"ఇది భారత దేశ క్షణం"
"భారతదేశం ముందున్న 21వ శతాబ్ది అసాధారణమైనది"
"2023 సంవత్సరంలో తోలి 75 రోజుల కాలంలో సాధించిన విజయాలు భారతదేశ క్షణానికి ప్రతిబింబం"
"భారతదేశ సంస్కృతి, సునిశిత శక్తి పట్ల ప్రపంచం కనివిని ఎరుగని విధంగా విభ్రాంతి చెందుతోంది"
"దేశం పురోగమించాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే సాహసం, శక్తి ఉండాలి"
"ప్రభుత్వం తమ గురించి శ్రద్ధ తీసుకుంటుందన్న విశ్వాసం నేడు ప్రతి ఒక్క దేశవాసిలోనూ ఏర్పడ్డాయి"
"మెం పాలనకు మానవతా దృక్పథం జోడించాం"
"నేడు భారతదేశం ఏమి సాధించినా అది ప్రజాస్వామ్యం, వ్యవస్థల శక్తి"
భారత్ దిశగా ప్రయాణాన్ని సాధికారం చేయాలి"

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలస్ లో జరిగిన ఇండియా టుడే సదస్సులో ప్రసంగించారు.

సభాసదులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సదస్సుకు ఎంపిక చేసిన "ద ఇండియా మోమెంట్" (భారతదేశ క్షణం) థీమ్ పట్ల హర్షం ప్రకటిస్తూ ప్రపంచంలోని ఉత్తమ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ఆలోచనా తత్పరులు కూడా ఇది భారతదేశ క్షణమన్నది వాస్తవం అని ధృవీకరించారు. ఇండియా టుడే గ్రూప్ అదే ఆశావహ వైఖరి ప్రకటించడం దాన్ని మరింత ప్రత్యేకం చేసింది. 20 నెలల క్రితం తాను ఎర్రకోట బురుజుల నుంచి చేసిన ప్రసంగంలో "ఇది సరైన కాలం, ఇదే సరైన సమయం" అన్న విషయం గుర్తు చేస్తూ ఇదే భారతదేశ క్షణం అని నొక్కి చెప్పాను.6

ఏదైనా జాతి అభివృద్ధి యానంలో వివిధ సవాళ్లు, దశల గురించి మాట్లాడుతూ ఈ 21వ శతాబ్ది ప్రస్తుత దశాబ్ది కాలం భారతదేశానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నదని  ప్రధానమంత్రి అన్నారు. కొన్ని దశాబ్దాల క్రితం అభివృద్ధి చెందిన దేశంగా మారిన దేశాలు ఎదుర్కొన్న విభిన్న పరిస్థితుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ప్రపంచ స్థాయి పోటీ లేని వాతావరణంలో తమతో తాము పోటీ పడడమే వారి విజయ రహస్యమని చెప్పారు. కాని నేడు భారతదేశం ఎదుర్కొంటున్న వాతావరణం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ సవాళ్లు స్వభావరీత్యా సమగ్రమైనవిగా, బహుళంగా ఉన్నాయి అన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్న "భాతదేశ క్షణం" సాధారణమైనది కాదు, అందులోనూ వందల సంవత్సరాల్లో ఒక సారి మాత్రమే వచ్చే అతి పెద్ద మహమ్మారి, రెండు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో అది మరింత ప్రత్యేకం అని నొక్కి చెప్పారు. "ఒక కొత్త చరిత్ర లిఖితమవుతోంది. మనందరం దాన్ని వీక్షిస్తున్నాం" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తం భారతదేశంపై నమ్మకం ప్రదర్శిస్తోంది అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ నేడు భారత్ ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో ప్రథమ స్థానం ఆక్రమించిన దేశం, ప్రపంచంలో ఫిన్ టెక్ అమలు రేటులో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం, ప్రపంచంలో స్టార్టప్ ల విషయంలో మూడో పెద్ద దేశం అని వివరించారు.

2023 సంవత్సరం తొలి 75 రోజుల కాలంలో దేశం సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ చారిత్రకమైన భారతదేశ హరిత బడ్జెట్ ఆవిష్కరణ, కర్ణాటకలోని శివమొగ్గలో కొత్త విమానాశ్రయం ప్రారంభం, ముంబై మెట్రో తదుపరి దశ ప్రారంభం, ప్రపంచంలోనే సుదీర్ఘ నదీ ప్రయాణం చేసే క్రూయిజ్ ప్రయాణం ముగించుకుని రావడం, బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో ఒక సెక్షన్ ప్రారంభం; ముంబై, విశాఖపట్నం నుంచి వందే భారత్ రైళ్లు ప్రారంభం; ధార్వాడ్ ఐఐటి ప్రారంభం; అండమాన్, నికోబార్ లలో 21 దీవులను 21 మంది పరమవీర్ చక్ర అవార్డుగ్రహీతలకు అంకితం చేయడం వంటివి జరిగాయని చెప్పారు. అలాగే 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో ఇ-20 పెట్రోల్ విడుదల, తుమకూరులో ఆసియాలోనే అధునాతన హెలికాప్టర్ ఫ్యాక్టరీ ప్రారంభం, చారిత్రక గరిష్ఠ సంఖ్యలో ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు ఆర్డర్ జారీ చేయడం కూడా చోటు చేసుకున్నాయన్నారు. గత 75 రోజుల కాలంలో ఇ-సంజీవని యాప్ ద్వారా 10 కోట్ల టెలీ కన్సల్టేషన్లు జరిగాయి. 8 కోట్ల కొత్త కుళాయి నీటి కనెక్షన్లు అందించడం జరిగింది. రైల్వే నెట్ వర్క్ 100 శాతం విద్యుదీకరణ పూర్తయింది. కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు ప్రవేశపెట్టారు. భారత మహిళల అండర్19 టీమ్ యు-19 టి 20 వరల్డ్ కప్ ను సాధించింది. రెండు ఆస్కార్ లు పొందిన ఆనందాన్ని దేశం అనుభవిస్తోంది అని వివరించారు. 75 రోజుల కాలంలో 28 కీలక జి-20 సమావేశాలు, ఇంధన శిఖరాగ్రం, ప్రపంచ చిరుధాన్యాల సదస్సు జరిగాయన్నారు. అలాగే బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా సదస్సులో 100కి పైగా దేశాలు పాల్గొన్నట్టు తెలిపారు. అంతే కాదు సింగపూర్ తో యుపిఐ అనుసంధానత ఏర్పాటు చేసుకున్నాం, తుర్కియే సహాయానికి ‘ఆపరేషన్ దోస్త్’ నిర్వహించాం, భారత-బంగ్లాదేశ్  ల మధ్య గ్యాస్ పైప్ లైన్ ప్రారంభించుకున్నాం అన్నారు. ‘‘ఇవన్నీ భారత క్షణానికి ప్రతిబింబం’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

నేడు భారతదేశం ఒకపక్క రోడ్లు, రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు వంటి భౌతిక మౌలిక వసతులు నిర్మించుకుంటూనే మరో పక్క భారత సంస్కృతి, సునిశిత శక్తి పట్ల ప్రపంచంలో ఎనలేని ఆకర్షణ సాధిస్తోంది అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  ‘‘నేడు యోగాకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం ఏర్పడింది. ఆయుర్వేదం, భారతదేశానికి చెందిన ఆహారాలు, పానీయాల పట్ల ఎనలేని ఆసక్తి కనిపిస్తోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు.  భారతీయ చలనచిత్రాలు, సంగీతం కొత్త శక్తితో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. భారతదేశ చిరుధాన్యాలు శ్రీఅన్న కూడా యావత్ ప్రపంచానికి చేరుతున్నాయి. అంతర్జాతీయ సోలార్ కూటమి లేదా వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతుల నిర్మాణ కూటమి ఏవైనా ‘‘ప్రపంచం మేలు’’ కోసం భారతదేశం ఆలోచనలు, సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ‘‘అందుకే నేడు ప్రపంచం చెబుతోంది – ఇది భారతదేశ క్షణం అని’’ అంటూ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  ఈ చర్యలన్నింటి బహుముఖీన ప్రభావాన్ని అన్ని దేశాలు గుర్తించాయి. చాలా దేశాలు భారతదేశానికి చెందిన ప్రాచీన విగ్రహాలను వాపసు చేస్తున్నాయి’’ అని చెప్పారు.

‘‘హామీతో ముడిపడిన పనితీరు భారతదేశ క్షణం ప్రత్యేకం’’ అని ప్రధానమంత్రి అన్నారు. గతించిపోయిన సంవత్సరాల నాటి వార్తల్లో ఎప్పుడూ లక్షలాది కోట్ల విలువ గల స్కామ్ లు, వాటిని నిరసిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి చేసే నిరసనలు అయితే నేడు అవినీతి కేసుల్లో తీసుకున్న చర్యల్లో భాగంగా  ఆ కేసుల్లో ఇరుక్కున్న వారిని వీధుల్లో తిప్పడం పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. గతంలో కుంభకోణాల వార్తల కవరేజి ద్వారా మీడియా అధికంగా టిఆర్ పిలు సాధిస్తే నేడు అవినీతిపరులపై చర్యలకు సంబంధించిన వార్తలు ప్రసారం చేసే అవకాశం పొంది టిఆర్ పి పెంచుకుంటున్నట్టు ప్రధానమంత్రి ఛలోక్తిగా అన్నారు.

గతంలో నగరాల్లో బాంబు పేలుళ్లు, నక్సలైట్లకు సంబంధించిన వార్తలు పత్రికల్లో ప్రధాన కథనాలుగా ప్రచురితమైతే నేడు శాంతి, సుసంపన్నత వార్తలు వస్తున్నాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. గతంలో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు పర్యావరణం పేరుతో నిలిచిపోయిన వార్తలు వస్తుంటే నేడు హైవేలు, ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వార్తలు వస్తున్నాయని గుర్తు చేశారు. అంతే కాదు గతంలో విషాదకరమైన రైలు ప్రమాదాల వార్తలు పత్రికల్లో వస్తే ఇప్పుడు ఆధునిక రైళ్లు ప్రవేశపెట్టినందు వల్ల ప్రమాదాలు తగ్గిన విషయం వార్తల్లో ప్రధానాంశంగా ఉన్నదని చెప్పారు.  అంతే కాదు, గతంలో ఎయిరిండియా కుంభకోణాలు, పేదరికం గురించిన వార్తలు వస్తే నేడు భారీ విమాన ఆర్డర్ల వార్తలు పతాక శీర్షికల్లో వస్తున్నట్టు తెలిపారు. ‘‘హామీ, పనితీరుతో వచ్చిన మార్పు నేటి భారతదేశ క్షణం ప్రత్యేకత’’ అని ప్రధానమంత్రి చెప్పారు. 

దేశంలో సంపూర్ణ ఆత్మ-విశ్వాసం, కట్టుబాటు పొంగిపొర్లుతూ విదేశాలు కూడా భారతదేశం పట్ల ఆశావహ వైఖరితో చూస్తుంటే కొందరు నిరాశావహమైన మాటలతో భారతదేశాన్ని అవమానపరిచేందుక, భారతదేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధానమంత్రి వివరించారు.

బానిసత్వ శకం కారణంగా దీర్ఘ కాలం పాటు భారత్ పేదరికంలో చెబుతూ ‘‘భారతదేశంలోని పేదలు వీలైనంత త్వరలో పేదరికం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. భవిష్యత్ తరాల జీవితాలతో పాటు తమ జీవితాల్లో కూడా మార్పు రావాలని సగటు భారతీయుడు వాంఛిస్తున్నాడు’’ అని ప్రధానమంత్రి చెప్పారు. అన్ని ప్రభుత్వాలు తమ సామర్థ్యం, అవగాహనతో కూడిన ప్రయత్నాల ద్వారా మాత్రమే ఫలితాలు సాధిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేటి ప్రభుత్వం కొత్త ఫలితాలు సాధించాలనుకుంటోంది, అందుకే వేగం, పరిధి పెంచింది అని చెప్పారు. రికార్డు సమయంలో దేశంలో 11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, 48 కోట్ల మందిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడం, పక్కా ఇళ్లకు చెందిన సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం వంటి ఉదాహరణలు ప్రస్తావించారు. కొత్త ఇంటి నిర్మాణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడమే కాదు, ఇళ్లన్నింటినీ జియో టాగింగ్ చేస్తున్నారని చెప్పారు. గత 9 సంవత్సరాలుగా 3 కోట్లకు పైగా ఇళ్లను నిర్మంచి పేదలకు అందించారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఇళ్లకు యాజమాన్య హక్కులు మహిళలకే అందినట్టు చెబుతూ పేద మహిళలు సాధికారంగా భావించుకున్నప్పుడే భారతదేశ క్షణం నిజమవుతుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆస్తిహక్కులు పొందడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి ప్రస్తావిస్తూ ప్రపంచంలో కేవలం 30 శాతం జనాభా చట్టపరంగా తమ ఆస్తికి పట్టాలు పొందగలుగుతున్నట్టు ప్రపంచబ్యాంకు నివేదిక తెలుపుతోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ అభివృద్ధికి ఆస్తిహక్కులు లేకపోవడమే పెద్ద అవరోధంగా ఉన్నదని చెబుతూ భారతదేశంలో డ్రోన్ టెక్నాలజీ సహాయంతో భూముల మ్యాపింగ్ చేసేందుకు రెండున్నర సంవత్సరాల క్రితం పిఎం-స్వమిత్ర యోజన ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 2,34,000 గ్రామాల్లో డ్రోన్ సర్వే ముగించి 1,22,00,000 ప్రాపర్టీ కార్డులు అందించడం జరిగినట్టు తెలిపారు. ‘‘ఇలాంటివే ఎన్నో విప్లవాలు భారతదేశంలో చోటు చేసుకుంటున్నాయి. ఇవే భారతదేశ క్షణానికి పునాదిగా నిలుస్తున్నాయి’’ అని ప్రధానమంత్రి చెప్పారు. పిఎం కిసాన్  సమ్మాన్ నిధి  ద్వారా రూ.2.5 లక్షల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని, తద్వారా 11 కోట్ల మంది చిన్న రైతులు లబ్ధి పొందారని ఆయన తెలియచేశారు.

‘‘విధాన నిర్ణయాల్లో స్తబ్ధత, యథాతథ స్థితి ఏ దేశ పురోగతికైనా పెద్ద అవరోధం’’ అని ప్రధానమంత్రి అన్నారు. కాలం చెల్లిపోయిన ఆలోచనా ధోరణులు, వైఖరి;  కొన్ని కుటుంబాల పరిములు భారతదేశంలో సుదీర్ఘ స్తబ్ధతకు కారణమయ్యాయని విమర్శిస్తూ ఏ దేశం అయినా పురోగమించాలంటే సాహసోపేతమైన విధాన నిర్ణయశక్తి, వేగం ఉండాలని ఆయన చెప్పారు. ఒక దేశం పురోగమించాలంటే కొత్తదనాన్ని ఆమోదించగల సామర్థ్యం, పరిశోధనాత్మక ఆలోచనా ధోరణి ఉండాలి;  దేశ ప్రజల సామర్థ్యాలు, ప్రతిభపై విశ్వాసం కలిగి ఉండాలి...అన్నింటికీ మించి లక్ష్యాలు సాధించడంలో ప్రజల ఆశీస్సులు, భాగస్వామ్యం ఉండాలి అన్నారు. ప్రభుత్వం ద్వారానే సమస్యలకు పరిష్కారాలు సాధించాలన్న వైఖరి, అధికారం వల్ల పరిమిత ఫలితాలు మాత్రమే ఉంటాయి; కాని 130 కోట్ల మంది బలం సమీకరించి, ప్రతీ ఒక్కరి ప్రయత్నం జోడైనట్టయితే దేశం ముందు ఏ సమస్యా నిలవదు అన్నారు. దేశంలో పాలనలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం అత్యంత ప్రధానమని పేర్కొంటూ ప్రభుత్వం తమ సంక్షేమానికి పాటు పడుతుందనే విశ్వాసం నేడు ప్రజల్లో ఏర్పడిందని చెప్పారు. ‘‘సత్పరిపాలనలో మానవతా కోణం, సునిశితత్వం ఉంటాయి. మేం పాలనకు ఆ మానవతను జోడించాం. అలాంటప్పుడే ఎవరైనా పెద్ద ప్రభావాన్ని చూడగలరు’’ అని చెబుతూ వైబ్రెంట్ విలేజ్ స్కీమ్ ను ఇందుకు ఉదాహరణగా ఉటంకించారు.  దేశంలో తొలి గ్రామంగా ఇలాంటి గ్రామాలు ప్రాంతీయాభివృద్ధికి దోహదపడగలుగుతాయన్నారు. కేంద్రమంత్రులు తరచు ఈశాన్య రాష్ర్టాలను సందర్శిస్తూ పాలనకు మానవతను జోడించారని ఆయన చెప్పారు. తాను ఈశాన్య రాష్ర్టాలను స్వయంగా 50 సార్లు సందర్శించానన్నారు. సునిశితత్వం ఈశాన్యంతో దూరాన్ని తగ్గించడమే కాదు, అక్కడ శాంతి స్థాపనకు కూడా దోహదపడిందని చెప్పారు.

ఉక్రెయిన్  సంక్షోభ సమయంలో ప్రభుత్వం పని సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ ఆ సమయంలో ప్రభుత్వం 14 వేల కుటుంబాలతో అనుసంధానం అయింది, ప్రతీ ఒక్క కుటుంబానికి ఒక ప్రతినిధిని పంపింది అని చెప్పారు. ‘‘కష్టకాలంలో ప్రభుత్వం మాతో ఉంది అనే భరోసా మేం కల్పించాం’’, ‘‘సంపూర్ణ మానవతాపూర్వకమైన చర్యల ద్వారా భారత క్షణానికి శక్తి అందింది’’ అన్నారు. పాలనలోమానవతా కోణం లోపించినట్టయితే కరోనా వంటి భారీ మహమ్మారిపై విజయం సాధ్యమై ఉండేది కాదు అని నొక్కి చెప్పారు.

‘‘నేడు భారతదేశం ఏం సాధించినా అది ప్రజాస్వామిక శక్తి, వ్యవస్థల బలం వల్లనే సాధ్యమయింది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పటిష్ఠమైన నిర్ణయాలు తీసుకోగలుగుతోందనే విషయాన్ని ప్రపంచం యావత్తు వీక్షిస్తున్నదని చెప్పారు. గత కొన్నేళ్ల కాలంలో భారతదేశం ఎన్నో కొత్త సంస్థల ఏర్పాటుకు కారణమయిందన్నారు. అంతర్జాతీయ సోలార్ అలయన్స్, వైపరీత్యాలను తట్టుకోగల మౌలిక వసతుల కూటమి వంటివి ఇందుకు ఉదాహరణగా చూపారు. దేశానికి భవిష్యత్  ప్రణాళికను రూపొందించడంలో నీతి ఆయోగ్ పాత్ర గురించి కూడా ప్రస్తావించారు. దేశంలో కార్పొరేట్ పాలనను పటిష్ఠం చేయడంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్  కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జిఎస్ టి కౌన్సిల్ దేశంలో ఆధునిక పన్ను వ్యవస్థ కల్పనకు మూలంగా నిలుస్తున్నట్టు చెప్పారు. కరోనా మధ్యలో కూడా దేశంలో ఎన్నో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ‘‘నేడు ప్రపంచ సంక్షోభం నడుమన భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచింది, బ్యాంకింగ్ వ్యవస్థ, ఇతర వ్యవస్థలు పటిష్ఠంగా ఉన్నాయి’’ అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 220 కోట్ల కరోనా వ్యాక్సిన్  డోస్  లను అందించగలిగినట్టు చెప్పారు. ‘‘ఈ కారణంగానే మన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక వ్యవస్థలపై తరచు దాడులు జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి దాడులెన్ని జరుగుతున్నప్పటికీ భారతదేశం లక్ష్యాల సాధన దిశగా పురోగమించి లక్ష్యాలు సాధిస్తూనే ఉంటుందన్న నమ్మకం నాకుంది’’ అని చెప్పారు.

తన ప్రసంగాన్ని ముగిస్తూ భారత మీడియా ప్రపంచవ్యాప్తంగా తన పాత్రను విస్తరించాలని ప్రధానమంత్రి అన్నారు. ‘‘మనం ‘సబ్ కా ప్రయాస్’తో భారతదేశ క్షణాన్ని శక్తివంతం చేయాలి, ఆజాదీ కా ఆజాదీ కా అమృత్  మహోత్సవ్  కాలంలో అభివృద్ధి చెందిన భారత్ దిశగా ప్రయాణాన్ని సాధికారం చేయాలి" అన్నారు. 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Private equity investments in Indian real estate sector increase by 10%

Media Coverage

Private equity investments in Indian real estate sector increase by 10%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India