“ ఈ నాల్గవ పారిశ్రామిక విప్లవ యుగంలో, సాంకేతికత ఉపాధికి ప్రధాన చోదక శక్తిగా మారింది - కొనసాగుతుంది"
"నైపుణ్యం, రీ-స్కిల్లింగ్ , అప్-స్కిలింగ్ భవిష్యత్తు శ్రామిక శక్తికి మంత్రాలు"
“ప్రపంచంలోనే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అత్యధికంగా అందించే దేశాల్లో ఒకటిగా భారత్ సామర్ధ్యం కలిగి ఉంది”
“ప్రతి దేశ ప్రత్యేక ఆర్థిక సామర్థ్యాలు, బలాలు, సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలి; సామాజిక రక్షణకు స్థిరమైన ఫైనాన్సింగ్ కోసం అన్నింటికీ ఒకే-పరిమాణం-సరిపోయే విధానాన్ని అవలంబించడం సరి కాదు.”

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన జీ20 కార్మిక, ఉపాధి శాఖ మంత్రుల

సమావేశంలో వీడియో సందేశం ద్వారా

ప్రసంగించారు.

 

ఇండోర్ కు ప్రముఖులకు స్వాగతం పలికిన ప్రధాన మంత్రి, చారిత్రాత్మక,  చైతన్యవంతమైన ఇండోర్ నగరం దాని గొప్ప పాక సంప్రదాయాలకు గర్వకారణమని, ప్రముఖులు ఈ నగరాన్ని దాని అన్ని రంగులు , రుచులతో ఆస్వాదించగలరని ఆకాంక్షించారు.

 

ఉపాధి అనేది అత్యంత ముఖ్యమైన ఆర్థిక, సామాజిక కారకాల్లో ఒకటని పేర్కొంటూ, ప్రపంచం ఉపాధి రంగంలో కొన్ని గొప్ప మార్పులకు ముంగిట ఉందని, ఈ వేగవంతమైన పరివర్తనలను పరిష్కరించడానికి ప్రతిస్పందించే , సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ప్రస్తుత నాల్గవ పారిశ్రామిక విప్లవ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపాధికి ప్రధాన చోదకశక్తిగా మారిందని, అది ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.

గతంలో ఇటువంటి సాంకేతిక ఆధారిత మార్పు సమయంలో లెక్కలేనన్ని టెక్నాలజీ ఉద్యోగాలను సృష్టించడంలో భారతదేశం ప్రదర్శించిన సామర్థ్యాన్ని ఆయన ప్రముఖంగా వివరించారు. ఇటువంటి మార్పుల కొత్త ప్రభంజనానికి  నాయకత్వం వహిస్తున్న అనేక స్టార్టప్ లకు ప్రస్తుత సదస్సు ఆతిథ్య నగరం ఇండోర్ కూడా నిలయంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు.

 

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రక్రియల వినియోగంతో శ్రామిక శక్తిలో నైపుణ్యం పెంపొందించాలని, నైపుణ్యం, రీ-స్కిల్లింగ్, అప్ స్కిలింగ్ భవిష్యత్ శ్రామిక శక్తికి మంత్రాలు అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశ  'స్కిల్ ఇండియా మిషన్' దీనిని నిజం చేసే ఉదాహరణ అని, అలాగే, 'ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన' ఇప్పటివరకు 12.5 మిలియన్లకు పైగా భారతీయ యువతకు శిక్షణ ఇచ్చిందని, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు వంటి పరిశ్రమల 'ఫోర్ పాయింట్ ఓ' రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు.

 

కోవిడ్ సమయంలో భారతదేశ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ల నైపుణ్యాలు , అంకితభావాన్ని ప్రధాన మంత్రి ప్రముఖంగా గుర్తు చేశారు. ఇది భారతదేశ సేవా , కరుణ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అందించే అతిపెద్ద దేశంగా భారత్ అవతరించే అవకాశం ఉందని, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ శ్రామిక శక్తి సాకారమవుతుందని ఆయన అన్నారు. నిజమైన అర్థంలో నైపుణ్యాల అభివృద్ధి , భాగస్వామ్యాన్ని గ్లోబలైజ్ చేయడంలో జి 20 పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు. నైపుణ్యాలు, అర్హతల ఆవశ్యకతల ద్వారా వృత్తులను అంతర్జాతీయంగా సూచించడానికి సభ్య దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి ప్రశంసించారు. దీనికి అంతర్జాతీయ సహకారం, సమన్వయం, వలసలు, మొబిలిటీ భాగస్వామ్యాల కొత్త నమూనాలు అవసరమని ఆయన అన్నారు. మెరుగైన నైపుణ్యం, శ్రామిక శక్తి ప్రణాళిక ,లాభదాయక ఉపాధి కోసం సాక్ష్యం ఆధారిత విధానాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు అధికారం ఇచ్చే ప్రారంభానికి యజమానులు , కార్మికులకు సంబంధించిన గణాంకాలు, సమాచారం, డేటాను పంచుకోవాలని ఆయన సూచించారు.

 

మహమ్మారి సమయంలో స్థితిస్థాపకతకు మూలస్తంభంగా అవతరించిన గిగ్ ప్లాట్ఫామ్ ఆర్థిక వ్యవస్థలో కొత్త వర్గాల కార్మికుల పరిణామమే పరివర్తనాత్మక మార్పు అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఇది సౌకర్యవంతమైన పని ఏర్పాట్లను అందిస్తుందని, ఆదాయ వనరులను కూడా భర్తీ చేస్తుందని ఆయన అన్నారు.

ముఖ్యంగా యువతకు లాభదాయకమైన ఉపాధిని కల్పించే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని, అదే సమయంలో మహిళల సామాజిక ఆర్థిక సాధికారతకు మార్పు సాధనంగా మారుతుందని ఆయన అన్నారు.

దాని సామర్థ్యాన్ని గుర్తించి, ఈ నవతరం కార్మికుల కోసం నూతన తరం విధానాలు, జోక్యాలను రూపొందించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. క్రమం తప్పకుండా పనిచేయడానికి అవకాశాలను సృష్టించడానికి స్థిరమైన పరిష్కారాలను కనుగొనాలని , సామాజిక భద్రత, ఆరోగ్యం,  భద్రతను నిర్ధారించడానికి కొత్త నమూనాలతో రావాలని ఆయన సూచించారు. దాదాపు 280 మిలియన్ల రిజిస్ట్రేషన్లను చూసిన భారతదేశ ' ఇ- శ్రమ్ పోర్టల్' గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  కార్మికుల లక్ష్య జోక్యాల కోసం దీనిని ఉపయోగిస్తున్నారని, పని స్వభావం అంతర్జాతీయంగా మారినందున దేశాలు ఇలాంటి పరిష్కారాలను అవలంబించాలని ఆయన అన్నారు.

 

2030 ఎజెండాలో ప్రజలకు సామాజిక రక్షణ కల్పించడం ఒక కీలక అంశమే అయినప్పటికీ, అంతర్జాతీయ సంస్థలు అవలంబిస్తున్న ప్రస్తుత ఫ్రేమ్ వర్క్ కొన్ని సంకుచిత మార్గాల్లో నిర్మించబడిన ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని, ఇతర రూపాల్లో అందించే అనేక ప్రయోజనాలు ఈ ఫ్రేమ్ వర్క్ పరిధిలోకి రావని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు. భారతదేశంలో సామాజిక రక్షణ కవరేజీ కి సంబంధించిన సరైన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, సార్వత్రిక ప్రజారోగ్యం, ఆహార భద్రత, బీమా, పెన్షన్ కార్యక్రమాలు వంటి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని శ్రీ మోదీ నొక్కి చెప్పారు.

ప్రతి దేశ ప్రత్యేక ఆర్థిక సామర్థ్యాలు, బలాలు , సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు, ఎందుకంటే సామాజిక రక్షణకు స్థిరమైన ఫైనాన్సింగ్ కోసం అందరికీ ఒకే- పరిమాణం-సరి పోతుందనే విధానం సరి కాదని అన్నారు.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరి సంక్షేమం కోసం బలమైన సందేశాన్ని పంపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రంగంలో అత్యంత అత్యవసరమైన కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ప్రముఖులందరూ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets with Crown Prince of Kuwait
December 22, 2024

​Prime Minister Shri Narendra Modi met today with His Highness Sheikh Sabah Al-Khaled Al-Hamad Al-Mubarak Al-Sabah, Crown Prince of the State of Kuwait. Prime Minister fondly recalled his recent meeting with His Highness the Crown Prince on the margins of the UNGA session in September 2024.

Prime Minister conveyed that India attaches utmost importance to its bilateral relations with Kuwait. The leaders acknowledged that bilateral relations were progressing well and welcomed their elevation to a Strategic Partnership. They emphasized on close coordination between both sides in the UN and other multilateral fora. Prime Minister expressed confidence that India-GCC relations will be further strengthened under the Presidency of Kuwait.

⁠Prime Minister invited His Highness the Crown Prince of Kuwait to visit India at a mutually convenient date.

His Highness the Crown Prince of Kuwait hosted a banquet in honour of Prime Minister.