తొలి ప్రొసీడిరగ్‌లోలే నారీశక్తి వందన్‌ అధినియమ్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి.
‘‘ అమృత్‌ కాల్‌ ఉషోదయ వేళ ఇండియా నూతన పార్లమెంటులోకి అడుగుపెడుతూ, ఉజ్వల భవిష్యత్‌కు సంకల్పంతో ముందుకు సాగుతోంది’’
‘‘ మనసంకల్పాలను నెరవేర్చి, కొత్త ఉత్సాహం, కొత్త శక్తితో నూతన ప్రయాణం ప్రారంభించడానికి ఇది తగిన సమయం’’
‘‘మన ఘనమైన గతంతో సెంగోల్‌ మనల్ని అనుసంధానం చేస్తోంది’’
‘‘ మహాద్భుత నూతన పార్లమెంటు భవనం ఆధునిక భారతావని గొప్పదనాన్ని చాటిచెబుతోంది.’’ ‘ మన ఇంజనీర్లు, శ్రామికలు శ్రమ ఇందులో దాగి ఉంది’’
‘‘నారీ శక్తి వందన్‌ అధియాన్‌ మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది’’
‘‘ భవన్‌ (బిల్డింగ్‌) మారింది. భవ్‌ (ఫీలింగ్స్‌) కూడా మారాలి’’
‘‘ మనమందరం పార్లమెంటరీ సంప్రదాయాల లక్ష్మణ రేఖను అనుసరించాలి’’
‘‘ పార్లమెంటులో మహిళలకురిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లును ముందుకుతీసుకువెళ్లేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023 సెప్టెంబర్‌ 19 భారతదేశ చరిత్రలో చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది’’
‘‘ మహిళలనాయకత్వంలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళుతూ, మన ప్రభుత్వం ఈరోజు ప్రధాన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నది. ఈ బిల్లు ఉద్దేశం, లోక్‌సభ, విధానసభలలో మహిళల పాత్రను మరింత పెంచడం.’’ ‘‘ ఈ బిల్లు చట్టం కావడానికి మేం కట్టుబడి ఉన్నామని, మాతృమూర్తులకు, సోదరీమణులకు, ఆడబిడ్డలకు తెలియజేస్తున్నాను’’

పధానమంత్రి శ్రీనరేంద్రమోదీ పార్లమెంటు నూతన భవనంలో ఈరోజు లోక్‌సభ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు.
సభనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, నూతన పార్లమెంటు భవనంలో ఈరోజు చరిత్రాత్మక తొలి సమాఏశాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.కొత్త పార్లమెంటు తొలి రోజు తొలి సమావేశంలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు , స్పీకర్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌ సభ సభ్యులకు ఆయన ఈ సందర్భంగా స్వాగతం పలికారు.
ఈ రోజుకు గల ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇది అమృత్‌ కాల్‌కు ఉషోదయమని అన్నారు. ఇండియా నూతన పార్లమెంటు మహాభవనంలోకి అడుగుపెడుతూ ఉజ్వల భవిష్యత్‌కు సంకల్పం చెప్పుకుంటున్నదని అన్నారు. ఇటీవల ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, శాస్త్ర విజ్ఞాన రంగంలో చంద్రయాన్‌ 3 విజయం గురించి ప్రస్తావించారు. జి 20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించడం గురించి, అంతర్జాతీయంగా దాని ప్రభావం గురించి తెలియజేశారు. ఈ నేపథ్యంలో దేశ నూతన పార్లమెంటు భవనం లో కార్యకలాపాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయన్నారు.  గణేశ్‌ చతుర్థి పర్వదినం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,  గణేశుడు జ్ఞానానికి,సహేతుకతకు, పవిత్రతకు, సుసంపన్నతకు అధిదేవత అని ఆయన అన్నారు.
‘‘ మరింతశక్తి, ఉత్సాహంతో మన సంకల్పాలను పూర్తిచేసుకుని, నూతన ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు ఇది తగిన సమయమని ఆయన అన్నారు.  గణేశ్‌ చతుర్థి సందర్భంగా, పార్లమెంటు నూతన భవనంలో కార్యకలాపాల ప్రారంభోత్సవం సందర్భంగా  లోకమాన్య తిలక్‌ను గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి, స్వాతంత్య్రోద్యమ కాలంలో లోకమాన్య తిలక్‌ , గణేశ్‌ ఉత్సవాలను దేశవ్యాప్తంగా స్వరాజ్య కాంక్షను రగిల్చేందుకు ఒక మాధ్యమంగా వాడారని అన్నారు. ఇవాళ మనం అదేస్ఫూర్తితో ముందుకు పోతున్నామని ప్రధానమంత్రి అన్నారు.

ఈ రోజు సంవత్సరి పర్వ కూడా అని ప్రధానమంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇది క్షమకు సంబంధించిన పండగ అన్నారు. ఉద్దేశ పూర్వకంగా కానీ లేదా తెలియక కానీ ఇతరులను బాధపెట్టిఉంటే  క్షమించమని వేడుకునే పండగఅని ప్రధానమంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరికీ ‘మిచ్చామి దుక్కదామ్‌ ’ అని ప్రధానమంత్రి ఈ పండుగ నేపథ్యంలో గతంలోని చేదు అనుభవాలను వదిలి ముందుకు సాగిపోవాలని అన్నారు. పవిత్ర సెంగోల్‌  గతానికి , భవిష్యత్తుకు ఒక గొప్ప అనుసంధానమని, ఇది స్వేచ్ఛా తొలికిరణాన్ని దర్శించినదని ఆయన అన్నారు. ఈ పవిత్ర సెంగోల్‌ను భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌ లాల్‌నెహ్రూ కరస్పర్శను పొందిందని,అందువల్ల సెంగోలÊ మనల్ని మన కీలక గతంతో మనల్ని అనుసందానం చేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు.
అద్భుత మహా నిర్మాణమైన పార్లమెంటు భవనం ఎంతో పవిత్రమైనదని, అమృత్‌ కాల్‌ను ఇది గుర్తుచేస్తుందని అంటూ, ఈ మహాద్భుత భవన నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రామికులు, ఇంజనీర్లను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలోనూ వారు ఎంతో శ్రమకోర్చిపనిచేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఈ మహాభవన నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రామికులు, ఇంజనీర్లకు ప్రధానమంత్రితో పాటు సభలోని వారందరూ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. ఈ భవన నిర్మాణంలో సుమారు 30 వేల మంది శ్రామికులు పాల్గొన్నట్టు తెలిపారు. ఇందులో పాల్గొన్న వారందరి పూర్తి వివరాలు డిజిటల్‌ బుక్‌లో ఉన్నాయన్నారు.

మన చర్యలలో భావాలు, భావోద్వేగాల ప్రభావం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి ఈరోజుమన భావాలు మన ప్రవర్తనకు మార్గనిర్దేశం వహిస్తాయని అన్నారు. ‘‘భవనం మారింది,భావ్‌ (ఫీలింగ్స్‌) కూడా మారాలి’’
అని ప్రధానమంత్రి అన్నారు.
‘‘దేశానికి సేవచేయడానికి అత్యున్నత స్థాయి వేదిక పార్లమెంటు ’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ సభ  ఏ రాజకీయపార్టీ ప్రయోజనాల కోసమో కాదని, దేశ అభివృద్ధికోసం మాత్రమేనని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులుగా మనం రాజ్యాంగ స్పూర్తిని మనసా వాచా కర్మణ కాపాడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. సభ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా  స్పీకర్‌ గారి మార్గనిర్దేశంలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటారని ప్రధానమంత్రి, స్పీకర్‌కు హామీఇచ్చారు. పార్లమెంటు కార్యకలాపాలన్నీ ప్రజల ఎదుట జరుగుతాయని , సభలో సభ్యుల ప్రవర్తన వారు అధికార పక్షంతో ఉన్నారా, ప్రతిపక్షంతో  ఉన్నారా అన్నది తెలియజేస్తుందన్నారు.
ప్రజల సమష్టి సంక్షేమం దృష్ట్యా ఉమ్మడి చర్చలు,కార్యాచరణ ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,  ఉమ్మడి లక్ష్యాల గురించి ప్రస్తావించారు. ‘‘మనమందరం పార్లమెంటరీ సంప్రదాయాలకు సంబంధించి లక్ష్మణ రేఖను పాటించాలి’’ అని ప్రధానమంత్రి అన్నారు.
సమాజపరివర్తనల రాజకీయాల క్రియాశీల పాత్రగురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, అంతరిక్షంనుంచి ఈకడల వరకు వివిధ రంగాలలో భారతీయ మహిళలపాత్ర గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.జి 20 సమావేశాల సందర్భంగా మహిళ లనేతృత్వంలోని అభివృద్ధి భావనను ప్రపంచదేశాలు ఎంతగా ఆదరించినదీ ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ దిశగా ప్రభుత్వం అర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. జన్‌ధన్‌ పథకం కింద 50 కోట్ల మంది లబ్ధిదారులు ఉంటే, ఇందులో ఎక్కువ శాతం మహిళలవేనని అన్నారు.

ముద్రయోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన,పథకాలలో మహిళలకు కలిగిన ప్రయోజనం గురించి ప్రస్తావించారు.
ఏ దేశ ప్రగతి ప్రస్థానంలో అయినా ఒక సమయం అంటూ ఉంటుందని, అది చరిత్ర సృష్టిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఇవాళ ఇండియా అభివృద్ధిపథంలో చరిత్ర ను తిరగరాస్తున్నదని ఆయన అన్నారు.  మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంటులో జరిగిన చర్చలు , సంప్రదింపుల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇందుకు సంబంధించిన బిల్లు తొలిసారిగా 1996లో ప్రవేశపెట్టారని చెప్పారు. శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి కాలంలో ఎన్నో సార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టారని, అయితే మహిళల కలలను సాకారం చేయడానికి అవసరమైన సంఖ్యాబలం పొందలేకపోయారన్నారు.  ‘‘ఈ పనిపూర్తి చేయడానికి భగవంతుడు నన్ను ఎంచుకున్నాడని నేను అనుకుంటున్నాను’’ అని ప్రధానమంత్రి అన్నారు. పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు కూడా ప్రధానమంత్రి తెలిపారు.  2023 సెప్టెంబర్‌ 19 ఒకచారిత్రాత్మక దినమని, ఇది భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రతి రంగంలో మహిళల పాత్ర పెరిగిపోతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, విధాన నిర్ణయాలలో మరింత మంది మహిళలను భాగస్వాములను చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దీనివల్ల దేశ ప్రగతిలో వారి పాత్ర మరింత పెరుగుతుందని అన్నారు. ఈ చారిత్రాత్మక దినాన మహిళలకు మరిన్ని అవకాశాలకు ద్వారాలు తెరవాల్సిందిగా పిలుపునిచ్చారు.

‘‘ మహిళల నేతృత్వంలో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళుతూ, మా ప్రభుత్వం కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఈరోజు ప్రవేశపెడుతున్నది. ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం లోక్‌సభ, విధానసభలలో మహిళల పాత్రను మరింత విస్తృతం చేయడం. నారీశక్తి వందన్‌ అధినియం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈనారీశక్తీ వందన్‌ అధినియం  ప్రవేశపెడుతున్న సందర్భంగా నేను తల్లులకు, ఆడబిడ్డలకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఈ బిల్లు  చట్ట  రూపం దాల్చేందుకు మేం కట్టుబడి ఉన్నామని తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలందరికీ హామీఇస్తున్నాను. ఈదిశగా ఒక గొప్ప పవిత్రమైన ప్రారంభం జరగాలని నేను సభలోని సహచరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బిల్లు ఏకాభిప్రాయం ద్వారా చట్టరూపం దాలిస్తేదీని శక్తి మరెన్నోరెట్లు అధికంగా ఉంటుంది.అందువల్ల పూర్తి ఏకాభిప్రాయంతో ఈ బిల్లును ఆమోదించాల్సిందిగా నేను ఉభయ సభలను కోరుకుంటున్నాను’’ అని ప్రధానమంత్రి అన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."