గతిశక్తి యొక్క దృష్టి కోణం మరియు కేంద్ర బడ్జెటు 2022 తో దానికి ఉన్న ఏకరూపత అనే అంశాల పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. ప్రధాన మంత్రి ప్రసంగించిన బడ్జెటు అనంతర వెబినార్ ల పరంపర లో ఇది ఆరో వెబినార్.
ఈ సంవత్సరపు బడ్జెటు 21వ శతాబ్దం లో భారతదేశం అభివృద్ధి (గతిశక్తి) కి దిశ ను ఇచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘మౌలిక సదుపాయాల కల్పన పై ఆధారపడిన అభివృద్ధి’ తాలూకు ఈ దిశా నిర్దేశం మన ఆర్థిక వ్యవస్థ లో అసాధారణ శక్తి ని ప్రవహింపచేస్తుంది; అంతే కాకుండా ఉపాధికల్పన పరం గా అనేక కొత్త అవకాశాల ను కూడా ఏర్పరుస్తుంది అని ఆయన అన్నారు.
ప్రాజెక్టుల ను పూర్తి చేయడం లో, సాంప్రదాయిక పద్ధతుల విషయం లో స్టేక్ హోల్డర్స్ మధ్య సమన్వయ లోపాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. దీనికి కారణం సంబంధిత వివిధ విభాగాల మధ్య స్పష్టమైన సమాచారం లోపించడం అని ఆయన చెప్పారు. ‘‘ప్రధాన మంత్రి గతిశక్తి ఆధారం గా, ప్రస్తుతం ప్రతి అన్ని వర్గాలు సంపూర్ణ సమాచారం తో వాటి వాటి ప్రణాళికల ను రూపొందించుకో గలుగుతాయి. దీనితో దేశ వనరుల ను ఆదర్శప్రాయమైనటువంటి విధం గా ఉపయోగించుకోవడం సాధ్యపడుతుంది’’ అని ఆయన అన్నారు.
ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి ని ఏ స్థాయి లో అయితే చేపడుతోందో ప్రధాన మంత్రి స్పష్టం గా వివరిస్తూ, ఈ విషయం లో పిఎమ్ గతిశక్తి యొక్క ఆవశ్యకత ను గురించి నొక్కిచెప్పారు. ‘‘2013-14వ సంవత్సరం లో భారత ప్రభుత్వ ప్రత్యక్ష మూలధన వ్యయం దాదాపు గా 1.75 లక్షల కోట్ల రూపాయలు గా ఉన్నది కాస్తా 2022-23 సంవత్సరం లో ఏడున్నర లక్షల కోట్ల రూపాయల కు పెంచడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘మౌలిక సదుపాయాల కల్పన సంబంధి ప్రణాళిక రచన, అమలు మరియు పర్యవేక్షణ లు పిఎమ్-గతిశక్తి నుంచి ఒక కొత్త దిశ ను అందుకోనున్నాయి. ఇది ప్రాజెక్టుల కు పట్టే కాలాని కే కాకుండా వ్యయం పెరిగిపోవడానికి కూడాను కళ్లెం వేస్తుంది’’ అని ఆయన అన్నారు.
‘‘సహకారాత్మక సమాఖ్య వాదం సూత్రాన్ని బలపరుస్తూ, మా ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెటు లో రాష్ట్రాల కు సహాయాన్ని అందించేందుకు ఒక లక్ష కోట్ల రూపాయల ఏర్పాటు ను చేసింది. ఈ సొమ్ము ను రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ విధ మౌలిక సదుపాయాల కల్పన తో పాటు ఇతర నిర్మాణాత్మకమైనటువంటి ఆస్తుల కోసం వినియోగించుకోవచ్చును.’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దుర్గమమైన పర్వత ప్రాంతాల లో సంధానాన్ని మెరుగు పరచడం కోసం నేశనల్ రోప్ వే డెవలప్ మెంట్ ప్రోగ్రామ్, ఇంకా ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్ మెంట్ ఇనిశియేటివ్ ఫార్ నార్థ్- ఈస్ట్ (పిఎమ్-డిఇవిఐఎన్ఇ) లను గురించి ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. పిఎల్ఐ కార్యక్రమం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దేశం లో మౌలిక సదుపాయాల రంగం లో పెట్టుబడి పెట్టవలసింది గా ప్రైవేటు రంగాని కి పిలుపు ను ఇచ్చారు.
పిఎమ్ గతి-శక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ లో ప్రస్తుతం 400కు పైగా డాటా- లేయర్ లు లభ్యం అవుతున్నాయి అని ప్రధాన మంత్రి వెల్లడించారు. దీనిలో భాగం గా ఇప్పటికే ఉన్నటువంటి మౌలిక సదుపాయాలే కాక ప్రతిపాదిత మౌలిక సదుపాయాల ను గురించి తెలియజేయడం జరురగుతుంది. అలాగే, అటవీ భూములు మరియు అందుబాటు లో ఉన్న పారిశ్రామిక సంపద కు సంబంధించిన సమాచారం కూడా ఇందులో ఉంది అని ఆయన చెప్పారు. ప్రైవేటు రంగం దీనిని వాటి ప్రణాళిక రచన కు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. మరి అదేవిధం గా నేశనల్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారం అంతా ప్రస్తుతం ఒకే ప్లాట్ ఫార్మ్ లో లభ్యం అవుతోంది అని ఆయన అన్నారు. ‘‘దీని కారణం గా వేరు వేరు రకాల అనుమతుల ను మరియు ప్రాజెక్టు ఎలైన్ మెంట్ ను డిపిఆర్ దశ లోనే పొందడం సాధ్యమవుతుంది. ఇది మీ యొక్క నియమావళి పాలన పరమైన భారాన్ని తగ్గించడం లో సైతం సహాయకారి అవుతుంది’’ అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రాజెక్టులు మరియు ఆర్థిక మండలాల కోసం పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ ను ఆధారం గా చేసుకోవాలి అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
‘‘ఈ రోజు కు కూడాను భారతదేశం లో లాజిస్టిక్స్ సంబంధి వ్యయం అనేది జిడిపి లో 13 నుంచి 14 శాతం మేరకు ఉంటున్నట్లుగా భావించడం జరుగుతోంది. ఇది ఇతర దేశాల కంటే చాలా అధికం గా ఉంది. మౌలిక సదుపాయల కల్పన పరమైనటువంటి సామర్ధ్యాన్ని మెరుగు పరచడం లో ప్రధాన మంత్రి గతిశక్తి కి చాలా పెద్ద బాధ్యత ఉంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ బడ్జెటు లో ప్రస్తావించిన యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫార్మ్ (యుఎల్ఐపి) ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, దీనిని ప్రభుత్వం లోని వివిధ విభాగాలు వాటి అవసరాల కు అనుగుణం గా స్వీకరించడం జరుగుతోంది. ఫలితం గా లాజిస్టిక్స్ సంబంధిత ఖర్చుల ను తగ్గించుకోవచ్చు అన్నారు. ‘‘ఆరు మంత్రిత్వ శాఖ లకు చెందిన 24 డిజిటల్ సిస్టమ్స్ ను యుఎల్ఐపి ద్వారా ఏకీకృతం చేయడం జరుగుతోంది. ఇది ఒక నేశనల్ సింగిల్ విండో లాజిస్టిక్స్ పోర్టల్ ను ఆవిష్కరిస్తుంది. ఈ పోర్టల్ లాజిస్టిక్స్ సంబంధిత వ్యయాన్ని తగ్గించడం లో సహాయపడుతుంది’’ అని ఆయన వివరించారు
ప్రతి విభాగం లో లాజిస్టిక్స్ డివిజన్, మరి అదే విధం గా మెరుగైన సమన్వయం ద్వారా లాజిస్టిక్స్ పరమైన సామర్ధ్యం కోసం ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రట్రిస్ ఏర్పాటు ల వంటి కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి తెలియజేశారు. పిఎమ్ గతి-శక్తి ద్వారా మన నిపుణులు కూడా చాలా సహాయాన్ని పొందగలుగుతారు. ‘‘మన ఎమ్ఎస్ఎమ్ఇ లు ప్రపంచ స్థాయి లో పోటీ పడగలుగుతాయి’’ అని ఆయన అన్నారు.
మౌలిక సదుపాయాల కల్పన కోసం తగిన ప్రణాళిక రచన మొదలుకొని అభివృద్ధి, ఇంకా ఉపయోగం దశ ల వరకు కూడా ను మౌలిక సదుపాయాల ఏర్పాటు లో సిసలైనటువంటి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ శిప్ కు గతి శక్తి పూచీ పడుతుంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘ఈ వెబినార్ లో, ప్రయివేటు రంగం ఏ విధం గా ప్రభుత్వ వ్యవస్థ తో కలసి పని చేయడం ద్వారా మెరుగైన ఫలితాల ను సాధించవచ్చునో అనే అంశం పైన కూడా మేధోమథనం జరగాలి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.