‘‘నిజాయతీ యుక్త ప్రభుత్వ ప్రయాస లు మరియు సాధికారిత యుక్త పేద ల ప్రయాస లు చెట్టాపట్టాల్వేసుకొన్నప్పుడు పేదరికం ఓడిపోతుంది’’
‘‘పేదల కు పక్కా ఇళ్ళ ను సమకూర్చే ప్రచార ఉద్యమం అనేది ప్రభుత్వ పథకం ఒక్కటేకాదు, అది గ్రామీణ పేదల లో విశ్వాసాన్ని ఏర్పరచాలనే నిబద్ధత కూడాను’’
‘‘పథకాల ద్వారా అందరికి మేలు కలగాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోవడం ద్వారాప్రభుత్వం అవినీతి కి మరియు వివక్ష కు గల ఆస్కారాన్ని నివారిస్తున్నది’’
ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థ మరియు పంచాయతీ ప్రతి ఒక్క జిల్లా లో 75 అమృత సరోవరాలు ఏర్పాటు చేయడం కోసంపాటుపడనున్నాయి

మధ్య ప్రదేశ్ లో దాదాపు గా 5.21 లక్షల మంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ లబ్ధిదారుల ‘గృహ ప్రవేశం’ కార్యక్రమం ఈ రోజు న జరుగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో పాల్గొన్న వారి లో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభ్యులు ఉన్నారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, రానున్న కొత్త సంవత్సరం విక్రమ్ సంవత్ లో ‘గృహ ప్రవేశం’ జరుపుకొంటున్నందుకు లబ్ధిదారుల కు అభినందనల ను తెలియజేశారు. ఇది వరకు రాజకీయ పక్షాలు అవి చెప్పుకొంటూ వచ్చిన దానికి భిన్నం గా పేదల కు పెద్ద గా ఏమీ చేయలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఒకసారి పేదలు గనుక సాధికారిత కు నోచుకొన్నారా అంటే అప్పుడు వారు పేదరికం తో పోరాటం జరపడం కోసం అవసరమైన సాహసాన్ని సంపాదించుకొంటారు. ఎప్పుడైతే ఒక చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం యొక్క కృషి మరియు సాధికారత పొందిన పేదల కృషి జతపడతాయో అప్పుడు ఇక పేదరికం ఓటమి పాలవుతుంది’’ అని ఆయన అన్నారు.

‘‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా నిర్మాణం జరిగిన ఈ 5.25 లక్షల ఇళ్ళు కేవలం గణాంకాలు కాదు. ఈ 5.25 లక్షల గృహాలు దేశం లోని పేదలు బలపడటానికి గుర్తింపు గా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. పేద ప్రజల కు పక్కా ఇళ్ళ ను సమకూర్చాలి అనేటటువంటి ఈ ప్రచార ఉద్యమం ప్రభుత్వ పథకమొక్కటే కాక, ఇది గ్రామీణ పేదల లో విశ్వాసాన్ని సంతరించాలనేటటువంటి ఒక వాగ్దానం కూడాను అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఇది పేదల ను పేదరంకి నుంచి బయటకు తీసుకు రావడం లో మొదటి అడుగు’’ అని ఆయన అన్నారు. ‘‘ఈ గృహాలు సేవ చేయాలి అనే ఒక ఉత్సాహాని కి, మరి అదే విధం గా గ్రామీణ మహిళల ను ‘లక్షాధికారుల ను’ చేయాలి అనేటటువంటి ఒక ప్రచార ఉద్యమాని కి అద్దం పడుతున్నాయి’’ అని ఆయన అన్నారు.

ఇది వరకు కొన్ని లక్షల ఇళ్ళ ను నిర్మించగా, ఈ ప్రభుత్వం ఇప్పటికే 2.5 కోట్ల పక్కా ఇళ్ళ ను అప్పగించింది, వీటిలో 2 కోట్ల ఇళ్ళు గ్రామీణ ప్రాంతాల లో ఏర్పాటయ్యాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మహమ్మారి సైతం ఈ ప్రచార ఉద్యమాన్ని నెమ్మదించ లేకపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. మధ్య ప్రదేశ్ లో ఆమోదం లభించిన 30 లక్షల ఇళ్ళ లో ఇప్పటికే 24 లక్షల గృహాల నిర్మాణం పూర్తి అయి, బైగా, సహరియా, భరియా సముదాయాల ప్రజల తో పాటు విస్తృత జనావళి కి ప్రయోజనం చేకూరింది అని ఆయన అన్నారు.

పిఎమ్ఎవై లో భాగం గా తయారైన ఇళ్ళు స్నానపు గది, సౌభాగ్య యోజన తాలూకు విద్యుత్తు కనెక్శన్, ఉజాలా పథకం లో భాగం గా ఎల్ఇడి బల్బు, ఉజ్జ్వల పథకం పరిధి లో గ్యాస్ కనెక్శన్ లతో పాటు గా హర్ ఘర్ జల్ లో భాగం గా నీటి సదుపాయం వంటి సౌకర్యాల తో ఏర్పాటు అయ్యాయి. తత్ఫలితం గా ఈ ప్రయోజనాల కోసమని లబ్ధిదారులు ఎక్కడెక్కడికో పరుగులు తీసే యాతన తప్పింది అని ప్రధాన మంత్రి అన్నారు.

పిఎమ్ఎవై లో భాగం గా నిర్మించిన ఇళ్ళ లో సుమారు గా రెండు కోట్ల గృహాలు మహిళల పేరుల తో నమోదు అయ్యాయని ప్రధాన మంత్రి వివరించారు. ఈ యాజమాన్య భావన అనేది కుటుంబం లో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం లో మహిళల ప్రాతినిధ్యాన్ని బలపరిచిందని ఆయన అన్నారు. మహిళల కు జీవించడం లో సౌలభ్యాన్ని మరియు వారి గౌరవాన్ని పెంచడం కోసం ప్రభుత్వం కంకణం కట్టుకొందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, గడచిన రెండున్నర సంవత్సరాల కాలం లో 6 కోట్ల కు పైగా కుటుంబాల కు తాగే నీటి కోసం నల్లా నీటి కనెక్శన్ లను ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.

పేద ప్రజల కు ఉచితం గా ఆహారాన్ని అందించడం కోసం 2 లక్షల 60 వేల కోట్ల రూపాయల సొమ్ము ను ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పథకాన్ని రాబోయే ఆరు నెలల పాటు పొడిగించటం జరిగినందువల్ల దీని కోసం అదనం గా 80 వేల కోట్ల రూపాయల సొమ్ము ను వెచ్చించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. లక్షిత లబ్ధిదారుల కు పూర్తి ప్రయోజనాన్ని అందించాలన్న ప్రభుత్వ వాగ్దానాని కి అనుగుణం గా 4 కోట్ల నకిలీ లబ్ధిదారుల ను రికార్డుల లో నుంచి ఏరివేయడం జరిగింది. 2014వ సంవత్సరం తరువాత అమలు చేసిన ఈ అభ్యాసం వల్ల పేదల కు వారి కి అందవలసిన ప్రయోజనం అందడం తో పాటు నిజాయతీ లోపించినటువంటి శక్తుల వల్ల స్వాహా అవుతూ వచ్చిన సొమ్ము ను ఆదా చేయడం జరిగింది. అమృత కాలం లో కనీస సౌకర్యాల ను ప్రతి ఒక్క లబ్ధిదారు చెంతకు తీసుకు పోయేందుకు ప్రయాస సాగుతున్నది అని ప్రధాన మంత్రి వివరించారు. పథకాలు వాటి నిర్ధిష్ట లక్ష్యాల ను చేరుకొనేటట్లుగా చూడాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం ద్వారా వివక్ష కు మరియు అవినీతి కి ఎటువంటి ఆస్కారాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదని ప్రధాన మంత్రి అన్నారు.

స్వామిత్వ పథకం లో భాగం గా సంపత్తి రికార్డు ను ఖాయం చేయడం ద్వారా పల్లెల లో వ్యాపార తరహా వాతావరణాన్ని ప్రభుత్వం సడలిస్తున్నది. మధ్య ప్రదేశ్ లో, అన్ని జిల్లాల లో కలుపుకొని 50 వేల గ్రామాల లో ప్రస్తుతం సర్వేక్షణ కొనసాగుతోంది.

చాలా కాలం గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను వ్యవసాయాని కి పరిమితం చేయడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. డ్రోన్ ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పాటు ప్రాకృతిక వ్యవసాయం వంటి ప్రాచీన పద్ధతుల ను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం గ్రామాల లో సరికొత్త దారుల ను పరుస్తోందని ఆయన అన్నారు. ఎమ్ఎస్ పి కొనుగోళ్ళ లో కొత్త రికార్డుల ను ఏర్పరచినందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి ని ఆయన అభినందించారు. మధ్య ప్రదేశ్ రైతులు పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 13 వేల కోట్ల రూపాయల ను అందుకొన్నారని ప్రధాన మంత్రి అన్నారు.

రాబోయే కొత్త సంవత్సరం లో 75 అమృత సరోవరాల (సరస్సుల ను ప్రతి జిల్లా లో నిర్మించాలి అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఈ సరస్సు లు కొత్త గా, పెద్దవి గా ఉండాలి అని ఆయన సూచించారు. దీని కోసం ఎమ్ఎన్ఆర్ఇజిఎ నిధుల ను వినియోగించుకోవచ్చు. మరి ఇది భూమి కి, ప్రకృతి కి, చిన్న రైతుల కు, మహిళల కు, చివరకు పశు పక్ష్యాదుల కు కూడాను ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది అని ఆయన అన్నారు. ఈ దిశ లో పాటుపడవలసింది గా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాని కి, స్థానిక సంస్థల కు మరియు పంచాయతీల కు ఆయన విజ్ఞప్తి చేశారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi