డిపార్ట్ మెంట్ ఫార్ ప్రమోశన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) ఆధ్వర్యం లో ఏర్పాటైన ఒక బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. ప్రధాన మంత్రి ప్రసంగించిన బడ్జెటు అనంతర వెబినార్ లలో ఈ వెబినార్ ఎనిమిదో ది. ‘మేక్ ఇన్ ఇండియా ఫార్ ద వరల్డ్’ అనేది ఈ వెబినార్ యొక్క ఇతివృత్తం గా ఉండింది.
బడ్జెటు లో ఆత్మనిర్భర్ భారత్ కు, మేక్ ఇన్ ఇండియా కు సంబంధించి అనేక ముఖ్యమైన కేటాయింపు లు ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం వంటి ఒక దేశం కేవలం ఒక బజారు గా మిగిలిపోవడం ఆమోదయోగ్యం కాదు అని ఆయన అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కు ఉన్నటునవంటి అత్యధిక ప్రాముఖ్యాన్ని గురించి ఆయన చెప్తూ మహమ్మారి, ఇంకా ఇతర అనిశ్చిత స్థితుల కాలం లో సరఫరా వ్యవస్థ లో తలెత్తిన అంతరాయాల ను గురించి ప్రస్తావించారు. మరో పక్క చూసుకొంటే జనాభా లో యువతీ యువకుల సంఖ్య, ప్రతిభావంతుల ఉనికి, ప్రజాస్వామిక వ్యవస్థ, ప్రాకృతిక వనరులు మొదలైన సకారాత్మక కారకాల అండదండల ఊతం తో మనం దృఢ సంకల్పం తో మేక్ ఇన్ ఇండియా బాట లో సాగిపోయేందుకు ప్రోత్సాహాన్ని పొందాలి అని ప్రధాన మంత్రి అన్నారు. జీరో డిఫెక్ట్ జీరో ఇఫెక్ట్ మేన్యుఫాక్చరింగ్ అవసరం అంటూ ఎర్రకోట బురుజుల మీది నుంచి తాను ఇచ్చిన పిలుపు ను గురించి కూడా ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. మనం జాతీయ భద్రత అనే పట్టకం లో నుంచి చూశామా అంటే గనక ఆత్మనిర్భర్ భారత్ అనేది మరింత ఎక్కువ ప్రాధాన్యాన్ని సంతరించుకొందని ఆయన అన్నారు.
ప్రపంచం భారతదేశాన్ని ఒక మేన్యుఫాక్చరింగ్ పవర్ హౌస్ గా చూస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం జిడిపి లో 15 శాతాన్ని తయారీ రంగం సమకూర్చుకున్నది. అయితే, మేక్ ఇన్ ఇండియా ఎదుట అనంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మనం భారతదేశం లో ఒక పటిష్టమైనటువంటి తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేయడం కోసం పూర్తి బలం తో కృషి చేయవలసి ఉందని ఆయన అన్నారు.
విద్యుత్తు వాహనాలు, ఇంకా సెమి-కండక్టర్స్ వంటి రంగాల లో కొత్త డిమాండు మరియు నూతన అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఉదాహరణల ను ప్రధాన మంత్రి ఇచ్చారు. ఈ రంగాల లో విదేశీ వనరుల పై ఆధారపడుతూ ఉండడాన్ని దూరం చేయాలనే భావన తో తయారీదారు సంస్థలు ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఇదే విధం గా ఉక్కు, ఇంకా చికిత్స సంబంధి సామగ్రి వంటి రంగాలలోనూ స్వదేశీ తయారీ పై శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.
బజారు లో ఒక ఉత్పాదన లభ్యం కావడం అనే అంశానికి, మరి దానితో పోల్చి చూసినప్పుడు భారతదేశం లో తయారైన ఉత్పాదన లభ్యం కావడం అనే అంశానికి మధ్య ఉన్న తేడా ను గురించి ప్రధాన మంత్రి చర్చించారు. భారతదేశం లో వివిధ పండుగల ను జరుపుకొనే కాలం లో విదేశీ తయారీదారు సంస్థల ద్వారా సామగ్రులు సరఫరా అవుతూ ఉండడం పట్ల ఆయన తన నిరాశ ను మరోమారు వ్యక్తం చేశారు. అవే వస్తువుల ను స్థానిక తయారుదారు సంస్థ లు ఇట్టే సమకూర్చవచ్చు కదా అని ఆయన అన్నారు. ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానిక ఉత్పత్తుల ను కొనుగోలుకు మొగ్గు చూపడం) యొక్క పరిధి అనేది దీపావళి సందర్భం లో ప్రమిదల ను కొనుగోలు చేయడం కన్నా ఎంతో మిన్న అయినటువంటిది అని కూడా ఆయన నొక్కిచెప్పారు. ప్రైవేటు రంగం తన మార్కెటింగు, ఇంకా బ్రాండింగు ప్రయాసల లో ‘ఆత్మనిర్భర్ భారత్’ మరియు ‘వోకల్ ఫార్ లోకల్’ ల వంటి అంశాల కు పెద్దపీట వేయాలి అని ఆయన సూచించారు. ‘‘మీ కంపెనీ తయారు చేసే ఉత్పాదనల ను చూసుకొని గర్వపడండి. దానితో పాటు గా మీ యొక్క భారతీయ వినియోగదారుల లోనూ ఇదే తరహా అతిశయ భావన ను ఏర్పరచండి. దీని కోసం ఏదైనా ఉమ్మడి బ్రాండింగ్ ను గురించి కూడా ఆలోచన లు చేయవచ్చును’’ అని ఆయన అన్నారు.
స్థానిక ఉత్పత్తుల కోసం కొత్త గమ్య స్థానాల ను కనుగొనవలసిన అవసరం గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. పరిశోధన, ఇంకా అభివృద్ధి (ఆర్&డి) పై చేస్తున్నటువంటి ఖర్చు ను మరింత పెంచాలి, అదే మాదిరి గా ప్రైవేటు రంగం తన ఉత్పత్తి శ్రేణి ని వివిధీకరించుకోవాలి, ఇంకా ఆ శ్రేణి ని ఉన్నతీకరించుకోవాలి అంటూ ఆయన కోరారు. 2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం గా ప్రకటించిన విషయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘ప్రపంచం లో చిరుధాన్యాల కు గిరాకీ పెరుగుతున్నది. ప్రపంచ విపణుల ను అధ్యయనం చేసి, మనం మన మిల్లుల ను గరిష్ఠ ఉత్పాదన మరియు ప్యాకేజింగ్ కోసం ముందునుంచే సిద్ధం చేయాలి’’ అని సూచన చేశారు.
గనుల తవ్వకం, బొగ్గు రంగం, ఇంకా రక్షణ రంగం వంటి రంగాల లో ఆంక్షల ను సడలించినందువల్ల అందివస్తున్న కొత్త అవకాశాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, వీటి లో పాలుపంచుకో దలచిన వారు ఒక కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవాలి అని సూచించారు. ‘‘ప్రపంచ శ్రేణి ప్రమాణాల ను మీరు అందుకోవాలి, అంతేకాక మీరు ప్రపంచ స్థాయి లోనూ పోటీపడి ముందుకు సాగిపోవాలి ’’ అని ఆయన అన్నారు.
ఈ బడ్జెటు రుణ సంబంధి వెసులుబాటు, ఇంకా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతీకరణ ల ద్వారా ఎమ్ఎస్ఎమ్ఇ లకు అత్యధిక ప్రాముఖ్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఇ ల కోసం 6,000 కోట్ల రూపాయల తో ఒక ఆర్ఎఎమ్ పి కార్యక్రమాన్ని ప్రకటించింది. బడ్జెటు లో పెద్ద పరిశ్రమలు, ఇంకా ఎమ్ఎస్ఎమ్ఇ ల కోసం, రైతుల కోసం సరికొత్త గా రైల్వే లాజిస్టిక్స్ సంబంధి ఉత్పాదనల ను అభివృద్ధి పరచడం పైన కూడా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. తపాలా, ఇంకా రైల్ వే నెట్ వర్క్ ఏకీకరణ తో చిన్న వ్యాపార సంస్థల కు మరియు సుదూర రంగాల లో సంధానం పరమైన సమస్యల కు పరిష్కారం లభిస్తుంది అని ఆయన వివరించారు. ఈశాన్య ప్రాంతాల కోసం ప్రకటించిన పిఎమ్ డిఇవిఐఎన్ఇ యొక్క నమూనా ను వినియోగించుకోవడం ద్వారా ప్రాంతీయ తయారీ ఇకో- సిస్టమ్ ను పటిష్టం చేయవచ్చు అని ఆయన అన్నారు. ఇదే విధం గా, స్పెశల్ ఇకానామిక్ జోన్ యాక్ట్ సంస్కరణల తో ఎగుమతుల కు దన్ను లభిస్తుంది అని ఆయన తెలిపారు.
సంస్కరణ ల తాలూకు ప్రభావాన్ని గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ విశదం గా వివరించారు. పిఎల్ఐ లో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం 2021వ సంవత్సరం డిసెంబర్ లో ఒక లక్ష కోట్ల రూపాయల విలువైన ఉత్పాదన అనే లక్ష్యాన్ని అందుకోవడం జరిగింది అని ఆయన చెప్పారు. పిఎల్ఐ తాలూకు అనేక ఇతర పథకాలు అమలు తాలూకు ముఖ్యమైనటువంటి దశల లో ఉన్నాయి అని ఆయన అన్నారు.
ఇరవై అయిదు వేల వరకు ఉన్న నియమాల ను అనుసరించనక్కరలేకుండా వెసులుబాటు ను గురించి మరియు లైసెన్సుల ఆటో రిన్యూవల్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ చర్య లు నియమ పాలన తాలూకు భారాన్ని గణనీయం గా తగ్గించి వేశాయి అని ఆయన అన్నారు. ఇదే మాదిరి గా, డిజిటలీకరణ అనేది నియంత్రణ సంబంధి రూపురేఖల లో వేగాన్ని, ఇంకా పారదర్శకత్వాన్ని తీసుకువస్తుంది అని ఆయన అన్నారు. ‘‘కామన్ స్పైస్ ఫార్మ్ మొదలుకొని జాతీయ ఏక గవాక్ష వ్యవస్థ వరకు, ఒక కంపెనీ ని ఏర్పాటు చేయడం దాకా, ఇప్పుడు మీరు ప్రతి ఒక్క దశ లోను మా అభివృద్ధి ప్రధానమైనటువంటి స్నేహపూర్ణ వైఖరి ని అనుభూతి చెందుతున్నారు కదా’’ అని ఆయన అన్నారు.
కొన్ని రంగాల ను ఎంపిక చేసుకొని ఆయా రంగాల లో విదేశాల పై ఆధారపడే పరిస్థితి ని తొలగించడం కోసం కృషి చేయవలసింది గా తయారీ రంగ ప్రముఖుల కు ప్రధాన మంత్రి పిలుపు ను ఇచ్చారు. ఇటువంటి వెబినార్ లు బడ్జెటు లో పొందుపరచిన విధానాల తాలూకు మెరుగైన ఫలితాలను ఆవిష్కరించడం కోసం సరి అయిన, సకాలం లో తీసుకొనే మరియు నిరంతరాయ అమలు కు తగ్గ విధానాల ను అమలు చేయడం లో సంబంధిత వర్గాల అభిప్రాయాల ను కూడా తెలుసుకొని వాటిని భాగం గా చేసేటటువంటి మరియు ఒక సామూహిక దృష్టికోణాన్ని అభివృద్ధిపరచేటటువంటి దిశ లో ప్రభుత్వం వేసిన ఓ అపూర్వమైన అడుగు అంటూ ఆయన మరో సారి స్పష్టంచేశారు.