The Rule of Law has been a core civilizational value of Indian society since ages: PM Modi
About 1500 archaic laws have been repealed, says PM Modi
No country or society of the world can claim to achieve holistic development or claim to be a just society without Gender Justice: PM Modi

అంతర్జాతీయ న్యాయ సదస్సు న్యూ ఢిల్లీ లో జరుగగా ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.  ఈ కార్యక్రమం లో సర్వోన్నత న్యాయస్థానం, వివిధ ఉన్నత న్యాయస్థానాల లోని ప్రముఖ న్యాయమూర్తుల తో పాటు ప్రసిద్ధ న్యాయవాదులు, పలు దేశాల కు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రపంచ ప్రజానీకం లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రోది చేసే న్యాయ కోవిదుల నడుమ ఒకరుగా నిలచే అవకాశం తనకు లభించడాన్ని ఎంతో గౌరవం గా భావిస్తున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  ఈ 21వ శతాబ్దపు మూడో దశాబ్దం ఆరంభం లో న్యాయ సదస్సు జరుగుతోందని ఈ సందర్భం లో గుర్తు చేశారు.  భారతదేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తం గా పలు వేగవంతమైన మార్పుల ను తీసుకువచ్చిన దశాబ్దం ఇదే అని ప్రధాన మంత్రి అన్నారు.  సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగాలు అన్నిటా ఈ మార్పు లు చోటు చేసుకొంటున్నాయని ఆయన అన్నారు.  అయితే, అవన్నీ హేతుబద్ధత, సమ న్యాయం ల ప్రాతిపదిక గా ఉండాలని ఆకాంక్షించారు.  అందువల్ల ఈ సదస్సు లో ‘న్యాయ వ్యవస్థ-మారుతున్నటువంటి ప్రపంచం’ అన్నది చర్చనీయాంశం గా ఉండటం సముచితం అని ఆయన అన్నారు.  

దేశం జాతి పిత మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాల ను నిర్వహించుకొంటున్న కాలం లో ఈ సదస్సు జరుగుతోంది అని ఆయన అన్నారు.

ఒక న్యాయవాది గా ఒక కేసు ను స్వీకరించేందుకు కమీషన్‌ చెల్లించవలసి రావడం తో మహాత్ముడు ఆ కేసు నే వదలివేసుకొన్నారని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.  తన పెంపకం తో పాటు భారతీయ సంప్రదాయాల పై, సంస్కృతి పై అధ్యయనం వల్లనే నిజాయతీ పై, సేవాధర్మం పై మహాత్ముని కి అత్యంత విశ్వాసం ఏర్పడిందని పేర్కొన్నారు.  భారతీయ తత్త్వశాస్త్రాని కి ‘న్యాయం రాజులకే రాజు.. న్యాయం సర్వోన్నతం’ అన్నదే ప్రాతిపదిక అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. 

ఒక న్యాయవాది గా ఒక కేసు ను స్వీకరించేందుకు కమీషన్‌ చెల్లించవలసి రావడం తో మహాత్ముడు ఆ కేసు నే వదలివేసుకొన్నారని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.  తన పెంపకం తో పాటు భారతీయ సంప్రదాయాల పై, సంస్కృతి పై అధ్యయనం వల్లనే నిజాయతీ పై, సేవాధర్మం పై మహాత్ముని కి అత్యంత విశ్వాసం ఏర్పడిందని పేర్కొన్నారు.  భారతీయ తత్త్వశాస్త్రాని కి ‘న్యాయం రాజులకే రాజు.. న్యాయం సర్వోన్నతం’ అన్నదే ప్రాతిపదిక అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. 

న్యాయ వ్యవస్థ ఇటీవల వెలువరించిన పలు తీర్పుల ను ఈ తాత్వికత పై గల విశ్వాసంతోనే దేశం లోని 130 కోట్ల మంది భారతీయులు శాంతియుతం గా, ప్రశాంత చిత్తం తో స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.

‘రాజ్యాంగం ఒక న్యాయవాది రూపొందించిన పత్రం కాదు. అది ఒక జీవన వాహకం.  దాని స్ఫూర్తి కలకాలం కొనసాగుతుంది’ అన్న డాక్టర్‌ బి.ఆర్‌. ఆంబేడ్ కర్‌ వ్యాఖ్య ను ప్రధాన మంత్రి ఈ సందర్భం గా ఉట్టంకించారు.  ఈ భావన ను దేశం లోని న్యాయస్థానాలు ముందుకు తీసుకుపోతున్నాయని, అలాగే మన చట్టసభ లు, కార్యనిర్వాహక వ్యవస్థ సజీవం గా ఉంచుతున్నాయని తెలిపారు.  రాజ్యాంగం లో మూడు స్తంభాలు అయినటువంటి ఈ వ్యవస్థ లు అనేక సవాళ్ల నడుమ తమ పరిమితుల ను అర్థం చేసుకుంటూ దేశాన్ని సరైన దారి లో నడిపిస్తున్నాయని చెప్పారు.  గడచిన ఐదు సంవత్సరాల లో దేశం లోని భిన్న వ్యవస్థలు ఈ సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేశాయన్నారు.  దేశం లో కాలంచెల్లిన దాదాపు 1500 చట్టాల ను వేగంగా రద్దు చేసినట్లు ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు.  అలాగే సమాజాన్ని శక్తిమంతం చేసే అనేక చట్టాల ను కూడా అదే వేగం తో ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ఈ సదస్సు కు ‘లింగ సముచిత ప్రపంచం’ ఇతివృత్తం కావడం పై ప్రధాన మంత్రి హర్షం వ్యక్తం చేశారు.  లింగపరమైన న్యాయం తో నిమిత్తం లేకుండా ప్రపంచ లోని ఏ దేశమైనా, సమాజమైనా సర్వతోముఖాభివృద్ధి ని గానీ, న్యాయాన్ని గానీ సాధించలేదని పేర్కొన్నారు.  లింగ సమతూకం తేవడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్పుల ను ప్రధాన మంత్రి వివరించారు.  ఆ మేరకు సైనిక సేవల లో మహిళల కు ప్రవేశం, యుద్ధవిమాన పైలట్ ల ఎంపిక ప్రక్రియ లో మార్పులు, గనుల లో రాత్రి వేళ పని చేసే స్వేచ్ఛ తదితరాల ను ఉట్టంకించారు.  పని చేసే మహిళల కు జీతం తో కూడిన 26 వారాల సెలవు ను ఇస్తున్న అతి కొద్ది దేశాల లో నేడు భారతదేశం కూడా ఒక దేశం అని గుర్తు చేశారు.  

ప్రగతి, పర్యావరణ సమతూకం దిశ గా న్యాయవ్యవస్థ చూపుతున్న చొరవ కు ప్రధాన మంత్రి ఈ సందర్భం గా కృతజ్ఞతలను తెలియజేస్తూ, ఈ విషయం లో మార్గదర్శకత్వాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు.  మౌలిక వసతుల సృష్టి తో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమే అని ప్రపంచాని కి భారతదేశం నిరూపించిందన్నారు.

సత్వర న్యాయ ప్రదానం లో సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  ఇందులో భాగంగా దేశం లోని ప్రతి న్యాయస్థానాన్నీ ఇ-కోర్టు ‘సమీకృత కార్యక్రమ విధాన పథకం’తో సంధానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘జాతీయ న్యాయ సమాచార నిధి’ ఏర్పాటు వల్ల న్యాయస్థానాల లో ప్రక్రియ లు సులభతరం కాగలవని ఆయన తెలిపారు.  కృత్రిమ మేధస్సు, మానవ చైతన్యాల ను ఏకీకృతం చేస్తే భారతదేశం లో న్యాయ ప్రక్రియల కు మరింత ఊతం లభిస్తుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi