ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్లో, ఇటి నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024నుద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 ఎంచుకున్న ఇతివృత్తం “అంతరాయం, అభివృద్ధి, వైవిధ్యం’’’‘ ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతరాయం, అభివృద్ధి, వైవిధ్యం విషయానికి వచ్చినపుడు,ప్రతి ఒక్కరూ ఇది ఇండియా కాలమని అంగీకరిస్తారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాపై విశ్వాసం పెరుగుతున్నదన్నారు. దావోస్లో ఇండియా పట్ల ఎంతో ఆసక్తి వ్యక్తమైన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండియా అద్భుతమైన ఆర్థిక విజయగాధకు నిదర్శనమని, ఇండియా డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని అన్నారు.ప్రపంచంలోని ప్రతి రంగంలో ఇండియా కీలక స్థానంలో ఉందన్నారు. ఒక అధికారి ఇండియా సామర్ధ్యాన్ని దూసకుపోతున్న వృషభంతో పోల్చారని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలోని, అభివృద్ధి ఆర్ధిక వేత్తలు గత 10 సంవత్సరాలలో భారతదేశపు పరివర్తనను చర్చిస్తున్నారని , ఇండియా పై విశ్వాసం పెరగడానికి నిదర్శనమని ప్రధానమంత్రి తెలిపారు.
“ఇండియాకు ఇంత సామర్థ్యం కలిగి ఉందని, విజయం సాధిస్తుందని ఇలాంటి సానుకూల అభిప్రాయం, ఇంతకు ముందు ఎప్పుడూ,ప్రపంచంలో వ్యక్తం కాలేదని అన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ, తాను ఎర్రకోటనుంచి చేసిన ప్రసంగంలో ‘‘ఇది మన సమయం, ఇదే సరైన సమయం అని ప్రస్తావించిన విషయాన్నిగుర్తుచేశారు.
అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు , దేశ అభివృద్ధి ప్రస్తానంలో ఏదేశానికైనా ఒక సమయం వస్తుందని అంటూ ప్రధానమంత్రి, రాగల శతాబ్దాలకు దేశం గట్టి పునాది వేసేందుకు ఇది సమయమని అన్నారు.
‘‘ఇవాళ ఇండియా విషయంలో ఇదే జరుగుతోంది. ఈ సమయం మున్నెన్నడూ లేనంతటి అవకాశం. దేశం పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించే ప్రక్రియ ప్రారంభమైంది.అని ప్రధానమంత్రి అన్నారు. నిరంతరాయంగా వృద్ధి రేటు పెరుగుదల, ద్రవ్యలోటు తగ్గడం, ఎగుమతులు పెరగడం, కరెంటు ఖాతా లోటు తక్కువగా ఉండడం, ఉత్పాదక పెట్టుబడులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడం,ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, అవకాశాలు నానాటికీ పెరుగుతుండడం, ఆదాయాలు పెరగడం, పేదరికం తగ్గుదల, వినియోగంలో పెరుగుదల, కార్పొరేట్ లాభాలలో వృద్ధి, బ్యాంకుల ఎన్.పి.ఎలు రికార్డు స్థాయిలో తగ్గుదల వంటివి దేశం శరవేగంతో పురోగమిస్తున్నదానికి సూచనలని అన్నారు. ఉత్పత్తి, ఉద్పాదకత రెండూ మరింతగా పెరుగుతున్నాయని కూడా ప్రధానమంత్రి తెలిపారు.
ఆర్ధికవేత్తలనుంచి , జర్నలిస్టుల నుంచి ఈ ఏడాది బడ్జెట్ విషయంలో వస్తున్న ప్రశంసలపట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజాకర్షక బడ్జెట్ కాదని అంటూ ప్రధానమంత్రి, ఈ ఏడాది బడ్జెట్ ను ప్రశంసిస్తూ వస్తున్న సమీక్షలకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా బడ్జెట్ ప్రాథమిక సూత్రాలను లేదా బడ్జెట్ విధాన నిర్ణయాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
సుస్థిరత, నిలకడతనం, కొనసాగింపు తమ ప్రాధాన్యతలన్నారు. ప్రస్తుత బడ్జెట్ ఈ సూత్రాలకు కొనసాగింపు అని ప్రధానమంత్రి తెలిపారు. కరోనా వైరస్ మహ్ మ్మారి కాలం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కరొనా కాలం, ఆ తర్వాత అంతా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా సవాలుగా నిలిచిన కాలమని అన్నారు.ఈ కాలంలో ఇండియా ప్రజల ప్రాణాలు కాపాడడానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. జీవితం ఉంటే అన్నీ ఉన్నట్టేనని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని వనరులను సమీకరించడానికి ప్రభుత్వం చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. అలాగే ప్రజలకు కరోనా ముప్పుగురించి అవగాహన కల్పించినట్టు తెలిపారు. పేదలకు కోవిడ్ సమయంలో ఉచిత రేషన్ అందించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. అలాగే ఇండియా లో తయారైన వాక్సిన్ ద్వారా వాక్సిన్ ను అందరికీ అందుబాటులోకి తేవడానికి వీలైందని తెలిపారు. ఒకవైపు ఆరోగ్యం మరోవైపు జీవనోపాధి డిమాండ్లను ప్రభుత్వం తీరుస్తూ వచ్చిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రత్యక్షనగదు బదిలీ ద్వారా మహిళల ఖాతాలలో ప్రభుత్వప్రయోజనాలకు సంబంధించిన నగదును జమ చేసినట్టు తెలిపారు. చిరువ్యాపారులు, వీధివ్యాపారులకు ఆర్ధిక సహాయం అందించినట్టు తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై దృష్టిపెట్టినట్టు కూడా ప్రధానమంత్రి తెలిపారు.
విపత్తును సైతం ఒక అవకాశంగా తీసుకునేందుకు ప్రభుత్వం సంకల్పం చెప్పుకున్నదని ప్రధానమంత్రి అన్నారు.డిమాండ్ను పెంచేందుకు, పెద్ద వ్యాపారాలకు సాయపడేందుకు ఎక్కువ ద్రవ్యాన్ని ముద్రించాలన్ననిపుణుల అభిప్రాయాలను గుర్తుచేసుకుంటూ, ప్రపంచంలోని పలు దేశాలు ఈ విధానాన్ని అనుసరించడంతో చివరికి అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. మనపై కూడా ఈ విషయంలో ఒత్తిడి వచ్చిందని అంటూ ప్రధానమంత్రి, కానీ మనకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసునని వాటిని అర్థం చేసుకుని వ్యవహరించామని తలిపారు. మన అనుభవాలు, మన అంతరాత్మకు అనుగుణంగా వ్యవహరించామని తెలిపారు. ఇండియా విధానాలను తొలుత ప్రశ్నించిన వారున్నారని అయితే ఆతర్వాత ఇండియా విధానమే సరైనదని తేలిందన్నారు. ఇవాళ ఇండియా బలమైన ఆర్థిక స్థితిలో ఉన్నదని తెలిపారు.‘‘భారతదేశం సంక్షేమ రాజ్యం. ప్రభుత్వ ప్రాధాన్యత,సామాన్య ప్రజల జీవనం సులభతరంగా ఉండేట్టు , వారిజీవన ప్రమాణాలు మెరుగుపడేట్టు చూడడం.” అని ప్రధానమంత్రి తెలిపారు. ఒకవైపు కొత్త పథకాలను ప్రారంభిస్తూనే మరోవైపు ప్రభుత్వం ప్రభుత్వ ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుకు అందేట్టు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.“మనం ప్రస్తుతానికి మాత్రమే పెట్టుబడి పెట్టడం కాక, భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా పెట్టుబడి పెట్టినట్టు ’’తెలిపారు.
ప్రతి బడ్జెట్లో నాలుగు ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యతనిచ్చినట్టు ప్రధానమంత్రి తెలిపారు. మూలధన పెట్టుబడి కింద రికార్డు స్థాయిలో ఉత్పాదక వ్యయం, సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున పెట్టుబడి, అనవసర వ్యయంపై నియంత్రణ, ఆర్ధిక క్రమశిక్షణ వంటివి ఇందులో ఉన్నాయన్నారు. ఈ నాలుగు అంశాల విషయంలో సమతూకం పాటించడమే కాక, నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నట్టు కూడా ఆయన వివరించారు. డబ్బు పొదుపు చేయడమంటే , డబ్బు ఆర్జించడమేనన్న సూత్రాన్ని పాటించి లక్ష్యాలు సాధించినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
ప్రాజెక్టులు పూర్తిచేయడంలో జాప్యం వల్ల ప్రాజెక్టుల వ్యవయం పెరగడం గురించి చెబుతూ ప్రధానమంత్రి, తూర్పు ప్రత్యే సరకు రవాణా ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. దీనిని 2008లో చేపట్టారు. ఈ ప్రాజెక్టు వ్యయం 16,000 కోట్ల రూపాయల నుంచి గత ఏడాది పూర్తి అయ్యేనాటికి 50,000 కోట్ల రూపాయలకు పెరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అస్సాంలోని బొగిబీల్బ్రిడ్జ్ని 1998లో రూ 1100 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారని, అయితే 2018లో అది పూర్తి అయ్యేనాటికి దాని వ్యయం రూ5000 కోట్ల రూపాయలు అయిందని ప్రధానమంత్రి అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమ ప్రసంగంలో , పారదర్శక పాలన గురించి ప్రస్తావించారు. వ్యవస్థలో సాంకేతికతను ఉపయోగించచచడం ద్వారా, పారదర్శకత పాటించడం ద్వారా ప్రభుత్వ నిధులను పొదుపుచేయగలిగినట్టు తెలిపారు. కేవలం కాగితం మీద మాత్రమే కనిపిస్తూ వచ్చిన పది కోట్ల నకిలీ లబ్ధిదారులను తొలగించినట్టు తెలిపారు. తద్వారా ప్రభుత్వ నిధులను పొదుపు చేయగలిగినట్టు చెప్పారు. ప్రత్యక్షనగదు బదిలీ ద్వారా 3.25 లక్షల కోట్ల రూపాయలు అనర్హుల చేతిలోకి పోకుండా అడ్డుకోగలిగినట్టు తెలిపారు. జిఇఎం పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లు చేయడం ద్వారా 65,000 కోట్ల రూపాయలు అదా అయిందని తెలిపారు. చమురు ప్రొక్యూర్మెంట్ డైవర్సిఫికేషన్ ద్వవవారా 25,000 కోట్ల రూపాయలు ఆదా అయినట్టు తెలిపారు.‘‘గత ఏడాది ఒక్క సంవత్సరమే పెట్రోల్లో ఇథనాలు కలిపి వాడడం వల్ల 24,000 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగా’’మని తెలిపారు.స్వచ్ఛతా అభియాన్ కింద ప్రభుత్వం ఆఫీసులలో పేరుకుపోయిన వ్యర్థాలను విక్రయించడం ద్వారా రూ1100 కోట్ల రూపాయలను ఆర్జించినట్టు తెలిపారు.
ప్రజలు తమ డబ్బును ఆదా చేసుకునే విధంగా ప్రభుత్వ పథకాలను రూపొందించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. జల్ జీవన్ మిషన్ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, పరిశుభ్రమైన తాగునీరు ప్రజలకు సరఫరా చేయడం జరుగుతోందని తద్వారా వారు ఆరోగ్య పరిరక్షణపై పెట్టే ఖర్చు తగ్గిందని తెలిపారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు ఇది వీలుకల్పించిందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, దీని ద్వారా పేదలు లక్ష కోట్ల రూపాయలు ఆరోగ్యంపై ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పొదుపు చేయగలిగారని,పిఎం జన్ ఔషధి కేంద్రాల ద్వారా 80 శాతం తక్కువ ధరకు మందులు అందుబాటులోకి రావడం వల్ల పేదలకు మరో 30,000 కోట్ల రూపాయలు ఆదా అయిందని తెలిపారు. ప్రస్తుత తరానికి మాత్రమే కాక , తాను భవిష్యత్ తరానికి సైతం జవాబుదారీ అని ప్రధానమంత్రి అన్నారు. అందువల్ల ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలలో పటిష్ట ఆర్ధిక నిర్వహణకు ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు.విద్యుత్ గురించిన ఉదాహరణనిస్తూ ప్రధానమంత్రి, కోటి గృహాలకు ఇంటిపైకప్పుపై సోలార్ పానళ్ల ను అమర్చడం ద్వారా సౌర విద్యుత్ సరఫరాకు సంబంధించి అమలు చేస్తున్న పథకాన్ని వివరించారు. దీనివల్ల వారు విద్యుత్ బిల్లును ఆదా చేసుకోగలుగడమే కాక, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా మరికొంత మొత్తాన్ని గడించవచ్చని తెలిపారు.ఉజాలా పథకం కింద ఎల్.ఇ.డి బల్బులను అందజేయడం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు.ఈ బల్బుల వల్ల రూ 20,000 కోట్ల విలువగల విద్యుత్ బిల్లులు ఆదా అయ్యాయని తెలిపారు.
గడచిన ఏడు దశాబ్దాలలో పేదరిక నిర్మూలన గురించిన నినాదాలు వినిపిస్తూనే ఉన్నప్పటికీ, అవి పేదలపై ఎలాంటి ప్రభావాన్నీ చూపలేకపోయాయని అన్నారు. ఎయిర్ కండిషన్డ్ రూములలో కూర్చుని సలహాలు ఇచ్చిన వారు బిలియనీర్లు అయ్యారు కాని పేదలు మాత్రం పేదలుగానే ఉండిపోయారని అన్నారు. 2014 సంవత్సరం తర్వాత పేదలను పేదరికం నుంచి బయటపడేసే కార్యక్రమాలు ముమ్మరంగా సాగాయని, ఫలితంగా గత 10 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలే కారణమని తెలిపారు.“నేను పేదరికం నుంచే వచ్చాను. అందువల్ల పేదరికాన్ని ఎదుర్కోవడం ఎలాగో నాకు తెలుసు . ఈ దిశగా ముందుకు వెళుతూ మనం దేశంలో పేదరికాన్ని తగ్గించి మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలం ’’అని ప్రధానమంత్రి తెలిపారు.
’భారత ప్రభుత్వ పాలనా నమూనా ఏకకాలంలో రెండు విధాలుగా ముందుకు సాగుతున్నది. ఒకవైపు 20 వ శతాబ్దపు సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం, మరోవైపు 21 వశతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చడం జరుగుతోంది’ అని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి ప్రమాణాల గురించి వివరిస్తూ ఆయన 11 కోట్ల శౌచాలయాల నిర్మాణం గురించి, అంతరిక్ష రంగంలో వచ్చిన కొత్త అవకాశాల గురించి ప్రస్తావించారు. 4 కోట్ల మంది పేదలకు ఇళ్లను ప్రభుత్వం నిర్మించిందని, పదివేల అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేశామని ,300 కు పైగా మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని సరకు రవాణా కారిడారల్ నిర్మాణం, డిఫెన్స్ కారిడార్ నిర్మాణం పూర్తి చేసుకుంటున్నామని, వందేభారత్ రైళ్లు నడుపుకుంటున్నామని, ఢిల్లీ తో పాటు, పలు నగరాలలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టామని చెప్పారు. కోట్లాదిమందిని బ్యాంకింగ్ రంగంతో అనుసంధానించడంతోపాటు ఫైన్టెక్, డిజిటల్ ఇండియా ద్వారా వారికి మరిన్ని సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు.
ఇంక్రిమెంటల్ ఆలోచనా విధానం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇది పరిమితులు కల్పిస్తుందని, పూర్తి శక్తితో ముందుకు సాగడానికి అనుమతించదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ప్రభుత్వ యంత్రాంగంలో ఇలాంటి ధోరణే ఉంటూ వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో మార్పు తెచ్చేందుకు, తాను మరింత విస్తృత స్థాయిలో,గత ప్రభుత్వాల కంటే వేగంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.2014 వరకు జరిగిన పనులకు గత పది సంవత్సరాలలో జరిగిన పనులను పోల్చి చూపుతూ ప్రధానమంత్రి రైల్వే లైన్ల గురించి ప్రస్తావించారు.
రైల్వే లైన్లను 20,000 కిలోమీటర్లనుంచి 40,000 కిలోమీటర్లకు పెంచుకున్నామని, నాలుగులైన్ల జాతీయ రమదారులను 18,000 కిలోమీటర్లనుంచి 30,000 కిలోమీటర్లకు పెంచుకున్నామని తెలిపారు. మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణను 250 కిలోమీటర్లనుంచి 650 కిలోమీటర్లకు పైగా పెంచుకున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద 2019 నుంచి గడచిన 5 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలలోని 10 కోట్ల కుటుంబాలు కుళాయిల ద్వారా నీటిని అందుకుంటున్నాయని, 2014 వరకు ఏడు దశాబ్దాలలో కేవలం 3.5 కోట్ల కుళాయి కనెక్షన్లు మాత్రమే ఏర్పాటైనట్టు తెలిపారు.
2014 కుముందు పది సంవత్సరాలలో ప్రభుత్వం అనుసరించిన విధానాలు వాస్తానికి దేశాన్ని పేదరికంవైపు తీసుకువెళ్లాయని,ఇందుకు సంబంధించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో సభ ముందుంచిన శ్వేత పత్రం గురించి, ప్రస్తుత సెషన్ లో ప్రవేశపెట్టిన దాని గురించీ ప్రధానమంత్రి గుర్తుచేశారు. గతంలో కుంభకోణాలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్తబ్దత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో పెద్ద ఎత్తున నిరాశ వ్యక్తమవుతూ వచ్చిందని, ఫలితంగా ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కానీ ప్రస్తుతం అలాంటి వాటికి తావులేదని, ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉందని, ప్రభుత్వం మొత్తం వాసత్వాలను శ్వేత పత్రం రూపంలో ప్రజలముందు ఉంచిందని తెలిపారు. ‘‘ఇండియా ప్రస్తుతం అత్యున్నత పురోగతి స్థాయికి దూసుకువెళుతోంద’’ని తెలిపారు. ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా దేశం ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ‘‘ప్రస్తుతం ప్రభుత్వం మూడోవిడత పాలనలో కీలక నిర్ణయాలు ఉంటాయని,పేదరికాన్ని తొలగించేందుకు నూతన పథకాలు సిద్దంగా ఉన్నాయని,మరోవైపు దేశ ప్రగతికి కొత్త ఊతం ఇవ్వనున్నామని తెలిపారు.1.5 లక్షల మంది ప్రజలనుంచి వచ్చిన సలహాలు,సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని అంటూ ప్రధానమంత్రి, నవ భారత దేశం సూపర్ స్పీడ్ తో పనిచేస్తుందని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని ”ప్రధానమంత్రి తెలిపారు.
This is India’s Time. pic.twitter.com/m8ROtZf0q2
— PMO India (@PMOIndia) February 9, 2024
Today, every development expert group in the world is discussing how India has transformed in last 10 years. pic.twitter.com/K5qnfp3fRe
— PMO India (@PMOIndia) February 9, 2024
The world trusts India today. pic.twitter.com/IrvoJfP0v4
— PMO India (@PMOIndia) February 9, 2024
किसी भी देश की Development Journey में एक समय ऐसा आता है, जब सारी परिस्थितियां उसके favour में होती हैं।
— PMO India (@PMOIndia) February 9, 2024
ये वो समय होता है जब वो देश अपने आपको, आने वाली कई-कई सदियों के लिए मजबूत बना लेता है।
मैं भारत के लिए आज वही समय देख रहा हूं: PM @narendramodi pic.twitter.com/AK3UqxuMBk
Stability, consistency and continuity... pic.twitter.com/L1R0J4lCRA
— PMO India (@PMOIndia) February 9, 2024
We ensured that the government itself reaches every eligible beneficiary. pic.twitter.com/Uli9scOj5t
— PMO India (@PMOIndia) February 9, 2024
Four main factors in each of our budgets... pic.twitter.com/5lkV2x2XCS
— PMO India (@PMOIndia) February 9, 2024
Completing projects in a time-bound manner has become the identity of our government. pic.twitter.com/fM179inN9I
— PMO India (@PMOIndia) February 9, 2024
On one hand we are addressing the challenges of the 20th century and on the other hand, we are also fulfilling the aspirations of the 21st century. pic.twitter.com/8d22YiVHyr
— PMO India (@PMOIndia) February 9, 2024
2014 के पहले के 10 साल में देश जिन नीतियों पर चला, वो वाकई देश को कंगाली की राह पर ले जा रही थीं।
— PMO India (@PMOIndia) February 9, 2024
इस बारे में संसद के इसी सेशन में एक White Paper भी रखा गया है: PM pic.twitter.com/lFBSKhbmSk