“ఈ ఏడాది బడ్జెట్ ను ఆచరణాత్మకంగా, పరిశ్రమ ఆధారితంగా రూపొందించడం వల్ల అది విద్యావ్యవస్థ పునాదులను మరింత బలోపేతం చేసింది. ’’
“ నూతన విద్యా విధానంలో భాగంగా విద్యకు, నైపుణ్యాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.’’
‘‘వర్చుల్ ప్రయోగశాలలు, జాతీయ డిజిటల్ లైబ్రరీ వంటి భవిష్యత్ దృష్టి కలిగిన చర్యలు మన విద్యా వ్యవస్థ, నైపుణ్యాలు, శాస్త్ర విజ్ఞానం వంటి వాటిని మొత్తంగా మార్చివేయనున్నాయి .’’
‘‘ యువతకు తరగతి గది వెలుపలి పరిస్థితులతో పరిచయం కల్పించేందుకు , కేంద్రప్రభుత్వం, ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్ లు కల్పించడం పై దృష్టిపెడుతోంది.
‘‘జాతీయ అప్రెంటీస్ షిప్ ప్రమోషన్ పథకం కింద 50 లక్షల మంది యువతకు స్టయిపండ్ అందుబాటులో ఉండేట్టు చూడడం జరిగింది.’’
“ కృత్రిమ మేథ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లకు సంబంధించి నైపుణ్యాలు కలిగిన వారిని తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టిపెడుతోంది’’

యువ శక్తిని సద్వినియోగం చేసుకోవడం –నైపుణ్యాలు, విద్య అనే అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు బడ్జెట్ అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు.  కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన వివిధ
అంశాలను చురుకుగా అమలు  చేసేందుకు తగిన సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 12 బడ్జెట్ అనంతర వెబినార్లలో ఇది మూడవది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,  అమృత్ కాల్ లో నైపుణ్యం, విద్య అనేవి రెండు ప్రధాన ఉపకరణాలని అన్నారు.  అభివృద్ధి చెందిన భారతావని దార్శనికతతో యువత, దేశ అమృతయాత్రను ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు.
 అమృత్ కాల్ కు సంబంధించిన తొలి బడ్జెట్లో యువత, వారి భవిష్యత్తు పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు.
ఈ ఏడాది బడ్జెట్ విద్యా వ్యవస్థ పునాదులను బలోపేతం చేస్తుందని, అలాగే  విద్యను మరింత ఆచరణాత్మకంగా, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూస్తోందని అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణమైన వెసులుబాటు లేకుండా ఉండేదని , ప్రస్తుతం ఈ  విషయంలో మార్పునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి వివరించారు.
“యువత సామర్ధ్యాలకు అనుగుణంగా విద్య, నైపుణ్యాలకు మెరుగుపెట్టడం జరుగుతోందని ”అన్నారు. అలాగే విద్య, నైపుణ్యాలు రెండింటికీ నూతన విద్యా విధానంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని,  ఇందుకు ఉపాధ్యాయుల నుంచి మద్దతు
లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  ఈ చర్య వల్ల ప్రభుత్వం విద్య, నైపుణ్యాల విషయంలో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తుందని,   గతంలో ఉన్న నిబంధనల భారం నుంచి ఇది   వారిని  బయటపడేస్తుందన్నారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో అనుభవాల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,  నూతన సాంకేతికత కొత్త తరహా క్లాస్ రూమ్ల రూపకల్పనకు సహాయపడుతోందని అన్నారు.

జ్ఞానాన్ని ఎక్కడి నుంచి అయనా సమకూర్చుకునేందుకు వీలు కల్పించే ఉపకరణాలపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నదని ఆయన అన్నారు.
ఇందుకు సంబంధించి ఆయన స్వయం  పేరుతో నిర్వహిస్తున్న ఈ – అభ్యసన ప్లాట్ ఫారం గురించి ప్రస్తావించారు. ఇందులో మూడు కోట్ల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. వర్చువల్ ప్రయోగశాలలు,
నేషనల్ డిజిటల్ లైబ్రరీ జ్ఞాన సముపార్జనకు గొప్ప మాధ్యమాలుగా రూపుదిద్దుకోనున్నాయన్నారు. డిటిహెచ్ ఛానళ్ల ద్వారా స్థానిక భాషలలో అభ్యసనానికి గల అవకాశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు, సాంకేతికత ఆధారిత చర్యలు దేశంలో  చేపట్టడం జరుగుతోందని, ఇవి నేషనల్ డిజిటల్ యూనివర్శిటీ నుంచి మరింత బలం సమకూర్చుకోనున్నాయన్నారు.
ఈ విధమైన భవిష్యత్ దృష్టి కలిగిన చర్యలు మన మొత్తం విద్యా వ్యవస్థలో, నైపుణ్యాలు, నాలెడ్జ్ సైన్స్ లో మార్పులు తీసుకురానున్నాయని అన్నారు. ప్రస్తుతం మన ఉపాధ్యాయుల  పాత్రను తరగతి గది కి మాత్రమే పరిమితం చేయడం జరగదని
చెప్పారు.  మన విద్యా సంస్థలకు వివిధ రకాల బోధన సమాచారం విద్యా సంస్థలకు అందుబాటులో ఉంటుందని ఇది ఉపాధ్యాయులకు నూతన అవకాశాలకు నూతన ద్వారాలు తెరవడమే కాకుండా,  గ్రామాలు, సిటీ పాఠశాలల మధ్య అంతరాన్ని తొలగిస్తుందని ఆయన అన్నారు.

 ఉపాధికి అవసరమైన అభ్యసనాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ప్రధానమంత్రి,  ప్రత్యేక ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్ షిప్ల ద్వారా తరగతి గది వెలుపల నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
నేషనల్ ఇంటర్న్షిప్ పోర్టల్ లో ప్రస్తుతం 75 వేల మంది ఎంప్లాయర్లు ఉన్నారని, ఇప్పటివరకు 25 లక్షల ఇంటర్న్షిప్లకు అవకాశాలను ఈ పోర్టల్ లో పోస్ట్ చేయడం జరిగిందన్నారు. పరిశ్రమ వర్గాలు, విద్యార్థులు
విద్యాసంస్థలు ఈ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని , ఇంటర్న్షిప్ సంస్కృతిని దేశంలో పెంపొందింప చేయాలని ప్రధానమంత్రి అన్నారు.

ఇంటర్న్షిప్లు మన యువతను భవిష్యత్తుకు సన్నద్ధం చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం ఇంటర్న్షిప్లను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.  దీనివల్ల సరైన నైపుణ్యాలు కలిగిన
యువతను గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ పథకం కింద 50 లక్షల మంది యువతకు
స్టయిపండ్ అందేలా తగిన కేటాయింపులు చేసినట్టు చెప్పారు. ఇది అప్రెంటిస్షిప్ కు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, చెల్లింపుల విషయంలో పరిశ్రమకు దోహదపడుతుందన్నారు.
నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ప్రపంచం ఇండియాను తయారీ రంగ హబ్గా చూస్తున్నదని,  దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం ఆసక్తి కనబరుస్తున్నదని ఆయన అన్నారు.
ఈ ఏడాది బడ్జెట్లో నైపుణ్యాల కల్పించడంపై దృష్టిపెట్టిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ఇది  రానున్న కాలంల లక్షలాది మంది యువతకు
నైపుణ్యాలను కల్పిస్తుందని, పునర్ నైపుణ్యాలు, నైపుణ్యాల ఉన్నతీకరణకు కృఫి చేస్తుందని అన్నారు. గిరిజనలు అవసరాలకు అనుగుణంగా అలాగే  దివ్యాంగులైన వారు,  మహిళల  అవసరాలకు అనుగుణంగా ఈ పథకం కింద
ప్రయోజనం కల్పించనున్నట్టు చెప్పారు. దేశంలో కృత్రిమ మేథ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ల విషయంలో నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయడంపై ఇది దృష్టిపెడుతుందని అన్నారు. ఫలితంగా
సిబ్బందికి శిక్షణ ఇవ్వడంపై పెద్ద ఎత్తున ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు , తమ తమ సంస్థలకు నైపుణ్యాలు కలిగిన సిబ్బందిని ఎంపిక చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని అన్నారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా పి.ఎం. విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజనను ఉదహరిస్తూ , దీని ద్వారా సంప్రదాయ కళాకారులలో, సంప్రదాయ చేతివృత్తుల వారిలో, హస్త కళాకారులలో నైపుణ్యాల అభివృద్ధికి బాటలు వేసినట్టు తెలిపారు.
వీరిని నూతన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. అలాగే వారి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చేసేందుకు సహాయపడుతున్నట్టు చెప్పారు.
 దేశ విద్యా రంగంలో మార్పు తీసుకురావడంలో విద్యాసంస్థలు, పరిశ్రమల పాత్ర, వాటి భాగస్వామ్యం వంటి వాటికి గల  ప్రాధాన్యతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  మార్కెట్ అవసరాలకు అనుగుణంగా

పరిశోధనను సుసాధ్యం చేయనున్నట్టు చెప్పారు. అలాగే  రీసెర్చ్ పరిశ్రమ నుంచి తగిన నిధుల కల్పనకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ,  కృత్రిమ మేథకు మూడు
సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఐ.సి.ఎం.ఆర్  ప్రయోగశాలలను ప్రస్తుతం వైద్య కళాశాలలకు, ప్రైవేటు రంగానికి,
పరిశోధన అభివృద్ధి బృందాలకు  అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. దేశంలో పరిశోధన ,అభివృద్ధి వాతవరణాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవలసిందిగా ఆయన ప్రైవేటు రంగాన్ని కోరారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న  సంపూర్ణ ప్రభుత్వ  విధానం గురించి ప్రస్తావిస్తూ, విద్య, నైపుణ్యాలను కేవలం ఆయా మంత్రిత్వశాఖలు, విభాగాలకు మాత్రమే పరిమితం చేయడం లేదని, దీనిని ప్రతి రంగానికి వర్తింప చేస్తున్నామని అన్నారు.
నైపుణ్యాలు, విద్య కుం సంబంధించి ఆయా రంగాలలోని వారు రాగల రోజులలో వివిధ రంగాలలో ఇందుకు గల అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఈ దిశగా తగిన  సిబ్బందికి శిక్షణ ఇచ్చే విధంగా సిద్ధం చేయాలన్నారు.
భారతదేశంలో పెద్ద ఎత్తున విస్తరిస్తున్న పౌర విమానయాన రంగం గురించి వివరణ ఇస్తూ, ఇది దేశంలో పర్యటన, పర్యాటక రంగాలలో వృద్ధిని సూచిస్తున్నదని, ఇది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తున్నదని చెప్పారు.
స్కిల్ ఇండియా మిషన్ కింద తగిన శిక్షణ పొందిన యువత వివరాలను అప్ డేట్ చేయాలని ప్రధానమంత్రి సూచించారు. డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ వంటి వాటి తర్వాత భారత మానవ వనరులు ఈ విషయంలో వెనుకబడే పరిస్థితి ఉండకూడదని
ప్రధానమంత్రి చెప్పారు. ఈ దిశగా పరిశ్రమ నిపుణులు కృషి చేయాలని సూచించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power

Media Coverage

Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Shri Atal Bihari Vajpayee ji at ‘Sadaiv Atal’
December 25, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tributes at ‘Sadaiv Atal’, the memorial site of former Prime Minister, Atal Bihari Vajpayee ji, on his birth anniversary, today. Shri Modi stated that Atal ji's life was dedicated to public service and national service and he will always continue to inspire the people of the country.

The Prime Minister posted on X:

"पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर आज दिल्ली में उनके स्मृति स्थल ‘सदैव अटल’ जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का सौभाग्य मिला। जनसेवा और राष्ट्रसेवा को समर्पित उनका जीवन देशवासियों को हमेशा प्रेरित करता रहेगा।"