‘‘అధిక వృద్ధి తాలూకు జోరు ను అలాగే కొనసాగించడం కోసం ఈ బడ్జెటు లో అనేకనిర్ణయాల ను ప్రభుత్వం తీసుకొంది’’
‘‘ఎమ్ఎస్ఎమ్ఇ లను పటిష్ట పరచడం కోసం అనేక మౌలికమైన సంస్కరణల ను మేం ప్రవేశపెట్టాం. ఈ సంస్కరణ లసాఫల్యం అనేది వాటికి ఆర్థిక సహాయాన్ని బలోపేతం చేయడం పైన ఆధారపడుతుంది’’
‘‘సరికొత్త ఆలోచనలు మరియు కార్యక్రమాల తాలూకు నష్ట భయాన్ని తట్టుకోవడంగురించి, అలాగే కొత్త కొత్త విధానాల లో ఆర్థిక సాయాన్ని అందించడం గురించి మన ఆర్థికసహాయ రంగం పరిశీలించవలసిన అవసరం ఉంది’’
‘‘భారతదేశం యొక్క ఆకాంక్ష లు ప్రాకృతిక వ్యవసాయం తో, సేంద్రియ సాగు తో సైతం ముడిపడి ఉన్నాయి’’
‘‘పర్యావరణ హితకరమైన పథకాల ను మరిన్ని చేపట్టాల్సిఉంది. గ్రీన్ ఫైనాన్సింగ్ ను గురించి అధ్యయనం చేయడం, మరి ఆ తరహా నూతన పార్శ్వాల ను ఆచరణలోకి తీసుకు రావడం వంటి సరికొత్త దృష్టి కోణాలు ప్రస్తుత కాలం లో ఎంతైనా అవసరం’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘వృద్ధి ని మరియు ఆకాంక్షభరిత ఆర్థిక వ్యవస్థ ను దృష్టి లో పెట్టుకొని ఆర్థిక సహాయాన్ని అందించడం’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది బడ్జెటు సమర్పణ తరువాత ప్రధాన మంత్రి ప్రసంగించిన వెబినార్ లలో పదో వెబినార్.

ప్రధాన మంత్రి తన ప్రసంగం మొదట్లో ‘మహిళ ల అంతర్జాతీయ దినం’ సందర్భం లో అభినందనల ను తెలియజేశారు. భారతదేశం లో ఒక మహిళ ఆర్థిక మంత్రి పదవి లో ఉన్నారని, ఆమె ఇటువంటి పురోగమన ప్రధానమైనటువంటి బడ్జెటు ను అందించారని ప్రధాన మంత్రి అన్నారు.

వందేళ్ళ లో ఒకసారి తలెత్తిన మహమ్మారి అనంతరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగాన్ని పుంజుకొంటోంది, మరి ఇది మన ఆర్థికపరమైన నిర్ణయాలు, ఇంకా ఆర్థిక వ్యవస్థ తాలూకు బలమైన పునాది కి అద్దం పడుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. అధిక వృద్ధి తాలూకు జోరు ను అలాగే కొనసాగించడం కోసం ప్రభుత్వం ఈ బడ్జెటు లో అనేక చర్యల ను తీసుకొంది అని ఆయన చెప్పారు. ‘‘విదేశీ మూలధన ప్రవాహాల ను మరింత గా రప్పించడం, మౌలిక సదుపాయాల సంబంధి పెట్టుబడి కి పన్నుల ను తగ్గించడం, ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్ సిటీ, సరికొత్త డిఎఫ్ఐ ల వంటి నూతన సంస్థల ను ఏర్పాటు చేయడం వంటి వాటి ద్వారా మేం ఆర్థికపరమైన, ఇంకా ఆర్థిక సహాయం పరమైన వృద్ధి ని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నం చేశాం’’ అని ఆయన అన్నారు. ‘‘ఆర్థిక రంగం లో డిజిటల్ టెక్నాలజీ ని విరివి గా ఉపయోగించడాని కి ప్రభుత్వం కట్టుబడి ఉండడం అనేది ప్రస్తుతం తదుపరి స్థాయి కి చేరుకొంటున్నది. 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు కావచ్చు, లేదా 75 జిల్లాల లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సిబిడిసి) కావచ్చు.. ఇవి మా యొక్క దార్శనికత ను చూపుతున్నాయి’’ అని ఆయన వివరిపంచారు.

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆయా ప్రోజెక్టుల కు ఆర్థిక సహాయాన్ని అందించడాని కి వేరు వేరు నమూనాల ను అన్వేషించడం ద్వారా ఇతర దేశాల పై ఆధార పడడాన్ని ఎలాగ తగ్గించుకోవచ్చో అనేది ఆలోచించవలసిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ఉదాహరణ కు పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ అనేది ఆ తరహా చర్యల లో ఒకటి అని ఆయన చెప్పారు.

దేశాన్ని సంతులిత రీతి న అభివృద్ధి చేసే దిశ లో ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమం గాని, లేదా భారతదేశం లో తూర్పు ప్రాంతాలు మరియు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి గాని.. ఈ విధమైన పథకాల కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు

భారతదేశాని కి ఉన్న ఆకాంక్షలు, మరి అలాగే స్థూల, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) ల బలం.. ఈ రెండిటికి మధ్య గల లంకె ను గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ‘‘ఎమ్ఎస్ఎమ్ఇ లను బలపరచడం కోసం మేం అనేక మౌలిక సంస్కరణల ను ప్రవేశపెట్టాం. కొత్త పథకాల ను తీసుకువచ్చాం. ఈ సంస్కరణ ల సాఫల్యం వాటికి ఆర్థిక సహాయాన్ని పరిపుష్టం చేయడం పైన ఆధారపడుతుంది’’అని ఆయన అన్నారు.

ఫిన్ టెక్, ఎగ్రి టెక్, మెడి టెక్, ఇంకా నైపుణ్యాభివృద్ధి ల వంటి రంగాల లో దేశం పురోగమించేటంత వరకు ఇండస్ట్రీ 4.0 అనేది సాధ్యం కాదు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఆయా రంగాల లో ఆర్థిక సహాయ సంస్థ ల తోడ్పాటు భారతదేశాన్ని ఇండస్ట్రీ 4.0 పరం గా కొత్త శిఖరాల కు చేర్చగలుగుతుంది అని ఆయన అన్నారు.

భారతదేశం అగ్రగామి మూడు దేశాల సరసన నిలచేందుకు అవకాశం ఉన్నటువంటి రంగాల అన్వేషణ ను గురించి ప్రధాన మంత్రి సుదీర్ఘం గా వివరించారు. నిర్మాణం, స్టార్ట్-అప్స్, ఇంకా ఇటీవలే ఆంక్షల కు దూరం అయినటువంటి అంతరిక్షం, జియో-స్పేశల్ డేటా, డ్రోన్ లు వంటి రంగాల లో అగ్రగామి మూడు దేశాల జాబితా లో భారతదేశం చేరగలుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. దీని కోసం మన పరిశ్రమ, మన స్టార్ట్-అప్స్ ఆర్థిక సహాయ రంగం యొక్క సమర్ధన ను పూర్తి స్థాయి లో అందుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన అన్నారు. నవ పారిశ్రామికత్వం విస్తరించడం, నూతన ఆవిష్కరణలు వర్ధిల్లడం, స్టార్ట్-అప్స్ కొత్త కొత్త బజారుల ను అన్వేషించడం అనేవి ఎప్పుడు కార్య రూపం దాలుస్తాయి అంటే ఎప్పుడైతే భావి కాలపు ఆలోచన లు అయిన వీటిని గురించి లోతైన అవగాహన ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ‘‘నూతన భావి కాలపు ఆలోచనల మరియు కార్యక్రమాల తాలూకు నష్ట భయాన్ని దీర్ఘకాలం పాటు సంబాళించడం, కొత్త కొత్త విధానాల లో ఆర్థిక సహాయాన్ని అందించడం గురించి మన ఆర్థిక సహాయ రంగం సైతం మేధోమథనం జరపాలి’’ అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ కు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒక పెద్ద ఆధారం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి స్)ను, కిసాన్ క్రెడిట్ కార్డుల ను, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ ను, ఇంకా కామన్ సర్వీస్ సెంటర్స్ ను పటిష్టపరచడం వంటి చర్యల ను ప్రభుత్వం తీసుకొంటోంది అని ఆయన వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను సభికులు వారి విధానాల కు కేంద్ర స్థానం లో అట్టిపెట్టుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.

భారతదేశం యొక్క ఆకాంక్ష లు ప్రాకృతిక వ్యవసాయం తో, సేంద్రియ సాగు తో కూడా ముడిపడి ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఎవరైనా ఆయా రంగాల లో సరికొత్త కృషి కి నడుం కట్టారంటే గనక అప్పుడు అటువంటి వారికి మన ఆర్థిక సహాయ సంస్థ లు ఏ విధం గా సహాయం చేయాలి అనే దానిపై ఆలోచన చేయడం ఆవశ్యకం’’ అని ఆయన అన్నారు.

ఆరోగ్యం రంగం లో జరుగుతున్న కృషి, ఆరోగ్య రంగం లో పెట్టుబడి లను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, చికిత్స సంబంధి విద్య తో ముడిపడ్డ సవాళ్ళ ను ఎదుర్కోవడం కోసం మరిన్ని ఎక్కువ చికిత్స సంస్థల ను ఏర్పాటు చేయడం కీలకం అన్నారు. ‘‘మన ఆర్థిక సహాయ సంస్థలు మరియు బ్యాంకులు వాటి వ్యాపార పథక రచన లో ఈ విషయాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వగలవా?’’ అంటూ ప్రధాన మంత్రి ప్రశ్నించారు.

బడ్జెటు లో పొందుపరచినటువంటి పర్యావరణ పరమైన అంశాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. భారతదేశం 2070వ సంవత్సరాని కల్లా కర్బన ఉద్గారాల విషయం లో నికరం గా సున్నా స్థాయి ని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది, ఈ దిశ లో దేశం లో కృషి ఇప్పటికే ఆరంభం అయింది అని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ఈ కార్యాల ను మరింత వేగవంతం చేయడం కోసం పర్యావరణ స్నేహపూర్వక ప్రోజెక్టుల అమలు ను శీఘ్రతరం చేయడం అవసరం. గ్రీన్ ఫైనాన్సింగ్, మరి ఇంకా అలాంటి కొత్త కొత్త రూపాల ను అమలులోకి తీసుకు రావడం అనేవి ప్రస్తుత కాలపు డిమాండు గా ఉంది’’ అని ఆయన అన్నారు.

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'Under PM Narendra Modi's guidance, para-sports is getting much-needed recognition,' says Praveen Kumar

Media Coverage

'Under PM Narendra Modi's guidance, para-sports is getting much-needed recognition,' says Praveen Kumar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister remembers Rani Velu Nachiyar on her birth anniversary
January 03, 2025

The Prime Minister, Shri Narendra Modi remembered the courageous Rani Velu Nachiyar on her birth anniversary today. Shri Modi remarked that she waged a heroic fight against colonial rule, showing unparalleled valour and strategic brilliance.

In a post on X, Shri Modi wrote:

"Remembering the courageous Rani Velu Nachiyar on her birth anniversary! She waged a heroic fight against colonial rule, showing unparalleled valour and strategic brilliance. She inspired generations to stand against oppression and fight for freedom. Her role in furthering women empowerment is also widely appreciated."