‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో భాగం గా ప్రారంభించిన కొత్తకార్యక్రమాలు విద్య రంగం లో క్రాంతి ని తీసుకు వచ్చి, భారతదేశ విద్య వ్యవస్థ నుప్రపంచ చిత్ర పటం లో చేర్చుతాయి: ప్రధాన మంత్రి
మనం పరివర్తనదశ లో ఉన్నాం; అదృష్టవశాత్తు మన దగ్గర ఆధునికమైన, భవిష్యద్దర్శనంకలిగిన ఒక కొత్త జాతీయ విద్య విధానం సైతం ఉంది: ప్రధాన మంత్రి
ప్రజలు పాలుపంచుకోవడంఅనేది మళ్లీ భారతదేశం జాతీయ స్వభావం గా రూపుదాల్చుతున్నది: ప్రధాన మంత్రి
ఒలింపిక్క్రీడోత్సవాల లోను, పారాలింపిక్స్ లోను పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు/ క్రీడాకారిణి ప్రధాన మంత్రిఅభ్యర్ధించిన మేరకు 75 పాఠశాలల ను సందర్శిస్తారు
విద్యరంగం లోని నూతన మార్పు లు కేవలం విధానం ఆధారితమైనవే కాదు, అవిభాగస్వామ్యం ఆధారితమైనవి గా కూడానుఉన్నాయి: ప్రధాన మంత్రి
శం యొక్క‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కావిశ్వాస్’ లతో పాటు ‘సబ్ కా ప్రయాస్’ సంకల్పానికి ‘విద్యాంజలి 2.0’ ఒకవేదిక వలె ఉంది: ప్రధాన మంత్రి
'విద్యసంబంధి కార్యకలాపాలన్నిటి మధ్య ఒక సూపర్ కనెక్ట్ లాగా ‘ఎన్-డియర్’ ఉంటుంది: ప్రధాన మంత్రి
యోగ్యత ఆధారితమైన బోధన ను, కళ ల ఏకీ
విద్యసంబంధి కార్యకలాపాలన్నిటి మధ్య ఒక సూపర్ కనెక్ట్ లాగా ‘ఎన్-డియర్’ ఉంటుంది: ప్రధాన మంత్రి

‘శిక్షక్ పర్వ్’ తాలూకు ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఆయన భారతీయ సంజ్ఞా భాషా నిఘంటువు (వినికిడి లోపం ఉన్నవారి కి యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్‌ కు అనుగుణం గా ఆడియో మరియు టెక్స్ ట్ ఎంబెడెడ్ సంజ్ఞ భాష వీడియో) ను, మాట్లాడే పుస్తకాలు (దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందినటువంటి ఆడియో బుక్స్) ను, సిబిఎస్ఇ యొక్క స్కూల్ క్వాలిటీ అశ్యోరన్స్ ఎండ్ అసెస్‌ మెంట్ ఫ్రేమ్ వర్క్ ను, ‘నిపుణ్ భారత్’ కు ఉద్దేశించినటువంటి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం అయిన ‘నిష్ఠ’ ను, విద్యాంజలి పోర్టల్ ను (పాఠశాల అభివృద్ధి కి విద్య వాలంటియర్ లు/ దాత లు/ సిఎస్ఆర్ సహకారాన్ని సులభతరం చేయడం కోసం ఉద్దేశించింది) కూడా ప్రారంభించారు.

మంత్రి ఈ సందర్భం లో సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జాతీయ పురస్కారాల ను అందుకొన్న గురువుల కు అభినందన లు తెలిపారు. కష్ట కాలాల్లో దేశం లో విద్యార్థుల భవిష్యత్తు ను దిద్ది తీర్చడానికి ఉపాధ్యాయులు అందించిన తోడ్పాటు ను ఆయన ప్రశంసించారు. ఈ రోజు న ‘శిక్షక్ పర్వ్’ సందర్భం లో అనేక కొత్త పథకాల ను మొదలుపెట్టుకోవడం జరిగింది. దేశం ప్రస్తుతం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటూ స్వాతంత్య్రం వచ్చిన 100 సంవత్సరాల కు భారతదేశం ఏ విధం గా ఉండాలి అనే అంశం లో కొత్త సంకల్పాల ను తీసుకొంటున్న నేపథ్యం లో ఆ పథకాలు మహత్వపూర్ణమైన పథకాలు అని ఆయన అన్నారు. మహమ్మారి రువ్విన సవాలు కు స్పందించినందుకు విద్యార్థుల ను, ఉపాధ్యాయుల ను, యావత్తు విద్య రంగ సముదాయాన్ని మంత్రి మెచ్చుకొని, ఆ కష్ట కాలాన్ని తట్టుకొని నిలబడటానికి వీలు గా అభివృద్ధి పరచిన సామర్ధ్యాల ను మరింతగా ముందుకు తీసుకుపోవలసిందిగా వారిని కోరారు. ‘‘మనం ఒక పరివర్తన దశ లో ఉన్నాం అని భావించినట్లయితే గనక, అదృష్టవశాత్తు మనకు అండ గా ఒక ఆధునికమైనటువంటి, భవిష్యత్ దర్శనం కలిగినటువంటి నూతన జాతీయ విద్య విధానం ఉంది’’ అని ఆయన అన్నారు.

జాతీయ విద్య విధానం రూపకల్పన లో, మరి అలాగే ఆ విధానం అమలు లో ప్రతి ఒక్క స్థాయి లో గురువులు, నిపుణులు, విద్య రంగ పండితుల తోడ్పాటు లభించిందంటూ ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఈ భాగస్వామ్యాన్ని ఒక కొత్త స్థాయి కి తీసుకుపోవాలని, అలాగే దీని అమలు లో సమాజం పాలుపంచుకొనేటట్లుగా చేయాలని ప్రతి ఒక్కరి కి ఆయన విజ్ఞప్తి చేశారు. విద్య రంగం లో ఈ పరివర్తన లు ఒక్క విధానం ఆధారితమైనవి మాత్రమే కాదు, కానీ ప్రాతినిధ్యం ఆధారితమైనవి కూడాను అని ఆయన అన్నారు.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ కు జత గా ‘సబ్ కా ప్రయాస్’ అనేటటువంటి దేశం సంకల్పాని కి ‘విద్యాంజలి 2.0’ ఒక వేదిక మాదిరి గా పని చేస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. దీనికోసం సమాజం లో, మన ప్రైవేటు రంగం ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్య తాలూకు నాణ్యత ను పెంచడంలో తోడ్పడి తీరాలి అని ఆయన అన్నారు.

కొన్ని సంవత్సరాల లో ప్రజల భాగస్వామ్యం అనేది మరో మారు భారతదేశం యొక్క జాతీయ స్వభావం గా మారుతోంది అని ప్రధాన మంత్రి చెప్పారు. గత 6-7 సంవత్సరాల లో ప్రజల భాగస్వామ్యం తాలూకు సామర్థ్యం కారణం గా భారతదేశం లో ఇదివరకు ఊహించడానికైనా కష్టం గా తోచినటువంటి అనేక కార్యాల ను పూర్తి చేయడం జరిగింది అని ఆయన అన్నారు. ఏదైనా కార్యాన్ని సమాజం కలసికట్టు గా చేసినప్పుడు, ఆశించిన ఫలితాలు అందడం తథ్యం అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు, వారు జీవనం లో ఏ రంగాని కి చెందిన వారు అయినప్పటికీ, యువత భవిష్యత్తు ను మలచడం లో ఒక పాత్ర ను కలిగి ఉంటారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఇటీవలే ముగిసిన ఒలింపిక్స్ లోను, పారాలింపిక్స్ లోను మన క్రీడాకారులు, క్రీడాకారిణులు గొప్ప గా రాణించారు అని ఆయన గుర్తు కు తెచ్చారు. ఆటగాళ్ళ లో ప్రతి ఒక్కరు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కాలం లో కనీసం 75 పాఠశాల లను సందర్శించాలి అంటూ తాను చేసిన విన్నపాన్ని మన్నించినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, అనేక మంది ప్రతిభావంతులు ప్రేరణ ను పొందేటట్లు చేస్తుంది, క్రీడల రంగం లో ముందడుగు వేయడం కోసం వారికి ప్రోత్సాహం అందుతుంది అని ఆయన అన్నారు.

దేశం అయినా ప్రగతి ని సాధించాలి అంటే విద్య కేవలం అందరినీ కలుపుకుపోయేది గా ఉండటమే కాకుండా, అందరికీ సమానమైన విద్యార్జన అవకాశాలు కూడా లభించాలి అని ప్రధాన మంత్రి అన్నారు. నేశనల్ డిజిటల్ ఆర్కిటెక్చర్ (‘ఎన్- డిఇఎఆర్’.. ‘ఎన్- డియర్’) అనేది విద్య లో, విద్య ఆధునికీకరణ లో అసమానత ల నిర్మూలన లో ఒక ప్రధాన పాత్ర ను పోషించే అవకాశం ఉంది అని కూడా ఆయన అన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని యుపిఐ ఇంటర్ ఫేస్ విప్లవాత్మకమైన మార్పుల కు బాట ను పరచిన విధంగానే అనేక విద్యా సంబంధ కార్యకలాపాల మధ్య ఒక ‘సూపర్-కనెక్ట్’ గా ఎన్- డియర్ ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. టాకింగ్ బుక్స్, ఆడియో బుక్స్ వంటి సాంకేతికత ను విద్య లో ఒక భాగం గా దేశం ప్రవేశపెట్టుకొంటోంది అని ఆయన వివరించారు.

పాఠ్య క్రమం, విద్య ను బోధించేటటువంటి కళ, మూల్యాంకనం, మౌలిక సదుపాయాలు, అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి అభ్యాసాలు, పాలన ప్రక్రియ వంటి పార్శ్వాల లో ఒక సామాన్నయ శాస్త్రీయ ఫ్రేమ్ వర్క్ లోపించడం అనేటటువంటి కొరత ను ఈ రోజు న మొదలుపెట్టిన స్కూల్ క్వాలిటీ అసెస్‌మెంట్ ఎండ్ ఎశ్యోరెన్స్ ఫ్రేమ్ వర్క్ (ఎస్.క్యు.ఎ.ఎ.ఎఫ్) పరిష్కరిస్తుంది. ఈ అసమానత ను తొలగించడంలో ఎస్ క్యుఎఎఎఫ్ తోడ్పడుతుందని ఆయన అన్నారు.

శర వేగం గా మార్పుకు లోనవుతున్న ప్రస్తుత యుగం లో మన గురువు లు సైతం కొత్త కొత్త వ్యవస్థల ను, మెలకువల ను అంతే వేగం గా నేర్చుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం ఈ విధమైన మార్పుల ను దృష్టి పెట్టుకొని ‘నిష్ఠ’ శిక్షణ కార్యక్రమాల ద్వారా తన గురువుల ను సన్నద్ధం చేస్తోంది అని ఆయన వెల్లడించారు.

భారతదేశం లో గురువు లు ఏ ప్రపంచ ప్రమాణాన్ని అయినా సరే అందుకోవడమే కాకుండా వారివద్ద వారిదైన ఒక ప్రత్యేకమైన పెట్టుబడి కూడా ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రత్యేకమైన పెట్టుబడి ,ఈ విలక్షణమైన బలం ఏమిటి అయ్యా అంటే అవి వారి లో అంతర్గతం గా ఇమిడిపోయి ఉన్నటువంటి భారతీయ సంస్కృతే అని ఆయన చెప్పారు. మన ఉపాధ్యాయులు వారి పని ని అది ఒక వృత్తి అని మాత్రమే ఎంచరు, బోధన అనేది వారికి ఒక మానవీయ సహానుభూతి, ఒక పవిత్రమైన నైతిక కర్తవ్యం గా దానిని వారు చూస్తారు అని ఆయన అన్నారు. ఈ కారణం గా మన దేశం లో గురువు కు, బాలల కు మధ్య ఒక వృత్తిపరమైన సంబంధాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబిక అనుబంధం ఉంటుంది, మరి ఈ అనుబంధం జీవన పర్యంతం కొనసాగుతుంది అని ప్రధాన మంత్రి చెప్పారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi