‘‘మనమే రూపొందించుకొన్న 5జి టెస్ట్-బెడ్ అనేది టెలికమ్ రంగం లో కీలకమైన మరియుఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం లో ఆత్మనిర్భరత దిశ లో వేసినటువంటి ఒక ముఖ్యమైనఅడుగు గా ఉంది’’
‘‘21వ శతాబ్ది తాలూకు భారతదేశం లో ప్రగతి యొక్క గతి ని నిర్ధారించేది కనెక్టివిటీనే’’
‘‘దేశ పరిపాలన లో, జీవన సౌలభ్యం లో మరియు వ్యాపారం చేయడం లో సౌలభ్యం లో 5జి సాంకేతిక విజ్ఞ‌ానం సకారాత్మకమైన మార్పుల ను తీసుకు రానుంది’’
‘‘2జి యుగం తాలూకు నిరాశ నిస్పృహలు, నిరుత్సాహం, అవినీతి మరియు విధాన రూపకల్పన పరమైననిష్క్రియ ల నుంచి బయటపడి దేశం 3జి నుంచి 4జి కి, మరి ప్రస్తుతం 5జి, ఇంకా 6జి ల వైపునకు వేగం గా అడుగులు వేస్తున్నది’’
‘‘గడచిన 8 సంవత్సరాల లో రీచ్, రిఫార్మ్, రెగ్యులేట్, రెస్పాండ్ ఎండ్ రివల్యూశనజ్.. ఈ ‘పంచామృతం’ తో టెలికమ్ రంగం లో కొత్త శక్తి ని పుట్టించడంజరిగింది’’
‘‘మొబైల్ తయారీ యూనిట్ లు 2 నుంచి 200కు పైగా వృద్ధి చెంది, మొబైల్ ఫోను నునిరుపేద కుటుంబాల కు అందుబాటులోకి తీసుకుపోయాయి’’
‘‘ప్రస్తుతం ప్రతి ఒక్కరు సహకార భరితనియంత్రణ తాలూకు అవసరాన్ని గ్రహిస్తున్నారు. దీని కోసం నియంత్రణదారు సంస్థలుఅన్నీ ఏకమై, ఉమ్మడి వే

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలికం రెగ్యులేటరి ఆథారిటి ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ.. ‘ట్రాయ్’) యొక్క రజతోత్సవాల కు సూచకం గా ఈ రోజు న ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భాని కి గుర్తు గా ఒక తపాలా బిళ్ళ ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భం లో హాజరైన వారి లో కేంద్ర మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ దేవు సింహ్ చౌహాన్ మరియు శ్రీ ఎల్. మురుగన్ లతో పాటు టెలికమ్, ఇంకా బ్రాడ్ కాస్టింగ్ రంగాల కు చెందిన నేత లు ఉన్నారు.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేశ ప్రజల కు ఈ రోజు న తాను అంకితం చేసినటువంటి దేశవాళీ తయారీ 5జి టెస్ట్ బెడ్ తో టెలికమ్ రంగం లో కీలకమైనటువంటి మరియు ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడం తో ఆత్మనిర్భరత దిశ లో ఒక ముఖ్యమైన అడుగు పడింది అన్నారు. ఈ ప్రాజెక్టు తో జతపడ్డ వారందరినీ- ఐఐటి లతో సహా- ఆయన అభినందించారు. ‘‘దేశం యొక్క సొంత 5జి ప్రమాణాన్ని 5జిఐ ( 5Gi ) రూపం లో ఆవిష్కరించడమైంది; ఇది దేశాని కి గొప్ప గర్వకారణమైనటువంటి అంశం. ఇది 5జి సాంకేతిక విజ్ఞానాన్ని దేశం లోని పల్లెల కు చేర్చడం లో ఒక పెద్ద పాత్ర ను పోషించ గలుగుతుంది’’ అని ఆయన అన్నారు.

కనెక్టివిటీ అనేది 21వ శాతాబ్ధి యొక్క భారతదేశం లో ప్రగతి తాలూకు గతి ని నిర్ధారిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గా కనెక్టివిటీ ని ప్రతి ఒక్క స్థాయి లో ఆధునికీకరించవలసి ఉంది అని ఆయన అన్నారు. 5జి సాంకేతిక పరిజ్ఞానం దేశం యొక్క పరిపాలన లో, జీవన సౌలభ్యం లో మరియు వ్యాపార పరమైన సౌలభ్యం లో కూడా సకారాత్మక మార్పుల ను తీసుకు రానుంది. ఇది వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ ల వంటి ప్రతి ఒక్క రంగం లో వృద్ధి కి దన్నుగా నిలుస్తుంది. ఇది సదుపాయాల ను పెంచివేసి, అనేక ఉపాధి అవకాశాల ను కూడా కల్పిస్తుంది. 5జి ని అమిత వేగం తో అందించాలి అంటే అందుకు ప్రభుత్వం మరియు పరిశ్రమ.. ఈ రెండు వర్గాల ప్రయాస లు అవసరపడుతాయి అని కూడా ఆయన అన్నారు.

ఆత్మనిర్భరత మరియు ఆరోగ్యకరమైనటువంటి స్పర్థ అనేవి సమాజం లో, ఆర్థిక వ్యవస్థ లో ఏ విధం గా అనేక రెట్ల ప్రభావాన్ని ప్రసరించగలుగుతాయనే దానికి ఒక గొప్ప ఉదాహరణ టెలికమ్ రంగం అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. నిరాశ నిస్పృహ లు, నిరుత్సాహం, అవినీతి మరియు విధానపరమైన నిష్క్రియ అనేవి 2జి కాలం లో తలెత్తాయి. వాటి బారి నుంచి దేశం బయట పడి 3జి నుంచి 4జి కి, మరి అదే విధం గా ఇప్పుడు 5జి కి, 6జి కి శరవేగం గా దూసుకుపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు.

గత 8 సంవత్సరాల లో రీచ్, రిఫార్మ్, రెగ్యులేట్, రెస్పాండ్ ఎండ్ రివల్యూశనైజ్.. ఈ ‘పంచామృతం’ తో టెలికం రంగం లో కొత్త శక్తి ని సృష్టించడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. దీనిలో ఒక చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ను పోషించిన ఖ్యాతి టిఆర్ఎఐ (‘ట్రాయ్’) దే అని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశం గిరి గీసుకొని ఆలోచనలు చేసే ధోరణి కి మించి సాగిపోతోంది. మరి ‘యావత్తు ప్రభుత్వ వైఖరి’ తో ముందుకు పోతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. టెలిడెన్సిటీ మరియు ఇంటర్ నెట్ వినియోగదారుల పరం గా చూసినట్లయితే ప్రపంచం లో అత్యంత వేగవంతం గా విస్తరిస్తోంది దేశం. టెలికమ్ సహా అనేక రంగాలు దీనిలో పాత్ర ను పోషించాయి అని ఆయన అన్నారు.

పేదల లో కెల్లా అత్యంత పేద కుటుంబాల కు మొబైల్ ను అందుబాటు లోకి తీసుకు పోవడం కోసం దేశం లోనే మొబైల్ ఫోన్ లను తయారు చేయడాని కి పెద్దపీట ను వేయడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. తత్ఫలితం గా మొబైల్ తయారీ యూనిట్ లు 2 నుంచి 200 కి పైగా యూనిట్ లకు వృద్ధి చెందాయి అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ప్రతి ఒక్క పల్లె ను ఆప్టికల్ ఫైబర్ తో భారతదేశం కలుపుతోంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. 2014వ సంవత్సరానికి మునుపు భారతదేశం లో 100 గ్రామ పంచాయతీ లు అయినా ఆప్టికల్ ఫైబర్ సదుపాయాని కి నోచుకోలేదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం మేం బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ దాదాపుగా 1.75 లక్షల గ్రామ పంచాయతీల కు సమీపించేటట్లు చేశాం. వందల కొద్దీ ప్రభుత్వ సేవ లు పల్లెల కు చేరుకొంటున్నాయి అంటే దానికి కారణం ఇదే అని ఆయన అన్నారు.

టిఆర్ఎఐ (‘ట్రాయ్’) వంటి నియంత్రణదారు సంస్థల కు, అలాగే వర్తమాన సవాళ్ల ను మరియు భవిష్యత్తు కాలపు సవాళ్ళ ను ఎదురొడ్డి నిలవడానికి ‘యావత్తు ప్రభుత్వ వైఖరి’ అనేది ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇవాళ నియంత్రణ అనేది ఏ ఒక్క రంగాని కో పరిమితం కాలేదు. సాంకేతిక విజ్ఞ‌ానం వేరు వేరు రంగాల ను ఒకదాని తో మరొక దానిని జోడిస్తున్నది. అందువల్లే ప్రస్తుతం ప్రతి ఒక్కరు సహకారం ఆధారితమైనటువంటి నియంత్రణ యొక్క అవసరాన్ని గమనిస్తున్నారు. దీని కోసం అన్ని నియంత్రణదారు సంస్థ లు ఒకే తాటి మీదకు వచ్చి ఉమ్మడి ప్లాట్ ఫార్మ్ లను అభివృద్ధి పరచి, మరి మెరుగైన సమన్వయం కోసం పరిష్కార మార్గాల ను వెదకాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi