ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ‘ మౌలికసదుపాయాలు, పెట్టుబడులు: పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ తో లాజిస్టిక్ సామర్ధ్యాలను మెరుగుపరచడం’ అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్‌ను నిర్వహించారు.
బడ్జెట్ అనంతరం నిర్వహించే 12 వెబినార్‌లలో ఇది 8 వ వెబినార్. 2023 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పలు కార్యక్రమాలను సమర్ధంగా అమలు చేసేందుకు ప్రజలనుంచి ఆలోచనలు, సూచనలను స్వీకరించేందుకుఈ వెబినార్‌లను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా వెబినార్‌లో పాల్గొన్న వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇవాల్టి వెబినార్‌లో వందలాదిమంది పాల్గొంటుండడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు . సుమారు 700 మంది సిఇఒలు, మేనేజింగ్ డైరక్టర్లు ఇందులో పాలుపంచుకున్నారు. దీనిని బట్టి ఈ వెబినార్ ప్రాధాన్యత తెలుస్తోంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, స్టేక్‌హోల్డర్లు ఈ వెబినార్‌ను విజయవంతం చేశారని అన్నారు.
మౌలిక సదుపాయాల రంగానికి ఈ ఏడాది బడ్జెట్ నూతన శక్తిని ఇస్తుందని ఆయన అన్నారు.బడ్జెట్‌కు సర్వత్రా ప్రశంసలు లభించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. బడ్జెట్ లో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలకు నిపుణుల నుంచి ప్రధాన మీడియా సంస్థలనుంచి ప్రశంసలు లభించాయన్నారు. భారతదేశపు కాపెక్స్ 2013`14 సంవత్సరంతో పోలిస్తే 5 రెట్లు పెరగిందన్నారు. ప్రభుత్వం జాతీయ మౌలికసదుపాయాల పైప్‌లైన్ కింద 110 లక్షల కోట్లరూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ముందుకు పోతున్నదని చెప్పారు.నూతన అవకాశాలకు, నూతన బాధ్యతలకు, గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతో అనువైన కాలమని ప్రధానమంత్రి అన్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు, ఏ దేశ సుస్థిరాభివృద్ధిలో అయినా మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల చరిత్రకు సంబంధించిచన
పరిజ్ఞానం కలవారికి ఈ విషయం బాగా తెలుసునని ఆయన అన్నారు. చంద్రగుప్త మౌర్యుడు ఉత్తరాపథ్ నిర్మించగా , అశోకుడు దానిని మరంత ముందుకు తీసుకువెళ్లారని, షేర్ షా సూరి దానిని అప్గ్రేడ్ చేశారని అన్నారు.
దానిని బ్రిటిషర్లు జి.టి.రోడ్ గా మార్చారని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాధాన్యతను శతాబ్దాల క్రితమే భారతదేశంలో గుర్తించారని ప్రధానమంత్రి చెప్పారు. జలమార్గాలు, రివర్ ఫ్రంట్ ల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, బెనారస్ ఘాట్ ల గురించి ప్రస్తావించారు. ఈ ఘాట్లు జలమార్గాల ద్వారా నేరుగా కలకత్తా తో అనుసంధానమై ఉండేవని చెప్పారు.
తమిళనాడులోని 2000 సంవత్సరాల క్రితం నాటి కలనై డ్యామ్ ఇప్పటికీ నీటిని అందిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు.
దేశ మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వాలకు అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన అన్నారు. పేదరికం ఒక శాపమన్న భావనను తొలగించి , ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.
మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు సంబంధించి పరిస్థితి మెరుగుపడినట్టు ప్రధానమంత్రి వివరించారు. 2014 నాటికి ముందు ఉన్న పరిస్థితితో పోల్చినపుడు, జాతీయ రహదారుల నిర్మాణం సగటున రెట్టింపు అయిందని ప్రధానమంత్రి తెలిపారు.
అలాగే 2014 కు ముందు సంవత్సరానికి 600 రూట్ కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరణ జరిగిందని , అది ప్రస్తుతం సంవత్సరానికి 4000 కిలోమీటర్లకు చేరుకున్నదన తెలిపారు. అలాగే దేశంలో విమానాశ్రయాల సంఖ్య, సముద్ర పోర్టుల సామర్ధ్యం రెట్టింపు అయినట్టు ప్రధానమంత్రి తెలిపారు.
“మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా ”అని అంటూ ప్రధానమంత్రి, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం రూపుదిద్దుకునే లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఇందుకు అనుగుణమైన మార్గాన్ని భారతదేశం అనుసరిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇప్పుడు మనం వేగాన్ని మెరుగుపరచుకుని టాప్ గేర్లో ముందుకు పోవాలని అన్నారు. పి.ఎం. గతి శక్తి మాస్టర్ ప్లాన్ అనేది, ఎంతో కీలకమైనది అని అంటూ ప్రధానమంత్రి, సమీకృత ఆర్ధిక , మౌలికక సదుపాయాల ప్రణాళికకు ఇది ముఖ్యమైనదని అన్నారు. గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ భారతదేశ మౌలిక సదుపాయాల రంగం, మల్టీ మోడల్
లాజిస్టిక్ ల ముఖచిత్రాన్ని మార్చివేయనున్నదని చెప్పారు.
పి.ఎం. గతి శక్తి మాస్టర్ ప్లాన్ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. లాజిస్టక్ ల సమర్ధతపై ప్రభావం చూపుతున్న అంశాలను , లోపాలను గమనించడం జరిగిందని ప్రధానమంత్రి తెలిపారు.
అందువల్ల ఈ ఏడాది బడ్జెట్ లో 100 కీలక ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టినట్టు తెలిపారు. ఇందుకు 75,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఆయన తెలిపారు. నాణ్యతతో కూడిన, మల్టీ మోడల్ మౌలిక సదుపాయాలతో, మన లాజిస్టిక్ ఖర్చులు రాగల రోజులలో మరింత తగ్గనున్నాయి. ఇది భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది అని ఆయన అన్నారు. లాజిస్టిక్ రంగంతో పాటు సులభతర జీవనం, సులభతర వ్యాపారం విషయలోనూ పరిస్థితి మరింత మెరుగుపడనున్నదని చెప్పారు. మౌలికసదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించారు.
రాష్ట్రాల పాత్ర గురించి వివరిస్తూ ప్రధానమంత్రి, 50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను మరో ఏడాది పొడిగించినట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్ వ్యయం 30 శాతానికి పెంచినట్టు ప్రధానమంత్రి తెలిపారు.
మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి వివిధ మెటీరియల్స్ అవసరం ఉన్నందున , ఆయా రంగాల అవసరాలకు సంబంధించి ముందస్తు అంచనాలు రూపొందించాలని ప్రధానమంత్రి సూచించారు.
భవిష్యత్ సుస్పష్టంగా ఉన్నందున మనం సమీకృత విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి సూచించారు. ఇందులో పి.ఎం.గతిశక్తి మాస్టర్ ప్లాన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ రంగంతో సర్కులర్ ఎకానమీని సమీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కచ్ ప్రాంతంలో భూకంపం వచ్చినప్పడు తన అనుభవాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. సహాయ కార్యక్రమాల అనంతరం కచ్ ప్రాంతంలో పూర్తిగా నూతన అభివృద్ధి విధానాన్ని అనుసరించినట్టు ఆయన తెలిపారు. మౌలక సదుపాయాల అభివృద్ధి తో కూడిన అభివృద్ధిని ఈ ప్రాంతంలో చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు.
రాజకీయంగా అవసరార్థం నిర్ణయాలు తీసుకోవడం కాకుండా కచ్ ప్రాంతాన్ని ఒక గొప్ప ఆర్ధిక కార్యకలాపాల క్షేత్రంగా మార్చినట్టు ప్రధానమంత్రి తెలిపారు.
దేశ సామాజిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలంటే , భారతదేశపు భౌతిక మౌలిక సదుపాయాలు కూడా ఎంతో ముఖ్యమైనవని ఆయన అన్నారు. బలమైన సామాజిక మౌలిక సదుపాయాలు, మరింత ప్రతిభ కలిగిన, నైపుణ్యం కలిగిన యువత దేశానికి సేవ చేయడానికి ముందుకు రావడానికి వీలు కల్పిస్తాయని అన్నారు.
నైపుణ్యాల అభివృద్ధి, ప్రాజెక్టు యాజమాన్యం, ఆర్ధిక నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యుయర్ షిప్, ఈ లక్ష్యాలు నెరవేర్చడానికి ఉపకరిస్తుందని చెప్పారు.
నైపుణ్యాల కు సంబంధించిన సమాచారం అందించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇది వివిధ రంగాలలోని చిన్న, పెద్ద సంస్థలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇది దేశ మానవ వనరుల శక్తి సద్వినియోగానికి ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు సత్వరం కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారు.
ఈ వెబినార్ లోని ప్రతి స్టేక్ హోల్డర్ ఇచ్చే సూచనలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని అంటూ ప్రధానమంత్రి, వీరు దేశ అభివృద్ధికి తోడ్పడడమే కాకుండా, భారత దేశ ప్రగతి వేగం పరుగులు పెట్టడానికి దోహదపడుతున్నారని అన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి రైలు, రోడ్డు, పోర్టులు, విమానాశ్రయాలకు మాత్రమే పరిమితం కాదని, ఈ ఏడాది బడ్జెట్ లో భాగంగా భారీ ప్రాజెక్టులను చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు. గ్రామాలలో రైతుల పంటను నిల్వ చేసే సదుపాయాలకు సంబంధించి భారీ ప్రాజెక్టులు చేపడుతున్నట్టు చెప్పారు. నగరాలు, గ్రామాలలో వెల్ నెస్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
నూతన రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాల నిర్మాణం జరుగుతోందని ప్రధానమంత్రి తెలిపారు.
ఈ వెబినార్లో వివిధ స్టేక్ హోల్డర్లు ఇచ్చే సూచనలు, సలహాలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు. వారి అనుభవాలు అన్నీ ఈ ఏడాది బడ్జెట్ వేగంగా, చురుకుగా అమలు చేయడానికి పనికివస్తాయని ప్రధానమంత్రి అన్నారు.
Infrastructure development is an important pillar in the progress of any country. pic.twitter.com/ToGVYob1n2
— PMO India (@PMOIndia) March 4, 2023
हमारी सरकार आधुनिक इंफ्रास्ट्रक्चर पर रिकॉर्ड Invest कर रही है। pic.twitter.com/iiUGlc3bkE
— PMO India (@PMOIndia) March 4, 2023
Infrastructure development is the driving force of the country's economy. pic.twitter.com/s9OBaMnAiA
— PMO India (@PMOIndia) March 4, 2023
गतिशक्ति नेशनल मास्टर प्लान, भारत के Infrastructure का, भारत के Multimodal Logistics का कायाकल्प करने जा रहा है। pic.twitter.com/Dzy4FGndGo
— PMO India (@PMOIndia) March 4, 2023
Physical infrastructure की मजबूती के साथ ही देश के social infrastructure का भी मजबूत होना उतना ही आवश्यक है। pic.twitter.com/Z0pGoOSKdo
— PMO India (@PMOIndia) March 4, 2023