‘‘విబిఎస్‌వై అంటే- ప్రభుత్వ ప్రయాణం మాత్రమే కాదు... దేశ ప్రగతి పయనం కూడా...’’;
‘‘పేదలు.. రైతులు.. మహిళలు.. యువతకు సాధికారతతోనే దేశం శక్తిమంతం’’;
‘‘అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందాలన్నదే ‘విబిఎస్‌వై’ లక్ష్యం’’;
‘‘రైతుల ప్రతి కష్టాన్నీ తీర్చేందుకు మా ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేసింది’’

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుసహా దేశం నలుమూలల నుంచి వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులు వేలాదిగా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ‘విబిఎస్‌వై’ ఇటీవ‌లే 50 రోజులు పూర్తిచేసుకోగా, దాదాపు 11 కోట్లమంది ప్ర‌జ‌లు దీనితో మమేకమయ్యారని గుర్తుచేశారు. ‘విబిఎస్‌వై’ అంటే- ప్రభుత్వ ప్రయాణం మాత్రమే కాదని, దేశ ప్రగతి పయనానికీ ఇది ప్రతిబింబమని ప్రధాని పేర్కొన్నారు.

   నేడు ‘మోదీ హామీ’ దేశం నలుమూలలకూ చేరుతోందని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాల కోసం జీవితంలో ఏళ్ల తరబడి ఎదురుచూసిన పేదలు నేడు అర్థవంతమైన మార్పును చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ ప్రభుత్వ కృషితో పథకాల ప్రయోజనాలు ప్రతి లబ్ధిదారు ముంగిటకూ సకాలంలో చేరుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘మోదీ హామీ’ వాహనంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు చేరువవుతున్నారని తెలిపారు.

 

   ‘మోదీ హామీ’ ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తున్నదని ప్రస్తావిస్తూ- ఈ హామీ స్వరూపస్వభావాలు సహా ఉద్యమ తరహాలో ప్రయోజనాలు లబ్ధిదారుకు చేరడంలోగల సహేతుకతను ప్రధాని వివరించారు. అదే సమయంలో వికసిత భారత్ సంకల్పంతో పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధనకుగల సంబంధాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు. పేదలు, యువత, మహిళలు, రైతులు తరతరాలుగా అనుభవిస్తున్న వేదనను ప్రధాని మోదీ ఎత్తిచూపారు. అయితే, ‘‘మునుప‌టి త‌రాల వేదన ప్రస్తుత- భ‌విష్య‌త్తరాల వారికి ఉండరాదన్నదే మా ప్ర‌భుత్వ ఆకాంక్ష. దేశంలోని విస్తృత జనాభా చిన్నచిన్న రోజువారీ అవసరాల కోసం కూడా సంఘర్షణ పడే దుస్థితిని తప్పించడమే మా ధ్యేయం. అందుకే పేదలు, రైతులు, మహిళలు, యువతరం భవిష్యత్తుపై మేం దృష్టి సారిస్తున్నాం. మా విషయానికొస్తే-ఈ వర్గాలవారే దేశంలోని నాలుగు పెద్ద కులాలు. అందువల్ల పేదలు, రైతులు, మహిళలు, యువతకు సాధికారతతోనే దేశం శక్తిమంతం కాగలదు’’ అని ప్రధాని స్పష్టం చేశారు.

   ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకూ అందాలన్నదే ‘విబిఎస్‌వై’ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. యాత్ర ఆరంభం నుంచి నేటిదాకా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కోసం 12 లక్షల కొత్త దరఖాస్తులు అందాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి యోజన, పీఎం స్వానిధి సాయం కోసం కూడా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ‘విబిఎస్‌వై’ ప్రభావం గురించి వివరిస్తూ- యాత్రలో భాగంగా 1కోటి టీబీ చెక‌ప్‌లు, 22 లక్షల సికిల్ సెల్ చెకప్‌లు సహా ఇప్పటిదాకా 2 కోట్ల మందికిపైగా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు ప్రధాని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో దేశానికి భారంగా పరిగణించబడిన పేదలు, దళితులు, అణగారిన-గిరిజన వర్గాలకు వైద్యులు నేడు చేరువవుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. వీరందరికీ నేడు ఏటా రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమా, పేదలకు ఉచిత డయాలసిస్, జనౌషధి కేంద్రాల్లో చౌకధరకు మందులు అందించే ఆయుష్మాన్ యోజనను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘దేశవ్యాప్తంగా నిర్మించబడిన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు గ్రామాలకు, పేదలకు పెద్ద ఆరోగ్య ప్రదాయనులుగా మారాయి’’ అని ప్రధాని అన్నారు.

 

   దేశంలో మహిళా సాధికారతపై ప్రభుత్వ ప్రభావాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ- ముద్ర యోజన కింద రుణలభ్యతతోపాటు బ్యాంక్ మిత్ర, పశుసఖి, ఆశా కార్యకర్తలుగా కీలకపాత్ర పోషిస్తున్న మహిళల గురించి వివరించారు. గత 10 సంవత్సరాల్లో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాలలో సభ్యులయ్యారని, వారి అభ్యున్నతి కోసం రూ.7.5 లక్షల కోట్లకుపైగా ఆర్థిక సహాయం  అందించామని శ్రీ మోదీ గుర్తుచేశారు. దీనివల్ల కొన్నేళ్ల వ్యవధిలో వీరిలో చాలామంది లక్షాధికారి సోదరీమణులుగా మారారని ప్రధాని అన్నారు. ఈ విజయం స్ఫూర్తితో లక్షాధికారి సోదరీమణుల సంఖ్యను 2 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తదనుగుణంగా ‘విబిఎస్‌వై’లో భాగంగా దాదాపు లక్ష డ్రోన్‌లను ప్రదర్శించిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఉద్యమ స్థాయిలో కొత్త టెక్నాలజీలతో ప్రజలను  అనుసంధానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘‘ప్రస్తుతం వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై మాత్రమే వారికి శిక్షణ ఇవ్వబడుతుంది. రానున్న కాలంలో ఇతర రంగాలకూ దీన్ని విస్తరిస్తాం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.

   గత ప్రభుత్వాల పాలనలో వ్యవసాయ విధానం సంబంధిత చర్చల పరిధి కేవలం ఉత్పత్తి-అమ్మకాలకే పరిమితమన్నారు. దేశవ్యాప్తంగా రైతుల నిత్య సమస్యలు పూర్తిగా విస్మరణకు గురయ్యాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ‘‘రైతుకు ఎదురయ్యే ప్రతి కష్టాన్నీ తొలగించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోంది’’ అని శ్రీ మోదీ తెలిపారు. ఈ మేరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకూ కనీసం రూ.30,000 వంతున బదిలీ చేయడం, ‘పిఎసిఎస్’లు, రైతు ఉత్పత్తిదారు సంస్థలు వగైరాల ద్వారా వ్యవసాయంలో సహకారాన్ని ప్రోత్సహిస్తున్నామని శ్రీ మోదీ పేర్కొన్నారు. అలాగే నిల్వ సౌకర్యాల మెరుగుదలతోపాటు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు ఊతమిస్తున్నామని చెప్పారు. కంది పంట పండించే రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తిని ఆన్‌లైన్‌లో నేరుగా ప్రభుత్వానికే విక్రయించవచ్చని తెలిపారు. తద్వారా కనీస మద్దతు ధర లభించడమే కాకుండా అధిక ధరగల మార్కెట్లోనూ అమ్ముకునే అవకాశం ఉంటుందని ప్రధాని తెలిపారు. ఈ పథకం పరిధిని ఇతర పప్పు ధాన్యాలకూ విస్తరిస్తామని చెప్పారు. ‘‘విదేశాల నుంచి పప్పుధాన్యాల కొనుగోలుకు వినియోగించే సొమ్ము ఇకపై దేశంలోని రైతులకే లభించాలన్నది మా ఆకాంక్ష’’ అని స్పష్టం చేశారు.

 

   చివరగా- ‘విబిఎస్‌వై’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బృందం అంకితభావాన్ని, ఇందుకు సహకరిస్తున్న స్థానిక యంత్రాంగాల కృషిని ప్రధానమంత్రి అభినందించారు. ఈ మేరకు ‘‘ఇదే స్ఫూర్తితో మన దేశాన్ని వికసిత భారతంగా తీర్చిదిద్దడంలో చిత్తశుద్ధితో మన కర్తవ్యం నిర్వహిద్దాం’’ అని పిలుపునిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

   దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర 2023 నవంబరు 15న ప్రారంభమైన నాటినుంచి ప్రధానమంత్రి లబ్ధిదారులతో క్రమం తప్పకుండా సంభాషిస్తున్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా నాలుగు సార్లు (నవంబరు 30, డిసెంబరు 9, 16, 27 తేదీల్లో) లబ్ధిదారులతో ఆయన మమేకమయ్యారు. మరోవైపు గత నెలలో వారణాసి పర్యటన సందర్భంగా వరుసగా రెండు రోజులు (డిసెంబరు 17-18తేదీల్లో) లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాటామంతీ నిర్వహించారు.

   దేశంలో అర్హులైన లక్షిత లబ్ధిదారులందరికీ ఈ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా చూడటం ద్వారా ప్రభుత్వ ప్రధాన పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధన లక్ష్యంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర చేపట్టబడింది.

   ఈ నేపథ్యంలో 2024 జనవరి 5నాటికి యాత్రలో పాలుపంచుకున్న వారి సంఖ్య 10 కోట్లు దాటడం ద్వారా ఓ కీలక మైలురాయిని అధిగమించింది. యాత్ర మొదలయ్యాక కేవలం 50 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో విజయవంతం కావడం విశేషం. తద్వారా వికసిత భారత సమష్టి దృక్పథం దిశగా దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంలో ఈ యాత్ర సామర్థ్యం, దాని ఎనలేని ప్రభావం స్పష్టమవుతున్నాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India produced record rice, wheat, maize in 2024-25, estimates Centre

Media Coverage

India produced record rice, wheat, maize in 2024-25, estimates Centre
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 మార్చి 2025
March 10, 2025

Appreciation for PM Modi’s Efforts in Strengthening Global Ties