‘ఎనర్జీ ఫార్ సస్ టేనబుల్ గ్రోథ్’ (చిరస్థాయి వృద్ధి కోసం శక్తి) పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. బడ్జెటు సమర్పణ అనంతరం ప్రధాన మంత్రి ప్రసంగించిన వెబినార్ ల పరంపర లో ఇది తోమ్మిదో వెబినార్.
‘ఎనర్జీ ఫార్ సస్ టేనబుల్ గ్రోథ్’ అనేది భారతదేశ సంప్రదాయం తో ప్రతిధ్వనించడం ఒక్కటే కాకుండా అంతకంటే అది మన భవిష్యత్తు అవసరాల ను మరియు ఆకాంక్షల ను నెరవేర్చుకోవడానికి అనుసరించవలసిన ఒక మార్గం గా కూడాను ఉంది. దీర్ఘకాలిక శక్తి వనరుల వల్లనే చిరకాల వృద్ధి అనేది సాధ్యపడుతుంది అని ఆయన అన్నారు. 2070వ సంవత్సరానికల్లా నెట్ జీరో స్థాయి కి చేరుకోవాలనే గ్లాస్గో సంకల్పాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. పర్యావరణ మిత్ర పూర్వకమైనటువంటి జీవనశైలి తో పెనవేసుకొన్న ఎల్ ఐ ఎఫ్ ఇ తాలూకు తాను చేసినటువంటి ఒక ప్రకటన ను గురించి కూడా ఈ సందర్భం లో ఆయన ప్రస్తావించారు. ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ వంటి ప్రపంచ స్థాయి సహకార భరిత కార్యక్రమానికి భారతదేశం నాయకత్వం వహిస్తోందని ఆయన గుర్తు కు తెచ్చారు. 500 గీగావాట్ శిలాజేతర శక్తి సామర్ధ్యాన్ని, అలాగే శిలాజేతర శక్తి మాధ్యమం ద్వారా 2030వ సంవత్సరానికల్లా స్థాపిత శక్తి సామర్ధ్యం లో 50 శాతం మేరకు శక్తి స్తోమత ను సంపాదించుకోవాలన్న లక్ష్యాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘భారతదేశం తన కోసం ఏ లక్ష్యాలను ఏర్పరచుకొన్నప్పటికీ, నేను వాటిని సవాళ్ళు గా భావించడం లేదు. అంతకంటే, వాటి ని ఒక అవకాశం గా చూస్తాను. గడచిన కొన్ని సంవత్సరాలు గా భారతదేశం ఈ దృష్టి కోణం తో ముందుకు సాగిపోతున్నది. మరి ఈ సంవత్సరం బడ్జెటు లో దీనిని విధానపరమైన స్థాయి లో అంగీకరించడం జరిగింది’’ అని ఆయన అన్నారు. ఈ బడ్జెటు లో అధిక సామర్ధ్యం కలిగినటువంటి సోలర్ మాడ్యూల్ మేన్యుఫేక్చరింగ్ కోసం 19.5 వేల కోట్ల రూపాయల ను ప్రకటించడం అనేది సోలర్ మాడ్యూల్స్, ఇంకా తత్సంబంధిత ఉత్పాదనల తయారీ మరియు పరిశోధన- అభివృద్ధి లో భారతదేశాన్ని ఒక గ్లోబల్ హబ్ గా మలచడం లో సహాయకారి అవుతుంది అని ఆయన వివరించారు.
ఇటీవలే ప్రకటించినటువంటి నేశనల్ హైడ్రోజన్ మిశన్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశం తన దగ్గర ఉన్న సమృద్ధ నవీకరణ యోగ్య శక్తి తాలూకు సత్తా ను గనుక వినియోగించుకొన్న పక్షం లో అది గ్రీన్ హైడ్రోజన్ కు హబ్ గా అవతరించగలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రంగం లో కృషి చేయవలసిందని ప్రైవేటు రంగానికి ఆయన సూచించారు.
శక్తి ని నిలవ చేసేందుకు సంబంధించిన సవాలు పైన సైతం బడ్జెటు లో గణనీయమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్యాటరీ స్వాపింగ్ పాలిసి, ఇంటర్-ఆపరబులిటీ స్టాండర్డ్ స్ కు సంబంధించి కూడా ఈ సంవత్సరం బడ్జెటు లో ఏర్పాట్ల ను చేయడం జరిగింది. వీటితో భారతదేశం లో విద్యుత్తు వాహనాల వినియోగం లో వచ్చే సమస్యలు తగ్గుతాయి’’ అని ఆయన అన్నారు.
శక్తి ఉత్పాదన తో పాటు గా, శక్తి ని పొదుపు గా వాడుకోవడం కూడా సస్ టేనబులిటి సాధన లో సమాన ప్రాధాన్యం కలిగినటువంటి అంశం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘మీరు మరింత శక్తి సమర్ధమైనటువంటి ఎయర్ కండిషనర్ లను, మరింత శక్తి సమర్ధమైనటువంటి హీటర్ లను, మరింత శక్తి సమర్ధమైనటువంటి గీజర్ లను, మరింత శక్తి సమర్ధమైనటువంటి అవన్ లను మన దేశం లో తయారు చేయడం ఎలాగన్న విషయం లో కృషి చేయాలి’’ అని సమావేశం లో పాలుపంచుకొన్న వారికి ఆయన ఉద్భోదించారు.
శక్తి ని సమర్ధం గా వినియోగించుకొనేటటువంటి ఉత్పాదన లకు ప్రాథమ్యాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, ఎల్ఇడి బల్బుల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించినట్లు ఉదాహరణ గా పేర్కొన్నారు. మొదట ప్రభుత్వం ఎల్ఇడి బల్బుల ఉత్పాదన ను ప్రోత్సహించి, ఎల్ఇడి బల్బుల ధర ను తగ్గించింది. మరి 37 కోట్ల ఎల్ఇడి బల్బుల ను ఉజాలా పథకం లో భాగం గా వితరణ చేయడమైంది. దీనితో ప్రతి గంట కు 48 వేల మిలియన్ కిలో వాట్ మేర కు విద్యుత్తు ను ఆదా చేయడం సాధ్యపడింది. మరి పేద కుటుంబాల కు, మధ్య తరగతి కుటుంబాల కు ఎలక్ట్రిసిటి బిల్లుల లో ఇంచుమించు 20 వేల కోట్ల రూపాయలు మిగిలింది. దీనికి అదనం గా, వార్షిక కర్బన ఉద్గారాల లో 4 కోట్ల టన్నుల క్షీణత నమోదు అయింది. స్థానిక పాలన సంస్థ లు వీధి దీపాలను వెలిగించడం కోసమని ఎల్ఇడి బల్బుల ను ఉపయోగిస్తూ ఉండడం తో ప్రతి సంవత్సరం 6 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అని ఆయన తెలిపారు.
బొగ్గు ను వాయువు గా మార్చే ప్రక్రియ అనేది బొగ్గు కు ఒక స్వచ్ఛమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గం గా ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దీనిని దృష్టి లో పెట్టుకొని ఈ సంవత్సరం బడ్జెటు లో కోల్ గ్యాసిఫికేశన్ కోసమని 4 ప్రయోగాత్మక పథకాల ను ప్రకటించడం జరిగింది. ఇది ఆయా ప్రాజెక్టు ల విషయం లో సాంకేతిక పరమైన మరియు ఆర్థిక పరమైన లాభదాయకత కు పూచీ పడటం తో సహాయకారి కాగలదు అని ఆయన చెప్పారు. అదే విధం గా ప్రభుత్వం పదే పదే ఇథెనాల్ మిశ్రణానికి ప్రాధాన్యాన్ని ఇస్తోందని ఆయన అన్నారు. మిశ్రణరహిత ఇంధనం కోసం అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం గురించి సభికుల దృష్టి కి ప్రధాన మంత్రి తీసుకు వచ్చారు. ఇందౌర్ లో ఈమధ్యే గోబర్ ధన్ ప్లాంటు ను ప్రారంభించిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రైవేటు రంగం రాబోయే రెండు సంవత్సరాల కాలం లో అటువంటి 500 లేక 1000 ప్లాంటుల ను ఏర్పాటు చేయవచ్చునని పేర్కొన్నారు.
భారతదేశం లో శక్తి కి డిమాండు భవిష్యత్తు కాలం లో మరింత పెరగవచ్చన్న అంశాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, మనం నవీకరణ యోగ్య శక్తి వైపునకు మళ్ళితే మంచిదన్నారు. ఈ దిశ లో అనేక చర్యల ను చేపట్టడమైందంటూ ఆయన అవేమిటో ఒక్కటొక్కటి గా వివరించారు. వాటి లో భారతదేశం లో 24 మొదలుకొని 25 కోట్ల కుటుంబాలు క్లీన్- కుకింగ్ కు మారడం, కాలువ ల మీద సోలర్ ప్యానల్స్ , ఇళ్ల పెరళ్ల లో గాని లేదా మిద్దె ల మీద గాని సోలర్ ట్రీ ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. కుటుంబాని కి అవసరపడే విద్యుత్తు లో 15 శాతం విద్యుత్తు సోలర్ ట్రీ ద్వారానే లభిస్తుంది. విద్యుత్తు ఉత్పత్తి ని పెంచడం కోసం సూక్ష్మ జలవిద్యుత్తు ఉత్పాదన ను చేపట్టడాని కి అవకాశాలు ఉన్నాయా అనేది అన్వేషించాలి అని ఆయన సూచించారు. ‘‘అన్ని విధాలైన ప్రాకృతిక వనరులు కరిగిపోతూ ఉండటాన్ని ప్రపంచం గమనిస్తున్నది. అటువంటి స్థితి లో, సర్క్యులర్ ఇకానమి ప్రస్తుత తక్షణావసరం గా ఉంది. మరి మనం దీని ని మన నిత్య జీవనం తాలూకు అనివార్య భాగం గా చేసుకోక తప్పదు’’ అని ఆయన అన్నారు.