జాతీయ విద్యా సంస్థ‌ల ను ఆహ్వానించ‌డం, ప‌రిశ్ర‌మ‌ల‌ ను దృష్టి లో పెట్టుకొని నైపుణ్యాల ను సముపార్జించడం ద్వారా మనం మన యువ‌త ను త‌ద‌నుగుణం గా స‌న్న‌ద్ధం చేయాల‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ బ‌డ్జెటు లో ప్ర‌స్తావించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ అప్రెంటిస్ శిప్ ప్రోగ్రాము దేశ యువ‌త కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

శ‌క్తి రంగం లో మ‌నం స్వ‌యంస‌మృద్ధి ని సాధించాలి అంటే భావి కాలం లో వినియోగించ‌ద‌గిన ఇంధ‌నం, గ్రీన్ ఎన‌ర్జీ లు అత్య‌వ‌స‌ర‌ం అని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. దీని ని దృష్టిలో పెట్టుకొనే బ‌డ్జెటు లో హైడ్రోజ‌న్ మిశన్ ను ప్ర‌క‌టించ‌డ‌మైంది, దీని వైపు మనం పూర్తి గంభీర‌తతో ముందుకు సాగాలి అని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం హైడ్రోజ‌న్ వాహ‌నాలను ప‌రీక్షించడం పూర్తి అయింది అని ఆయన వెల్ల‌డి చేశారు. రవాణా కోసం హైడ్రోజ‌న్ ను ఇంధ‌నం గా ఉపయోగించుకొనే దిశ లో సమన్వయభరిత ప్ర‌యాసలకు నడుం బిగించవలసిన అవసరం, మ‌న వాహన ప‌రిశ్ర‌మ ను దీనికోసం సన్నద్ధం చేసుకోవలసిన అవసరం ఉందని ఆయ‌న అన్నారు.

కొత్త జాతీయ విద్య విధానం లో స్థానిక భాష ను బాగా ఎక్కువ‌ గా వినియోగించుకోవడాన్ని ప్రోత్స‌హించ‌డమైంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇక ఇప్పుడు ప్రపంచం లోని శ్రేష్ఠ సాహిత్యాన్ని ప్రతి భారతీయ భాష లో ఎలా తయారుచేయవచ్చో అన్నది విద్యావేత్త‌లు, ప్రతి ఒక్క భాష నిపుణుల‌దే అని ఆయన‌ అన్నారు. ఈ సాంకేతిక విజ్ఞాన యుగం లో ఇది పూర్తి స్థాయి లో సాధ్య‌మే అని ఆయ‌న అన్నారు. బ‌డ్జెటు లో ప్ర‌స్తావించిన నేశ‌న‌ల్ లాంగ్వేజ్ ట్రాన్స్‌ లేశ‌న్ మిశ‌న్ (ఎన్ఎల్ టిఎమ్) ఈ దిశ లో ఒక మహత్వపూర్ణమైనటువంటి చర్య అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi