Quote“దృఢంగా ఉండటమంటే ఏంటో భారతదేశం ప్రపంచానికి చూపింది”
Quote“100 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద సంక్షోభంలో భారత్ ప్రదర్శించిన సామర్థ్యాన్ని అధ్యయనం చేసి 100 ఏళ్ళ తరువాత మానవత్వమే గర్విస్తుంది”
Quote“2014 తరువాత పాలనలో ప్రతి అంశాన్నీ పునరాలోచించి పరిష్కారానికి ప్రయత్నించాలని నిర్ణయించాం”
Quote“పేదల సాధికారత కోసం ప్రభుత్వం సంక్షేమాన్ని ఎలా అందించాలో పునరాలోచించాం” “పేదల సాధికారతతో వారి పూర్తి సామర్థ్యాన్ని దేశ పురోగతికి వెచ్చించేలా చూస్తున్నాం”
Quote“మా ప్రభుత్వం వివిధ పథకాల కింద 28 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదలీ చేసింది “
Quote“గత ఎనిమిదేళ్లలో దాదాపు 3.5 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు, 80 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించాం”
Quote“మెట్రో మార్గం పొడవులో భారత్ 5వ స్థానంలో ఉంది, త్వరలో 3వ స్థానం సాధిస్తుంది”
Quote“పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ వలన మౌలిక సదుపాయాల నిర్మాణం వేగం పుంజుకోవటంతోబాటు ప్రాంతీయ, ప్రజాభివృద్ధి సాగుతోంది”
Quote“ఇంటర్నెట్ డేటా రేటు 25 రెట్లు తగ్గి ప్రపంచంలోనే అతి చౌకగా మారింది”
Quote“2014నుంచి “ప్రభుత్వం ముందు” బదులు ‘ప్రజలు ముందు’ అనే వైఖరి వచ్చింది.”
Quote“చెల్లించిన పన్
Quoteసమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ళక్రితం జరిగిన ఎకనామిక్ టైమేశ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ అనంతరం ఇప్పటిదాకా జరిగిన మార్పులను ప్రస్తావించారు
Quote100 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద సంక్షోభంలో భారత్ ప్రదర్శించిన సామర్థ్యాన్ని అధ్యయనం చేసి 100 ఏళ్ళ తరువాత మానవత్వమే గర్విస్తుందని వ్యాఖ్యానించారు.
Quoteఅంటే 24 లక్షలకోట్లు లూటీ అయి ఉండాలి. కానీ ఈ రోజు మొత్తం లబ్ధిదారులకే చేరుతోంది” అన్నారు.
Quoteపరిశుభ్రమైన నీటి సరఫరా గురించి మాట్లాడుతూ, 2014 నాటికి 3 కోట్ల కుళాయిలు మాత్రమే ఉండగా గడిచిన మూడున్నరేళ్లలో 8 కోట్ల కనెక్షన్లు జోడించామన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలెస్ లో జరిగిన ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ళక్రితం జరిగిన ఎకనామిక్ టైమేశ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ అనంతరం ఇప్పటిదాకా జరిగిన మార్పులను ప్రస్తావించారు. సరిగ్గా ఆ సమావేశం జరిగిన మూడు రోజులకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మహమ్మారి మీద  ప్రకటన చేయటం, భారత్ సహా ప్రపంచమంతటా అనేక మార్పులు జరగటం చూశామన్నారు.

అలాంటి సందర్భం కేవలం కోలుకోవటానికే పరిమితం కాకుండా, దృఢంగా ఉండాల్సిన అవసరాన్ని చాటి చెప్పిందని, కష్టకాలంలో ఎలా గట్టిగా ఉండాలో నేర్పిందని అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి పట్టుదల తన మదిలో మెదలగానే అలాంటి దృఢత్వం తనకు వచ్చిందన్నారు. ఈ మూడేళ్ళ యుద్ధం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారతదేశం, భారతీయులు తమ బలమైన పట్టుదలను చాటారన్నారు. దృఢంగా ఉండటమంటే ఏంటో భారతదేశం ప్రపంచానికి చూపిందని ప్రధాని వ్యాఖ్యానించారు.  విపత్తులను అవకాశాలుగా మార్చుకోవటమెలాగో భారతదేశం  ప్రపంచానికి చాటిందని ప్రధాని గుర్తుచేశారు. 100 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద సంక్షోభంలో భారత్ ప్రదర్శించిన సామర్థ్యాన్ని అధ్యయనం చేసి 100 ఏళ్ళ తరువాత మానవత్వమే గర్విస్తుందని వ్యాఖ్యానించారు. 

|

ఈ సంవత్సరపు శిఖరాగ్ర సదస్సు చర్చనీయాంశమైన “వ్యాపారాన్ని పునరూహించు- ప్రపంచాన్ని పునరూహించు” గురించి ప్రస్తావిస్తూ,  ఈ దేశం 2014 లో ప్రస్తుత ప్రభుత్వానికి పాలించే అవకాశమిచ్చినప్పుడే పునరూహించటం మొదలైందన్నారు. కుంభకోణాలు, అవినీతి కారణంగా పేదలు నిరుపేదలుగా మారటం, యువత ప్రయోజనాలు దెబ్బతినటం, బంధుప్రీతి. విధానాల పక్షవాతం ఫలితంగా ప్రాజెక్టులలో జాప్యం లాంటివి దేశాన్ని పట్టి పీడించిన కష్టకాలాన్ని ప్రధాని గుర్తు చేశారు. “అందుకే పాలనలో మేం అన్నీ పునరూహించటానికి, కొత్తగా కనిపెట్టటానికి నిర్ణయించుకున్నాం. పేదల సాధికారత కోసం సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందేలా చేయటమెలాగో ఆలోచించాం. మౌలిక సదుపాయాలు మరింత సమర్థవంతంగా సృష్టించటం మీద దృష్టిపెట్టాం. దేశ పౌరులతో ప్రభుత్వానికి ఉండాల్సిన సంబంధం మీద కూడా పునరాలోచించాం” అన్నారు. సంక్షేమాన్ని అందించటం గురించి ప్రధాని సుదీర్ఘంగా వివరించారు. బాంకు ఖాతాలు, రుణాలు, గృహనిర్మాణం, ఆస్తుల హక్కులు, మరుగుదొడ్లు, విద్యుత్, వంట గ్యాస్ తదితర అంశాల గురించి మాట్లాడారు.  “పేదలు సాధికారత సాధించి, వారే వాళ్ళ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి  దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలని మనం ఆశిస్తున్నాం” అన్నారు. ప్రత్యక్ష నగదు బదలీని ఉదహరిస్తూ, గతంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వ పథకాల కేటాయింపుల గురించి మాట్లాడుతూ లీకేజ్ కారణంగా అసలైన లబ్ధిదారుకు చేరేది రూపాయిలో 15 పైసలే అనటాన్ని  ప్రస్తావించారు. “ మా ప్రభుత్వం ఇప్పటిదాకా 28 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బడలీ ద్వారా లబ్ధిదారులకు బడలాయించింది. రాజీవ్ గాంధీ వ్యాఖ్యలు ఈరోజుకూ వర్తిస్తే, అందులో 85 శాతం.. అంటే 24 లక్షలకోట్లు లూటీ అయి ఉండాలి. కానీ ఈ రోజు మొత్తం లబ్ధిదారులకే చేరుతోంది” అన్నారు.

ప్రతి భారతీయుడికీ మరుగుదొడ్డి సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నాడు దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలు అందుకున్నట్టేనని  నెహ్రూకు కూడా తెలుసునని ప్రధాని వ్యాఖ్యానించారు. 2014 తరువాత దేశంలో 10 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్టు శ్రీ మోడీ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం 40 శాతం నుంచి 100 శాతానికి పెరిగిందని కూడా చెప్పారు.

|

ఆకాంక్షాపూరిత జిల్లాలను ఉదహరిస్తూ, 2014 కు ముందు 100 జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయని, వాటి వెనుకబాటుతనాన్ని  అంచనా వేసి ఈ జిల్లాలను ఆకాంక్షాపూరిత జిల్లాలుగా ప్రకటించామని చెప్పారు. ఇందులో ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాకు సంస్థాగత సహాయం 47 శాతం నుంచి 90 శాతానికి పెరగటాన్ని ప్రధాని ప్రస్తావించారు. మధ్య ప్రదేశ్ లోని బర్వాని జిల్లాలో పిల్లల టీకాల శాతం 40 నుంచి 90 శాతానికి చేరటం, మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో 2015 లో క్షయ వ్యాధి చికిత్స విజయవంతం కావటం 48 శాతం నుంచి 90 శాతానికి చేరటం గురించి కూడా ప్రధాని చెప్పారు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో  గ్రామ పంచాయితీలు బ్రాడ్ బాండ్ తో అనుసంధానం కావటం 20 నుంచి 80 శాతానికి పెరిగిందని చెబుతూ, మొత్తంగా చూసినప్పుడు ఈ జిల్లాలు దేశ సగటు కంటే మెరుగైన స్థితికి చేరుకుంటున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన నీటి సరఫరా గురించి మాట్లాడుతూ, 2014 నాటికి 3 కోట్ల కుళాయిలు మాత్రమే ఉండగా గడిచిన మూడున్నరేళ్లలో 8 కోట్ల కనెక్షన్లు జోడించామన్నారు.

మౌలిక సదుపాయాల రంగంలో కూడా రాజకీయాలకంటే దేశం అవసరాలకు ప్రాధాన్యమిచ్చామన్నారు. మాలిక సదుపాయాల నిర్మాణాననే గొప్ప వ్యూహంగా భావించటం వల్లనే ఈ రోజుదేశణలో జాతీయ రహదారులు రోజుకు 38 కిలోమీటర్ల వేగంతో, రైలుమార్గం రోజుకు 5 కిలోమీటర్ల వేగంతో నిర్మిస్తున్నామన్నారు. మన నౌకాశ్రయాల సామర్థ్యం వచ్చే రెండేళ్లలో ఏడాదికి 3000  మిలియన్ టన్నులకుచేరుతోందని చెప్పారు. 2014 తో పోల్చుకున్నప్పుడు ఉపయోగంలో ఉన్న విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 147 కు చేరటం ద్వారా రెట్టింపయిందన్నారు. ఈ 9 ఏళ్ళలో దాదాపు 3.5 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణం, 80 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, 3 కోట్ల మంది నిరుపేదలకు ఇళ్ళు కట్టించామని చెప్పారు. 

మెట్రో నిర్మాణ నైపుణ్యం మనకు 1984 నుంచే ఉన్నప్పటికీ, 2014 వరకు నెలకు అరకిలోమీటర్ మెట్రో లైన్ చొప్పున మాత్రమే నిర్మించగా, ఇప్పుడది నెలకు 6 కిలోమీటర్లకు పెరిగింది. మెట్రో మార్గం పొడవులో నేడు భారతదేశం  ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండగా త్వరలోనే అది మూడో స్థానానికి ఎదగబోతోందన్నారు.

|

 “పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా మౌలిక సదుపాయాల నిర్మాణం వేగం పుంజుకోవటమే కాకుండా ప్రాంతాల అభివృద్ధికి, ప్రజాల అభివృద్ధికి దారితీసిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని ఎక్స్ ప్రెస్ వేలు, ఇతర మౌలిక సదుపాయాలన్నీటినీ కృత్రిమ మేధతో అనుసంధానం  చేయటం వలన  ప్రయాణీకులు బాగా దగ్గరిదారి ఏదో తెలుసుకోగలుగుతారని చెప్పారు.  జానా సాంద్రత, స్కూళ్ళ అందుబాటు సైతం టెక్నాలజీ సాయంతో తెలుసుకునే అవకాశం ఉండటం వల్లనే ఎక్కడ స్కూళ్ళ కొరత ఉన్నదో గ్రహించి అక్కడ కట్టే వెసులుబాటు కలిగిందన్నారు. విమానయాన రంగంలో గగన తలంలో ఎక్కువ భాగం రక్షణ రంగా అవసరాలు వాడుకోవటం వలన పౌర విమానాలకు పరిమిత ప్రాంతం అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో సాయుధ దళాలతో విస్తృత చర్చలు జరిపి 128 వాయు మార్గాలను రక్షణ రంగం నుంచి తప్పించి పౌర విమానాల రాకపోకలకు వీలు కల్పించారు. దీనివలన కొన్ని విమాన మార్గాల దూరం తగ్గి సమయం, ఇంధనం ఆదా అవుతున్నాయి.

గడిచిన 9 ఏళ్లలో సాధించిన ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, దేశంలో 6 లక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టిక్ ఫైబర్ లైన్లు వేశామన్నారు. మొబైల్ తయారీ యూనిట్ల సంఖ్య అనేక రెట్లు పెరిగిందని, ఇంటర్నెట్ డేటా ధర 25 రెట్లు తగ్గి ప్రపంచంలో అత్యంత చౌకగా మారిందని  ప్రధాని గుర్తు చేశారు. 2012 లో అంతర్జాతీయ మొబైల్ డేటా ట్రాఫిక్ ప్రపంచ ట్రాఫిక్ లో 2% ఉండగా, 75% పాశ్చాత్య మార్కెట్ దే ఉండేదని, కానీ 2022 లో భారత్ వాటా 21% కి పెరిగిందని, ఉత్తర అమెరికా, యూరప్ కలిసి నాలుగో వంతు వాటాకే పరిమితమయ్యాయని చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో 40 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయన్నారు. 

|

ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య ఒక రకమైన అపనమ్మకం ఏర్పడటం మంచిది కాదన్నారు. అక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టుల నుద్దేశించి మాట్లాడుతూ, రేడియోలకు, టీవీలకు రెన్యూ చేసుకునే లైసెన్సుల జారీ గురించి ప్రస్తావించారు.  తొంబైల నాటి తప్పులను కొన్నింటిని అనివార్యంగా దిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడినా, పాతకాలపు “నేనే పెద్ద దిక్కు” అనే మనస్తత్వం ఇంకా పోలేదన్నారు. 2014 తరువాత  “ప్రభుత్వం ముందు” బదులు ‘ప్రజలు ముందు’ అనే వైఖరి వచ్చిందని గుర్తు చేశారు. ప్రజలను విశ్వాసించటామనే సూత్రం మీద ప్రభుత్వం పనిచేయటం మొదలైందన్నారు. స్వీయ ధ్రువపత్రాలు, చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూల రద్దు, చిన్న ఆర్థిక నేరాలను శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగింపు, హామీ అవసరం లేని ముద్ర రుణాలు, ఎం ఎస్ ఎం ఈ లకు ప్రభుత్వమే హామీదారుగా ఉండటం లాంటి కార్యక్రమాలను ప్రధాన గుర్తు చేశారు.

|

పన్ను వసూళ్లను ఉదాహరిస్తూ, 2013-14 లో దేశ స్థూల పన్ను వసూళ్ళు 11 లక్షల కోట్లు ఉండేదని, 2023-24 లో అది 33 లక్షలకోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశామని చెప్పారు.  పన్నుల తగ్గింపు వల్లనే స్థూల పన్నుల మొత్తం పెరిగిందని కూడా ప్రధాని వివరణ ఇచ్చారు. గత 9 ఏళ్లలో పన్ను తగ్గించిన ఫలితంగా వసూళ్ళు మూడు రెట్లు పెరిగాయన్నారు.   “చెల్లించిన పన్ను సార్థకమవుతుంటే పన్ను చెల్లింపుదారుల్లో ఉత్సాహం ఉంటుంది” అంటూ, నేరుగా హాజరుకాకుండానే పన్ను మదింపు చేసి, మొత్తం ప్రక్రియను సరళతరం చేస్తున్నామన్నారు.  ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ లు ప్రాసెస్ చేయటానికి గతంలో 90 రోజులు పట్టేదని, ఈ ఏడాది మొత్తం 6.5 కోట్ల రిటర్న్ లు ప్రాసెస్ చేయగా అందులో 3 కోట్ల రిటర్న్ లు 24 గంటలలోపే ప్రాసెస్ అయ్యాయని కొద్ది రోజుల్లోనే డబ్బు వాపస్  చేశామని చెప్పారు.

|

భారతదేశ సౌభాగ్యమే ప్రపంచ సౌభాగ్యమని, భారతదేశ ఎదుగుదలే ప్రపంచ ఎదుగుదల అని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు. జి-20 కి థీమ్ గా ఎంచుకున్న ‘ఒక ప్రపంచం-ఒక కుటుంబం-ఒక భవిష్యత్తు’ అనేక ప్రపంచ సవాళ్ళకు జవాబు అవుతుందన్నారు. .  అందరి ప్రయోజనాలు కాపాడుతూ ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ప్రపంచం మెరుగ్గా తయారవుతుందన్నారు. ఈ దశాబ్దంతోబాటు వచ్చే 25 ఏళ్ల కాలం భారతదేశానికి కనీవినీ ఎరుగనంత ఆత్మ విశ్వాసం కలిగిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. భారత దేశం తన లక్ష్యాలు సాధించటానికి ‘సబ్ కా ప్రయాస్’ ను వేగవంతం చేయటం ఒక్కటే మార్గమన్నారు. ఈ కృషిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. “దేశ ఎదుగుదల యాత్రలో భాగమైనప్పుడు దేశం మీకు ఎదుగుదలకు హామీ ఇస్తుంది”  అంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • Reena chaurasia August 29, 2024

    मोदी
  • pm Kisan online customer care number 7605848473 March 20, 2023

    Kisi bhi Kisan bhaiyon ko business loan chahie to .100000.se.10. lakh .Tak emergency loan. Chahie . Customer care mein call Karen Diye hue number per.7605848473.Karen
  • pradeepshukla human rights Reform Org. March 12, 2023

    माननीय प्रधान मंत्री श्री नरेन्द्र मोदी जी से विनती है प्रिया दुर्गेश मिश्रा आयु 30 वर्ष पति की हाट अटैक से मृत्यु हो गई 1बेटा मुम्बई में पति के नाम से घर है मीरा रोड गोल्डेन नेस्ट गोल्डन हार्वेस्ट में 302 number हमारे पति 5भाई है सब का अपना अपना मकान है फिर भी हमारे घर को हड़पना चाहते है मै असहाय हु कुछ नहीं कर पा रही हूं अब एक ही रास्ता बचा है अपने बेटे के साथ आत्महत्या कर लू मुझे कुछ सूझ नहीं रहा क्या करू मेरे ससुर राधेश्याम मिश्रा आयु 75 मकान में नामनी है सभी 4भाई मिलकर बहका फुसला कर मेरे घर को हड़प रहे हैं मेरे घर वाले गरीब होने के नाते उनका कुछ कर नहीं पा रहे मेरे भाई ने इस एप के माध्यम से आप तक अपनी बात को पहुंचाने के लिए मार्ग दर्शन किया है मुझे आप पर विश्वास है मुझ जैसी असहाय महिला का मदद करेंगे मो. न.8419810710 मुझे आप के हेल्प का भरोसा है
  • Dipak Dubedi March 05, 2023

    भारत माता को समर्पित स्वच्छता अभियान परिवार द्वारा 227 तम सप्ताहिक स्वच्छता अभियान सफलतापूर्वक किया जो मातृभूमि को समर्थन है।
  • Jayakumar G February 25, 2023

    #MeghalayaElections2023 #Meghalaya #MeghalayaWithModi #VoteWisely #Elections2023 @RiturajSinhaBJP
  • CHANDRA KUMAR February 21, 2023

    अधिकांश छात्रों को UPSC के OTR की सही जानकारी नहीं थी, इसी वजह से कई छात्र upsc ias का फॉर्म जमा नहीं कर सका। अतः upsc ias का फॉर्म जमा करने की तिथि बढ़ाया जाना चाहिए। विशेष रूप से उन छात्राओं के लिए जिन्होंने पहली बार upsc ias की परीक्षा देने के बारे में सोच रही है। उन्हें प्रोत्साहित किया जाना चाहिए। और बीजेपी सरकार को विभिन्न मंचों सोशल मीडिया से प्रचार भी करना चाहिए, की बीजेपी सरकार ने पहली बार upsc ias के लिए 1105 रिक्तियां पर भर्ती परीक्षा का आयोजन करने जा रही है। सभी छात्र छात्राएं उत्साह पूर्वक इस प्रतिष्ठित परीक्षा में भाग लें।
  • Jatin Tank February 21, 2023

    👍👍👍
  • Tribhuwan Kumar Tiwari February 20, 2023

    वंदेमातरम सादर प्रणाम सर
  • SRS SwayamSewak RSS February 20, 2023

    नमामी शमीशान निर्वाण रूपं, विभुं व्यापकं ब्रह्म वेदः स्वरूपम् । निजं निर्गुणं निर्विकल्पं निरीहं, चिदाकाश माकाशवासं भजेऽहम्। 🚩ॐ नमः शिवाय हर हर महादेव🚩
  • MONICA SINGH February 20, 2023

    Jai Hind, Jai Bharat🙏 🌻🌳🇮🇳
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman

Media Coverage

Khadi products witnessed sale of Rs 12.02 cr at Maha Kumbh: KVIC chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
India will always be at the forefront of protecting animals: PM Modi
March 09, 2025

Prime Minister Shri Narendra Modi stated that India is blessed with wildlife diversity and a culture that celebrates wildlife. "We will always be at the forefront of protecting animals and contributing to a sustainable planet", Shri Modi added.

The Prime Minister posted on X:

"Amazing news for wildlife lovers! India is blessed with wildlife diversity and a culture that celebrates wildlife. We will always be at the forefront of protecting animals and contributing to a sustainable planet."