మధ్య ప్రదేశ్ లో కొత్త గా ఉద్యోగాల లో నియామకం జరిగిన గురువుల కు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా పాలుపంచుకొని ప్రసంగించారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మధ్య ప్రదేశ్ లో యువతీ యువకుల కు ప్రభుత్వ ఉద్యోగాల ను అందించడం కోసం తలపెట్టిన ఉద్యమం త్వరితగతిన సాగిపోతోందని, ఈ ఉద్యమం లో భాగం గా వేరు వేరు జిల్లాల లో రోజ్ గార్ మేళా లను నిర్వహించడం ద్వారా వివిధ ఉద్యోగాల లోకి వేల కొద్దీ యువతీ యువకుల ను నియమించడమైందన్నారు. 22,400 మంది కి పైగా యువతీ యువకులు టీచర్ పోస్టు లో నియమితులు అయ్యారు అని ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, చదువు చెప్పడం వంటి ఒక ముఖ్యమైన పని లో కుదురుకొని నియామక పత్రాల ను అందుకొన్న యువతీ యువకుల ను అభినందనల ను వ్యక్తం చేశారు.
ఆధునికమైనటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క అవసరాల ను దృష్టి లో పెట్టుకొని నూతన జాతీయ విద్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు పరచింది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ విధానం బాలల సంపూర్ణ అభివృద్ధి కి, జ్ఞానాని కి, నైపుణ్యాల కు, సంస్కృతి కి మరియు భారతదేశ విలువల ను ప్రోత్సహించడాని కి పెద్ద పీట ను వేస్తోంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ విధానాన్ని ప్రభావవంతమైన రీతి లో అమలు పరచడం లో గురువుల కు ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది అని ఆయన అన్నారు. గురువుల భర్తీ కోసం మధ్య ప్రదేశ్ లో పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి ఉద్యమం ఈ దిశ లో ఒక పెద్ద అడుగు అని చెప్పాలి అని ఆయన అన్నారు. ఈ రోజు న నియామకం జరిగిన గురువుల లో దాదాపు గా సగం మంది ని ఆదివాసి ప్రాంతాల కు పంపించడం జరుగుతుంది. ఫలితం గా అక్కడి బాలలు ప్రయోజనాన్ని అందుకొంటారు అని ప్రధాన మంత్రి వివరించారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం లో అరవై వేల మంది గురువు లు సహా ఒక లక్ష కు పైచిలుకు ప్రభుత్వ కొలువుల ను భర్తీ చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం పట్ల ప్రధాన మంత్రి ప్రసన్నత ను వ్యక్తం చేశారు. తత్ఫలితం గా జాతీయ కార్యసాధన సర్వేక్షణ లో విద్య యొక్క నాణ్యత అనే కేటగిరీ పరం గా రాష్ట్రం ఒక పెద్ద పురోగతి ని సాధించింది అని ఆయన అన్నారు. ప్రకటన ల పైన డబ్బు ను ఖర్చు పెట్టకుండానే ఈ రాష్ట్రం పదిహేడో స్థానం నుండి అయిదో స్థానాని కి చేరుకొంది అని ప్రధాన మంత్రి చెప్పారు. విద్యార్థుల కు, గురువుల కు మరియు మరియు మధ్య ప్రదేశ్ ప్రభుత్వాని కి ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు.
ఉద్యోగ కల్పన ను మరియు స్వతంత్రోపాధి ని ప్రోత్సహించడం కోసం నైపుణ్యాభివృద్ధి కి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తోంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన’ లో భాగం గా యువతీ యువకుల కు శిక్షణ ను ఇవ్వడం కోసం దేశవ్యాప్తం గా నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ను తెరవడం జరిగింది అని ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం బడ్జెటు లో, 30 స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాల ను తెరవడం జరుగుతుంది, ఆ కేంద్రాల ద్వారా యువత కు కొత్త తరం సాంకేతికత సాయం తో శిక్షణ ను ఇవ్వడం జరుగుతుంది అంతే కాకుండా చిన్న చేతివృత్తుల వారికి పిఎమ్ విశ్వకర్మ యోజన ద్వారా శిక్షణ ను ఇవ్వడం కోసం మరియు వారి ని ఎమ్ఎస్ఎమ్ఇ తో జతపరచడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడమైందని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ రోజు న నియామకం జరిగిన వేల కొద్దీ గురువుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, గురువులు వారి యొక్క విద్యార్థుల మనస్సుల లో ఓ మాతృమూర్తి కి ఉండే అటువంటి స్థానాన్ని గాని లేదా మన జీవనం లో ఒక గురువు చూపే ప్రభావాన్ని గాని దక్కించుకోవాలని ఆయన కోరారు. ‘‘మీరు ఎల్లవేళలా మది లో పదిలపరచుకోవలసిన అంశం ఏమిటి అంటే అది మీరు చెప్పే చదువు దేశాన్ని వర్తమానాన్నే గాక దేశం యొక్క భవిష్యత్తు ను కూడా ను తీర్చిదిద్దుతుంది అనేదే’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గురువు లు బోధించేటటువంటి విద్య విద్యార్థి లో సకారాత్మకమైన పరివర్తన ను తీసుకు రావడం ఒక్కటే కాకుండా సమాజం లోనూ సకారాత్మకమైన మార్పు ను కొనితెస్తుందని ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘మీరు నేర్పే విలువ లు నేటి తరాని కొక్కదానికి మాత్రమే కాకుండా రాబోయే అనేక తరాల వారి పై సైతం ఒక సకారాత్మక ప్రభావాన్ని ఏర్పరచగలుగుతాయి.’’ అని ఆయన అన్నారు.