విశ్వవిద్యాలయం లో ఫేకల్టీ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సెంటర్ ఎండ్ ఎకడమిక్ బ్లాకు నిర్మాణాని కి ఆయనశంకుస్థాపన చేశారు
‘కమెమరేటివ్ సెంటినరి వాల్యూమ్ – కంపైలేశన్ ఆఫ్ సెంటినరి సెలిబ్రేశన్స్’ ను; ‘లోగో బుక్ - ఢిల్లీ యూనివర్సిటీ ఎండ్ ఇట్స్ కాలేజెస్’ ను; ఇంకా, ‘ఆర - 100 ఇయర్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ’ ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు
దిల్లీ విశ్వవిద్యాలయాని కి వెళ్ళేందుకు మెట్రో లోప్రయాణించిన ప్రధాన మంత్రి
‘‘దిల్లీవిశ్వవిద్యాలయం అనేది కేవలం ఒక విశ్వవిద్యాలయమే కాదు; అది ఒక ఉద్యమం కూడాను’’
‘‘ఈ వంద సంవత్సరాలలో డియు తన ఉద్వేగాల ను సజీవం గా నిలుపుకోవడం తో పాటు తన మూల్యాల ను సైతంచైతన్య భరితం గా పరిరక్షించింది’’
‘‘భారతదేశం యొక్క ఘనమైన విద్య వ్యవస్థ భారతదేశం సమృద్ధి కి వాహకం గా ఉన్నది’’
‘‘ప్రతిభావంతులైనమరియు దృఢమైన యువతరాన్ని తయారు చేయడం లో దిల్లీ విశ్వవిద్యాలయం ఒక ప్రధానమైన పాత్రను పోషించింది’’
‘‘ఒక వ్యక్తి యొక్కలేదా సంస్థ యొక్క సంకల్పం దేశం పట్ల ఉంది అంటే అప్పుడు వాటి కార్యసాధనల ను దేశప్రజల యొక్క కార్యసిద్ధుల తో సమమైనవి గా చూడవచ్చును’’
‘‘గడచిన శతాబ్ద కాలం లోని మూడో దశాబ్దం భారతదేశం స్వాతంత్య్ర పోరాటాని కిక్రొత్త కదలిక ను జోడించింది; మరినూతన శతాబ్ది లోని మూడో దశకం భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర కు ఉత్తేజాన్ని అందించనుంది’’
‘‘ప్రజాస్వామ్యం, సమానత్వం మరియు పరస్పర గౌరవం అనేటటువంటి భారతీయ విలువలు మానవీయ విలువల రూపాన్ని సంతరించుకొంటున్నాయి’’
‘‘ప్రపంచం లో అతిపెద్దదైన వారసత్వ మ్యూజియమ్ - ‘యుగే యుగీన్ భారత్’ ను దిల్లీ లో నిర్మించడం జరుగుతుంది’’
‘‘భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ అనేది భారతదేశం లోని యువత యొక్క సాఫల్యగాథ గామారుతున్నది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఢిల్లీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని మల్టీ పర్పస్ హాల్ లో దిల్లీ విశ్వవిద్యాలయం శత వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమం జరగగా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన విశ్వవిద్యాలయం యొక్క నార్థ్ కేంపస్ లో ఫేకల్టీ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సెంటర్ ఎండ్ ఎకడమిక్ బ్లాకు భవనం సంబంధి శంకుస్థాపన లో కూడా పాలుపంచుకొన్నారు. ప్రధాన మంత్రి ఇదే సందర్బం లో ‘కమెమరేటివ్ సెంటినరీ వాల్యూమ్ - కంపైలేశన్ ఆఫ్ సెంటినరీ సెలిబ్రేశన్స్’ ను; ‘లోగో బుక్ - లోగో ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ ఎండ్ ఇట్స్ కాలేజెస్’ ను మరియు ‘ఆర - 100 ఇయర్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ’ ని ఆవిష్కరించారు.

 

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (డియు) కి చేరుకోవడం కోసం ప్రధాన మంత్రి మెట్రో రైలు లో ప్రయాణించారు; ఈ యాత్ర లో భాగం గా విద్యార్థుల తో ఆయన సంభాషించారు. దిల్లీ యూనివర్సిటీ కి చేరుకొన్న తరువాత ప్రధాన మంత్రి - జర్నీ ఆఫ్ 100 ఇయర్స్ ఎగ్జిబిశన్ గుండా కలియ దిరిగారు. ఫేకల్టీ ఆఫ్ మ్యూజిక్ ఎండ్ ఫైన్ ఆర్ట్స్ సమర్పించిన సరస్వతి వందనాన్ని , ‘యూనివర్సిటీ కుల్ గీత్’ కార్యక్రమాన్ని ఆయన తిలకించారు. 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ (డియు) యొక్క శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం లో పాలుపంచుకోవాలి అని తాను గట్టి గా నిర్ణయించుకొన్నానన్నారు. ఈ అనుభూతి తాను తన సొంత ఇంటి కి వచ్చిన అనుశూతి ని ఇస్తున్నది అంటూ ఆయన అభివర్ణించారు. తన ప్రసంగం కంటే ముందు ప్రదర్శించిన ఒక లఘు చిత్రాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ విశ్వవిద్యాలయం నుండి ఎదిగిన వ్యక్తులు అందించిన తోడ్పాటు లు ఈ యొక్క విశ్వవిద్యాలయం జీవన చిత్రాన్ని ఆవిష్కరించాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఒక ఉత్సవ సందర్భం లో మహోత్సాహ భావన తో దిల్లీ యూనివర్సిటీ కి విచ్చేసినందుకు ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా ఒక విశ్వవిద్యాలయాన్ని సహచరుల తో కలసి సందర్శించడం తాలూకు ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి పలుకుతూ, ఈ కార్యక్రమాని కి చేరుకోవడం కోసం మెట్రో లో ప్రయాణించే అవకాశం లభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

భారతదేశం స్వాతంత్య్రం అనంతరం 75 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న తరుణం లో యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ శత వార్షికోత్సవాలు అవతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘విశ్వవిద్యాలయాలు మరియు విద్య సంస్థ లు ఆ దేశం కార్యసిద్ధుల కు అద్దం పడతాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. డియు 100 సంవత్సరాల ప్రస్థానం లో, ఎంతో మంది విద్యార్థులు, గురువులు తదితరుల జీవనం తో సంబంధం కలిగినటువంటి అనేకమైన చరిత్రాత్మక ఘట్టాలు చోటు చేసుకొన్నాయి అని ఆయన అన్నారు. దిల్లీ విశ్వవిద్యాలయం ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదు అది ఒక ఉద్యమం, అది ప్రతి ఒక్క ఘడియ ను జీవం తో నింపి వేసింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తో అనుబంధం కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కి, ప్రతి ఒక్క గురువు కు మరియు తదితరుల కు శత వార్షికోత్సవాల సందర్భం లో ప్రధాన మంత్రి అభినందనల ను వ్యక్తం చేశారు. 

సభికుల లో క్రొత్త విద్యార్థుల తో పాటు పూర్వ విద్యార్థులు కూడా ఉండడాన్ని గమనించిన ప్రధాన మంత్రి, ఇది పరిచయాల ను పెంచుకొనేందుకు ఒక అవకాశం అన్నారు. ‘‘ఈ వంద సంవత్సరాల కాలం లో డియు తన ఉద్వేగాల ను సజీవం గా అట్టిపెట్టుకొన్నది, అది తన చైతన్యభరితమైన విలువల ను కాపాడుకొంది కూడాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. జ్ఞానం ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, నాలందా మరియు తక్షశిల వంటి చైతన్యభరిత విశ్వవిద్యాలయాలు భారతదేశం లో అలరారిన కాలం లో భారతదేశం సమృద్ధి పరంగా శిఖర స్థాయి లో ఉండింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘భారతదేశం యొక్క సమృద్ధి కి వాహకం గా భారతదేశం యొక్క ఘనమైన విద్య బోధన వ్యవస్థ ఉండింది’’ అని ఆయన అభివర్ణించారు. ఆ కాలం లో ప్రపంచ జిడిపి లో భారతదేశాని కి అధిక వాటా ఉన్న సంగతి ని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. బానిసత్వం కాలం లో జరిగిన నిరంతరాయ దాడులు ఈ సంస్థల ను దెబ్బతీశాయి; దానితో భారతదేశం లోకి తరలివస్తున్న మేధావుల మార్గం లో అంతరాయం ఏర్పడి, మరి వృద్ధి స్తంభించిపోయింది అని ఆయన అన్నారు.

 

స్వాతంత్ర్యం వచ్చాక స్వేచ్ఛాభారత భావోద్వేగ తీవ్రతకు నిర్దిష్ట రూపకల్పనలో భాగంగా విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాయని ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రతిభగల బలమైన యువతరం సృష్టిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం కూడా ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ విధంగా గతంపై అవగాహన మన మనుగడకు ఒక రూపమిచ్చి, ఆదర్శాలకు తీర్చిదిద్ది, భవిష్యత్ దృక్కోణాన్ని విశాలం చేస్తుందన్నారు. అలాగే “ఒక వ్యక్తి లేదా సంస్థ సంకల్ప లక్ష్యం దేశమే అయినపుడు, అది సాధించే విజయాలన్నీ జాతి సాధించే విజయాలతో సమానమే” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఏర్పడ్డాక తొలినాళ్లలో కేవలం 3 కళాశాలలు మాత్రమే దాని పరిధిలో ఉండేవని శ్రీ మోదీ గుర్తుచేస్తూ, ఇవాళ 90కిపైగా కాలేజీలు ఉన్నాయని వెల్లడించారు. ఒకనాడు దుర్బల ఆర్థిక వ్యవస్థగా పరిగణించబడిన భారత్‌, నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద వ్యవస్థగా ఆవిర్భవించిందని స్పష్టం చేశారు.

   ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదివే మహిళల సంఖ్య పురుషులకన్నా అధికమని ప్రధాని పేర్కొన్నారు. దీన్నిబట్టి దేశంలో లింగ నిష్పత్తి గణనీయంగా మెరుగుపడినట్లు తెలుసుకోవచ్చునని చెప్పారు. ఒక దేశం-విశ్వవిద్యాలయ సంకల్పాల నడుమ అవినాభావ సంబంధానికిగల ప్రాధాన్యాన్ని ఆయన విశదీకరించారు. ఉన్నత విద్యా సంస్థల మూలాలు ఎంత లోతుగా ఉంటే, దేశం పురోగమనం అంత ఉన్నతంగా ఉంటుందని చెప్పారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రారంభమైనపుడు దాని లక్ష్యం భారత స్వాతంత్ర్య సాధనేనని ప్రధాని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనం స్వాతంత్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి ఈ సంస్థకు 125 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఈ అమృత కాలంలో ‘వికసిత భారతం’ నిర్మాణంపై ఈ సంస్థ సంకల్పంపూనాలని ఉద్బోధించారు. “గత శతాబ్దపు మూడో దశాబ్దంలో  భారత స్వాతంత్ర్య పోరాటం కొత్త వేగం పుంజుకుంది. ఈ కొత్త శతాబ్దంలో మూడో దశాబ్దం భారత ప్రగతి పయనానికి ప్రేరణనిస్తుంది” అని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే కాలంలో మరిన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌ పెద్ద సంఖ్యలో ఏర్పాటు కాగలవని ప్రధానమంత్రి చెప్పారు. “ఈ సంస్థలన్నీ నవ భారత నిర్మాణంలో ఇటుకలుగా మారగలవు” అని ఆయన చెప్పారు.

 

   విద్య అంటే కేవలం బోధన ప్రక్రియ ఒక్కటే కాదని, అభ్యసన మార్గమని ప్రధాని నొక్కిచెప్పారు. అభ్యసనాంశాలపై విద్యార్థుల దృక్కోణంలో చాలాకాలం తర్వాత మార్పు కనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా తమకు కావాల్సిన పాఠ్యాంశాలను ఎంచుకునే స్వేచ్ఛ నేడు కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా అందుబాటులోకి వచ్చిందన్నారు. విద్యా సంస్థల మధ్య పోటీతత్వం, బోధన నాణ్యత మెరుగుదలను ప్రస్తావిస్తూ- జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ చట్రం గురించి ప్రధానమంత్రి వివరించారు. ఈ చట్రం సంస్థలను ప్రేరేపిస్తుందని, వాటి స్వయంప్రతిపత్తిని విద్యా నాణ్యతతో అనుసంధానించేలా కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

   విష్యత్ దృక్పథంగల విద్యా విధానాలు, నిర్ణయాల నేపథ్యంలో భారతీయ విశ్వవిద్యాలయాలకు గుర్తింపు పెరుగుతోందని ప్రధాని అన్నారు. ఈ మేరకు 2014 నాటి  ‘క్యూఎస్’ ప్రపంచ ర్యాంకింగ్‌లో దేశంలోని 12 విశ్వవిద్యాలయాలకు మాత్రమే చోటు లభించిందని ఆయన గుర్తుచేశారు. అయితే, నేడు ఈ సంఖ్య 45కి చేరిందని, ఈ పరివర్తనకు చోదకశక్తిగా నిలిచిన ఘనత భారత యువతరానిదేనని ప్రధాని ప్రశంసించారు. విద్య అనేది కేవలం డిగ్రీ సాధన, ఉద్యోగ సముపార్జనకే పరిమితమనే భావనను నేటి యువతరం తుత్తునియలు చేసిందని ప్రధాని ప్రశంసించారు. వారు తమదైన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ వెళ్తున్నారని, అందుకే దేశంలో అంకుర సంస్థల సంఖ్య లక్షకుపైగా నమోదైందని పేర్కొన్నారు. అలాగే 2014-15తో పోలిస్తే ఇవాళ పేటెంట్‌ దరఖాస్తుల సమర్పణ, ప్రపంచ ఆవిష్కరణ సూచీలో నమోదు 40 శాతానికిపైగా పెరిగిందని ఆయన చెప్పారు. 

   మెరికాలో ఇటీవలి తన పర్యటన సందర్భంగా ‘కీలక-ఆవిర్భావ సాంకేతికతల కార్యక్రమం’ (ఐసిఇటి)పై అమెరికాతో ఒప్పందం గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. దీనివల్ల కృత్రిమ మేధస్సు (ఎఐ) నుంచి సెమి-కండక్టర్ల దాకా వివిధ రంగాల్లో భారత యువతరానికి కొత్త అవకాశాలు అందివస్తాయన్నారు. అలాగే ఒకనాడు యువతరం నైపుణ్యాభివృధ్ధికి కనుచూపు మేరలో లేని సాంకేతిక పరిజ్ఞానాలు నేడు చేరువ అవుతాయని తెలిపారు. ఈ మేరకు మైక్రాన్, గూగుల్, అప్లైడ్ మెటీరియల్స్ వంటి సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో యువతకు ఉజ్వల భవిష్యత్తుపై ఒక అవగాహన కలుగుతుందని ప్రధాని చెప్పారు.

   ప్పుడు “పారిశ్రామిక విప్లవం 4.0 మన తలుపులు తడుతోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒకనాడు చలనచిత్రాలలో మాత్రమే చూడగలిగే ‘ఎఐ, ఎఆర్‌, విఆర్‌’ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు ఇప్పుడు మన వాస్తవ జీవితంలో భాగమయ్యాయని పేర్కొన్నారు. ఇక వాహనాల డ్రైవింగ్ నుంచి శస్త్రచికిత్సదాకా ‘రోబోటిక్స్‌’ నవ్య సంప్రదాయంగా మారిందని చెప్పారు. ఈ రంగాలన్నీ భారత యువతరానికి సరికొత్త బాటలు వేస్తున్నాయని ఆయన వివరించారు. ఇక దేశీయంగా ప్రైవేటు రంగానికి భారత్‌ తన అంతరిక్ష, రక్షణ రంగాల తలుపులు తెరిచిందన్నారు. దీంతోపాటు డ్రోన్‌ సంబంధిత విధానాల్లో భారీ మార్పులు చేయడంవల్ల యువత ముందడుగుకు ఇవన్నీ విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు.

   ప్రపంచంలో భారత ప్రతిష్ట ఇనుమడిస్తున్నదని, విద్యార్థులపై ఇది సానుకూల ప్రభావం చూపుతున్నదని ప్రధాని చెప్పారు. ఈ నేపథ్యంలో భారతదేశంపై అవగాహన దిశగా ప్రపంచ ప్రజానీకం ఆసక్తి చూపుతున్నదని ఆయన అన్నారు. కరోనా సమయంలో ప్రపంచానికి భారత్‌ చేయూత గురించి ప్రస్తావించారు. అలాగే ప్రకృతి విపత్తుల వేళ కూడా మొట్టమొదట స్పందించే భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నదని తెలిపారు. ఇక జి-20 అధ్యక్షతసహా యోగా, శాస్త్రవిజ్ఞానం, సంస్కృతి, పండుగలు, సాహిత్యం, చరిత్ర, వారసత్వం, వంటకాలు తదితర రంగాల్లో విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు. “భారత యువతరానికి ఇవాళ డిమాండ్ పెరుగుతోంది...  దేశం గురించి ప్రపంచానికి సమగ్రంగా, చక్కగా చెప్పగలిగేది, మన విశేషాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లగలిగేది వారే” అని ఆయన అన్నారు. 

   ప్రజాస్వామ్యం, సమానత్వం, పరస్పర గౌరవం వంటి భారతీయ విలువలు నేడు మానవాళి విలువలుగా మారుతున్నాయని ప్రధాని చెప్పారు. పాలన, దౌత్యం వంటి వేదికలలో భారత యువతకు ఇవి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై దృష్టి కూడా యువతకు కొత్త బాటలు పరుస్తున్నదని ఆయన నొక్కిచెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలు ఏర్పాటవుతున్నాయని, స్వతంత్ర భారత ప్రగతి పయనాన్ని ‘ప్రధానమంత్రి ప్రదర్శనశాల’ కళ్లకు కడుతుందని ఆయన ఉదాహరించారు. వీటితోపాటు ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ ప్రదర్శనశాల- ‘యుగే యుగే భారత్’ పేరిట నిర్మితం కానుందని హర్షం వెలిబుచ్చారు. పలు దేశాల్లో భారతీయ బోధకులకు గుర్తింపు పెరుగుతుండటాన్ని ప్రధాని ప్రస్తావించారు. వివిధ సందర్భాల్లో ప్రపంచ దేశాల అధినేతలు తమ దేశాల్లోని భారతీయ ఉపాధ్యాయుల ప్రతిభను తరచూ ప్రశంసిస్తుంటారని పేర్కొన్నారు. “భారతదేశపు ఈ మృదుశక్తి భారతీయ యువత విజయగాథగా పరివర్తన చెందుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలకు తగినట్లు విశ్వవిద్యాలయాలు తమ ఆలోచనా ధోరణిని రూపొందించుకోవాలని ప్రధాని కోరారు. ఈ మేరకు 125 ఏళ్లు పూర్తిచేసుకోబోయే ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రపంచ అగ్రశ్రేణి వర్సిటీల జాబితాలో స్థానం కోసం తగిన మార్గప్రణాళికను రూపొందించాలని సూచించారు. “భవిష్యత్తును నిర్మించే ఆవిష్కరణలు ఇక్కడ సాగాలి… అంతర్జాతీయ స్థాయిలో అగ్రగాములు, అత్యుత్తమ పరిశోధనలకు మన విశ్వవిద్యాలయాలు నెలవు కావాలి. ఈ దిశగా మీరంతా నిర్విరామ కృషి చేయాల్సి ఉంటుంది” అని ప్రధాని స్పష్టం చేశారు.

   చివరగా- మన జీవితం కోసం మనం నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం మనోశరీరాలను సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా ఒక దేశపు అంతరంగం, ఆలోచనలకు పదునుపెట్టే కర్తవ్యాన్ని విద్యా సంస్థలు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. దేశ ప్రగతి పయనాన్ని నడిపించే క్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈ సంకల్పాలను సాకారం చేయగలదని ప్రధాని విశ్వాసం వెలిబుచ్చారు. “మన నవతరం భవిష్యత్ కాలపు నైపుణ్యంతో సిద్ధం కావాలి. సవాళ్లను స్వీకరించి-ఢీకొనగల స్వభావం కలిగి ఉండాలి. ఇది కేవలం విద్యా సంస్థల దృక్కోణం, కార్యాచరణ ద్వారా మాత్రమే సాధ్యం” అని విశదీకరిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్రు ప్రధాన్‌, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉప-కులపతి శ్రీ యోగేష్‌ సింగ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

   ఢిల్లీ విశ్వవిద్యాలయం  1922 మే 1న స్థాపించబడింది. నాటినుంచీ గడచిన శతాబ్ద కాలంలో అపారంగా ఎదిగి, పరిధిని పెంచుకుంటూ నేడు 86 విభాగాలు, 90 కళాశాలలు, 6 లక్షల మందికిపైగా విద్యార్థులతో వర్ధిల్లుతూ దేశ నిర్మాణంలో ఎంతగానో సహకరిస్తోంది. 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India