ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాంగ్ వ్యాలీలో జరిగిన అభినందన్ కార్యక్రమంలొ పాల్గొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్‌ను రోహతాంగ్ వద్ద ప్రారంభించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని శిస్సు వద్ద అభర్ సమారోహ్‌లో ప్రధానమంత్రి పాల్గొన్నారు.
టనెల్ వల్ల పరివర్తనాత్మక ప్రభావం:
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, అటల్‌జీ మనాలీని ఎంతో ప్రేమించేవారని,ఈ ప్రాంతం అనుసంధానత, మౌలికసదుపాయాలు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ టన్నెల్ నిర్మాణాన్ని సంకల్పించారన్నారు.
అటల్ టన్నెల్ హిమాచల్, లెహ్, లద్దాక్, జమ్ము కాశ్మీర్ ప్రజల జీవితాలలో మార్పు తీసుకవస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సొరంగ మార్గం సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గిస్తుందని, లహౌల్, స్పితిలను ఏడాదిపొడవునా చేరుకోవడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. ఈ టన్నెల్ ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను, పర్యాటకాన్ని వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు.
పర్యాటకుల కులు మనాలిలో సిద్దు ఘీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుని, లాహౌల్‌లో దోమార్, చిలాదేల మధ్యాహ్నభోజనాన్ని ఆరగించే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.
హమీర్‌పూర్‌లో దౌలాసిధ్‌హైడ్రో ప్రాజెక్టు :
హమీర్‌పూర్‌లోని దౌలాసిధ్‌లో 66 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టు నిర్మాణించనున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.ఇదివిద్యుత్‌ను అందించడమే కాకుండా ఈ ప్రాంత యువతకు పలు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
దేశవ్యాప్తంగా ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు , ప్రత్యేకించి గ్రామీణ రోడ్ల నిర్మాణం, జాతీయరహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు, రైలు మార్గాల అనుసంధానత, విమానయాన అనుసంధానత వంటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో హిమాచల్ ప్రదేశ్ కూడా ఒక కీలక స్టేక్ హోల్డర్ అని ప్రధానమంత్రి అన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి:
కిరాత్‌పూర్-కులు – మనాలి రోడ్‌కారిడార్, జిరాక్‌పూర్-పర్వానూ-సోలన్-కైతలీఘాట్ రోడ్ కారిడార్, నంగల్‌డ్యామ్, తల్వారా రైలు మార్గం, భానుపాలి-బిలాస్‌పూర్ రైలు మార్గం పనులు శరవేగంతో సాగుతున్నాయని ప్రధాని చెప్పారు. ఇవి వీలైనంత త్వరలో పూర్తిచేసుకుని హిమాచల్ ప్రజలకు సేవలందించనున్నాయని ఆయన చెప్పారు.
రోడ్డు,రైలు, ఎలక్ట్రిసిటి,, వంటి మౌలిక సదుపాయాలతోపాటు మోబైల్, ఇంటర్నెసేవల వంటివి ప్రజల జీవితాన్ని సులభతరం చేయడానికి ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు.
దేశంలోని 6 లక్షల గ్రామాలలో ఆప్టికల్ ఫైబర్‌నే వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇది ఈ ఏడాది ఆగస్టు నుంచి వెయ్యిరోజులలో పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.
ఈ ప్రాజెక్టు కింద వైఫై హాట్‌స్పాట్‌లను గ్రామాలలో ఏర్పాటు చేస్తారని, ఇళ్లకు ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుందని అన్నారు. దీనితో హిమాచల్ ప్రదేశ్‌పిల్లలు విద్య ,వైద్యం, వైద్య పర్యాటకం వంటి వాటివల్ల ప్రయోజనం పొందగలుగుతారు.
ప్రజల సులభతర జీవనానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని, వారు వారి హక్కుల ప్రకారం పూర్తి ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నదని ప్రధాని చెప్పారు. దాదాపు అన్ని ప్రభుత్వ సేవలు, వేతనాలు, పెన్షన్లు, బ్యాంకింగ్ సేవలు, విద్యుత్ , టెలిఫోన్ బిల్లులు ఇలా అన్నీ డిజిటలైజ్ అయ్యాయనిచెప్పారు. ఇలాంటివే ఎన్నో సంస్కరణలు సమయాన్ని , కాలాన్ని ఆదా చేయడంతోపాటు అవినీతిని అంతం చేస్తాయని చెప్పారు.
కరోనా సమయలో కూడా జన్‌ధన్‌ఖాతాలలో వందల కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయని, హిమాచల్ ప్రదేశ్‌లో 5 లక్షల మంది పెన్షనర్లు, 6 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారు.
వ్యవసాయ సంస్కరణలు:
వ్యవసాయ రంగంలో ఇటీవల తీసుకువచ్చిన సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారని విమర్శిస్తూ ప్రధానమంత్రి, తమ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసంపనిచేసుకున్నవారుఈ సంస్కరణలతో నిరాశకు గురయ్యారని అన్నారు. ఇలాంటి వారే నిస్పృహకు లోనౌతారని, ఇదివారు రూపొందించిన మధ్యదళారీలు, బ్రోకర్ల వ్యవస్థను తొలగిస్తుందని ఆయన అన్నారు.
కులు, షిమ్లా, కిన్నౌర్‌లనుంచి ఆపిల్ పండ్లు కేజీ 40-50 రూపాయలకు తీసుకువచ్చి చివరికి వినియోగదారుకు కేజీ 100 నుంచి 150 రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. దీనివల్ల రైతు కానీ , కొనుగోలుదారుకు కానీ ప్రయోజనం లేదన్నారు. ఇదే కాదు, ఆపిల్ సీజన్ సమీపించే కొద్దీ ధరలు దారుణంగా పడిపోతాయి. దీనివల్ల చిన్న చిన్న తోటలు కల రైతులు బాగా నష్టపోతారు. వ్యవసాయరంగం అభివృద్ధి కోసం చరిత్రాత్మక సంస్కరణలు తీసుకువచ్చినట్టు ఆయన చెప్పారు.ఇప్పుడు చిన్న రైతులు తమకు తోచినట్టు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని ఆపిల్స్‌ను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆయన అన్నారు.
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి:
ప్రభుత్వం రైతుల ఆదాయాన్నిరెట్టింపు చేసేందుకు కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రదానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి కింద 10.25 కోట్ల మంది రైతు కుటుంబాల ఖాతాలలో ఇప్పటివరకూ 1 లక్ష కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఇందులో హిమాచల్ ప్రదేశ్ నుంచి 9 లక్షల మంది రైతు కుటుంబాల వార ఉన్నారు. వారు 1000 కోట్ల రూపాయలు అందుకున్నారని తెలిపారు.
ఇటీవలి కాలం వరకు దేశంలోని చాలా రంగాలలో మహిళలను పనిచేయడానకి అనుమతించలేదని,ఇటీవల తీసుకువచ్చిన కార్మిక సంస్కరణలతో ఇలాంటి పరిస్థితి తొలగిపోయిందని ప్రధానమంత్రి చెప్పారు. ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా పని హక్కును పొందుతున్నారని ,వారితో సమానంగా వేతనాలు పొందగలుగుతున్నారన్నారు.
దేశంలోని ప్రతి పౌరుడిలో విశ్వాసాన్ని పాదుకొల్పడానికి ,స్వావలంబిత భారతదేశాన్నినిర్మించడానికి సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని, దేశంలోని ప్రతి యువకుడి కలల, ఆకాంక్షలు తమకు ఎంతో ముఖ్యమైనవని ఆయన అన్నారు.
अटल टनल के साथ-साथ हिमाचल के लोगों के लिए एक और बड़ा फैसला लिया गया है।
— PMO India (@PMOIndia) October 3, 2020
हमीरपुर में 66 मेगावॉट के धौलासिद्ध हाइड्रो प्रोजेक्ट को स्वीकृति दे दी गई है।
इस प्रोजेक्ट से देश को बिजली तो मिलेगी ही, हिमाचल के अनेकों युवाओं को रोज़गार भी मिलेगा: PM
पीएम किसान सम्मान निधि के तहत देश के लगभग सवा 10 करोड़ किसान परिवारों के खाते में अब तक करीब 1 लाख करोड़ रुपए जमा किया जा चुका है।
— PMO India (@PMOIndia) October 3, 2020
इसमें हिमाचल के सवा 9 लाख किसान परिवारों के बैंक खाते में भी लगभग 1000 करोड़ रुपए जमा किए गए हैं: PM
अभी तक स्थिति ये थी कि देश में अनेक सेक्टर ऐसे थे, जिनमें बहनों को काम करने की मनाही थी।
— PMO India (@PMOIndia) October 3, 2020
हाल में जो श्रम कानूनों में सुधार किया गया है, उनसे अब महिलाओं को भी वेतन से लेकर काम तक के वो सभी अधिकार दे दिए गए हैं, जो पुरुषों के पास पहले से हैं: PM
समाज और व्यवस्थाओं में सार्थक बदलाव के विरोधी जितनी भी अपने स्वार्थ की राजनीति कर लें,
— PMO India (@PMOIndia) October 3, 2020
ये देश रुकने वाला नहीं है: PM