విద్యుత్తు మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్ర బడ్జెట్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా సంప్రదింపుల కోసం నిర్వహించిన ఒక వెబినార్ ను ఉద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో - కేంద్ర విద్యుత్తు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ (ఇంచార్జ్) మంత్రి; విద్యుత్తు రంగానికి చెందిన భాగస్వాములతో పాటు ఆయా రంగాల నిపుణులు; పరిశ్రమలు మరియు సంఘాల ప్రతినిధులు; డిస్కామ్ ల మేనేజింగ్ డైరెక్టర్లు; పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన రాష్ట్ర నోడల్ ఏజెన్సీల ముఖ్య కార్యనిర్వాక అధికారులు; వినియోగదారుల బృందాలు; విద్యుత్తు మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

 

దేశ ప్రగతిలో ఇంధన రంగం పెద్ద పాత్ర పోషిస్తుందనీ, జీవన సౌలభ్యం, సులభతర వ్యాపారం రెండింటికీ, ఇది దోహదపడుతుందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య గల విశ్వాసాన్ని ఈ వెబినార్ అద్దం పడుతోందనీ, ఈ రంగానికి బడ్జెట్ ప్రతిపాదనలను త్వరగా అమలు చేయడానికి అవసరమైన మార్గాలను కనుక్కోడానికి, ఇది ఒక ప్రయత్నమనీ, ప్రధానమంత్రి చెప్పారు.

 

ఈ రంగానికి ప్రభుత్వ విధానం సమగ్రంగా ఉందని, నాలుగు మంత్రాలు- అంటే -చేరుకోవడం (రీచ్), బలోపేతం చేయడం (రీన్ఫోర్స్), సంస్కరించడం (రిఫార్మ్) మరియు పునరుత్పాదక ఇంధనం (రెన్యూవబుల్ ఎనర్జీ) మార్గనిర్దేశం చేశాయని, ప్రధానమంత్రి వివరించారు. చేరుకోవడానికి, చివరి వరకు అనుసంధానం అవసరం. సంస్థాపనా సామర్థ్యం ద్వారా ఈ పరిధిని బలోపేతం చేయాలి, ఇందుకు సంస్కరణలు ఎంతైనా అవసరం. ఈ పునరుత్పాదక ఇంధనంతో పాటు సమయానికి డిమాండు ఉందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.


ఈ విషయాల గురించి, ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రతిపాదనలు, ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికి చేరుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, చెప్పారు. సామర్ద్యాన్ని బలోపేతం చేయడానికి సంబంధించి చెప్పాలంటే, భారతదేశం విద్యుత్ లోటు నుండి విద్యుత్ మిగులు దేశంగా మారింది. ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశం 139 గిగా వాట్ల సామర్థ్యాన్ని జోడించి, "ఒక దేశం-ఒక గ్రిడ్-ఒక ఫ్రీక్వెన్సీ" లక్ష్యాన్ని చేరుకుంది. ఆర్థిక మరియు కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు 2 లక్షల 32 వేల కోట్ల రూపాయల బాండు జారీతో ఉదయ్ పథకం వంటి సంస్కరణలు చేపట్టడం జరిగింది. పవర్ గ్రిడ్ యొక్క ఆస్తులపై డబ్బు ఆర్జించడం కోసం, మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్టు - "ఇన్విట్" స్థాపించబడింది, ఇది త్వరలో పెట్టుబడిదారులకు అందుబాటులోకి వస్తుంది.


గత ఆరేళ్లలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని రెండున్నర రెట్లు పెంచినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. సౌర విద్యుత్తు సామర్థ్యం 15 రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్టు, మౌలిక సదుపాయాల పెట్టుబడి పట్ల అపూర్వమైన నిబద్ధతను చూపించింది. మిషన్ హైడ్రోజన్, సౌర ఘటాల దేశీయ తయారీ మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ మూలధన ఇన్ఫ్యూషన్‌లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

పి.ఎల్.‌ఐ. పథకాన్ని ప్రస్తావిస్తూ, అధిక సామర్థ్యం గల సోలార్ పివి మాడ్యూల్ ఇప్పుడు పి.ఎల్.‌ఐ. పథకంలో భాగమనీ, అందులో 4500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పథకానికి భారీ స్పందన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పి.ఎల్.‌ఐ. పథకం కింద 14 వేల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్ సోలార్ పివి తయారీ కర్మాగారాలు పనిచేయనున్నాయి. ఇది స్థానికంగా ఉత్పత్తి చేసే ఈ.వి.ఏ; సోలార్ గ్లాస్; బ్యాక్ షీట్; జంక్షన్ బాక్స్ వంటి వాటికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. "స్థానిక డిమాండ్లను నెరవేర్చడానికి మాత్రమే కాకుండా, మన కంపెనీలు అంతర్జాతీయ తయారీ ఛాంపియన్లుగా అవ్వాలని మనం కోరుకుంటున్నాము" అని ప్రధానమంత్రి, చెప్పారు.


పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 1000 కోట్ల రూపాయల విలువైన అదనపు మూలధన ఇన్ఫ్యూషన్ యొక్క నిబద్ధతను ప్రభుత్వం సూచించింది. అదేవిధంగా, భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థకు అదనంగా 1500 కోట్ల రూపాయల పెట్టుబడి లభిస్తుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 17 వేల కోట్ల రూపాయల విలువైన వినూత్న ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి, ఈ అదనపు పెట్టుబడి, దోహదపడుతుందని ప్రధానమంత్రి అన్నారు. అదేవిధంగా, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ- ఇరేడా లోని పెట్టుబడులు, ఏజన్సీ ద్వారా 12 వేల కోట్ల రూపాయల అదనపు రుణాలకు దారి తీస్తుంది. ఇది, 27 వేల కోట్ల రూపాయల విలువైన ఐ.ఆర్.ఈ.డి.ఏ. యొక్క ప్రస్తుత రుణాలు ఇచ్చే సామర్థ్యం కంటే ఎక్కువ.

ఈ రంగంలో సులభతరం వ్యాపారాన్ని మెరుగుపరిచే ప్రయత్నాల గురించి కూడా ప్రధానమంత్రి పేర్కొన్నారు. నియంత్రణ మరియు ప్రక్రియ వ్యవస్థలో సంస్కరణలతో విద్యుత్ రంగం పట్ల దృక్పథం గణనీయంగా మెరుగుపడిందని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వం విద్యుత్తును పరిశ్రమ రంగంలో భాగంగా కాకుండా ప్రత్యేక రంగంగా పరిగణిస్తుంది. విద్యుత్తును, ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడంపై, ప్రభుత్వం తీవ్రంగా దృష్టి పెట్టడానికి, ఈ విద్యుత్తుకు ఉన్న సహజ ప్రాముఖ్యతే కారణం. పంపిణీ రంగంలో సమస్యలను తొలగించడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. ఇందు కోసం కోసం డిస్కామ్ ‌ల పాలసీ మరియు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ పరిశీలనలో ఉంది. ఏ ఇతర రిటైల్ వస్తువుల మాదిరిగానే పనితీరు ప్రకారం వినియోగదారుడు తన సరఫరాదారుని ఎన్నుకోగలగాలి. పంపిణీ రంగం ఎదుర్కొంటున్న ప్రవేశ అవరోధాలను అధిగమించి, పంపిణీ మరియు సరఫరా లైసెన్సింగ్ కోసం పని జరుగుతోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్, ఫీడర్ సెపరేషన్, సిస్టమ్ అప్‌గ్రేడేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి తెలియజేశారు.


ప్రధానమంత్రి కుసుం పథకం కింద రైతులు విద్యుత్తు ఉత్పత్తిదారులుగా మారుతున్నారని శ్రీ మోదీ అన్నారు. రైతుల పొలాల్లోని చిన్న చిన్న ప్లాంట్ల ద్వారా 30 జి.డబ్ల్యూ. సౌర సామర్థ్యాన్ని సృష్టించడం లక్ష్యం కాగా, ఇప్పటికే, రూఫ్-టాప్ సౌర ప్రాజెక్టుల ద్వారా 4 ఐ.డబ్ల్యూ. సౌర సామర్థ్యం ఏర్పాటు చేయబడింది, త్వరలో మరో 2.5 జి.డబ్ల్యూ. సామర్ధ్యాన్ని జోడించనున్నారు. వచ్చే ఒకటిన్నర సంవత్సరాల్లో, రూఫ్-టాప్ సౌర ప్రాజెక్టుల ద్వారా, 40 జి.డబ్ల్యూ. విద్యుత్తు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు, ప్రధానమంత్రి తేల్చిచెప్పారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India emerges as a global mobile manufacturing powerhouse, says CDS study

Media Coverage

India emerges as a global mobile manufacturing powerhouse, says CDS study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూలై 2025
July 24, 2025

Global Pride- How PM Modi’s Leadership Unites India and the World