"విద్య అనేది మన నాగరికత నిర్మితమైన పునాది మాత్రమే కాదు,
ఇది మానవాళి భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దుతుంది కూడా."
"నిజమైన జ్ఞానం వినయాన్ని ఇస్తుంది, వినయం నుండి యోగ్యత వస్తుంది, యోగ్యత నుండి ఒక వ్యక్తి సంపదను పొందుతాడు, సంపద మనిషికి సత్కార్యాలకు వీలు కల్పిస్తుంది... ఇది ఆనందాన్ని ఇస్తుంది"
"మెరుగైన పాలనతో నాణ్యమైన విద్యను అందించడమే మా లక్ష్యం"
"మా యువతను భవిష్యత్తు-సిద్ధంగా మార్చడానికి, మేము నిరంతరం నైపుణ్యం, రీ-స్కిల్, అప్-స్కిల్ అవసరం" "విద్యకు చేరువను పెంచడంలో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చడంలో డిజిటల్ సాంకేతికత శక్తి గుణకం అయింది"

ఈరోజు పూణేలో జ‌రిగిన జి20 విద్యా మంత్రుల స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్ర‌సంగించారు. 

స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, విద్య అనేది మ‌న నాగ‌రిక‌త‌కు పునాది మాత్ర‌మే కాదు, మానవత్వం భవిష్యత్తు  రూపురేఖలను తీర్చిదిద్దేది అని అన్నారు. ప్రధాన మంత్రి విద్యా మంత్రులను షెర్పాలు అని ప్రస్తావిస్తూ, అభివృద్ధి, శాంతి, అందరి శ్రేయస్సు కోసం మానవజాతి కృషిలో వారు నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఆనందాన్ని తీసుకురావడంలో విద్య పాత్ర కీలకమని భారతీయ గ్రంథాలు వివరిస్తున్నాయని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. 'నిజమైన జ్ఞానం వినయాన్ని ఇస్తుంది, వినయం నుండి యోగ్యత వస్తుంది, యోగ్యత నుండి సంపద వస్తుంది, సంపద మనిషికి సత్కార్యాలు చేయడానికి వీలు కల్పిస్తుంది  ఇదే సంతోషాన్ని ఇస్తుంది' అని అర్థం వచ్చే సంస్కృత శ్లోకాన్ని వినిపించారు ప్రధాన మంత్రి. సంపూర్ణ, సమగ్ర ప్రయాణం సాగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘అండర్‌స్టాండింగ్, న్యూమరాసీతో చదవడంలో నైపుణ్యం కోసం జాతీయ చొరవ’ లేదా ‘నిపున్ భారత్’ చొరవను ఆయన ప్రస్తావించారు. ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ’ని జి20 కూడా ప్రాధాన్యతగా గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2030 నాటికి నిర్దిష్ట కాలానుగుణంగా పని చేయాలని కూడా ఆయన నొక్కి చెప్పారు.

మన యువతను నిరంతరం నైపుణ్యం-పునరుద్ధరణ, నైపుణ్యం పెంచడం ద్వారా వారి భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, అభివృద్ధి చెందుతున్న పని ప్రొఫైల్‌లు, అభ్యాసాలతో వారి సామర్థ్యాలను సమలేఖనం చేయాలని నొక్కి చెప్పారు. భారతదేశంలో, విద్య, నైపుణ్యం, కార్మిక మంత్రిత్వ శాఖలు ఈ చొరవతో కలిసి పనిచేస్తున్న చోట తాము స్కిల్ మ్యాపింగ్‌ను చేపడుతున్నామని ప్రధాన మంత్రి తెలిపారు. జి 20 దేశాలు గ్లోబల్ స్థాయిలో స్కిల్ మ్యాపింగ్‌ను చేపట్టవచ్చని, ప్లగ్ ఇన్ చేయాల్సిన ఖాళీలను కనుగొనవచ్చని కూడా శ్రీ మోదీ సూచించారు.

డిజిటల్ టెక్నాలజీ ఈక్వలైజర్‌గా పని చేస్తుందని, కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. విద్యలో ప్రవేశాన్ని పెంపొందించడంలో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చడంలో ఇది శక్తి గుణకాన్ని పెంచిందని ఆయన అన్నారు. అభ్యాసం, నైపుణ్యం, విద్య రంగంలో గొప్ప సామర్థ్యాన్ని అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. సాంకేతికత ద్వారా ఎదురయ్యే అవకాశాలు, సవాళ్ల మధ్య సరైన సమతుల్యతను సాధించడంలో జి-20 పాత్రను కూడా ఆయన నొక్కి చెప్పారు.

పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ, భారతదేశం దేశవ్యాప్తంగా పది వేల ‘అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను’ ఏర్పాటు చేసిందని, ఇవి మన పాఠశాల పిల్లలకు పరిశోధన, ఆవిష్కరణ నర్సరీలుగా పనిచేస్తాయని ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. ఈ ల్యాబ్‌లలో 1.2 మిలియన్లకు పైగా వినూత్న ప్రాజెక్టులపై 7.5 మిలియన్లకు పైగా విద్యార్థులు పనిచేస్తున్నారని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో జి20 దేశాలు తమ శక్తిసామర్థ్యాలతో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. పరిశోధన సహకారాలు పెరగడానికి ఒక మార్గాన్ని రూపొందించాలని ఆయన ప్రముఖులను కోరారు.

మన పిల్లలు, యువత భవిష్యత్తు కోసం జి20 విద్యా మంత్రుల సమావేశం ప్రాముఖ్యతను చెప్పిన ప్రధాన మంత్రి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి గ్రీన్ ట్రాన్సిషన్, డిజిటల్ పరివర్తనలు, మహిళా సాధికారతలను యాక్సిలరేటర్లుగా గ్రూప్ గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. "ఈ ప్రయత్నాలన్నింటికీ విద్య మూలం", ఈ సమావేశం ఫలితం అందరినీ కలుపుకొని, కార్యాచరణ-ఆధారిత, భవిష్యత్తు-సిద్ధమైన విద్యా ఎజెండాగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి. "ఇది వసుధైవ కుటుంబం - ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు నిజమైన స్ఫూర్తితో మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుంది" అని ప్రధాన మంత్రి ముగించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
2024: A Landmark Year for India’s Defence Sector

Media Coverage

2024: A Landmark Year for India’s Defence Sector
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Maharashtra meets PM Modi
December 27, 2024

The Governor of Maharashtra, Shri C. P. Radhakrishnan, met Prime Minister Shri Narendra Modi today.

The Prime Minister’s Office handle posted on X:

“Governor of Maharashtra, Shri C. P. Radhakrishnan, met PM @narendramodi.”