Quote‘‘ఈ సంవత్సరం యొక్క బడ్జెటు ను 2047 వ సంవత్సరానికల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడం కోసం ఒక మంగళప్రదమైనటువంటి ఆరంభం గా దేశం చూస్తున్నది’’
Quote‘‘మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి సంబంధి ప్రయాసల కు ఈ సంవత్సరం యొక్క బడ్జెటుఒక కొత్త జోరు ను అందించనుంది’’
Quote‘‘మహిళల కు సాధికారిత కల్పన కై చేపట్టిన ప్రయాసల తాలూకు ఫలితాలు స్పష్టం గాకనపడుతున్నాయి; మరి మనం దేశం యొక్క సామాజిక జీవనం లో ఒకవిప్లవాత్మకమైనటువంటి మార్పు ను అనుభవం లోకి తెచ్చుకొంటున్నాం’’
Quote‘‘విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, ఇంకా గణిత శాస్త్రం లలో చేరుతున్నబాలిక లు ప్రస్తుతం 43 శాతం గా ఉన్నారు; ఇది అమెరికా, యుకె మరియు జర్మనీ వంటి దేశాల కంటే అధికంఅని చెప్పాలి’’
Quote‘‘కుటుంబం తీసుకొనే ఆర్థిక నిర్ణయాల లో మహిళల కు ఒక నూతన స్వరాన్ని పిఎమ్ ఆవాస్ ఇచ్చింది’’
Quote‘‘గడచిన తొమ్మిది సంవత్సరాల లో ఏడు కోట్ల మంది కి పైగా మహిళ లు స్వయం సహాయసమూహాల లో చేరారు’’
Quote‘‘మహిళల కు గౌరవప్రదం గా ఉండే హోదాల ను ఇస్తూ మరియు సమానత్వ భావన ను పెంచుతూమాత్రమే భారతదేశం ముందుకు సాగిపోగలుగుతుంది’’
Quoteరాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వ్రాసిన మహిళల దినం సంబంధి వ్యాసాన్నిప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు

‘‘మహిళల కు ఆర్థికం గా సాధికారిత ను కల్పించడం’’ అనే విషయం పై జరిగిన బడ్జెటు అనంతర కాల వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావంతమైనటువంటి రీతి లో అమలు పరచడం కోసం ఆలోచనల ను మరియు సూచనల ను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బడ్జెటు అనంతర కాల వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ పదకొండో వెబినార్.

యావత్తు ఈ సంవత్సరపు బడ్జెటు ను 2047 వ సంవత్సరాని కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని సాధించే దిశ లో ఒక శుభారంభం గా దేశం చూస్తున్నది అంటూ ప్రధాన మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘‘భావి అమృత్ కాల్ దృష్టి కోణం లో నుండి ఈ బడ్జెటు ను పరిశీలించడం మరియు బేరీజు వేయడం జరుగుతోంది, దేశ పౌరులు వారి ని వారు ఈ లక్ష్యాల తో ముడిపడి రాబోయే 25 సంవత్సరాల వైపు చూస్తున్నారు ఇది దేశానికి ఒక శుభ సంకేతం గా ఉంది.’’ అని ఆయన అన్నారు.

గడచిన తొమ్మిది సంవత్సరాల లో మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి తాలూకు దృష్టి కోణం తో దేశం ముందుకు కదిలింది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. భారతదేశం ఈ ప్రయాసల ను ప్రపంచ రంగస్థలం వరకు తీసుకొని పోతున్నది, ఎందుకంటే భారతదేశం జి-20 సమావేశాని కి అధ్యక్ష తను వహిస్తూ ప్రపంచం లో తన స్థితి ని ప్రముఖంగా చాటిచెబుతున్నది అని ఆయన వివరించారు. ఈ సంవత్సరం తీసుకు వచ్చిన బడ్జెటు మహిళ ల నేతృత్వం లో అభివృద్ధి యొక్క ప్రయాసల కు కొత్త గతి ని ఇస్తుంది అని ఆయన అన్నారు.

దృఢనిశ్చయం, ఇచ్ఛాశక్తి, కల్పన శక్తి, లక్ష్యాల ను అందుకోవడం కోసం పాటుపడేటటువంటి సామర్థ్యం మరియు కఠోర పరిశ్రమ అనేవి నారీ శక్తి యొక్క సూచిక లు అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, వీటిని ‘మాతృ శక్తి’ యొక్క ప్రతిబింబం గా అభివర్ణించారు. ఈ గుణాలు ఈ శతాబ్దం లో భారతదేశం యొక్క వేగాన్ని మరియు విస్తృతి ని పెంపు చేయడం లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ను పోషిస్తున్నాయి అని ఆయన అన్నారు.

ప్రస్తుతం మహిళ ల సాధికారిత తాలూకు ప్రయాస ల ఫలితాలు స్పష్టం గా కనపడుతున్నాయని, మరి మనం దేశ సామాజిక జీవనం లో ఒక క్రాంతికారి పరివర్తన ను అనుభవం లోకి తెచ్చుకొంటున్నామని ప్రధాన మంత్రి అన్నారు. పురుషుల తో పోల్చినప్పుడు మహిళ ల సంఖ్య పెరుగుతోంది; మరి ఉన్నత పాఠశాల స్థాయి తరువాతి విద్యాభ్యాసం లో బాలిక ల సంఖ్య సైతం గడచిన తొమ్మిది పదేళ్ల లో మూడింతలు అయిపోయింది అని ఆయన అన్నారు. విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్ మరియు గణితశాస్త్రం సబ్జెక్టుల లో చేరుతున్న బాలికల సంఖ్య ప్రస్తుతం 43 శాతం గా ఉంది. ఇది అమెరికా, యుకె మరియు జర్మనీ వంటి దేశాల లో కంటె ఎక్కువ. వైద్యచికిత్స, క్రీడలు, వాణిజ్యం లేదా రాజకీయాల వంటి రంగాల లో మహిళ ల భాగస్వామ్యం పెంపు ఒక్కటే కాకుండా వారు ముందడుగు వేసి నాయకత్వాన్ని కూడా వహిస్తున్నారు అని ఆయన అన్నారు.

ముద్ర రుణాల లబ్ధిదారుల లో 70 శాతం లాభార్థులు గా మహిళలే ఉన్నారన్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇదే విధం గా, మహిళ లు ‘స్వనిధి’ లో భాగం గా ఎటువంటి పూచీకత్తు లేకుండా మంజూరయ్యే రుణ పథకాల, పశుపోషణ, మత్స్య పోషణ, గ్రామీణ పరిశ్రమలు, ఎఫ్ పిఒ స్ మరియు క్రీడల కు సంబంధించిన పథకాల నుండి లాభపడుతున్నది మహిళలే అని ఆయన అన్నారు.

‘‘దేశ జనాభా లో సగం సంఖ్య లో ఉన్న మహిళల తోడ్పాటు తో మనం ఎలా ఈ దేశాన్ని ముందుకు తీసుకు పోవచ్చు, మరి మహిళా శక్తి యొక్క సామర్థ్యాన్ని మనం ఎలా పెంచవచ్చు అనేది ఈ బడ్జెటు లో వెల్లడి అవుతున్నాయి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహిళ లు 7.5 శాతం వడ్డీ ని అందుకొనే అవకాశం ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీము ను గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘మూడు కోట్ల గృహాల లో చాలా వరకు గృహాలు మహిళల పేరిట ఉన్నాయి. ఈ కారణం గా పిఎమ్ ఆవాస్ యోజన కు ఎనభై వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది మహిళా సాధికారిత దిశ లో వేసినటువంటి ఒక అడుగు అని చెప్పాలి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహిళల కు వారి పేరిట ఎటువంటి సంపత్తి లేకపోవడం అనేది ఒక సంప్రదాయం గా నెలకొన్న స్థితి అందరికి తెలిసిందే; అయితే, పిఎమ్ ఆవాస్ తాలూకు మహిళా సాధికారిత కల్పన సంబంధి దృష్టి కోణాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ‘‘కుటుంబం తీసుకొనేటటువంటి ఆర్థిక నిర్ణయాల లో మహిళల కు ఒక కొత్త వాణి ని పిఎమ్ ఆవాస్ ఇచ్చింది’’ అని ఆయన అన్నారు.

స్వయం సహాయ సమూహాల లో కొత్త యూనికార్న్ స్ ను తయారు చేయడాని కి వీలుగా ఆయా స్వయం సహాయ సమూహాల కు సమర్థన ను అందించడం జరుగుతుందన్న ప్రకటన ను గురించి ప్రధాన మంత్రి తెలియ జేశారు. మారుతున్న పరిస్థితుల ను దృష్టి లో పెట్టుకొని మహిళల కు సాధికారిత కల్పన కోసం దేశం యొక్క దార్శనికత ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ప్రస్తుతం వ్యవసాయేతర వ్యాపారాలు అయిదింటి లో ఒక వ్యాపారాన్ని మహిళ లు నిర్వహిస్తున్నారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో ఏడు కోట్ల మంది కి పైగా మహిళలు స్వయం సహాయ సమూహాల లో భాగస్తులు అయ్యారు. ఈ స్వయం సహాయ సమూహాలు 6.25 లక్షల కోట్ల రూపాయల విలువ గల రుణాల ను తీసుకొన్నాయంటే వాటి వేల్యూ చైన్ ను వాటి కి అవసరపడ్డ మూలధనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చును అని ఆయన అన్నారు.

ఈ మహిళ లు చిన్న నవ పారిశ్రామికవేత్త ల వలె దేశాని కి తోడ్పాటు ను అందించడం ఒక్కటే కాకుండా దక్షత కలిగిన రిసోర్స్ పర్సన్స్ గా కూడా నడుచుకొంటున్నారు అని ప్రధాన మంత్రి తెలిపారు. పల్లెల లో అభివృద్ధి పరం గా కొత్త కొత్త కోణాల ను ఆవిష్కరిస్తున్న బ్యాంకు సఖి, కృషి సఖి మరియు పశు సఖి కార్యక్రమాల ను గురించి ఆయన ప్రస్తావించారు.

సహకార రంగం లో మార్పు మరియు ఈ రంగం లో మహిళ ల భూమిక ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. ‘‘రాబోయే సంవత్సరాల లో మొత్తం 2 లక్షల పైచిలుకు బహుళ ఉద్దేశ్యాల తో కూడినటువంటి సహకార సంఘాల ను, పాడి సంబంధి సహకార సంఘాల ను, చేపల పెంపకాని కి సంబంధించిన సహకార సంఘాల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రాకృతిక వ్యవసాయం తో ఒక కోటి మంది రైతుల ను జోడించాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడమైంది. దీనిలో మహిళా రైతులు మరియు ఉత్పాదక సమూహాలు ఒక పెద్ద పాత్ర ను పోషించ గలుగుతాయి.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

‘శ్రీ అన్నాన్ని’ ప్రోత్సహించడం లో మహిళా స్వయం సహాయ సమూహాల పాత్ర ను గురించి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘శ్రీ అన్న’ విషయం లో సాంప్రదాయిక అనుభవాన్ని కలిగి వున్నటువంటి ఒక కోటి మంది కి పైగా ఆదివాసి మహిళ లు ఈ స్వయం సహాయ సమూహాల లో భాగం అయ్యారు అని ఆయన చెప్పారు. ‘‘ మనం ‘శ్రీ అన్నం’ మొదలుకొని దాని నుండి తయారు చేసిన ఇతర ఆహార పదార్థాల మార్కెటింగ్ కు సంబంధించిన అవకాశాల ను వినియోగించుకోవాలి. అనేక చోట్ల, ప్రభుత్వ సంస్థ లు చిన్న అటవీ ఉత్పాదనల ప్రాసెసింగ్ లో సాయాన్ని అందిస్తున్నాయి, మరి ఆ ఉత్పాదనల ను బజారు కు చేరవేస్తున్నాయి. ప్రస్తుతం, సుదూర ప్రాంతాల లో అనేక స్వయం సహాయ సమూహాల ను ఏర్పాటు చేయడం జరిగింది. మనం వీటి ని మరింత గా విస్తరించవలసి ఉంది.’’ అని ఆయన అన్నారు.

నైపుణ్యాల అభివృద్ధి తాలూకు ఆవశ్యకత ను గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ, ఈ బడ్జెటు లో తీసుకు వచ్చిన విశ్వకర్మ స్కీము ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషిస్తుంది. మరి అది ఒక వంతెన వలె పనిచేస్తుంది. ఆ స్కీము లోని అవకాశాల ను మహిళల కు సాధికారిత కల్పన కై ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది. ఇదే విధం గా, జిఇఎమ్ (GeM) మరియు ఇ-కామర్స్ లు మహిళల కు వ్యాపార అవకాశాల ను విస్తరింప చేసే మాధ్యమాలు గా మారుతున్నాయి. శిక్షణ లో నూతన సాంకేతిక పద్ధతుల కు ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరగాలి; స్వయం సహాయ సమూహాల లో ఈ పనినే చేయడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

దేశం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్’ అనే భావన తో ముందుకు సాగుతోంది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. దేశం యొక్క కుమార్తె లు దేశ భద్రత సంబంధి భూమికల ను పోషిస్తుండడాన్ని, మరి రాఫేల్ విమానాల ను వారు నడుపుతుండడాన్ని మనం చూడవచ్చును. ఇంకా వారు నవ పారిశ్రామికవేత్తలు కావడాన్ని, నిర్ణయాల ను తీసుకొంటుండడాన్ని మరియు నష్టభయాల కు సైతం సై అంటుండడాన్ని.. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు వారి ని గురించినటువంటి ఆలోచనల లో మార్పు వచ్చేస్తుంది అని ఆయన అన్నారు. నాగాలాండ్ లో మొట్ట మొదటిసారి గా ఇద్దరు మహిళల ను ఎమ్ఎల్ఎ లుగా ఇటీవల ఎన్నికవడం గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘ఆ ఇరువురి లో ఒకరు మంత్రి గా పదవీప్రమాణాన్ని కూడా స్వీకరించార’’ని ఆయన అన్నారు. మహిళ ల గౌరవాని కి సంబంధించిన హోదాల ను పెంచడం ద్వారా మరియు సమానత్వ భావన ను పెంపొందింపచేయడం ద్వారా మాత్రమే భారతదేశం ముందడుగు వేయగలుగుతుంది. అందరు మహిళలు, సోదరీమణులు, కుమార్తెల దారి లో అడ్డువచ్చే అన్ని బాధల ను తొలగించడం కోసం మీరంతా దృఢం గా ముందంజ వేయండి అంటూ నేను పిలుపు ను ఇస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వ్రాసిన ఒక వ్యాసం నుండి కొంత భాగాన్ని ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగించారు. రాష్ట్రపతి ఇలా వ్రాశారు, ‘‘పురోగతి ని వేగిర పరచే బాధ్యత మన మీద, మనలో ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ కారణం గా, ఈ రోజు న, నేను మీలో ప్రతి ఒక్కరి కి చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే అది మీరు స్వయంగా మీలో, మీ కుటుంబం లో, మీ ఇరుగుపొరుగు వారి లో గాని లేదా మీరు పని చేసే స్థానం లో గాని కనీసం ఒక మార్పు ను తీసుకు వచ్చేందుకు సంకల్పాన్ని తీసుకోండి.. అది ఎటువంటి మార్పు అంటే అది ఏ బాలిక మోము లోనైనా చిరునవ్వు ను తీసుకు వచ్చేటటువంటి మార్పు; అది ఎటువంటి మార్పు అంటే అది జీవనం లో ముందుకు సాగిపోయేందుకు ఆ బాలిక కు గల అవకాశాల ను మెరుగు పరచేటటువంటి మార్పు అన్నమాట. ఈ ఒకే అభ్యర్థన ను, నేను ఇంతకు ముందు చెప్పినట్లు గా, నేరు గా నా అంతరంగం లో నుండి మీకు మనవి చేస్తున్నాను.’’

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
We've to achieve greater goals of strong India, says PM Narendra Modi

Media Coverage

We've to achieve greater goals of strong India, says PM Narendra Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the passing of His Highness Prince Karim Aga Khan IV
February 05, 2025

The Prime Minister, Shri Narendra Modi today condoled the passing of His Highness Prince Karim Aga Khan IV. PM lauded him as a visionary, who dedicated his life to service and spirituality. He hailed his contributions in areas like health, education, rural development and women empowerment.

In a post on X, he wrote:

“Deeply saddened by the passing of His Highness Prince Karim Aga Khan IV. He was a visionary, who dedicated his life to service and spirituality. His contributions in areas like health, education, rural development and women empowerment will continue to inspire several people. I will always cherish my interactions with him. My heartfelt condolences to his family and the millions of followers and admirers across the world.”