గిరిజ‌న క‌మ్యూనిటీకి చెందిన ఒక‌మ‌హిళ దేశ అత్యున్న‌త ప‌ద‌విని అలంక‌రించ‌డం భార‌త ప్ర‌జాస్వామ్యానికి గొప్ప‌దినం
శ్రీ హ‌ర్ మోహ‌న్ సింగ్‌యాద‌వ్ త‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో డాక్ట‌ర్ రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆలోచ‌న‌ల‌ను ముందుకు తీసుకువెళ్ళారు.
హ‌ర్ మోహ‌న్ సింగ్ యాద‌వ్ జి సిక్కుల ఊచ‌కోతకు వ్య‌తిరేకంగా రాజ‌కీయ వైఖ‌రి తీసుకున్నారు. అలాగే సిక్కు సోద‌ర సోద‌రీమ‌ణుల‌ను ర‌క్షించేందుకు ఆయ‌న ముందుకు వ‌చ్చారు.
ఇటీవ‌లి కాలంలో, సైద్ధాంతిక‌, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను స‌మాజం, దేశ ప్ర‌యోజ‌నాల‌కు మించి చూసే
"ఇటీవలి కాలంలో, సమాజం, దేశ ప్రయోజనాల కంటే సైద్ధాంతిక లేదా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే ధోరణి క‌నిపిస్తోంది"
“వ్య‌క్తిని వ్య‌తిరేకించ‌డం లేదా పార్టీని వ్య‌తిరేకించ‌డం అనేది దేశానికి వ్య‌తిరేకం కారాదని అది ప్ర‌తి రాజ‌కీయ‌పార్టీ బాధ్య‌త కావాలి.”
“ డాక్ట‌ర్ లోహియా రామాయ‌ణ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌, గంగా ప‌రిర‌క్ష‌ణ వంటి వాటితో దేశ సాంస్కృతిక శ‌క్తిని బ‌లోపేతం చేసేందుకు కృషిచేశారు”

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ దివంగ‌త శ్రీ హ‌ర్ మోహ‌న్ సింగ్ యాద‌వ్ 10 వ పుణ్య‌తిథి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. హ‌ర్ మోహ‌న్ సింగ్ పార్ల‌మెంటు మాజీ స‌భ్యుడు, ఎం.ఎల్‌.సి, ఎం.ఎల్‌.ఎ, శౌర్య‌చ‌క్ర అవార్డు గ్ర‌హీత‌, యాద‌వ క‌మ్యూనిటీ నాయ‌కులు కూడా.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ, శ్రీ హ‌ర్ మోహ‌న్‌సింగ్‌యాద‌వ్ 10 వ పుణ్య‌తిథి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. ఇవాళ స్వాతంత్ర్యానంత‌రం తొలిసారిగా ఒక గిరిజ‌న మ‌హిళ దేశ అత్యున్న‌త పీఠాన్ని అధిష్ఠించిన విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్బంగా గుర్తుచేశారు. భార‌త ప్ర‌జాస్వామ్యానికి ఇది అత్యంత గొప్ప రోజు అని ఆయ‌న అన్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన గొప్ప వార‌స‌త్వం, ఆ రాష్ట్ర గొప్ప‌నాయ‌కుల గురించి ప్ర‌ధాన‌మంత్రి గుర్తుచేసుకున్నారు. హ‌ర్ మోహ‌న్ సింగ్ యాద‌వ్‌జి డాక్ట‌ర్ రామ్ మ‌నోహ‌ర్ లోహియా జి ఆలోచ‌న‌ల‌ను త‌న సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, కాన్పూర్ ల‌నుంచి  ముందుకు తీసుకువెళ్లార‌ని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న అందించిన సేవ‌లు, స‌మాజానికి ఆయ‌న చేసిన సేవ‌లు, ఇప్ప‌టికీ త‌ర‌త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కం గా నిలుస్తున్నాయ‌న్నారు.ఆయ‌న త‌న సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో గ్రామ‌స‌భ‌నుంచి రాజ్య‌స‌భ‌వ‌ర‌కు ఎదిగార‌ని, స‌మాజానికి, క‌మ్యూనిటీకి అంకిత‌భావంతోకృషి చేశార‌ని అన్నారు.

శ్రీ హ‌ర్‌మోహ‌న్ సింగ్‌యాద‌వ్ అత్య‌ద్భుత ధైర్య‌సాహ‌సాలను ప్ర‌ధాన‌మంత్రి కొనియాడారు. సిక్కుల ఊచ‌కోత‌కు వ్య‌తిరేకంగా హ‌ర్ మోహ‌న్ సింగ్ యాద‌వ్ జి రాజ‌కీయ వైఖ‌రి అనుస‌రించ‌డ‌మే  కాకుండా సిక్కు సోద‌ర సోద‌రీమ‌ణుల‌ను ర‌క్షించేందుకు ముందుకువ‌చ్చార‌ని అన్నారు.  ఆయ‌న త‌న ప్రాణాల‌ను  సైతం లెక్క చేయ‌కుండా ఎంతో మంది అమాయ‌క సిక్కు కుటుంబాల‌ను ర‌క్షించార‌ని  అన్నారు. దేశం ఆయ‌న నాయ‌క‌త్వాన్ని గుర్తించి ఆయ‌న‌కు శౌర్య‌చ‌క్ర‌ను ప్ర‌దానం చేసింద‌న్నారు.

దివంగ‌త మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బిహారి వాజ్‌పేయి మాట‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌, పార్టీ రాజ‌కీయాల‌క‌న్న దేశం స‌మున్న‌త‌మైన‌ద‌ని చెప్పిన మాట‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ప్ర‌జాస్వామ్యం వ‌ల్ల పార్టీలు మ‌నుగ‌డ సాగిస్తున్నాయ‌ని, దేశం వ‌ల్ల ప్ర‌జాస్వామ్యం మ‌న‌గ‌లుగుతున్న‌ద‌ని అన్నారు. మ‌న దేశంలో చాలా రాజ‌కీయ పార్టీలు ప్ర‌త్యేకించి కాంగ్రెసేత‌ర పార్టీలు దేశం కోసం స‌హ‌కారం, స‌మ‌న్వ‌యం అనే  ఆలోచ‌న‌ను అనుస‌రించాయ‌ని అన్నారు.


ఆయ‌న ఈ సంద‌ర్భంగా 1971 యుద్ధం, అణుప‌రీక్ష‌లు, ఎమ‌ర్జెన్సీపై పోరాటానికి సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌ల‌ను ప్ర‌స్తావించారు.  ఆ స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు దేశం కోసం ఐక్య సంఘ‌ట‌న‌గా వ్య‌వ‌హ‌రించాయ‌న్నారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో  దేశ ప్ర‌జాస్వామ్యాన్ని చిదిమేసిన‌పుడు, అన్ని ప్ర‌ధాన రాజ‌కీయ‌పార్టీలు, ఒక్క‌తాటిపైకి వ‌చ్చి రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడాయ‌ని తెలిపారు. చౌద‌రి హ‌ర్‌మోహ‌న్ సింగ్‌యాద‌వ్‌జి ఆ పోరాటయోధుడ‌ని అన్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ‌పార్టీల సిద్ధాంతాలు, ప్ర‌యోజ‌నాలు, దేశ ప్ర‌యోజనాలు, స‌మాజ‌ప్ర‌యోజ‌నాల‌ కంటే ప్రాధాన్య‌త‌నిచ్చే ధోర‌ణి క‌న‌ప‌డుతోంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. చాలా సంద‌ర్భాల‌లో  కొన్ని ప్ర‌తిప‌క్ష‌పార్టీలు ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కు అడ్డంకులు క‌లిపిస్తున్నాయ‌ని అన్నారు. వారు అధికారంలో ఉన్న‌ప్పుడు ఇలాంటి నిర్ణ‌యాల‌ను అమ‌లుచేయ‌లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌న్నారు. దేశ ప్ర‌జ‌లు ఇలాంటి ధోర‌ణిని మెచ్చుకోవ‌డం లేద‌ని చెప్పారు. దేశంలోని ప్ర‌తి రాజ‌కీయ‌పార్టీ, అది ప్ర‌తిప‌క్ష‌పార్టీ అయినా, వ్య‌క్తి అయినా దేశానికి వ్య‌తిరేకంగా మార‌కూడ‌దు . సిద్ధాంతాలు, రాజ‌కీయ ఆకాంక్ష‌లు వాటి స్థానంలో వాటిని ఉంచాలి. అయితే దేశం, స‌మాజం అనేవి అన్నింటికంటే ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త క‌లిగిన‌వ‌ని గుర్తించాలి అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

డాక్ట‌ర్ రామ్ మ‌నోహ‌ర్ లోహియా సిద్ధాంత‌మైన సాంస్కృతిక బ‌లం గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. వాస్త‌విక భార‌తీయ ఆలోచ‌న‌లో, స‌మాజం అనేది వివాదాలు, చ‌ర్చ‌ల‌కు సంబంధించిన అంశం కాద‌ని, సంఘ‌టిత‌త్వం, సామూహిక‌త ల ఫ్రేమ్ వ‌ర్క్ గా దీనిని చూస్తార‌ని అన్నారు. డాక్ట‌ర్ రామ్ మ‌నోహ‌ర్ లోహియా దేశ సాంస్కృతిక  శ‌క్తిని బ‌లోపేతం చేసేందుకు కృషి చేశార‌ని, రామాయ‌ణ ఉత్స‌వాలు, గంగా ప‌రిర‌క్ష‌ణ వంటి వాటిని నిర్వ‌హించార‌ని అన్నారు. భార‌త దేశం ఈ ల‌క్ష్యాల‌ను న‌మామి గంగే వంటి చ‌ర్య ల ద్వారా, అలాగే స‌మాజంలోని సాంస్కృతిక చిహ్నాలను పునరుద్ధ‌రించ‌డం ద్వారా , బాధ్య‌త‌ల‌ను గుర్తుచేయ‌డం ద్వారా, హ‌క్కులు కల్పించ‌డం ద్వారా సాకారం చేస్తున్న‌ద‌ని ప్రధాన‌మంత్రి అన్నారు.

స‌మాజానికి సేవ‌చేయాలంటే, సామాజిక న్యాయ‌స్ఫూర్తిని మ‌నం ఆమోదించ‌డం అవ‌స‌ర‌మని , దీనిని చేప‌ట్టాల‌ని అన్నారు. ఇవాళ దేశం 75 సంవ‌త్స‌రాల భార‌త స్వాతంత్ర్య అమృత్ మ‌హోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న‌ద‌ని, ఈ సంద‌ర్భంగా దీని ప్రాధాన్య‌త‌ను అర్థంచేసుకుని ఈ దిశ‌గా ముందుకు సాగిపోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అంటే స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గం స‌మాన అవ‌కాశాలు పొందేలా ఉండాల‌ని, మౌలిక‌జీవ‌న అవ‌స‌రాలు వారికి అంద‌కుండా ఉండ‌రాద‌ని అన్నారు. ద‌ళితులు, వెనుక‌బ‌డిన వారు, ఆదివాసీలు, మ‌హిళ‌లు,దివ్యాంగులు అభ్యున్న‌తిలోకి వ‌చ్చిన‌పుడే దేశం ముందుకు పోతుంద‌ని అన్నారు.

ఈ మార్పున‌కు విద్య అత్యంత ఆవ‌శ్య‌క‌మైన‌ద‌ని హ‌ర్ మోహ‌న్ జి గుర్తించార‌ని ఆయ‌న అన్నారు. విద్యారంగంలో వారు చేసిన కృషి ప్రేర‌ణాత్మ‌క‌మైన‌ద‌న్నారు. దేశం ఈ దిశ‌గా బేటి బ‌చావో, బేటీ ప‌ఢావో, గిరిజ‌నుల కోసం ఏక‌ల‌వ్య‌పాఠ‌శాల‌లు, మాతృభాష‌లో విద్య‌కు ప్రోత్సాహం వంటివి ఈ కోవ‌లోనివే అని ఆయ‌న అన్నారు. విద్య ద్వారా సాధికార‌త అనే మంత్రంతో దేశం ముందుకుపోతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. విద్యయే సాధికార‌త అని ఆయ‌న అన్నారు.

శ్రీ హ‌ర్ మోహ‌న్ సింగ్ యాద‌వ్ (18 అక్టోబ‌ర్ 1921- 25 జులై 2012)

శ్రీ హ‌ర్ మోహ‌న్ సింగ్ యాద‌వ్ (18 అక్టోబ‌ర్ 1921-25 జులై 2012) యాద‌వ క‌మ్యూనిటీలో గొప్ప నాయ‌కుడు.ప్ర‌ధాన‌మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం , దివంగ‌త నాయ‌కుడు రైతులు, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు స‌మాజంలోని ఇత‌ర వ‌ర్గాల అభ్యున్న‌తికి  ఆయ‌న చేసిన కృషికి గుర్తింపు. శ్రీ హ‌ర్ మోహ‌న్‌సింగ్ యాద‌వ్ సుదీర్ఘ‌కాలం క్రియాశీల రాజ‌కీయాల‌లోఉన్నారు. ఆయ‌న వివిధ హోదాల‌లో ప‌నిచేశారు. ఎం.ఎల్‌.సిగా, ఎం.ఎల్.ఎగా, రాజ్య‌స‌భ స‌భు్య‌డిగా, అఖిల‌భార‌తీయ యాద‌వ మ‌హాస‌భ ఛైర్మ‌న్‌గా ఆయ‌న వివిధ ప‌ద‌వులు అలంక‌రించారు. త‌న కుమారుడు శ్రీ సుఖ‌రామ్‌సింగ్ తో క‌లిసి, కాన్పూరు చుట్టుప‌క్క‌ల ఎన్నో విద్యాసంస్థ‌ల ఏర్పాటులో ఆయ‌న కీల‌క పాత్ర వ‌హించారు.

శ్రీ హ‌ర్ మోహ‌న్ సింగ్ కు 1991లో శౌర్య చ‌క్ర పుర‌స్కారం ల‌భించింది. 1984లో సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల స‌మ‌యంలో ఆయ‌న ఎంతోమంది సిక్కుల ప్రాణాల‌ను కాపాడడంలో  అస‌మాన ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.