ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కార్బీ ఆంగ్ లోంగ్ జిల్లా లోని దీఫూ లో జరిగిన ‘శాంతి, ఏకత మరియు అభివృద్ధి ర్యాలీ’ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇదే కార్యక్రమం లో ఆయన వేరు వేరు ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. దీఫూ లో పశు చికిత్స కళాశాల కు, పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ లో డిగ్రీ కళాశాల కు మరియు పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ జిల్లా లోనే గల కోలోంగ లో వ్యవసాయ కళాశాల కు ప్రధాన మంత్రి పునాది రాళ్ళు వేశారు. 500 కోట్ల రూపాయల కు పైగా విలువైన ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో నైపుణ్యాల సాధన కు మరియు ఉపాధి కల్పన కు కొత్త కొత్త అవకాశాల ను తీసుకు రానున్నాయి. 2950 కి పైగా అమృత్ సరోవర్ పథకాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ అమృత్ సరోవర్ లను మొత్తం సుమారు 1150 కోట్ల రూపాయల వ్యయం తో అసమ్ అభివృద్ధి చేయనుంది. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో అసమ్ గవర్నర్ శ్రీ జగదీశ్ ముఖీ మరియు అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కార్బీ ఆంగ్ లోంగ్ ప్రజలు తనకు స్నేహపూర్ణమైనటువంటి ఆహ్వానాన్ని పలికినందుకు గాను ధన్యవాదాల ను తెలియ జేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు అసమ్ ముద్దుబిడ్డ శ్రీ లచిత్ బోర్ ఫుకాన్ 400వ వార్షికోత్సవం ఒకే కాలం లో జరుగుతుండడం ఒక సంయోగం అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘దేశభక్తి కి మరియు రాష్ట్రశక్తి కి ఒక ప్రేరణ గా శ్రీ లచిత్ బోడ్ ఫుకన్ జీవనం ఉంది. కార్బీ ఆంగ్ లోంగ్ లో పుట్టిన ఈ దేశ వీర పుత్రుని కి నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
జోడు ఇంజిన్ ల ప్రభుత్వం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, మరియు సబ్ కా ప్రయాస్’ యొక్క స్ఫూర్తి తో కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ రోజు న ఈ సంకల్పం కార్బీ ఆంగ్ లోంగ్ గడ్డ పైన అదనపు బలాన్ని అందుకొంది. అసమ్ సత్వర అభివృద్ధి కి మరియు అసమ్ లో చిర శాంతి కి ఉద్దేశించిన ఒప్పందాన్ని అమలుపరచే కృషి శర వేగం గా సాగుతోంది’’ అని ఆయన అన్నారు.
ఈ రోజు న 2600కు పైగా సరోవరాల నిర్మాణం పనులు మొదలవుతున్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి గా ప్రజల భాగస్వామ్యం పై ఆధారపడిందని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసీ సముదాయాల లో ఆ తరహా సరోవరాల తాలూకు ఘనమైనటువంటి సంప్రదాయాలు ఉండనే ఉన్నాయి అని ఆయన అంగీకరించారు. ఈ సరోవరాలు నీటి ని నిల్వ చేయడం ఒక్కటే కాకుండా ఆదాయ మాధ్యమం గా కూడా మారుతాయి అనేటటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దేశం లోని ఈశాన్య ప్రాంతం లో 2014వ సంవత్సరం నుంచి కష్టాలు తగ్గుతూ వస్తున్నాయి. అంతేకాదు, అభివృద్ధి చోటు చేసుకొంటోంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ‘‘ప్రస్తుతం ఎవరైనా అసమ్ లోని ఆదివాసీ ప్రాంతాల కు విచ్చేస్తే, లేదా ఈశాన్య ప్రాంతం లోని ఇతర రాష్ట్రాల కు వెళ్తే వారు కూడాను మారుతున్న స్థితి ని మెచ్చుకొంటారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కార్బీ ఆంగ్ లోంగ్ నుంచి అనేక సంస్థల ను కిందటి సంవత్సరం లో శాంతి మరియు అభివృద్ధి ప్రక్రియ లో చేర్చడమైంది అని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. 2020వ సంవత్సరం లో కుదిరినటువంటి బోడో ఒప్పందం సైతం చిర శాంతి కి తలపుల ను తెరచింది. అదే విధం గా, త్రిపుర లో ఎన్ఐఎఫ్ టి శాంతి దిశ లో చొరవ తీసుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. రెండున్నర దశాబ్దాలు గా ఉన్న బ్రూ-రియాంగ్ చిక్కుముడి కూడా వీడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెశల్ పవర్ యాక్ట్ (ఎఎఫ్ఎస్ పిఎ) ను ఈశాన్య ప్రాంతం లోని అనేక రాష్ట్రాల లో చాలా కాలం పాటు రుద్దడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఏమైనప్పటికీ గత 8 సంవత్సరాల కాలం లో శాశ్వతమైనటువంటి శాంతి మరియు ఉత్తమమైన చట్టం, ఇంకా వ్యవస్థ ల తాలూకు స్థితిగతులు ఏర్పడినందు వల్ల ఈశాన్యం లోని అనేక ప్రాంతాల లో ఎఎఫ్ఎస్ పిఎ ను మేం ఉపసంహరించాం’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. సరిహద్దు ప్రాంతాల లో సమస్యల కు పరిష్కారాన్ని సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ తాలూకు స్ఫూర్తి తో అన్వేషించేందుకు ప్రయత్నం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘అసమ్ కు మరియు మేఘాలయ కు మధ్య కుదిరిన ఒప్పందం ఇతర అంశాల ను కూడా ప్రోత్సహించ గలుగుతుంది. ఇది యావత్తు ప్రాంతం లో అభివృద్ధి ఆకాంక్షల కు ఉత్తేజాన్ని ఇస్తుంది’’ అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.
ఆదివాసీ సముదాయాల ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఆదివాసీ సమాజం యొక్క సంస్కృతి, ఆ సమాజం యొక్క భాష, ఆ సమాజం యొక్క ఆహారం, కళ లు, చేతివృత్తులు.. ఇవి అన్నీ భారతదేశం సంపన్న వారసత్వం గా ఉన్నాయి. ఈ విషయం లో అసమ్ మరింత సమృద్ధం గా ఉంది. ఈ సాంస్కృతిక వారసత్వం భారతదేశాన్ని జోడిస్తోంది. ఇది ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి ని బలపరుస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఆజాదీ కా అమృత్ కాల్ లో కార్బీ ఆంగ్ లోంగ్ కూడా శాంతి మరియు అభివృద్ధి ల తాలూకు ఒక సరికొత్త భవిష్యత్తు వైపునకు సాగిపోతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక ఇక్కడి నుంచి మనం వెనుదిరిగి చూడవలసిన పని లేదు. రానున్న కొన్ని సంవత్సరాల లో మనం ఇంతకు మునుపు దశాబ్దుల లో ఏ అభివృద్ధి ని అయితే సాధించలేకపోయామో, ఆ అభివృద్ధి ని ఇక మీదట సాధించవలసి ఉంది అని ఆయన చెప్పారు. కేంద్రం యొక్క పథకాల ను సేవా భావం తో, సమర్పణ భావం తో అమలు పరుస్తున్నందుకు గాను అసమ్ ను మరియు ఈ ప్రాంతం లోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ను ప్రధాన మంత్రి అభినందించారు. మహిళ లు అంత పెద్ద సంఖ్య లో తరలి వచ్చినందుకు గాను ఆయన ధన్యవాదాలు పలికారు. మహిళల స్థాయి, మహిళల గౌరవం, వారు జీవించడం లో సుగమత వంటి వాటిపై తాను శ్రద్ధ వహిస్తూనే ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు.
అసమ్ ప్రజల ప్రేమ ను, మరియు ఆదరణ ను వడ్డీ తో తిరిగి చెల్లిస్తాను అంటూ భరోసా ఇస్తానంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఆ ప్రాంతం అభివృద్ధి కి కృషి చేయడం లో తనను తాను పునరంకితం చేసుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇటీవల కార్బీ తీవ్రవాద సంస్థలు ఆరిటి తో భారత ప్రభుత్వం మరియు అసమ్ ప్రభుత్వం ఒక మెమోరాండమ్ ఆఫ్ సెటిల్ మెంట్ (ఎమ్ఒఎస్) పై సంతకాలు చేయడం అనేది ఆ ప్రాంతం యొక్క శాంతి మరియు అభివృద్ధి ల పట్ల ప్రధాన మంత్రి కి ఉన్నటువంటి అచంచలమైన నిబద్ధత ను వెల్లడిస్తున్నది. ఈ మెమోరాండమ్ ఆఫ్ సెటిల్ మెంట్ ఆ ప్రాంతం లో శాంతి యొక్క నవ యుగానికి బాట ను పరచింది.
ये सुखद संयोग है कि आज जब देश आज़ादी का अमृत महोत्सव मना रहा है, तब हम इस धरती के महान सपूत लचित बोरफुकान की 400वीं जन्मजयंति भी मना रहे हैं।
— PMO India (@PMOIndia) April 28, 2022
उनका जीवन राष्ट्रभक्ति और राष्ट्रशक्ति की प्रेरणा है।
कार्बी आंगलोंग से देश के इस महान नायक को मैं नमन करता हूं: PM @narendramodi
डबल इंजन की सरकार, जहां भी हो वहां सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास की भावना से काम करती है।
— PMO India (@PMOIndia) April 28, 2022
आज ये संकल्प कार्बी आंगलोंग की इस धरती पर फिर सशक्त हुआ है।
असम की स्थाई शांति और तेज़ विकास के लिए जो समझौता हुआ था, उसको ज़मीन पर उतारने का काम तेज़ी से चल रहा है: PM
आज असम में भी 2600 से अधिक अमृत सरोवर बनाने का काम शुरु हो रहा है।
— PMO India (@PMOIndia) April 28, 2022
सरोवरों का निर्माण पूरी तरह से जनभागीदारी पर आधारित है।
ऐसे सरोवरों की तो जनजातीय समाज में एक समृद्ध परंपरा रही है।
इससे गांवों में पानी के भंडार तो बनेंगे ही, इसके साथ-साथ ये कमाई के भी स्रोत बनेंगे: PM
2014 के बाद से नॉर्थ ईस्ट में मुश्किलें कम हो रही हैं, लोगों का विकास हो रहा है।
— PMO India (@PMOIndia) April 28, 2022
आज जब कोई असम के जनजातीय क्षेत्रों में आता है, नॉर्थ ईस्ट के दूसरे राज्यों में जाता है, तो हालात को बदलते देखकर उसे भी अच्छा लगता है: PM @narendramodi
असम के अलावा त्रिपुरा में भी NLFT ने शांति के पथ पर कदम बढ़ाए।
— PMO India (@PMOIndia) April 28, 2022
करीब ढाई दशक से जो ब्रू-रियांग से जुड़ी समस्या चल रही थी, उसको भी हल किया गया: PM @narendramodi
पिछले वर्ष सितंबर में कार्बी आंगलोंग के अनेक संगठन शांति और विकास के संकल्प से जुड़े।
— PMO India (@PMOIndia) April 28, 2022
2020 में बोडो समझौते ने स्थाई शांति के नए द्वार खोले: PM @narendramodi
लंबे समय तक Armed Forces Special Power Act (AFSPA) नॉर्थ ईस्ट के अनेक राज्यों में रहा है।
— PMO India (@PMOIndia) April 28, 2022
लेकिन बीते 8 सालों के दौरान स्थाई शांति और बेहतर कानून व्यवस्था लागू होने के कारण हमने AFSPA को नॉर्थ ईस्ट के कई क्षेत्रों से हटा दिया है: PM @narendramodi
सबका साथ, सबका विकास की भावना के साथ आज सीमा से जुड़े मामलों का समाधान खोजा जा रहा है।
— PMO India (@PMOIndia) April 28, 2022
असम और मेघालय के बीच बनी सहमति दूसरे मामलों को भी प्रोत्साहित करेगी।
इससे इस पूरे क्षेत्र के विकास की आकांक्षाओं को बल मिलेगा: PM @narendramodi
जनजातीय समाज की संस्कृति, यहां की भाषा, खान-पान, कला, हस्तशिल्प, ये सभी हिंदुस्तान की समृद्ध धरोहर है।
— PMO India (@PMOIndia) April 28, 2022
असम तो इस मामले में और भी समृद्ध है।
यही सांस्कृतिक धरोहर भारत को जोड़ती है, एक भारत श्रेष्ठ भारत के भाव को मज़बूती देती है: PM @narendramodi
आज़ादी के इस अमृतकाल में कार्बी आंगलोंग भी शांति और विकास के नए भविष्य की तरफ बढ़ रहा है।
— PMO India (@PMOIndia) April 28, 2022
अब यहां से हमें पीछे मुड़कर नहीं देखना है।
आने वाले कुछ वर्षों में हमें मिलकर उस विकास की भरपाई करनी है, जो बीते दशकों में हम नहीं कर पाए: PM @narendramodi